సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం..

సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం..

ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి

వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు కృషి

డీజీపీ బీ శివధర్ రెడ్డి

రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన

హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల ప్రతినిధి (నేటి ధాత్రి):

రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ బీ శివధర్ రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.2 కోట్ల 50 లక్షలతో ఎకరం స్థలంలో ఆధునిక హంగులతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ బీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ బీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిజం అంతమైందని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసింగ్ లో నూతన మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజల కేంద్రగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామని, అదే స్థాయిలో విస్తృత సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం.. తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. హత్యలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో ఎక్కువ మరణాలు జరగడంలేదని, రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ద్విచక్ర వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. పౌరులు బాగుంటే రాష్ట్రం.. దేశ అభివృద్ధి సాధ్యమని, ఇందులో భాగంగానే అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అండగా ఉంటున్నారని చెప్పారు.

ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకం

ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అన్ని సెలవుల్లో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి హోమ్ శాఖ తాను నిర్వహిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు దాడులు చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ఇటీవల ప్రారంభించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. తాను కోరిన వెంటనే రుద్రంగికి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ మంజూరు చేశారని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు రూ.150 కోట్లతో కొనసాగుతున్నాయని, మూడో బ్రిడ్జి పనులు చేయిస్తున్నామని, రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు అయిందని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేములవాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, భీమారంలో పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, వేములవాడలో ఆలయ భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాలని డీజీపీని కోరారు.రుద్రంగి, భీమారంలో రెవెన్యూ, మండల పరిషత్ భవనాలు ఇస్తానని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం అదృష్టమని పేర్కొన్నారు.

నూతన పోలీస్ స్టేషన్ ఎంతో కీలకం

 

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత.. మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ ఎంతో కీలకమని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఎకరం 10 గుంటల స్థలం కేటాయించామని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జనవరిలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించామని తెలిపారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత..

జిల్లాలోని రుద్రంగి మండలం చిన్నదని, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని తెలిపారు. మండల ప్రజల సహకారంతో మండల కేంద్రంలో నేరాల నియంత్రణ కోసం ఇటీవల హై క్వాలిటీ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏ ఎన్ పి ఆర్) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ పోలీస్ స్టేషన్ ద్వారా మండల ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే కాకుండా, ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందన్నారు.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఇటీవల అరైవ్.. అలైవ్ కింద జిల్లాలో నో హెల్మెట్.. నో ఎంట్రీ అమలు చేస్తున్నామని, ఇప్పటికే అన్ని గ్రామాల సేఫ్టీ కమిటీలకు తెలిపామని,ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్, ఆటో మున్సిపల్ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించామని, సీపీఆర్, ప్రాథమిక ఆరోగ్య చికిత్స పై అవగాహన కల్పించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాభాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లు, ఎస్ఐలు, పోలీస్ హౌసింగ్ బోర్డ్ అధికారులు సుందర్, రాజశేఖర్, వినేయ్ , సుదర్శన్,సర్పంచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు.

అగ్ని ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు.

ఫైర్‌ స్టేషన్‌కు నూతన వాహనం అందిస్తాం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

అత్యాధునిక పరికరాలతో అగ్నిమాపక సిబ్బంది ఏడు రోజులపాటు ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.కోదాడ ఫైర్ స్టేషన్‌కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్ వాహనాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిబ్బంది, బాలాజీ నగర్ ప్రజల కోసం కార్యాలయ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,జిల్లా ఫైర్ ఆఫీసర్ వై. కృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ బాబు, స్థానిక కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, చైతన్య నాయక్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఫైర్ సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు

తహరాపూర్ సర్పంచ్ కుక్కల సరోజన

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన
మాట్లాడుతూవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట పోలీస్ ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్ (సురక్షితంగా గమ్యా నికి చేరండి) రోడ్ సేఫ్టీ అవగా హన కార్యక్రమాన్ని సర్పంచ్ కుక్కల సరోజన పిలుపు మేరకు గ్రామంలో నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని, హెల్మెట్ ధరించి గ్రామ పంచాయతీ ఆవరణం నుంచి మెయిన్ రోడ్డువరకు ర్యాలీ నిర్వహించారు. ఇది ఎంతో ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ.జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదాలను గణ నీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ డం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధానకారణమని హెచ్చరిం చారు. మన భద్రతే మన కు టుంబ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, గ్రామయువకులు బడుగు సునీల్, నిమ్మల రాజకుమార్, కొమ్ముల మల్లికార్జున్, గాజర్ల అజయ్, గోనెల రాజు, దాసరి నరేష్, బండారి రమేష్, సముద్రాల అనిల్, తాళ్ల రాజకుమార్, వాలుస పృథ్విరాజ్, కందగట్ల ప్రకాష్, గోనెల నాగరాజ్, కుక్కల రాజ్‌కుమార్, వాలుస తరుణ్, కుక్కల కుమార్, లోకాల బోయిన శివ నాగేంద్ర, కుక్కల దేవేందర్, పంచాయ తీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం..

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా జిల్లాలో నేర నియంత్రణ, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించబడనుంది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగంతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన భద్రత అందించడమే లక్ష్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల మానిటరింగ్ ఈ కేంద్రం ద్వారా నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ ఐ సంతోష్,

సీసీ కెమెరాల పునరుద్ధరణ – ఎస్సై ముప్పు సురేష్ చొరవ ప్రశంసనీయం…

సీసీ కెమెరాల పునరుద్ధరణ – ఎస్సై ముప్పు సురేష్ చొరవ ప్రశంసనీయం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

https://youtu.be/ooGYBXQUVCQ?si=jFfBx1SsO_kmQKBp

మొగుళ్లపల్లి గ్రామంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సుమారు 24 సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయకుండా వృథాగా ఉండటం గమనించబడింది. ఈ కారణంగా గ్రామంలో భద్రతా వ్యవస్థ కొంత మేర బలహీనపడిన పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితిని గమనించిన మొగుళ్లపల్లి ఎస్సై ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకుని, ప్రత్యేక శ్రద్ధతో ముందుండి కెమెరాల మరమ్మతు పనులు చేపట్టించి, అన్ని సీసీ కెమెరాలు తిరిగి సక్రమంగా పనిచేసేలా చేశారు. ఆయన పట్టుదలతో చేసిన ఈ చర్య గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. సీసీ కెమెరాల పునరుద్ధరణతో గ్రామంలో నేరాల నియంత్రణకు దోహదపడటమే కాకుండా, అనుమానాస్పద సంఘటనలను పర్యవేక్షించేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసులకు సహకారం లభిస్తోంది. దీంతో గ్రామ ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగి, పోలీసులపై విశ్వాసం మరింత బలపడింది.

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

మాదకద్రవ్యాలు,గంజాయి లాంటి పదార్థాలను కనిపెట్టే నాట్కోటిక్ డాగ్స్ చే తనిఖీలు

అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సరైన పత్రాలు లేని 23ద్విచక్ర వాహనాలు,15 లీటర్ల మద్యం స్వాధీనం

సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిక్ వాడలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు,నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్విర్ సింగ్ చందర్ సింగ్‌లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం (Sense of Security) కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు..ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో పట్టణ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు శ్రీకాంత్,ఉపేందర్ ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

వనపర్తి లో కారు ప్రమాదం రోడ్ల విస్తరణ చేయాలి…

వనపర్తి లో కారు ప్రమాదం రోడ్ల విస్తరణ చేయాలి

తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో మిగిలిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ మాజీ ఎంపీ టి సి బాలస్వమి ఒక ప్రకటన లోప్రభుత్వన్ని కోరారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు రోడ్డు లో మంగళవారం ఉదయం కారు ప్రమాదంలో డివైడర్ కు తగలదముతో కారు ముందరి భాగం దెబ్బ తిన్నదని పెను ప్రమాదం తప్పిందని రోడ్డు చిన్నా గా ఉండము వల్ల గతంలో బస్ డిపో గోడ దగ్గర కారు ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు విరిగి గాయపడ్డారని గారు పేర్కొన్నారు వెంటనే ఎమ్మెల్యే మేగారెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోని వనపర్తి లో వెంటనే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని వారు కోరారు

.

రోడ్ల మరమ్మత్తులు తప్పనిసరి…

రోడ్ల మరమ్మత్తులు తప్పనిసరి

గుంతలను పుడ్చాలని ప్రజల వేడుకోలు

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో రోడ్ల పరిస్థితి అక్కడక్కడ దెబ్బతినడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కూరగాయల మార్కెట్ సమీపంలో,మాదారం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద,బస్టాండ్ కూడలి వద్ద ఉన్న రహదారి గుంతలతో నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రతిరోజూ ఈ మార్గంలో భారీగా రాకపోకలు సాగుతుండగా,రోడ్డు దెబ్బతినడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.గుంతలు పెద్దవిగా మారడంతో ద్విచక్ర వాహనదారులు,ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గుంతలను వెంటనే పూడ్చాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.కనీసం తాత్కాలికంగా అయినా మరమ్మత్తులు చేపట్టి రహదారిని సరిచేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని,సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

 

వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలోని పండ్ల దుకాణాలను రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను రోడ్డుపై జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని వాహనదారుల రాకపోకలకు ఆటంకాలు రాకుండా రోడ్డుకు దూరంగా పెట్టాలని ఒక మార్కును నియమించి ఆ మార్కు బయట పెట్టవద్దని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్,సీఐ నవీన్ తో కలిసి భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్బంగా డీసీపీ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిచడంతో పాటు,స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు,స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు,గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,పోలీస్ స్టేషన్ రికార్డ్ లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై డిసీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను ఎస్సై రాజేందర్ ని అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని,మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై అవగాహన. ఎస్సై ఎం సురేష్.

డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై అవగాహన. ఎస్సై ఎం సురేష్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కల్పించుకోవాలని ఎస్ఐ ముప్పు సురేష్ అన్నారుఇప్పలపల్లి గ్రామపంచాయతీ వద్ధ , మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిమితిలో “ డ్రంక్ అండ్ డ్రైవ్ ” అంశంపై అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా*మొగుళ్లపల్లి ఎస్సై ఎం. సురేష్*పాల్గొన్నారు ఎస్సై మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనం నడపడమేననిఇది కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదకరమైన అలవాటని అన్నారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం మరియు చట్టపరమైన చర్యల గురించి వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నియంత్రించేందుకు మొగుళ్లపల్లి పి.ఎస్ పరిధిలో ప్రత్యేక డ్రైవులు మరియు క్రమం తప్పని తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలు కలిగి ఉండాలన్నారు ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు తమతో పాటు ఇతరుల భద్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా యువత ముందుగా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని పేర్కొన్నారు

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు….

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

◆”-: రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మార్చ్ 26: పెట్రోల్, డీజిల్ కొరత వదంతుల్లో వాస్తవం లేదని, ఇంధన సరఫరాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని బారులు తీరవద్దని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్సై పేర్కొన్నారు.

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు….

 

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు

◆”-: ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్

◆”-: మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడం పట్ల ఝరాసంగం మండల్ మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో పోలీసులు సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ చర్యల వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, నిమ్జ్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఈ విధమైన రద్దీ నెలకొంటే, పనులు ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు మరింత పెరిగి ప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారంగా ఆ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని జగదీశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్…

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత…

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత

◆- : ఝరాసంగం ఎస్సై క్రాంతి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రమాదాల నివారణ కోసమే ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డును ముసివేయడం జరిగిందని ఝరాసంగం ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు.

సోమవారం కేంద్రీయ విద్యాలయం వద్ద ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లే రోడ్డు జంక్షన్ వద్ద మూసివేసి ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లేవారు నిన్జ్ రోడ్డు నుండి కృష్ణాపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఝరాసంగం వెళ్లేవారు బర్దిపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని ఆయన వివరించారు. జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రమాదాలు నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు

రోడ్డు సమస్యలను పరిష్కరించిన ఎస్సై క్రాంతికుమార్ పటేల్…

రోడ్డు సమస్యలను పరిష్కరించిన ఎస్సై క్రాంతికుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం నియోజకవర్గం, ఝరాసంగం మండలం, మాచ్నూర్ శివార్లలోని కెవి స్కూల్ జంక్షన్ వద్ద ఉన్న రహదారిని భద్రతా సమస్యల కారణంగా మూసివేసినట్లు ప్రజలకు సమాచారం అందించబడింది.మండల పోలీస్ స్టేషన్ అధికారి, సబ్-ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ వెంటనే స్పందించి, క్రేన్ ఉపయోగించి కెవి స్కూల్ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బంధించారు.
ఈ ప్రాంతానికి వెళ్ళే రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నందున ఈ రహదారి మూసివేయబడింది.కృష్ణపూర్, బర్దిపూర్ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు.మండలంలోని ప్రతి సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారు.

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన…

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన
మల్లాపూర్ మార్చి 4 నేటి ధాత్రి

మొగిలిపేట గ్రామంలో గోదావరి పుష్కరాలలో భాగంగా మొగిలిపేట తీరంలో పుష్కర ఘాట్ పరిశీలన నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి రాములు మల్లాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మొగిలిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య , వార్డు సభ్యులు తిప్పని మునీందర్ గ్రామ ప్రజలు దరిపెల్లి అశోక్. మాసుల బుచ్చి రెడ్డి. నైనేని రాజేందర్ పాల్గొనడం జరిగింది

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోలీ సంబరాలు…

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోలీ సంబరాలు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహేష్ బి.గితే ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు పోలీసు ఉద్యోగుల మధ్య జరుపుకోవడం జరిగినది. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ…

 

సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ హోలి శుభాకాంక్షలు తెలుపుతూ..

