గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కూలిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు మంగళవారం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చేనిగేపల్లి గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వానతో బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారిపై పడిపోయాయి, కొన్ని కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై చెట్లు, విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన స్తంభాలు, చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.
కల్వకుర్తి, నేటిధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల వర్షం పట్టణవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వరదల్లో మునిగిన సుదర్శన్ నగర్ కాలనీ
శేరిలింగంపల్లిలో, నేటి ధాత్రి :
శేరిలింగంపల్లి, డివిజన్ శనివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి రోడ్లు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి చెరువును తలపించేలా మారింది. చిన్న పాటి వర్షం కురిసిన రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
చేర్యాల పట్టణంలో చిన్న చెరువు పెద్ద చెరువు భూకబ్జాల కారణంగా చేర్యాల పట్టణమంతా పూర్తిగా జలమయమైనది పలు కాలనీలలో ఇంటి లోపలికి నీరు వస్తున్నడంతో ప్రజలు పలువురు ఇబ్బంది పడ్డారు గాంధీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు
ఈ సందర్భంగా చేర్యాల పట్టణమంతా గాంధీ చౌరస్తా వద్ద భూకబ్జాలతో
మరియు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం కాకుండా పూర్తిగా నెమ్మదిగా చేయడం వలన చేర్యాల సిద్దిపేట నేషనల్ హైవే పై మరియు చేర్యాల నుండి కడవేరుగు పోయే రోడ్డు కూడా పూర్తిగా మోకాళ్ళ లోతు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరియు వాహనదారులు తమ వాహనాలు తో ఇబ్బంది పడడం కనబడినది అయినను మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకొని అక్రమ కట్టడాలను కూల్చకుండా కబ్జాలను ప్రోత్సహిస్తూ పలువురికి కొమ్ముకాస్తుండడం తీరుపై ప్రజలు ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తున్నారు
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికీ చాలాసార్లు వర్షం వచ్చినప్పుడు జలమయమైన నామవాత్రపు చర్యలతో అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రెండు చెరువుల మధ్యలో ఉన్న చేర్యాల మున్సిపల్ ప్రాంతాన్ని నీటి గండాల నుండి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నది అన్నారు చేర్యాల సిఐ ఎల్ శ్రీను మరియు చేర్యాల ఎస్సై నవీన్ మరియు వారి సిబ్బంది జెసిబి సహాయంతో అక్కడ ఉన్న నీటిని మళ్లించే కార్యక్రమం చేశారు కానీ శాశ్వత పరిష్కారం కొరకు ప్రజలు పట్టణవాసులు వాహనదారులు ఎదురుచూస్తున్నారు ఈ సమస్యపై అందరు పరిష్కారం కోరుకుంటున్నారు
కోహీర్ మండలం, పిచర్యగడి గ్రామంలోని ఎస్సీ కాలనీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సీ కాలనీ గుండా కాలువలను నిర్మించడం, ఊరి వెనకాల ఉన్న చెరువు నీరు మరియు గ్రామంలోని మురికినీరు రెండూ ఒకే కాలువ గుండా ప్రవహించడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఈ కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వేరువేరు కాలువలను నిర్మించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
జహీరాబాద్ సెప్టెంబర్ 11:ఆగష్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగి పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే, వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయించినప్పటికీ బాధితుల కష్టాలు వర్ణనాతీతం ఇలాంటి బాధాకరమైన విషయాలు మరవకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోని ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జనాలు విసుగు చెందుతున్నారు. గురువారం ఉదయం 8 గంటలకే మొదలైన వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పొలాల్లో ఉన్నటువంటి కోతకు వచ్చిన పంటల్ని కోసి ధాన్యంగా మార్చే ప్రక్రియలో పనులకు అంతరాయం కలగడంతో చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లలోని మానేరు జల ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ మునక