ప్రతి ఒకరు తమ స్నేహితుల మధ్య ఆనందాలతో సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని అంతేకాకుండా ఎవరికి ఇబ్బంది తలపెట్టకుండా హోలీ జరుపుకోవాలని తెలిపారు. అంతేకాకుండా చిన్నపిల్లలు గాని యువకులు గాని చెరువులు కుంటలకు నది తీర ప్రాంతాలకు వెళ్లకూడదని దానివల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్కు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై వినతిపత్రం…

అదనపు కలెక్టర్కు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై వినతిపత్రం

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

 

టేకుమట్ల మండల కేంద్రం మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల రైతులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అగ్ని మాపక కేంద్రం ఈ మూడు మండలాలకు చేరుకోవడం ఆలస్యం అవుతుందని, తద్వారా ధన, ప్రాణ నష్టం సంభవిస్తుందనిఅన్నారు. నిన్నటి రోజున రాఘవరెడ్డి పేట గ్రామానికి చెందిన రైతు గడ్డి కట్టలకు నిప్పు అంటుకోగా భూపాలపల్లి నుండి అగ్ని మాపక కేంద్రం గ్రామానికి చేరుకునే సరికే అవి అగ్నికి ఆహతి అయ్యాయాని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి టేకుమట్ల మండలంలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేస్తే టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు సౌకర్యం వంతంగా ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అంబాల అశ్వథామ తదితరులు పాల్గొన్నారు..

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా…

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?

 

బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హిస్టోరియన్ నేహా వర్మానీ 130 ఏళ్ల క్రితం నాటి మహారాజుల డిన్నర్ మెనూను బయటపెట్టారు. మెనూకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1897 జనవరి 31వ తేదీన బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం. ఆ డిన్నర్‌లో ఇద్దరు మహారాజులు కేవలం ఫ్రెంచ్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.

వరంగల్‌లో దట్టమైన పొగమంచు….

వరంగల్‌లో దట్టమైన పొగమంచు.

100 ఫీట్ల రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పైపులు

పైపులు తొలగించండి మేడం.. మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల విన్నపం

నేటిధాత్రి, వరంగల్:

 

వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన వేళ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై మధ్యలో నిలిచిపోయిన పైపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుమధ్యలోనే ఉన్న ఈ పైపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్డుపై స్పష్టత తగ్గిన పరిస్థితుల్లో పైపులు ఎక్కడున్నాయో తెలియక వాహనాలు అటువైపు దాటేందుకు ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళ స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఉద్యోగులకు తీసుకెళ్లే వాహనాలు, చిరు వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డుకు మధ్యలో ఎలాంటి డివైడర్ లేకపోవడం, పైగా ఈ పైపులు అలాగే ఉండిపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న పైపులను వెంటనే తొలగించి, భద్రత కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సిపిఆర్ తో చివరి వరకు ప్రయత్నం చేసిన 108 సిబ్బంది…

సిపిఆర్ తో చివరి వరకు ప్రయత్నం చేసిన 108 సిబ్బంది

ప్రోగ్రాం మేనేజర్ పాటి శివ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

రోగికి అవసరమైన ఆక్సిజన్ సౌకర్యం పూర్తిగా అందుబాటులో ఉందని, పరిస్థితి విషమించిన వెంటనే 108 సిబ్బంది సిపిఆర్ చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేశారని ప్రోగ్రాం మేనేజర్ పాటి శివ కుమార్ అన్నారు
అలాగే, బాధితుడు ఇప్పటికే హార్ట్ పేషెంట్ కావడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, 108 ఎమర్జెన్సీ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, నిర్దేశిత ప్రోటోకాల్స్ ప్రకారం అన్ని వైద్య సహాయక చర్యలు చేపట్టారని పైలట్, ఈ ఎం టి లు స్పష్టం చేశారు.
రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు చివరి క్షణం వరకు ఆక్సిజన్ సపోర్ట్, సిపిఆర్ వేగవంతమైన తరలింపు వంటి అత్యవసర సేవలు అందించామని తెలిపారు. ఈ క్రమంలో 108 సిబ్బంది చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం అని ప్రోగ్రాం మేనేజర్ పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 108 సేవలపై నమ్మకం ఉంచాలని, 108 ఎమర్జెన్సీ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల సేవకు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు.

ప్రజావాణిలో ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ…

ప్రజావాణిలో ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
వనపర్తి నేటిధాత్రి .

సోమవారం ప్రజావాణిలో వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు
ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి వెంటనే పరిష్కారం చూపడమే పోలీసుశాఖ బాధ్యత అని ఎస్పీ తెలిపారు పోలీసు
ప్రజావాణి లో ప్రజలు తెలు పాలని పోలీసు ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు . బాధితులకు న్యాయం జరిగే విధంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ పని చేస్తుందని ప్రజలు పోలీసుశాఖపై నమ్మకం ఉంచి, సమస్యల పరిష్కారానికి పోలీస్ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమనిజిల్లా ఎస్పీ పేర్కొన్నారు

ఎన్నికల నియమాలను పాటించకుంటే చర్యలు తప్పవు…

ఎన్నికల నియమాలను పాటించకుంటే చర్యలు తప్పవు

నర్సంపేట టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించకుంటే చర్యలు తప్పవని నర్సంపేట టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలను గాని, వ్యక్తులను గాని కించపరిచే వాఖ్యలు చేయకూడదని అన్నారు.ఓట్ల కోసం డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం ఎన్నికల చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల శాంతిభద్రతలకు, ఎన్నికల నిర్వహణకు భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా చట్టప్రకారం కఠినంగా వ్యవహరించబడుతుందని తెలిపారు.ఏదైనా బెల్ట్ షాపులు నడిపినా,మాదకద్రవ్యాలు వినియోగించిన,అమ్మినా,అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ హెచ్చరించారు.

రౌడీషీటర్‌పై బహిష్కరణ ఉత్తర్వులు

రౌడీషీటర్‌ ను కమిషనరేట్ నుంచి బహిష్కరణ

ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి వెలివేత

సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు

వరంగల్ నేటిధాత్రి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్‌పై పోలీస్ కమిషనరేట్ తొలిసారిగా కఠిన చర్యలు చేపట్టింది. మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (31)ను ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం–1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం–2015)లోని సెక్షన్ 26(1) ప్రకారం ఈ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్వుల అనంతరం మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ మిథున్‌లు నిందితుడు కోతి సురేష్‌కు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో బహిష్కరణ ఉత్తర్వులను అందజేశారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, ఫిర్యాదులు చేయడానికీ ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కారణాలు చూపించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, నిందితుడు సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదని, ఎలాంటి వ్రాతపూర్వక వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు, అతని ప్రవర్తన ప్రజా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారిందని నిర్ధారించారు.

అందువల్ల ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు నెలల కాలానికి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాజరు సందర్భంలో మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యత: నూతన ఎస్సై శ్రీధర్

శాంతి భద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత..

ఆర్కేపీ నూతన ఎస్సై జె శ్రీధర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని రామకృష్ణాపూర్ పట్టణానికి నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జె శ్రీధర్ అన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి సాధారణ బదిలీపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జె శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్కేపీలో విధులు నిర్వహించిన భూమేష్ భూపాలపల్లి కి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం పోలీస్ స్టేషన్ కు ఎప్పుడైనా రావచ్చని హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజలు, ప్రజా ప్రతినిదులు పోలీసులకు సహకరించాలని కోరారు.

నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ప్రమాదకర స్థితిలో నీటి ట్యాంకు

ప్రమాదంలో జిల్లా ఆసుపత్రి నీటి ట్యాంకు

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఏళ్ల కింద కట్టిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకొని పగుళ్ళు రావడంలో పాటు పెచ్చులు ఊడిపడటం
ప్రమాదం జరగకముందే ట్యాంకును తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్న ఆసుపత్రి సిబ్బంది మరియు పేషెంట్లు

గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామంలోని విధి ప్రాంగణంలో గత కొన్ని రోజులుగా పనిచేయని వీధి దీపాలు నూతన సర్పంచ్ వినోద బలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ గారి చొరవతో మళ్లీ వెలుగులు నింపుతాయని.ఈ ప్రాంతం గ్రామానికి ముఖ్యమైన కేంద్రం కావడంతో వందలాది మంది భక్తులు ప్రయాణికులు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని వీధి దీపాలు వెలగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీధి దీపాలు బిగిస్తున్న పరిసరా ప్రాంతాల్లో ,రాత్రివేళ రాకపోకలు సులభ మవుతాయని. గ్రామ అభివృద్ధికి ఇది మంచి ఆరంభమని గ్రామస్తులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు అభినందిస్తున్నారు.

జహీరాబాద్ లో లక్ష విలువైన చైనీస్ మాంజా సీజ్

జహీరాబాద్ లో లక్ష విలువైన చైనీస్ మాంజా సీజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో లక్ష రూపాయల విలువైన నిషేధిత చైనీస్ మాంజా రీల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గడి మహల్లాలోని ఓ గోదాం నుండి ఈ మాంజాను సీజ్ చేశారు. ఈ ఘటనలో అజీమ్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు. నిషేధిత మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా, వాడినా చట్టపరమైన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్. శివలింగం హెచ్చరించారు. గత వారం రోజులుగా పోలీసులు ఈ మాంజాపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్…

గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఓదెలలో కోతుల దాడులతో ప్రజలకు ఇబ్బందులు

కోతుల బెడద తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామం లో రోజు రోజుకు కోతుల తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇండ్లలో వంట సామాగ్రి,పోలాల దగ్గేర కూలి పనికి వెళ్తే టిఫిన్ బాక్సు లు ఎత్తుకుబోతున్నాయని, దాడులు చేస్తున్నాయని రోడ్లపై వెళ్లాలన్న, సామాను తెచ్చుకోవాలన్న భయమేస్తుంది అని ప్రజలు వాపోతున్నారు.అధికారులు ఈ సమస్యని పట్టించుకుని ప్రజలను వీటి దాడుల నుండి కాపాడాలని కోరారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నారాయణాఖేడ్ నియోజకవర్గంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ గారి స్వగృహంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్,జీత్తు శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అప్పారావు శెట్కార్ కలిసి కైట్లను ఆవిష్కరించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, చైనా మంజాను వినియోగించకూడదని, ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ పద్ధతుల్లోనే పండుగను జరుపుకోవాలని సూచించారు. అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, సాంప్రదాయ విలువలపై వివరించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని జహీరాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సైదా నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, ‘అరైవ్, అలైవ్’ నినాదంతో జహీరాబాద్ పోలీసులు స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో కార్మికులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సాధనమని సూచించారు.

తిరుపతి జిల్లాలో కోడి పందాలపై సంపూర్ణ నిషేధం

*తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక క్రీడలపై సంపూర్ణ నిషేధం.

*సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము.

*కోడి పందాలు, జూదం నిర్వహించినా, వాటికి స్థలాలు లేదా పొలాలు కల్పించినా, నిర్వాహకులు, పాల్గొన్న వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు…

*డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బృందాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగించబడుతుంది…

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,

తిరుపతి(నేటిధాత్రి:

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర జూద క్రీడలు నిర్వహించడం, ఆడటం, ఆడించడటం చట్టరీత్యా నేరమని తిరుపతి జిల్లా ఎస్పీ
ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించుకోవాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
సంప్రదాయం పేరుతో జీవ హింసకు పాల్పడటం నేరమని, కోడి పందాలు వంటి క్రీడలు జంతు సంక్షేమ చట్టాలకు పూర్తిగా విరుద్ధమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమైనవని, నేరస్థులపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, మూగజీవాల సంక్షేమ బోర్డు సభ్యులు, ఎన్‌జీవో సంస్థల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కోడి పందేల నిర్వహణకు ప్రయత్నిస్తున్న నిర్వాహకులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించామని, అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, కోడి పందేల నిర్వహణ కోసం స్థలం లేదా పొలాలు అందించిన వారు, పందేల కోసం కోళ్లకు కత్తులు కట్టిన వారు, వాటిని తయారు చేసిన వారు లేదా సరఫరా చేసిన వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
జూదం, మట్కా వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల వలన సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో పడి కొందరు ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని, ఇది కుటుంబాలకు మరియు సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి అక్రమ క్రీడలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సహాయంతో గతంలో కోడి పందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలు, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక క్రీడలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తిరుపతి జిల్లాలో ఎవరైనా కోడి పందేల నిర్వహణ కోసం బరులు ఏర్పాటు చేసినా, స్థలం లేదా పొలం ఇచ్చినా, పందేల నిర్వహణకు సహకరించినా లేదా వాటిలో పాల్గొన్నా, అందరిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గౌరవ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., మరోసారి కఠినంగా హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్: 80999 99977 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు

చైనా మాంజా విక్రయిస్తే  కఠిన చర్యలు  సిఐ నరేష్ కుమార్
భూపాలపల్లి  నేటిధాత్రి 
https://youtu.be/nviWxUjGzCI
భూపాలపల్లి పట్టణంలో చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు  సిఐ నరేష్ కుమార్ అన్నారు
భూపాలపల్లి పట్టణంలో నిషేధించబడిన చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి పట్టణ సీఐడి నరేష్ కుమార్ స్పష్టంగా హెచ్చరించారు. భూపాలపల్లి పట్టణంలో సీఐ.డి నరేష్ కుమార్ ఎఫ్‌ఆర్‌వో నరేశ్ సతీష్ ఎస్ఐ  కలిసి పలు దుకాణాలు,  వ్యాపార కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిషేధిత చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయా? నిల్వలు ఉంచుతున్నారా? అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా, చైనా మాంజా వాడకం వల్ల పక్షులు, జంతువులు  మనుషులకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యుత్ తీగలు, మెడలు కోసుకునే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణ దృష్ట్యా ప్రభుత్వం చైనా మాంజాను పూర్తిగా నిషేధించిందని, ఎవరైనా వ్యక్తులు లేదా షాపులు నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  సీఐ. డి నరేష్ కుమార్ హెచ్చరించారు. కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా చేయబడతాయని తెలిపారు.
భూపాలపల్లి పట్టణ ప్రజలు, వ్యాపారులు ఈ విషయంలో పూర్తిగా సహకరించాలని, నిషేధిత చైనా మాంజాను విక్రయించకుండా, వాడకుండా ఉండాలని  సీఐ. డి నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా విక్రయాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

నెక్కొండలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

రోడ్ సేఫ్టీ పాటిస్తేనే ప్రమాదాల నివారణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, నెక్కొండ సీ ఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్సై మహేందర్,మోటార్ వెహికల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, నెక్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నెక్కొండ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపరాదని తెలిపారు.
రోడ్ సేఫ్టీని పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, మన కుటుంబాల భద్రతకు కూడా కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవిస్తేనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.

సంక్రాంతి పండుగలో పోలీసుల హెచ్చరిక

*సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నాం……*

◆-: దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు.. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త

◆-: చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్ ,బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచనలు.. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్…

చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్

 

చైనీస్ మాంజ పై నిషేధం ఉన్నందున ఎవరైనా చైనీస్ మంజా తో పతంగులు అమ్మిన ఎగురవేసిన అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి అత్యంత ప్రమాద కరమైన చైనీస్ మాంజ తో పతంగులు ఎగురవేయడం వల్ల ఆ మంజా తాకి వ్యక్తులు మరణించడం జరుగుతుంది కాబట్టి చర్ల మండలంలో వ్యాపారస్తులు అదేవిధంగా తల్లితండ్రులు పిల్లల విషయంలో జాగర్తగా ఉండి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక…

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ప్రభుత్వం మరియు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) తయారీ, విక్రయం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడిందని వర్దన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ, చైనా మంజా అత్యంత పదునుగా ఉండటంతో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సైకిల్ ప్రయాణికులు, పాదచారులు తీవ్ర గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు గతంలో అనేక చోట్ల ఈ నైలాన్ మంజా కారణంగా గొంతు కోసుకుపోయిన ఘటనలు ప్రాణ నష్టం సంభవించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే చైనా మంజా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ లైన్లకు చుట్టుకుపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని, కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు దీంతో ప్రజలకు ఆర్థిక నష్టం ప్రాణాపాయం కూడా ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చైనా మంజా వాడకుండా కట్టడి చేయాలని, పండుగలు సెలవుల సమయంలో పిల్లలు సురక్షితమైన కాగితపు మంజా మాత్రమే ఉపయోగించేలా చూడాలని సూచించారు. అలాగే వ్యాపారులు ఎవరైనా నిషేధిత మంజాను విక్రయిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సాయిబాబు కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి….

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.

బాలానగర్ ఎస్సై లెనిన్.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

#తదుపరి కాజీపేటలో సీసీ కెమెరాల ప్రారంభం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే….. వారికి కఠిన చర్యలు తప్పవు….

ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే….. వారికి కఠిన చర్యలు తప్పవు….!

• చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం
ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ తెలియజేశారు. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ఆదేశాల మేరకు మండల చైనా మాంజా నిల్వలపై దాడులు నిర్వహించి, నిషేధిత చైనా మాంజాను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండేలా ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు.

మండల ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగించినట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే…..!

ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే..అరెస్ట్‌ చేస్తామని! ఈ చైనా మాంజాపై జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ కోహిర్ మండలాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా మాంజా అమ్మే దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఎవరైనా చైనా మాంజాను అమ్మినట్లయితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

చైనా మాంజాపై నిషేధం ఉన్న విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలను ఎండగట్టింది. చైనా మాంజా ఏడు మంది ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తెచ్చిందో సవివరంగా చూపించింది. దాని ఫలితంగా అధికారులు కదిలారు.

పతంగులకు, మాంజాల హోల్‌సేల్ విక్రయాలకు కేరాఫ్‌గా ఉన్న మండల దుకాణాల యజమానులను హెచ్చరించారు, గాజుపూత, కెమికల్స్‌ ఉండే చైనా మాంజా అమ్మవద్దని నిబంధనలు ఉన్నా ఎందుకు విక్రయిస్తున్నారంటూ కేసులు పెట్టారు. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు. కానీ దాన్ని ఎగరేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనామాంజాను వాడుతున్నారు.

దానికి ఉన్న గాజుపూత, కెమికల్‌ పూతలతో అవి షార్ప్‌గా మారతాయి. ఎంత షార్ప్ అంటే.. వేగంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలిందీ అంటే.. అంతే సంగతులు. పీక తెగుతుంది. ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇలాంటివి మూడు నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇక పతంగుల సీజన్‌లో అయితే వందలాది పక్షులు ఈ మాంజాకు బలవుతున్నాయి. అందుకే చైనా మాంజాపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

ఈ సందర్భంగా ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పాటేల్ మాట్లాడుతూ.. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని వ్యాపారస్తులను హెచ్చరించారు. కైట్స్ షాప్ నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని పక్షంలో జైలుపాలు అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని సూచించారు. ఇందుకు ప్రజలు కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలే దీన్ని ఒక బాధ్యతగా వహించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

అంతేకాకుండా, ఇంట్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దాంతో పాటు చైనా మాంజా విక్రయాలను అరికట్టేలా చర్యలపై ఎస్ఐ క్రాంతి కుమార్ పాటేల్ వివరించారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కోతుల కోసం కొండెంగ తెప్పించిన సర్పంచ్…

కోతుల కోసం కొండెంగ తెప్పించిన సర్పంచ్.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కోతుల బెడద గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి, చిన్నపిల్లల పెద్దలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయంతో భయపడుతూ ఉండేవారు ఇంట్లో వస్తువులను రైతుల పంటలను నాశనం చేస్తూ విచ్చలవిడిగా ఊరు మీద పడి దాదాపు సుమారు 100 నుండి 200 కోతులు కోతులు రోడ్లమీద కొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, ఇది తెలిసికుడా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి థౌవుటం లక్ష్మి ప్రజల బాధలను అర్థం చేసుకొని ఒక కొండెంగను తెప్పించడం జరిగింది, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి థౌటం లక్ష్మి ప్రజలు అడిగిన వెంటనే బాధను అర్థం చేసుకొని కొండెంగని తెప్పించిన సర్పంచ్ తౌటం లక్ష్మీ ,కి గ్రామపంచాయతీ పాలకవర్గానికి చిట్యాల మండల కేంద్ర గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేయుచున్నారు,అలాగే గెలిచిన వెంటనే ప్రజల బాధలు అర్థం చేసుకుంటున్న నూతన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ నూతన సర్పంచ్ సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T112726.914.wav?_=1

 

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ నూతన సర్పంచ్ సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నూతనంగా సర్పంచ్ గా గెలుపొందిన తర్వాత ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొల్లూరు గ్రామ పెద్దలు నందు పాటిల్, కొల్లూరు సర్పంచ్ చింతలగట్టు శివరాజ్,ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకాకర్, వార్డు సభ్యులు చింతలగట్టు ప్రకాష్, వడ్ల సాయినాథ్,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,నాయకులు ఎర్రోల కిష్టన్న,అక్కమ్మోల సంగన్న,సి హెచ్ సంగమేష్, దప్పూర్ హరి,మంగలి కిష్టన్న,ధార గోరక్నాథ్,మాలగారి రమేష్ తధితరులు కలిసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి సార్ గారిని పూలమాలతో సన్మానించి స్వీట్ ఇవ్వడం జరిగింది..

జిల్లా ఎస్పీ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోలీసు బృందం…

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-02T113814.099.wav?_=2

 

జిల్లా ఎస్పీ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోలీసు బృందం

◆-: చారక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చారక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… నూతన సంవత్సరంలో జహీరాబాద్ పోలీస్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి…

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి

వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం – ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలంలో నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని,మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది.ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా, మీ న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామని,మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎవరైన ఈ నియమాలను అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు మండల ప్రజలు సహకరించాలని కోరారు.2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పోత్కపల్లి పోలీస్ పోలీసు విజ్ఞప్తి చేస్తోంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి..

నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

◆-: ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రజలు, యువత నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించుకోవడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే తమ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి వేడుకలకు అనుమతి లేదని ర్యాలీల పై పూర్తిగా నిషేధం ఉందని అన్నారు నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం, అనుమతి లేకుండా పార్టీలను ఏర్పాటు చేయడం, డీజేలు, భారీ సౌండ్ తో శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలు చట్టరీత్యా నిషేధించబడినవని స్పష్టం చేశారు.

ఈ నిషేధాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీలు ఉంటాయన్నారు. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని తమ ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రజల క్షేమమే పోలీసుల ప్రధాన ధ్యేయమని, యువత క్షేమమే సమాజ భవిష్యత్తని భావించి ఈ సూచనలు జారీ చేయడం జరుగుతుందన్నారు. 

వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు..

వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు

 

ఈ ఏడాది పోలీసుల పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు.

 వచ్చే యేడాది లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికను సిద్దం చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. మంగళవారం విజయవాడ సిటీ కమిషనరేట్‌లో 2025 ఏడాదిలో జరిగిన నేరాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది పోలీసు పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని చెప్పారు. 2024లో 11,937 నేరాలు నమోదు అయితే.. 2025లో 9,503 నేరాలు జరిగాయని.. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు. ఈ ఏడాది అంటే.. 2025 తమకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. సీసీ టీవీల ఏర్పాటు కోసం ఒక యుద్దమే చేశామని తెలిపారు.

ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌..

సురక్ష పేరు పెట్టి ఒకే సారి వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని వివరించారు. ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా పది వేల సీసీ కెమెరాలు పబ్లిక్ ప్లే‌స్‌ల్లో పెట్టడం ఒక రికార్డు అన్నారు. అందుకు సహకరించిన సురక్ష సభ్యులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో సైతం కెమెరాలు పెట్టామన్నారు.

అస్త్రం ద్వారా ట్రాఫిక్..

గంజాయ, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించామని స్పష్టం చేశారు. అస్త్రం ద్వారా ట్రాఫిక్‌ను పూర్తిగా కంట్రోల్ చేశామన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ క్రైం తగ్గదని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది.. చాలా విభాగాల్లో క్రైం రేట్‌ను తగ్గించామన్నారు. నార్కోటిక్, ఎకనామిక్ అఫెన్స్ కేసులు మాత్రమే ఈసారి పెరిగాయని తెలిపారు. వచ్చే యేడాది కూడా వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీస్ పనితీరుకు నిదర్శనం..

సైబర్ క్రైం తగ్గినా… నగదు నష్టం ఎక్కువుగానే ఉందన్నారు. వివిధ రకాల దొంగతనాల్లో మర్డర్ గెయిన్ ఒకటి పెరిగిందని వివరించారు. మిగిలిన వాటిలో కేసులు సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. రికవరీల్లో కూడా 80.70 శాతం ఉండటం ఒక రికార్డు.. 2024 లో 52 శాతం మాత్రమే రికవరీ ఉందన్నారు. కన్వెన్షన్ కూడా చాలా మందికి పడటం తమ పోలీసు పని తీరుకు నిదర్శనమని తెలిపారు. రోడ్టు ప్రమాద మరణాలు ఇరవై శాతం తగ్గాయని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంది వారే..

హెల్మెట్, సీటు బెల్ట్ పై అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. వచ్చే ఏడాది ఈ ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్ల వాళ్లే అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ వాడాలంటూ ప్రజలకు ఆయన సూచించారు.

ఎన్టీఆర్ జిల్లా పోలీసుల గొప్పతనం..

హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే… 238 మందికి న్యాయం చేసేలా చర్యలు తీసుకన్నామన్నారు. దేశంలోనే ఇది మూడో స్థానంలో ఉండటం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ గొప్పతనంగా భావిస్తున్నామని తెలిపారు. సైబర్ క్రైం లో రూ. 9.54 కోట్లు సీజ్ చేశామని వివరించారు. నార్కోటిక్ కేసుల్లో పిట్ యన్డీపీఎస్ కింద 22 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా మనమే ఈ సెక్షన్ కింద కేసు పెట్టామని గుర్తు చేశారు.

డ్రోన్లు కీలకం..

దసరా, భవానీ దీక్షల విరమణ, ఇతర భారీ ఉత్సవాలకు రద్దీని మానటరింగ్ చేయడంలో డ్రోన్లు కీలకంగా పని చేశాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ ఏడాది అద్భుతంగా పని చేశామన్నారు.

లక్షల మంది భక్తులు వచ్చినా..

కొత్త యాప్‌ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు దసరా నవరాత్రులు వేళ 18 లక్షల మంది భక్తులు, భవానీ దీక్షల విరమణకు 6 లక్షలు మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్యూలైన్లలో కౌంటింగ్ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు క్రౌడ్‌ను అంచనా వేశామని వివరించారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వచ్చే ఏడాదిలో ఈ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

వాటికి అనుసంధానించే సర్వర్, ఇతర పరికరాలు సైతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. పార్కింగ్ ప్లేస్‌ల్లో కూడా కౌంటింగ్ కెమెరాలు పెట్టబోతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో క్రైమ్ తగ్గినందుకు ఏబీసీడీ అవార్డు వచ్చిందని.. ఈ సందర్భంగా టీంకు ఆయన అభినందనలు తెలిపారు. పసి కందులను విక్రయించే ముఠాను అరెస్టు చేశామన్నారు.

పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు..

కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2024 అక్టోబర్ నెలలో 83 జంక్షన్‌లో 97 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌నూ క్రమబద్దీకరణ చేశామన్నారు. 2025 నవంబర్‌లో 97 కిలోమీటర్ల ఉన్న ట్రాఫిక్‌ను 43 కిలోమీటర్లకు తగ్గించామని సోదాహరణగా వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇన్స్‌పెక్టర్ల పని తీరు సైతం తెలిసిపోతుందని.. వీటి ఆధారంగా వారి పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అందుబాటులోకి కొత్త యాప్

రేపు ఏ జంక్షన్ వద్ద రద్దీ ఉండబోతుందో కూడా ఈ రోజే ముందస్తుగా తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక అంశాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని వివరించారు. అస్త్రం టూల్ ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ పాత్ ద్వారా అంబులెన్స్ మూవ్‌మెంట్ తెలిస్తే.. గ్రీన్ ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనం ఏ రూటులో వెళితే రద్దీ ఉండదని తెలిపేలా యాప్ ద్వారా తెలియ చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 మనుషుల ప్రాణాలతో చెలగాటం.. యూరియా, సర్ఫ్‌తో కల్తీ పాలు

 

ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మనుషుల్లో మానవత్వం మెల్లమెల్లగా నశించిపోతోంది. కొంతమంది డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. వాటిని తిన్న జనం అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి కల్తీ పాల దందాకు తెరతీశాడు. యూరియా, సర్ఫ్, నూనెతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కల్తీ పాల దందాకు చెక్ పెట్టారు.

కుక్కలు,కోతుల బెడద నుండి ప్రజలను కాపాడండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-27T145241.350.wav?_=3

 

కుక్కలు,కోతుల బెడద నుండి ప్రజలను కాపాడండి

కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బొచ్చు రాజు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలో కుక్కలు,పందులు మరియు కోతుల బెడద రోజురోజుకు ఎక్కువవుతున్నదని పట్టణప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కాంటెస్టెడ్ ఎంపీ బొచ్చు రాజు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పనిచేసుకునే కొయ్యడ బిక్షపతి అనే వ్యక్తి వెనకాల నుండి వచ్చి వీధి కుక్క కరవటం జరిగిందని అంతేకాకుండ గుడికి వెళ్ళన భక్తుడిపై కోతి దాడి చేయటం జరిగిందని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్..

 న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం

 

నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం..ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నేడు (డిసెంబర్ 27) ప్రకటించిన ఈ ఆపరేషన్‌లో దక్షిణ ఈశాన్య జిల్లాలోని హాట్‌స్పాట్‌లపై రాత్రివేళ దాడులు చేశారు.

రెడ్ మిక్స్ ప్లాంట్ తొలగించాలని డిమాండ్ – రాస్తారోక

మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ ను వెంటనే తొలగించాలి.

#దుమ్ము, శబ్దంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.

#భారీ వాహనాలతో దెబ్బతింటున్న సిసి రోడ్.

#పట్టించుకోని సంబంధిత అధికారులు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T162422.785.wav?_=4

 

నల్లబెల్లి, నేటిధాత్రి

మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ ద్వారా కస్తూర్బా విద్యార్థులు, రామాలయం గుడికి వచ్చే భక్తులకు ప్లాంట్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారం ఉన్నదని పలు శాఖలను భయభ్రాంతులకు గురిచేసి జనవాసాలలో రెడ్ మిక్స్ ప్లాంట్ కు దొంగ దారిలో అనుమతులు తీసుకొని నిర్వహణ చేస్తున్నారు. మండల కేంద్ర ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు.

ఒకవైపు విద్యార్థులు చదువుకునే కస్తూరిబా గురుకుల పాఠశాల మరోవైపు రామాలయం గుడి ఉండడంతో విద్యార్థులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మైనింగ్ , రెవిన్యూ అధికారులు, తక్షణమే స్పందించి మండల కేంద్రంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్లు వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై రాస్తరోక నిర్వహించడంతో పలు వాహనాలు స్తంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోక చేస్తున్న ప్రదేశానికి చేరుకొని విరమించే ప్రయత్నం చేయగా నిరసన చేస్తున్న వ్యక్తులు సంబంధిత అధికారులు న్యాయం చేస్తానని హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని చెప్పడంతో పోలీస్ సిబ్బంది దుగ్గొండి సీఐ సాయి రమణతో చరవనితో నిరసన చేస్తున్న మహేష్ తో మాట్లాడుతూ వెంటనే ప్లాటును తొలగించి ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని సీఐ హామీ ఇవ్వడంతో రాస్తారోకో ను విరమింప చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు కోలా లింగయ్య, మేకల మోహన్, గాజు బిక్షపతి, కన్నెబోయిన సురేష్, బత్తిని హరీష్, పరికి పవన్, త్యాగరాజు, కోడూరి సిద్దు, పోలేటి కిషోర్, కుక్క ముడి నాగరాజు, దండు సునీల్, కుక్కమూడి సుమన్, పోడేటి కిరణ్, భాస్కర్, పవన్, పల్లికొండ రవి, మాసం పెళ్లి ప్రభాకర్, నాగేల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే…

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో ఇటీవల ప్ర మాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసు పత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటు న్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు స్వయంగా బాధి తుడి ఇంటికి వెళ్లి పరామ ర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసు కున్నారు. బాధిత కుటుం బానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై సంబం ధిత అధికారులు సమగ్ర విచా రణ చేపట్టి తగిన చర్యలు తీ సుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిం చారు. ఇళ్లపై నుండి ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను చూశా రు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులకు ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగింది.

బ్రిడ్జి సైడ్ వాల్స్ పై కలర్ ఫుల్ పెయింటింగ్స్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T120155.747.wav?_=5

 

బ్రిడ్జి సైడ్ వాల్స్ పై కలర్ ఫుల్ పెయింటింగ్స్…! చిమ్మ చీకట్లో బ్రిడ్జి పై రహదారి..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

https://youtu.be/m7VTif2r920?si=3y72rUd3Upf9TiJ2

 

క్యాతన్ పల్లి రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేసి పది నెలలుగా రాకపోకలు జరుగుతున్నప్పటికీ బ్రిడ్జిపై లైటింగ్ లేకపోవడం తో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని, దీనిని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల రాత్రి సమయాల్లో ప్రయాణికులు,పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఇరువైపులా ఇసుక ఉండటం తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, స్థానిక మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకుని బ్రిడ్జి పై ఇరువైపుల ఉన్న ఇసుకను తొలగించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఫ్లై ఓవర్ వంతెనకు ఇరువైపులా కలర్ ఫుల్ పెయింటింగ్స్ తో కళకళలాడుతున్నాయి. ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దారిన పోయే ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ, సింగరేణి, ప్రజల జీవనశైలి,జంతువులు, పక్షులు,క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడియాడినట్లు దర్శనమిస్తున్నాయి. చిత్రలేఖనాలు బాగానే ఉన్నా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు మున్సిపల్ సిబ్బంది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలిగేలా చొరవ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

 

నెల రోజుల్లో బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలుగులోకి వస్తాయి..

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు..

క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు నెల రోజుల్లో వెలుగుతాయని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారని అన్నారు. పది నెలలుగా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఆర్ అండ్ బి అధికారులను పదేపదే అడగడం జరిగిందని,విద్యుత్ స్తంభాలకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వెలిగేలా చూస్తామని తెలిపారు. ఫ్లై ఓవర్ పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇసుకను త్వరితగతిన తొలగిస్తామని, వాహన ప్రమాదాలు జరగకుండా చూస్తామని అన్నారు.

చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ..

చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ.. యువకుడిపై ట్రాన్స్ జెండర్ల దాష్టికం

 

దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.

దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్లు చేస్తున్న పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పలు ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ట్రాన్స్ జెండర్ల ఆగడాలు, దాడులు మితిమీరిపోతున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌ (railway station)లో బెంచ్ పై పడుకున్న ఓ యువకుడిని ముగ్గురు ట్రాన్స్ (Transgenders) జండర్లు చెప్పుతో దాడి (Attack with Sandal) చేస్తున్న వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోలో ఓ యువకుడు రైల్వే స్టేషన్ లోని ఓ బెంచ్ పై నిద్రిస్తున్నాడు. హఠాత్తుగా అక్కడికి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు వచ్చారు. వారిలో ఓ ట్రాన్స్ జెండర్ ఆ యువకుడిని లేపి తిడుతూ చెప్పుతో కొడుతుంది. ఏం జరుగుతుంతో అర్థం కాక ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అవుతూ.. నన్ను ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించాడు. అంతలోనే మరో ట్రాన్స్ జెండర్ అతన్ని చెంపపై కొడుతుంది. ఇంత జరుగుతున్నా పక్క నుంచి ప్రయాణికులు వెళ్తున్నారే కానీ.. ఏం జరిగిందని ప్రశ్నించడం లేదు. చివరికి.. ఆ యువకుడు భయంతో అక్కడ నుంచి పారిపోతుండగా అతన్ని వెంబడించారు.వరాహ వారియర్ అనే యూజర్ X లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం (Netizens Serious) వ్యక్తం చేస్తున్నారు. రాను రాను రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు భద్రత లేకుండా పోతుందని.. పోలీసులు ఇలాంటి ఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి స్టేషన్ పేరు, బాధితుడి కాంటాక్ట్ నెంబర్, వివరాలు పంపించాల్సిందిగా రైల్వే పోలీసులు (Railway Police) ప్రజలను కోరారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులను గుర్తిస్తూ పోలీసులు లేదా రైల్వే అధికారులు ప్రకటనలు జారీ చేయలేదు.

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు..

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

 

నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.

హైదరాబాద్‌ సిటీ: కుక్క కాటు కేసులు ఆస్పత్రుల్లో ఇటీవల పెరుగుతున్నాయి. ఐపీఎంకు, ఫీవర్‌ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కుక్కకాటు బాధితులు రోజుకు 300 మందికి పైగా వస్తున్నారని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కుక్కకాటుకు గురైన వారికి నారాయణగూడ ఐపీఎంలో టీకా సదుపాయం ఉంది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో టీకాలు, వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, పట్టణ ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీవర్‌ ఆస్పత్రికి క్యూ..

ఫీవర్‌ ఆస్పత్రికి కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్‌ ఇవ్వడంతో పాటు రేబిస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్‌ ఆస్పత్రిలో 2023లో 27,172 మందికి చికిత్స అందించగా, 13 మంది రేబిస్‏తో చనిపోయారు. 2024లో 29,054 మందికి చికిత్స చేయగా, 16 మంది చనిపోయారు. ఈ ఏడాది 24,705 మందికి వైద్యం అందించారు. 34 మంది రేబి్‌సతో మృతిచెందారు.

– ఫీవర్‌ ఆస్పత్రికి రోజుకు సగటున 60 నుంచి 80 కేసులు వస్తున్నాయి. నెలలో ఒకటి, రెండు కేసులు రేబి్‌సకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రతీ ఏడాది 20 వేలమంది టీకాలు వేసుకుంటున్నారు.

నారాయణగూడ ఐపీఎంకు ఈ ఏడాది ఇప్పటి వరకు 33,765 మంది కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఐపీఎంను ప్రతీనెల 2,200 నుంచి 2,600 మంది కుక్కకాటు బాధితులు ఆశ్రయిస్తున్నారు.

– హయత్‌నగర్‌ ఆస్పత్రిలో నెలకు 400 మంది చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రికి నెలకు 275-300 మందికి కుక్కకాటు టీకాలు వేస్తున్నారు.

– రాజేంద్రనగర్‌ ఆరోగ్య కేంద్రంలో నెలకు 90-100 మంది, హయత్‌నగర్‌ నెలకు 300 మంది టీకాలు వేయించుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

కాప్రా ప్రజా సమస్యల పరిష్కారానికి శివకుమార్ ముందడుగు

కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు!

ప్రజల కోసం – ప్రజలతో కలిసి!

– గోగికార శివకుమార్

కాప్రా నేటిధాత్రి

 

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ పరిధిలో
సాయి నగర్ స్మశాన వాటిక ముందు నెలకొన్న మట్టి కుప్పలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే సాయి నగర్ – సాయిబాబా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న స్ట్రీట్ లైట్ సమస్యలు కారణంగా ప్రతిరోజూ ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు.
ఈ రెండు ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనే కోరుతూ, నేను స్వయంగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్ కి వినతిపత్రం సమర్పించాను.
ప్రజల సమస్యలంటే నా బాధ్యత. కాప్రా డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి చిన్న సమస్యనైనా పట్టించుకుని పరిష్కారం దిశగా ముందుకు సాగుతాను.

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ శ్రీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్ – 1861 నిబంధనలు 1 నుండి 30 వరకు) అమలులో ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలియజేశారు.
పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T130419.300.wav?_=6

 

 

 

ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే

పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం.

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు శరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు

చేపించుకున్నరు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని,పోలీసులు ఆరోగ్యంగా వున్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని,ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు ఆరోగ్య పరీక్షలకై సమయాన్ని కేటాయించాలన్నారు. విధి నిర్వహణకై అంకితమైన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమన్ని.దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈశిబిరాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈశిబిరంలో నేత్ర వైద్యుల బృందం పాల్గొని కంటి ఆరోగ్య పరిశీలన,దృష్టి సమస్యల నిర్ధారణ,అవసరమైన మందులు,సూచనలు అందించారు.రోజువారీ ఒత్తిడి,ఫీల్డ్ పనులు,రాత్రి పూట డ్యూటీ కారణంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయుక్తమని,వైద్యులు పేర్కొన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సీ విజన్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు మొగిలి,శ్రీనివాస్ ,రవి,నాగేశ్వరరావు, మధుకర్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్,యాదగిరి, ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మంగపేట మండల ప్రజలకు వాహనదారులకు మంగపేట పోలీస్ వారు విజ్ఞప్తి…

మంగపేట మండల ప్రజలకు వాహనదారులకు మంగపేట పోలీస్ వారు విజ్ఞప్తి

మంగపేట నేటిధాత్రి

 

ప్రస్తుతం కాలంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది కావున ప్రజలు తమ ప్రయాణాలను ఉదయం మరియు రాత్రి సమయంలో వాయిదా వేసుకోవాలని సరైన వెలుతురు వచ్చిన తర్వాతనే ప్రయాణం చేయాలని రోడ్డుపైన ఎటువంటి వాహనాలను సరైన జాగ్రత్తలు లేకుండా నిలపరాదని
ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా మంగపేట యస్ ఐ టి వి ఆర్ సూరి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ..

నిషేధిత, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఎలాంటివి అక్రమ రవాణా జరగడానికి వీలు లేదు..

◆:- • జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు, సాయుధ పోలీసులతో నాకాబందీ..

◆:- • జిల్లా ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ..

◆: – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఐపిఎస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండడం వలన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడిన గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు, పిడిఎస్ రైస్ వంటి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏవైనా వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.
ప్రజల శాంతి, భద్రతల రక్షణలో భాగంగా అంతర్ రాష్ట్ర నేరస్తులు, పేలుడు స్వభావం గల మందుగుండు సామగ్రి జిల్లాలోకి అక్రమంగా రాకుండా ప్రతి రోజు వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిన్న తేది: 12.11.2025 రాత్రి 9.00 గంటల నుండి 1.30 గంటల వరకు, చిరాగ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–65 పై సుమారు 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ కార్యక్రమం చేపట్టి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.ఈ తనిఖీల్లో మొత్తం 850 వాహనాలను తనిఖీ చేసి, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేయడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై డీడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ నాకాబందీ కార్యక్రమం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ పట్టణ ఇన్‌స్పెక్టర్ శివలింగం, బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, నారాయణఖేడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సాయుధ విభాగం సిబ్బంది, మరియు వివిధ సబ్‌డివిజన్‌లకు చెందిన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్…

విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న వైన్స్ ను తోలగించాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిడెంట్ కి వినతి పత్రం అందజేశిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్. ఈసందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల పరిధిలోని విఘ్నేశ్వర వైన్స్ జాతీయ రహదారి అనుకోని నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అందువల్ల మద్యం ప్రియులు ఫుటుగా తాగిపలుమార్లు రోడ్ క్రాస్ చెస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగి మృత్యువాతపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతారు చేస్తూ వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకొని వైన్ షాప్ నడిపిస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఎమ్ఆర్పి కంటే అదిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిని అనుకుని నిర్వహిస్తున్నందువల్ల రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు వాహనాలు ఆపుకొని మద్యం సేవించడం జరుగుతుందని, మద్యం ఎక్కువ సేవించిన మద్యం ప్రియులు రోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారని దీని వల్ల రోడ్డుపై వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విఘ్నేశ్వర వైన్స్ ను రోడ్డుపై నుండి తోలగించాలని యుగేందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బాబు, దగ్గుపాటి సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత..

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత
– ప్రజల ప్రాణాలకు ముప్పు!

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల, కామారెడ్డి రహదారి ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై భారీ గుంత.
నడిరోడ్డుపైనే ఇంత పెద్ద గుంత ఉండటం స్థానికులలో ఆందోళనకు కారణమైంది. ప్రధాన రహదారిపై ఉండటంతో వాహనదారులు ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే వాహనదారులు ఈ గుంతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుంత చుట్టూ కొంతమంది చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు ఇక్కడ ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో దీని ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు తెలుపుతున్నారు.
ఈ గుంతను తక్షణమే పూడ్చివేయాలని, రోడ్డు రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, వాహనదారులు. ఇప్పటికైనా పబ్లిక్ సేఫ్టీ, గ్రామపంచాయతీ అధికారులు రోడ్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వహించకుండా తొందరగా మరమ్మత్తులు జరపాలని కోరుతున్నారు.

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం

సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని 30 వార్డులలో కోతులను కుక్కలను అరికట్టడంలో అధికారులకు విఫలం చెందారని సిపిఐ జిల్లా నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, గురీజపెళ్లి సుధాకర్ రెడ్డి, కోరిమి సుగుణ లు అన్నారు. కోతుల కుక్కల బెడదను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కోతులు,కుక్కల సమస్య విపరీతంగా ఉంద ని వాటిని నివారించడంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. పట్టణ కేంద్రంలో 30 వార్డులలో కోతులు చాలా మంది మహిళలను,పిల్లలను తీవ్రంగా ఎన్నోసార్లు గాయపర్చడం జరిగిందన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. పట్టణం లోని హనుమాన్ నగర్ లో 80లక్షల రూపాయలతో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వాటి నివారణకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిర్వహించకపోవడం వల్ల కోతులు,కుక్కల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. కోతులు కుక్కల పట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు నిధులను దుర్వినియోగం చేస్తూన్నారని వారు ఆరోపించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం కలిసి కోతుల పట్టే బోన్ లను తీసుకొచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటిని వాడకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే కోతుల కుక్కల బెడదను అరికట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కువినతిపత్రం ఇవ్వడం కోసమే అధికారులు నిరాకరించటంతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో సిపిఐ నాయకులు ఆఫీస్ గేట్ ను నెట్టుకొని లోపటికి పోయే ప్రయత్నం చేయగా పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నూకల చంద్రమౌళి,మాతంగి రామ్ చందర్,పల్లె కృష్ణ,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, సదానందం,గణగల జోగేష్ ,లోకిని రమేష్ ,గంప రాజు,పెదమాముల్ సంధ్య శ్రీలత స్వప్న సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి సభలు సమావేశాలు నిర్వహించరాదు

జిల్లా ఎస్పీ రావుల గిరీదర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణం.జిల్లాలో ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించే సభలు సమావేశాలు ర్యాలీలు అనుమతి లేకుండా నిర్వహించా రాదని ఎస్పీ రావుల గిరీదర్ ఒక ప్రకటనలో తెలిపారు డి.ఎస్.పి ఉన్నత పోలీస్ అధికారులచే అనుమతి పొందాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈనెల 30 వరకు వనపర్తి జిల్లా లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు అనుమతి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు

మద్యం షాపులను తొలగించాలి.

మద్యం షాపులను తొలగించాలి.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న వైన్ షాపు మరియు బెల్ట్ షాపులను తొలగించాలని వీసీకే పార్టీ సిపిఐ ఎమ్మెల్ మరియు డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న సంఘాల నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రార్థన మందిరాలకు లేదా పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో వైన్ షాపులు నడిపించాలని ఆదేశాలు ఇచ్చిన కానీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మాత్రం 100 మీటర్ల పరిధిలో వైన్స్ షాపులు నడిపించవచ్చని ఆదేశాలు ఇచ్చారు. కనీసం వంద మీటర్ల దూరం లేకుండా చిట్యాల మండలంలోని వైన్స్ లు మరియు బెల్ట్ షాపులు ఇష్టఅనుసారంగా విచ్చలవిడిగా నడిపిస్తున్న ఇక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తునట్టు భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ వైన్స్ షాప్స్ మరియు బెల్ట్ షాప్స్ విద్యార్థులు వచ్చే దారిలో ఉండడం వలన విద్యార్థులు మరియు యూవతి యూవకులు టీచర్స్ ఇబ్బందులకు గురి అవుతున్నారు విద్యార్థులు యువత మధ్యనికి ప్రభావితం అవుతున్నారు ఈ ప్రభావితం భవిష్యత్ తరానికి ప్రమాదకరం కావున ఇలాంటి వైన్స్ మరియు బెల్ట్ షాపుల తొలగిచలని అన్నారు,
ఈ కార్యక్రమంలో వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మరియు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్. విద్యార్థులు కనకం హితేష్ .ఉదయ్. వినయ్. తదిర్లు పాల్గొన్నారు

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన…

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి, బయట ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని శేఖపూర్ గ్రామస్తులు శనివారం సంబంధిత అధికారులను కోరుతున్నారు.

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి…

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

 

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్‌పై (DeepFake) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు (Hyderabad CP Sajjanar) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజల్లో ఎంతో అవగాహన తీసుకువస్తున్నామని.. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు 5 వేలు, 10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని.. దీని వల్ల పెద్దలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ వెల్లడించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెండ్‌పై…

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..

*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్

 

ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.

మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.

తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు.
తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు.
అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు.
తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన
ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి….

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి

#పత్తిపల్లి గ్రామంలో వీధి కుక్కలకు వింతరోగాలు.
#పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ లక్షణాలు
#ఎస్సీ (మాల) కాలనీలో రేబిస్ వ్యాధి లక్షణాలు గల కుక్కలు.
#పట్టింపు లేని అధికారులు.

గ్రామ యువకుడు మధుకర్ బండారి

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో వింత రోగలతో కుక్కలు సంచరిస్తున్నాయి.కుక్కల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని వైనం.. పగలు,రాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై కోళ్లపై ,పశువుల పైన దాడులు చేస్తుండడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీ నివాసులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తిపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) కాలనీలో పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ వ్యాధి లక్షణాలు ఉండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు, పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో సంచరించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో వింత రోగానికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు, పిల్లలు వృద్దులు, పాదాచారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు. మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచాయితీ అధికారులు, కార్యదర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు. కావున వీధి కుక్కలకు వింత రోగాలు నియంత్రించేందుకు తక్షణమే తగుచర్యలు చేపట్టాలనీ గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

పెంపుడు కుక్కలకు వింత రోగాలు చర్యలు తీసుకోండి.. గ్రామ యువకుడు మధుకర్ బండారి

గ్రామంలో విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుతు ఈగలు వాలుతు వాటినీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచాయితీ అధికారులకు పలుమార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని గ్రామ యువకుడు మధుకర్ బండారి డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి..

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

జిన్నారం సీఐగా ఇటీవల బదిలీపై వచ్చిన రమణారెడ్డి బుధవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిన్నారం సర్కిల్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని సూచించారు.

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

#అధికారులు,కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే నాయిని విజ్ఞప్తి..

#మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా హనుమకొండ నగరంలో వరద పరిస్థితి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

హన్మకొండ, నేటిధాత్రి:

 

నగరంలో చాలా చోట్ల వరద ప్రవాహం కన్పిస్తుంది..
టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడూ సమాచారం ఇవ్వండి..
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…
సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ :
1800 4251115
18004251980

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొ o థ తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని . ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదు అని ఆయన మండల ప్రజలకు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే, రాంచంద్రునాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

మొంథ తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ సంబంధిత జిల్లా కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోతున్న ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు,ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు,” అని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ప్రజలను హెచ్చరించారు,అలాగే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, వర్షాల ప్రభావంతో చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. నేను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నాను.ఎక్కడైనా అత్యవసర సహాయం అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులను తక్షణమే సంప్రదించండి, అని ఎమ్మెల్యే తెలిపారు,మొత్తం మీద, వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ స్పష్టంగా సూచించారు.

ఖిలావరంగల్‌లో తహసీల్దార్ ఇక్బాల్ పర్యటన – వర్షంలో ప్రజల బాగోగులపై ఆరా…

ఖిలావరంగల్‌లో తహసీల్దార్ ఇక్బాల్ పర్యటన – వర్షంలో ప్రజల బాగోగులపై ఆరా…

నేటిధాత్రి, వరంగల్‌.

 

ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే బయటకు రావాలని సూచించిన ఇక్బాల్, ప్రభుత్వం మరియు అధికారులు ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు అందించారు.

ఈ పర్యటనలో ఆర్‌ఐ కీర్తన్, జూనియర్‌ అసిస్టెంట్లు వంశీ, శివ, జిపిఓ సుభాష్ పాల్గొని ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి…

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

#వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

#వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు సంప్రదించాలి.

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు రోజుల పాటు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్  సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

ఈ రోజు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని,విద్యుత్,త్రాగునీర,అంతరాయం కలగకుండా చూడాలని,రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని,అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి చూసించారు.అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

ఇది చెట్ల పొద కాదు.. అది బావి..

ఇది చెట్ల పొద కాదు.. అది బావి..

*కనీసం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చెయ్యని అధికారులు..

*ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా..?

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల పరిధిలోని ఓ రహదారిపై బావి వాహనదారులు ప్రమాదకరంగా మారింది.చూడడానికి చెట్ల పొదల కనిపించే బావి రహదారి పక్కనే సాధారణ కంచె ఏర్పాటు చేసి దర్శనమిస్తుంది.పరకాల పట్టణం నుండి మొగుళ్లపల్లి,చిట్యాల మండలాలకు,అలాగే సమీప గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ బావి హనుమాన్ కమాన్ సమీపంలో ఉంది.బావి నిర్మాణం సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై బలహీనపడిందని చెప్పవచ్చు రోడ్డుకు చాలా సమీపంలో ఉండడం వల్ల వాహనాలు,ముఖ్యంగా రాత్రిసమయాల్లో లేదా వర్షకాలంలో తారసపడే ప్రమాదం అధికంగా ఉందని, బావి చుట్టూ రక్షణ గోడ మరియు కనీసం హెచ్చరిక బోర్డు లేకపోవడం ప్రమాద సంకేతాలను మరింత పెంచుతోందని చెప్పవచ్చు ప్రతిరోజూ ఈ రహదారిపై వాహనాలు,ఆటోలు,ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు వెళ్తుంటాయి.ఆ సాధారణ కంచెను తొలగించి బావి చుట్టూ సిమెంట్ గోడ ఏర్పాటు,రహదారిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులు పెట్టడం,రాత్రి సమయంలో లైట్లు అమర్చడం వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్నారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను మరియు స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు…

జహీరాబాద్ పోలీసులు 25 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పోలీస్ బృందం తరపున, ఏదో ఒక కేసులో ప్రమేయం ఉన్న 25 మంది నేరస్థులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ 25 మంది నేరస్థులను భవిష్యత్తులో ఎటువంటి కేసుల్లో లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒక్క నేరస్థుడైనా ఏదైనా చేస్తే, అతను ఇబ్బందుల్లో పడతాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

వర్షం పడితే వాహనదారులకు నరకమే….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T123048.173.wav?_=7

 

వర్షం పడితే వాహనదారులకు నరకమే.

⏩ ప్రమాదకరంగా మారిన గుంతలు.

⏩ ఒక్కసారి వర్షం పడితే చిత్తడే.

⏩ ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా?

⏩ గత కొన్ని సంవత్సరాల నుండి పేరుకుపోతున్న సమస్య.

⏩పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.

కాశీబుగ్గ నేటిధాత్రి.

 

వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామం నుండి రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు వెంకట సాయి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న గుంతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.వర్షం పడితే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రమాదకరమైన రోడ్డులో ఎన్నో స్కూళ్లకు సంబంధించిన బస్సులు, ఇండస్ట్రియల్ ఏరియా కు సంబంధించిన పెద్ద పెద్ద వాహనాలు, రవాణా చేయటం జరుగుతుంది. వర్షం పడినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆర్ అండ్ బి అధికారులు పట్టినట్టు ఉండటం విడ్డూరంగా ఉంది.ఎన్నోసార్లు పేపర్లలో కథనాలు వచ్చినా కూడా కనీసం అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడం ఎన్నో వివాదాలు దారితీస్తుంది.పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తారా,ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళలో వచ్చే వాహనాలకు మాత్రం నరకమే కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం స్కూలుకు వెళ్లే బస్సులు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంతో వెళ్తుంటారు. ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

హై టెన్షన్ వైర్ల కింద అక్రమ నిర్మాణం, ప్రమాద సూచన…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిర్మాణదారులు పట్టించుకోని జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ అధికారులు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి 

మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులు
హై టెన్షన్ వైర్ల కింద బారి ఎత్తున
నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పనికొరకు అమాయక కూలీలు తెలియక వస్తున్నారు ఇట్టి హై టెన్షన్ వైర్లకు చాలా ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది దాదాపు 7 8 మీటర్ల దూరం నుండి వాటి ప్రభావం చూపుతుంటాయి అయితే ఇట్టి వైర్ల కిందనే నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు దూరం చాలా తక్కువ అసలు హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ ఇట్టి నిర్మాణదారులు ఏలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులను మరియు ఫిర్యాదుదారులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నాడు కావున అధికారులు పరిశీలించి వెంటనే ఇట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T131924.726.wav?_=8

 

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మునిసిపల్‌లోని సికందర్‌వాడి ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడి మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ సమీపంలో జంగి ఘన్స్ మరియు డ్రెయిన్‌ల నుండి మురికి నీరు పేరుకుపోయింది, దీని కారణంగా అంగన్‌వాడి పాఠశాలలోకి ఒక విషపూరిత పాము అకస్మాత్తుగా చొరబడింది, ఇది అమాయక పిల్లలలో గందరగోళానికి దారితీసింది మరియు స్థానికులందరూ గుమిగూడారు మరియు స్థానిక యువకులు బెదిరింపుతో ఆ పామును చంపారు. మరియు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు స్థానికులు దీని గురించి అంగన్‌వాడి కార్యకర్తలు మరియు ఉన్నతాధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి ప్రభావం లేదని చెప్పారు. అమాయక పిల్లలతో పాటు, గర్భిణీ స్త్రీలు కూడా ఈ పాఠశాలకు వచ్చి వెళ్తారని ప్రజలు చెప్పారు. మరియు మురికి నీటి గుంట యొక్క లోతు చాలా లోతుగా ఉంది, పాఠశాలకు వచ్చే పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడిపోతే, అతను తన ప్రాణాలను కోల్పోతాడు. అందువల్ల, ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని మరియు పిల్లలు మరియు మహిళల భద్రత కోసం శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోహిర్ మండల అంగన్‌వాడి అధికారికి విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

బిజెపి నేత ఉడుత కుమార్

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జ్ మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారిన ముళ్ళ కంపలను చెట్లను అదే గ్రామానికి చెందిన బిజెపి నేత ఉడుత కుమార్ స్వచ్ఛందంగా లేబర్ సహాయంతో తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి నిత్యం జమ్మికుంటకు వెళ్లే వాహనాలకు మూలమలుపు వద్ద పెరిగిన చెట్ల వల్ల, ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని పలుమార్లు ప్రమాదాలు జరిగిన, గ్రామ అధికారులు పట్టించుకోవడంలేదని, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా జరగాలని స్వచ్ఛందంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించడం జరిగిందన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి…

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కలకు వింతరోగా


లు…పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం…

ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):

 

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T131737.841.wav?_=9

 

ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం మండలం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరులకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరులకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఇదే మా ఘన నివాళి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ గారు అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.

పోలీసుల సేవలు త్యాగాలు చిరస్మరణీయం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T123933.977.wav?_=10

 

పోలీసుల సేవలు త్యాగాలు చిరస్మరణీయం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి నిత్య స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ కరే తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛగా,భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు.

అమరులైన పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే వారి సేవలు ఎనలేనివి అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారు”అని ప్రశంసించారు.ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి,సమాజ శాంతి భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు.అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమర వీరుల కుటుంబాలకు బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.తర్వాత రక్త దానం చేసిన పోలీస్ అధికారులకు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డీఎస్పీ సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ పోలీస్ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి,అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం ఎస్పీ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పి.డి.ఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.
ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. వి.పి.ఓ లు ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.
ఈ యొక్క సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ డివిజన్ పోలీస్ అధికారులు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు.వి.పి. ఓ లు ప్రతి గ్రామని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..!

◆ – కేసు నమోదు చేసిన హద్మూర్ ఎస్సై సుజిత్..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.

ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ జిల్లా సమావేశం….

ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ జిల్లా సమావేశం

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ ఆధ్వర్యంలో సమావేశం లో అధ్యక్షులు పోచవేని ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతు.. సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ వంటి కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎంతగానో ముందుకు సాగుతుందని తెలియజేశారు అంతేకాకుండా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ దేవానంద్ నాయుడు నేషనల్ సెక్రటరీ ఆకుల చందు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యవంశీ మాధవరావు పటేల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించబడింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే ని మర్యాదగాపూర్వకంగా జిల్లా హ్యూమన్ రైట్స్ మరియు ఆంటీ కరప్షన్ జిల్లా సభ్యులు కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో యువత జిల్లాలో మాదకద్రవ్యాలకు మరియు మద్యం చెడు వ్యసనాలకు అలవాటు పడింది యువత తప్పు మార్గంలో నడుస్తుంది జిల్లాలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తుంది కాబట్టి పోలీస్ శాఖ వారిని అరికట్టాలని ఎస్పీని హ్యూమన్ రైట్స్ జిల్లా ఇన్చార్జ్ పంజా బాలరాజు కోరారుయువతకు ప్రైవేటు కంపెనీ నందు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోచవేని ఎల్లయ్య యాదవ్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి మహిపాల్ జిల్లా ఇంచార్జ్ పంజా బాలరాజు జిల్లా సభ్యులు జింక శరత్ కుమార్ వేములవాడ అధ్యక్షులు చిగుర్ల తిరుపతి బోయిన్పల్లి మండల అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ కొనరావుపేట మండల అధ్యక్షులు గద్ద మల్లేశం రాజన్న రాజన్న జిల్లా జాయింట్ సెక్రెటరీ గొల్లపల్లి దావీదు మరియు జిల్లా సలహాదారుడు జక్కని అరవింద్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

అధ్వానంగా రహదారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T111507.383.wav?_=11

 

అధ్వానంగా రహదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఝరాసంగం – మేదపల్లి ఈదులపల్లి నుండి దిగ్వాల్ వెళ్లే రహదారి రోడ్డుపై వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులపల్లి నుండి దిగ్వాల్ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాలు ఒక పక్కకు ఒరిగి వెళ్లే పరిస్థితి దాపురించింది.కాగా, రీబీటీ వేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట మేదపల్లి ఈదులపల్లి కు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం మండలంలోని రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రమాదకరంగా రహదారులు

రహదారులపై ప్రమాదకరంగా గుంత లు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఝరాసంగం మేదపల్లి ఈదులపల్లి రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాత్రివేళ ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఈదులపల్లి వద్ద మురుగు రోడ్డుపైకి చేరడంతో గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి.

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు…

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ….

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T135735.182.wav?_=12

 

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి:

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని తెలిపారు.
బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు మండల గ్రామాల అధికారులు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. రహదారులు, వీధి విద్యుత్ దీపాలు తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు,పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో,ఝరాసంగం మండల ఆయా గ్రామాల పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలనారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న
జరిగే దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని. అక్టోబర్ 2వ తేదీన దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఝరాసంగం మండల వివిద శాఖల అధికారులకు కోరారు.ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు…

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ మరియు మాదారం గ్రామంలో ప్రధాన రహదారులపై,కాలనీల్లో ఆవులు నిర్బంధం లేకుండా సంచరించడం వలన వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్ అన్నారు.ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని,ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.కాబట్టి దయచేసి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకొని,ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి,అవసరమైతే జరిమానాలు విధించడం గాని లేదా ఆవులను గోశాలలో ఉంచే చర్యలు గాని తీసుకోవాలని ఎంపీడీఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T135203.980.wav?_=13

 

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు
అదుపు తప్పితే ప్రమాదమే

రాయికల్, సెప్టెంబర్ 19, నేటి ధాత్రి,:

 

రాయికల్ మండలంలోని కట్క పూర్ నుండి జగిత్యాల వెళ్లే రోడ్డు మార్గంలో విరాపూర్ గ్రామ పరిధిలో రోడ్లు కు గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గతంలో ఉన్న దానికంటే అతిపెద్దగా గుంతలు రోడ్డుకు పక్కనే ఏర్పడడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది గతంలో ఇదే ప్రదేశంలో ఓ వాహన ప్రమాదం జరిగి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది అలాంటి దారణలు మళ్లీ పున వృతం కాకూడదు అంటే రోడ్డు రవాణా అధికారులు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాహన చోదకు లకు ప్రమాదంగా మారిన ఈ గుంతలను తక్షణమే పూడ్చ వలసిందిగా ప్రజలు కోరుతున్నారు
ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T132101.418.wav?_=14

 

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో కుక్కల పెడదా ఉన్నది.
రహదారి వెంబడి వెళ్లే బాటసారులను కుక్కల గుంపుగా తయారై అనేకమందిని కరవడం జరుగుతున్నది. ఇలా రోజు కరుస్తూ అనేక మందిని భయాందోళన కు గురిచేస్తూ హాస్పిటల్లో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.

 

సుమారు రెండు నెలల నుండి ఇలాంటి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతున్న, అధికారులు గాని పట్టణ నాయకులు గాని పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు మరియు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలపడం జరిగినది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు గానీ, సిబ్బంది గాని,
చర్య తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా సిరిసిల్ల పట్టణ వాసులు తెలిపారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు…

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదిన సందర్భంగా
నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని.కోటి కాంతుల చిరునవ్వులతో ఆష్టఐశ్వర్యలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంగా జీవించాలని నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు,

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది

ప్రమాద కరంగ ఉన్న కరెంట్ స్థంబాన్ని తొలగిచిన విద్యుత్ సిబ్బంది
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణము15 వ వార్డు లో రేషన్ డీలర్ ఇటుకూరి వెంకటయ్య షాపు ప్రక్కన ఇనుప కరెంట్ స్థంభం వంగి ప్రమాద కరంగా వంగడముతో విద్యుత్ అధికారుల ఆదేశాల తో విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డి కాంట్రాక్టర్ దగ్గర ఉండి తొలగించారు ఈ మేరకు 15 వార్డు ప్రజల తరుపున వంగిన విద్యుత్ స్థంభం గూర్చి గతంలో నేటిదాత్రి దినపత్రికలో వార్త వచ్చినది ఈసందర్భంగా విద్యుత్ లైన్ మెన్ సుదర్శన్ రెడ్డ్ మాట్లాడుతూ నవత ట్రాన్స్ పోర్టు పక్క వీధిలో గతంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ అధికారుల అదేశాముతో ఏర్పాటు చేశామని చెప్పారు ఈమేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ 15 వ వార్డ్ మాజి మున్సిపల్ కౌన్సి లర్ బండారు కృష్ణ ఆర్ ఎంపీ డాక్టర్ దానెల్ ముంత మన్యం ఇంతియాజ్ భరత్ కుమార్
పాపిశెట్టి శ్రీనివాసులు కొంపలసురేష్ శివ మున్నూర్ సురేందర్ ఈశ్వర్ భాస్కర్ విద్యుత్ అధికారులకు నేటిదాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…
హైడ్రా ఆర్.&బి. అధికారులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారేమో??
ఫ్లై ఓవర్ బ్రిడ్జి రోడ్డు బాగు చేయాలని బాలానగర్ వాసుల వినతి
హైదరాబాద్, నేటిధాత్రి:
హైదరాబాద్ లోని బాలానగర్ వార్డు పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకి ఇబ్బందులుగా మారాయి.వర్షం కురిస్తే చాలు ఇక్కడ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఈ గుంతలు చూసి స్థానికులు మన్సూర్ ఎమర్జెన్సీ బాధ్యతలు తీసుకున్న హైడ్రా సిబ్బంది కి కూడా తెలియజేస్తే వారు ఆర్ అండ్ బీ కి సంబందించిన పని కాబట్టి వాళ్ళకి ఫిర్యాదు చేయాలని తప్పించుకుంటున్నారు.

Balanagar Flyover

అటు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవిస్తే అది హైడ్రా కంట్రోల్లో ఉంది అందుకే మేము అక్కడ ఏ పని చేయలేవు అని ఆర్.&బి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకుంటున్నాయి తప్ప ప్రజల సేఫ్టీ కోసం ఏ శాఖ కూడా ఆలోచన చేయడం లేదు. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరగకముందే గుంతలు పూడ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని స్థానికులు వాపోతున్నారు.

Balanagar Flyover

ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పైన గుంతలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన మెటీరియల్ తో పూడ్చి ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్…

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్

తనపై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు

20 కి పైగా కేసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలింపు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించునారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ సంపత్ రావు, డీఎస్పీ భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ తండ్రి. శంకర్ వయస్సు 28 సంవత్సరాలు కులం పెరుక వృత్తి హోటల్ వ్యాపారం నివాసం జంగేడు గ్రామం భూపాలపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై తేది 08.09.2025 నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ ( డిపి) చట్టం అమలు చేశారు.
ఆయన పై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసుల నమోదు అయినాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా లోనే దాదాపు 20 కి పైగా కేసులు నమోదు అయినాయి, పై వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ తన దుర్వినయాన్ని కొనసాగించాడు.
జిల్లా పోలీసులు ఆయనపై ఉన్న రికార్డులు నేరప్రవర్తనను సమగ్రంగా పరిశీలించి ప్రజా శాంతి పరిరక్షణ కోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (డిపి) చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చర్లపల్లి జైలు లో నిర్బంధించారు.జిల్లా ప్రజలకు శాంతి భద్రత కల్పించడం మా బాధ్యత. ఇటువంటి అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ సంపత్ రావు డి.ఎస్.పి గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు.

గల్లీకో బెల్ట్ షాప్….

గల్లీకో బెల్ట్ షాప్….!

బంద్ వైన్ షాపుల కేనా…!బెల్ట్ షాపులకు కాదా…?

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాప్ లు

బెల్ట్ షాపులను నియంత్రించే అధికారులు ఎక్కడ

హోల్ సేల్ ముసుగులో బెల్ట్ షాప్ లకు విక్రయాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.

 

బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు

బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.

వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల

ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?

మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T153143.129-1.wav?_=15

 

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం”

“ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ”

మంత్రి వాకటి శ్రీహరి.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం పశుసంవర్థక క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
“ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశాం. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్రం భద్రతా పరంగా పెద్ద తోడ్పాటు అందిస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…

 

“జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. మా నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

నారింజ ప్రాజెక్ట్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153927.000.wav?_=16

నారింజ ప్రాజెక్ట్ ను అదనపు కలెక్టర్ సందర్శించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్ట్ ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన అన్ని ఏర్పాట్ల వివరాలను పురపాలక సంఘం కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఇలాంటి అంచనా జరగకుండా చూడాలని అధికారులను సూచించారు,

ఓదెల గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150249.550.wav?_=17

గణేష్ నిమజ్జనం కు డిజె సౌండ్స్ నిషేధం ఎస్సై దీకొండ రమేష్..

18 డిజె సిస్టం అపరెటర్ల బైండోవర్…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల పరిధిలోని గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. మంగళవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 మంది డీజే ఆపరేటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారందరినీ బైండోవర్ చేసి, చట్టాన్ని అతిక్రమించే యత్నం చేసినా సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఊరేగింపు లో మండల పరిధిలో ఎవరైనా డీజే యజమానులు సౌండ్ సిస్టంను అద్దెకివ్వడం గాని, వినియోగించడం గాని చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆపదలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలే తీసుకుంటున్నామని అదేవిధంగా గణపతి ఉత్సవాలను సాంప్రదా యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రమేష్ ప్రజలను
కోరారు.

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T120752.110.wav?_=18

నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం: మానవ హక్కుల కమిషన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బి. సుమిత్ర, నవీన్ కుమార్, రాధిక, నర్సింహులు, ప్రవీణ కుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు మార్గమని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రత మెరుగుపడుతుందని, ప్రజలు పోలీసులతో సమన్వయంగా ఉండడం ద్వారా సమాజంలో శాంతి, న్యాయం స్థిరపడుతుందని అభిప్రాయపడ్డారు.

పోలీసుల సేవలకు సలామ్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T122317.302.wav?_=19

పోలీసుల సేవలకు సలామ్..!!

◆:- ప్రజల క్షేమమే ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ లక్ష్యం

◆:- వరుణుడి బీభత్సం.. సహాయ కార్యక్రమాలలో పోలీసుల కృషి

◆:- మండలంలో సుడిగాలి పర్యటన, ప్రజలకు సలహాలు తగు సూచనలు

◆:- ముందస్తు చర్యల్లో ఎస్ఐ సేవలు అభినందనీయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఒక్కసారిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు, రైతులు అతలాకు తలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, అటు వర్షానికి కూలిన ఇండ్లు దీంతో భారీ నష్టానికి గురైన ప్రజలు, రైతులు.

 

అదేవిధంగా చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తన సిబ్బందితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడటమే కాకుండా భారీ వర్షానికి ఇండ్లలోకి ప్రవహిస్తున్న నీటిని చూసి భయాందోళన చెందుతున్న ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ..

 

 

వారిని కూడా కాపాడి ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చెరువు, కుంటలు నిండి రోడ్లపై భారీగా నీరు వరదల ప్రవహించడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు, రైతులకు తగు సూచనలు,సలహాలు ఇస్తూ రాకపోకలను నిలిపివేశారు. ప్రజల క్షేమమే తన బాధ్యతగా తీసుకొని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం మండల జిర్లాపల్లి ప్యాలారం దేవరంపల్లి ఎల్గోయి కృష్ణాపూర్ పోటీపల్లి గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్య టించారు. ప్రజలు భారీ వర్షాలు ఉండడంవల్ల అప్ర మత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు రైతులను అటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసుల కృషి, అండ ఉంటుందని ధైర్యాన్ని ఇస్తూ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చేస్తున్న సేవలకు హాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా అని లెక్కచేయకుండా తన విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సలాం కొడుతున్నారు.

 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు : ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటి ప్రమాదం ఉన్నందున రాకపోకలు నిలిపివేశామని అదేవిధంగా అత్యవసర సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండేల చర్యలు చేపడుతున్నా మని అన్నారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు…

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్తూర్ శివారులో గల నారింజ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ముఖ్యంగా వరద నీటి ఉద్రితిని నిరంతరం పర్వేక్షించాలని అధికారులను అదేశంచారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని నీళ్లలో ఉన్న కరెంటు పోల్స్ ను తాకడం మరియు దగ్గర నుండి వెళ్లడం చేయరాదని పొంగి పొర్లే వాగులు వంకలను చూడటానికి వెళ్లకూడదని జలాశయాలు నిండుకుండల మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పొంగిపోరిలే వాగులను దాటడానికి

 

 

ప్రయత్నించకూడదని అన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా నియోజవర్గం లో పర్యటిస్తూ వివిధ శాఖల అధికారులను తగిన సూచనలను చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని పలు శాఖల అధికారులను ఆదేశించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ మాజి పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మాజి సర్పంచ్ లు కరణ్ రాజ్ జగదీష్ శంకర్ కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ అరుణ్ పాప్ నాథ్ భీమ్ రావు రాథోడ్ నవీన్ తేజ శశి వర్ధన్ రెడ్డి బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్ గ్రామ నాయకులు యేసు అతీఫ్ రౌఫ్ రాజు శివరాజ్ తదితరులు ఉన్నారు ..

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి…

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి

24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T131444.482.wav?_=20

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

పరకాల ఏసీపీ సతీష్ బాబు

పరకాల నేటిధాత్రి

 

గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నతరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు డివిజన్ ప్రజలను కోరారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పోల్స్,ట్రాన్స్ఫర్మర్స్ లను ఎవరు తాకరాధని,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలి,వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండాలని కోరారు.చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున,చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెల్లవద్దని రోడ్లపై వరద వచ్చినపుడు వాహనధారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదని,అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదని ఎటువంటి ఇబ్బందీ కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T121259.569.wav?_=21

 

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ మెదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్,ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ బోర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలను తాకరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గణేష్ మంటపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T120501.725.wav?_=22

 

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు.
ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T111949.266.wav?_=23

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి…

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వినాయక మండపం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డిజె సౌండ్ వాడవద్దని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T154258.504-1.wav?_=24

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో మంగళవారం సహా రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీటిమునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ వివరించారు. మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కేసముద్రంలో ప్రమాదకర కరెంటు స్తంభాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84.wav?_=25

ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు

గట్టిగా గాలి వీస్తే…! నేల కూలెన్…?

ఎవరిని బలికొంటాయో…? ఈ విద్యుత్ స్తంభాలు

విద్యుత్ అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో నెలకొని ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు నిర్మాణం జరిగిందని అప్పటినుంచి నేటి వరకు విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఏళ్ల తరబడి తీగల బరువు భరిస్తున్న విద్యుత్ స్తంభాలు ఇక మేము భరించలేమంటున్నట్టు దృశ్యం కనబడుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.స్తంభం మొదలులో సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని ఇనుప చూవలు బయటకు తేలి తుప్పు పట్టి ప్రమాదకరస్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తున్నట్టు ప్రతిబింబిస్తున్నాయి, అసలే వర్షాకాలం గట్టిగా గాలివాన వేస్తే ఎవరి ఇంటి మీద పడతాయో ఎవరి ప్రాణాలు బలి కొంటాయో అని సమీపంలోని నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకటి రెండు కాదు రజక బజార్ మున్నూరు కాపు బజార్ లలో కరెంటు స్తంభాల పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Dangerous Power Poles

దీనికి తోడు సిటీ కేబుల్ యజమానులు ఇష్టా రీతిగా కేబుల్ వైర్లను స్తంభాలకు బిగించి లాగడంతో ఎటు విద్యుత్ సరఫరా వైర్లు అటు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు భారం పడడంతో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి ప్రమాదకరంగా కనబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి అదే స్థానంలో కొత్త కరెంటు పోల్స్ ను నెలకొల్పాలని కేసముద్రం రజక బజార్, మున్నూరు కాపు బజార్ ప్రజలు కోరుకుంటున్నారు.

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు….

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు

*వాహనదారులు ప్రజల భయాందోళన

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండల
అధ్యక్షులు రావుల జానకి రావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.

ములుగు జిల్లాలో, ముఖ్యంగా మంగపేట మండలకేంద్రంలో వందలాది ఇసుక లారీలు రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీల పైన పట్టాలు కట్టకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల వాహనదారుల కళ్లలో ఇసుక రేణువులు పడుతూ నిత్యం ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పాదాచారులు సురక్షితంగా రోడ్లను ఉపయోగించలేక, భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్నాయని బిజెపి నేతలు కార్యకర్తలు అన్నారు.

ఇలాంటి ఇసుక లారీల వల్ల ప్రజలకు, వాహనదారులకు కలిగే భీభత్సాన్ని గుర్తుచేసి, వెంటనే లారీలను నియంత్రించి, సరైన పార్కింగ్‌లో ఉంచేటట్టు, రోడ్ల భద్రతను, ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయిబాబు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T142303.221-1.wav?_=26

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయిబాబు

వర్ధన్నపేట, నేటిధాత్రి:

 

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ఐ ఎన్. సాయిబాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముల్కనూర్ పోలీస్ స్టేషన్ నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన వర్ధన్నపేటకు వచ్చి విధులు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన సాయిబాబు, స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తు, చట్టం – సవ్య వ్యవస్థల అమలు, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శక పద్ధతిలో వ్యవహరించడానికి కట్టుబడి ఉంటాను” అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, యువతను నేరప్రవృత్తుల నుండి దూరంగా ఉంచి విద్య, ఉద్యోగ అవకాశాల దిశగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామాలల్లో, పట్టణాల్లో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో న్యాయపరమైన చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ఎస్ఐ సాయిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

 వీధి కుక్కల కేసులో సుప్రీం సంచలన తీర్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T122358.223.wav?_=27

 వీధి కుక్కల కేసులో సుప్రీం సంచలన తీర్పు

 

 

వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 11 ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేబిస్‌, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ.. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేదించింది.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. త్రిసభ్య ధర్మాసనం వీధి కుక్కలపై దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్/ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది

ఢిల్లీ నుంచి తరలించిన వీధి కుక్కలను మళ్లీ వాటి స్థానాల్లోనే వదిలి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ.. గతంలో జస్టిస్ పార్ధీవాలా ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం నిలిపివేసింది. కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధమని చెప్పుకొచ్చింది.

కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో ఆహారం పెట్టాలని సూచించింది. వాటి కోసం డాగ్ లవర్స్, ఎన్‌జీఓలు రూ.25,000–2 లక్షలు జమ చేయాలని తెలిపింది. వీధి కుక్కల విషయంలో అధికారుల పనికి ఎవరూ అడ్డుపడొద్దని పేర్కొంది. ఈ అంశంపై 8 వారాల తర్వాత మళ్లీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

 కేబుల్ వైర్ల వ్యవహారంపై మరోసారి హైకోర్టులో విచారణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T115741.046-1.wav?_=28

కేబుల్ వైర్ల వ్యవహారంపై మరోసారి హైకోర్టులో విచారణ..

 

 

ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.

శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన రామాంతపూర్ శోభాయాత్రలో జరిగిన విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో..హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్‌ను పరిశీలిస్తూ, ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించటం శోచనీయమని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికింది. కేబుల్ వైర్ల పునరుద్ధరణకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అనంతరం ప్రభుత్వ అధికారులు కేబుల్ వైర్లను కట్ చేయడంతో టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరపనుంది.

రామంతపూర్‌లో ఇటీవల చోటు చేసుకున్న విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో హైకోర్టు వైర్లు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. కేబుల్‌లలో విద్యుత్ ప్రసారం జరగదని.. ప్రమాదానికి కేబుల్ వైర్లు కారణం కానే కాదని స్పష్టంచేశారు. వీటి తొలగింపుతో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరో వైపు,ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రాణనష్టం ఘటనను సీరియస్‌గా తీసుకున్న కమిషన్, బాధిత కుటుంబాలకు పరిహారంపై, ప్రమాదానికి దారితీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, విద్యుత్ శాఖను కూడా భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేబుల్ తొలగింపు విషయంలో హైకోర్టు కూడా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజల ప్రాణాలు పోతుంటే కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యతను విస్మరించి ప్రజల భద్రత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని పూర్తిగా తప్పుపట్టింది.

అయితే, అధికార అనుమతులతోనే కేబుళ్లు అమర్చామని.. ప్రతి స్తంభానికి ప్రభుత్వానికి రూ.1100 చొప్పున మొత్తం రూ.21కోట్లు చెల్లించామని భారతి ఎయిర్‌టెల్ వాదిస్తోంది. చెల్లింపుల వివరాలను గత విచారణలోనే హైకోర్టులో నివేదించింది. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం అప్పటికప్పుడు కేబుల్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వం నిబంధనను పట్టించుకోని కారణంగా తమ కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారని విన్నవించింది. డాక్టర్లు, న్యాయవాదులు, మీడియా, వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు– ఇంటర్నెట్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ తరఫున న్యాయవాది వాదిస్తూ, ఒకే స్తంభానికి అనధికారికంగా అనేక కేబుళ్లు అమర్చారని, ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని పేర్కొన్నారు. దీంతో, జస్టిస్ నాగేశ్ భీమపాక పునరుద్ధరణపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. అన్ని పక్షాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించిన అనంతరం మాత్రమే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.

గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T114914.128-1.wav?_=29

 

గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగా రెడ్డి జిల్లా: జహీరాబాద్ మండల పరిది లోని గణేష్ నిర్వాహకులకు బహీరాబాద్ రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి విదాయక ప్రతిమను ప్రతిష్ఠించడలచినవారు

ముందస్తుగా జహీరాబాద్ రూరల్ పోలీసులకు ఆన్లైన్ %https://police portal.tspolice.goviny index.htm% లింక్ ద్వారా గణేష్ విగ్రహ వివరాలు నమోదు చేసి అట్టి పూర్తిచేసిన సమాచారం కాపీని పోలీస్ స్టేషన్ నందు సమాచారం నిమిత్తం అందించాలని

సూచిచ్చారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి జహీరాబాద్ రూరల్ పోలీసుల మాచనలు:అట్టి లింకులో మాదించిన వివరాలు పొందుపరిచిన అనంతరం, పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండవం ఏర్పాటు చేయదలచిన ప్రదేశం వివరాలతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశం, రోజు, సమయం దారి వంటి వివరాలను కుదా

ఈ లింక్ ద్వారా నమోదు చేయవలిసి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై కాలిబాటల పైన ప్రతిష్టించరాదు. ఎట్టి

పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు. గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్సింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి గణేష్ మండప నిర్వాహకులు: విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్యూటీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం రేపట్టాలన్నారు. మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద, ప్రార్థన మందిరాల వద్ద పెద్ద శాబ్దాలతో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యలు చేయడం, పాటలు పెట్టడం వంటివి చేయవారు. గణేష్ మండపాలను జాగ్రత్తగా

చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి గణేష్ మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉండరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి. టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు. గణేష్ మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీరు సహకరించాలి. మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి.
అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారంబవ్వాలి.

జహీరాబాద్ వార్డు నెం 9 శాంతినగర్. కుక్కల దాడి

జహీరాబాద్ వార్డు నెం 9 శాంతినగర్. కుక్కల దాడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాంతి నగర్ లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఐదు కుక్కలు దాడి చేసి రెండు నిమిషాల్లోనే ఒక చిన్న మేకను చంపేశాయి.
కుక్కలు తరచుగా వీధుల్లో తిరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బందికి ఈ విషయం తెలియదు, ప్రజా ప్రాంతాల నుండి కుక్కలను దూరంగా ఉంచాలని నేను కమిషనర్ మునిసిపాలిటీని అభ్యర్థిస్తున్నాను. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు,

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి ఎస్సై జాడి శ్రీధర్

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి

ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

 

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా,జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,ఏ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు,విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే తేదీ సమయం,ప్రదేశం,ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు.అన్ని వివరాలు మండప నిర్వహకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,వాలంటీర్ల వివరాలు,ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని,శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 డయల్ 112 ను సంప్రదించాలని తెలియజేశారు.మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు సామరస్యపూర్వక వాతావరణం లో , శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ కి సహకరించాలని కోరారు.
ఇంతకు మునుపు వినాయక మండపం ఏర్పాటు చేసినటువంటి,ఎలాంటి వివాదాస్పదం కాని ప్రదేశంలో మాత్రమే మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, విద్యుతు ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,స్త్రీలకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన క్యూలైన్లు నిర్వహించి వారిని గౌరవించాలని,వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల నిర్వహకులకు ఎస్సై శ్రీధర్ సూచించారు.

ఎత్తిపోతల వద్దకు వెళ్లొద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-4.wav?_=30

ఎత్తిపోతల వద్దకు వెళ్లొద్దు: ప్రజలకు పోలీసుల హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజ్జారావు పేట తండా శివారులో గల ఎత్తిపోతల పరిసరాలకు ప్రజలు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఎత్తిపోతల వద్దకు ఎవరూ వెళ్లవద్దని భారీ వర్షాల కారణంగా, ఎత్తిపోతల జలపాతాలలో నీటి మట్టం పరిమితిని దాటింది. ఈ పరిస్థితిలో, మునిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మరియు మానవ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పోలీసులు తెలిపారు.ఈ కారణంగా, ఎవరూ నీటి దగ్గరకు వెళ్లకుండా ప్రజలను చీకటిలో ఉంచారు మరియు పోలీసులను పూర్తిగా అగౌరవంగా చూడాలి.
జహీరాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు,

“జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తం సూచనలు”…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T155921.826-1.wav?_=31

 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి కొన్ని రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంత నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలి-గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి ఆగస్టు 18 నేటి ధాత్రి

 

 

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా అవసరమైన సహాయక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
కాగా రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవేళ ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు.
అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదని కోరారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు.
అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి పెట్టారని జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

వరద ధాటికి కోతకు గురైన పాలవాగు బ్రిడ్జి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40-2.wav?_=32

వరద ధాటికి కోతకు గురైన పాలవాగు బ్రిడ్జి

చెన్నూరు,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అక్కేపళ్లి గ్రామానికి వెళ్లే పాల వాగు బ్రిడ్జి అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురై ప్రమాదాలకు దారితీస్తుందని గ్రామస్తులు వాపోయారు.చెన్నూర్ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు నిరంతరం రాకపోకలు జరిపే బ్రిడ్జి కోతకు గురైన ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు.ఈ రహదారి వెంట ఎలాంటి ప్రమాదాల జరగకముందే అధికారులు అప్రమతమై చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరారు.

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-3.wav?_=33

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీప అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 24 నుండి 36 గంటల భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్,ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని,ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని,ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా,వాగు,నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే బిచ్చగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు,నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను,వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు,రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-2.wav?_=34

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉదృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈ ఈ ప్రసాదు ను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచన మేరకు
జిల్లాకు ఆదివారం వరకు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
90306 32608 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులను మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు.
రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని తెలిపారు. కొంతమంది. అత్యుత్సాహంతో ఎవరైనా దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో బారికేడ్లు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డిఈ వరుణ్, ఏఈ షర్ఫ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-4.wav?_=35

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు

మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

గణపురం సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు పోలీసు లాంఛనాలతో జెండా ఎగర వేయడం జరిగింది అనంతరం సీఐ మాట్లాడుతూ గణపురం రేగొండ కొత్తపల్లి గోరి మండలాలకు సర్కిల్ గా అపాయింట్మెంట్ చేసినందుకు ఎస్పీ కిరణ్ కార్కే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పనిచేస్తానని గణపురం పోలీస్ స్టాప్ ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ అందరూ సహకరించాలని వారిని కోరడం జరిగింది

గణపురంలో నూతన పోలీస్ సర్కిల్ ప్రారంభం…

గణపురం నూతన పోలీస్ సర్కిల్ ను ప్రారంభం కలెక్టర్, ఎస్.పీ గార్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాంతి భద్రతల బలోపేతమే ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

గణపురం నేటి ధాత్రి

గురువారం గణపురం మండలం కేంద్రంలోనిపోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ,ఎస్పీ కిరణ్ కరే గార్లతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ “ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందనీ,నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది” అన్నారు.ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు.ఈ నూతన సర్కిల్ కి చెన్నమనేని కరుణాకర్ రావు ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం నియమించింది అని ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే జీఎస్సార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై

ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై
నిరంతరం నిఘా పెట్టండి: కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌
`ట్రాఫిక్‌, విపత్తు స్పందన బృందాలు సమన్వయం చేసుకుంటూ నగర జీవనంకు ఆటంకం కలగకుండా చూడాలిలి
-వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
-రాజేంద్ర నగర్‌ సర్కిల్‌ లో పర్యటనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌
-ఫీల్డ్‌ బృందాల సన్నద్ధత పరిశీలన

 

 

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్‌, సర్కిల్‌,వార్డు అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఉదయం రాజేంద్ర నగర్‌ సర్కిల్‌ లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ , జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి , డిప్యూటీ కమిషనర్‌ , అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.


జల్‌ పల్లి చెరువుతో పాటు వరదముప్పు ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కమిషనర్‌ పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజల భద్రతా కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ట్రాఫిక్‌ , విపత్తు బృందాలు కలసికట్టుగా పని చేయాలన్నారు. వరద నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించాలన్నారు. వాటర్‌ లాగింగ్‌ పాయింట్‌ లపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ ఫ్లో సజావుగా జరిగేలా చూడాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రమాదకర స్థలాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
వర్షకాలంలో ట్రాఫిక్‌, విపత్తు స్పందన బృందాలు సమన్వయం చేసుకుంటూ నగర జనజీవనానికి ఆటంకం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు చేపట్టాలనీ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌ ఆదేశించారు.

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు,ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు,వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని,లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని,ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని,పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని,జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఉన్నారు.జిల్లాలో ప్రాణ నష్టం,పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్నా మలహాల్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T160400.440.wav?_=36

 

మానవత్వం చాటుకున్నా మలహాల్ రావు

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు లో భాగంగా నడికూడ నుండి ధర్మారం వెళ్లే రోడ్డు ఒకవైపు రోడ్డు పూర్తయి ఇంకోవైపు రోడ్డు పూర్తి కాలేదు,వర్షపు నీరు మురికి నీళ్లు పోవడానికి కూడా కాలువలు లేవు, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు ఎటు పోకుండా ఒక వైపు రోడ్డు మధ్యలో గుంటలాగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారు నీళ్లలో గుంటలు ఏర్పడక చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్లమలహాల్ రావు ట్రాక్టర్లతో మట్టి (మొరం) తెప్పించి నేర్పించి చదునుచేపించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిక్షపతి, గ్రామపంచాయసిబ్బంది కిన్నెర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న కాంట్రాక్టర్ రాజు పాటిల్…

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T120829.761-1.wav?_=37

మానవత్వం చాటుకున్న కాంట్రాక్టర్ రాజు పాటిల్

◆:- పస్తాపూర్ కమాన్ నుండి మహేంద్ర కాలానికి వెళ్లే రోడ్డు వరకు

◆:- రోడ్డుపై ఉన్న గుంతలను జెసిపి తో పూడ్చివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ కమాన్ నుండి మహేంద్ర కాలనీకీ వెళ్లే రోడ్డు వరకు గుంతలతో ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలగడంతో మానవత్వం చాటుకొని జెసిబి సాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేసిన కాంట్రాక్టర్ రాజు పాటిల్ బుధవారం సాయంత్రం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడంతో రోడ్డు పై వెళ్లే ప్రజలు రాజు పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పై వర్షము నీళ్లు నిండి ప్రజలకు ఇబ్బందులు పడ్డారు.ఈ రోడ్డు గుండా ఝరాసంగం రాయికోడు మండలం లతో పాటు వివిధ గ్రామాలకు ప్రజలు వెళ్తుంటారు ఇటీవల ఓ దంపతులు బైక్ పై వెళుచుండగా లోతైన గుంతలు ఏర్పడడంతో బైక్ పై నుండి క్రిందపడి గాయాలు ఏర్పడ్డాయి పలుమార్లు గుంతలు ఏర్పడిన విషయం అధికారులకు తెలిపిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు దీంతో కనికరించిన రాజు పాటిల్ తన మంచి మనుస్సు తో ముందుకు వచ్చి జెసిపి సాయంతో గుంతలన్నిపూడ్చి తన మంచి మనుస్సు ను చాటుకున్నారు.

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండల కేంద్రంలో గల శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో మాదక ద్రవ్యాలపై ఎస్సై రావుల రణధీర్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దుగ్గొండి బ్రాంచ్ శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్ లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం సమాజంలో ఆన్ లైన్ మోసాలు, డేటా హాకింగ్, ఫేక్ అకౌంట్ వంటి సైబర్ నేరాల గురించి వివరించామన్నారు.రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రతినెల ఒక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.మొబైల్ ఫోన్లో వస్తున్న ఫేక్ మెసేజ్లను ఇతరులకు షేర్ చేయకూడదుని తెలిపారు.అకౌంట్లో డబ్బులు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ జరిగినట్లయితే వెంటనే 1930 నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ మారక ద్రవ్యాలు, పాను,గుట్కా గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో అనుమానాస్పదంగా అనవసరమైన లింకులు,పాస్ వర్డ్ మొబైల్ ఫోన్ లో వస్తున్నాయని అటువంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కవిత బిక్షపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-3.wav?_=38

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…

రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…

పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి.

మండల వ్యాప్తంగా కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=39


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్
https://youtu.be/XsqTcVL4mKo
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం  పరిసర మండల ప్రాంతాలలో గత రెండు  రోజులుగా అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఈ కారణంగా పిడుగులు పడే అవకాశం  రహదారులపై వరద నీటి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్ లేదా విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దు.2. అత్యవసర పనులు తప్ప రోడ్లపైకి రావద్దు.3. వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలలో ప్రయాణించవద్దు, ప్రత్యేకించి లోతైన కాలువలు, వంతెనలు, బండ్లు వద్ద జాగ్రత్తగా ఉండాలి.4. వాహనదారులు రహదారులు జారుడు మయం కావచ్చునని గుర్తుంచుకుని మితమైన వేగంతో ప్రయాణించాలి.5. ఏవైనా ప్రమాద సూచనలు గమనించిన వెంటనే పోలీసు స్టేషన్ 8712658142, 8712658110, 8712658120, 8712658121 నంబర్‌లకు సమాచారం అందించాలి
ప్రజల భద్రత మా ప్రాధాన్యం. సహకరించి, భద్రంగా ఉండండి అని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు

దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మున్సిపల్ సంస్థ stray dogs‌ను ఎనిమిది వారాల్లో పట్టుకుని, వాటిని శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని, ముందుగా వాటిని స్టెరిలైజ్ చేయాలని ఆదేశించింది.

రాజధానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ప్రక్రియలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డంకిగా మారితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version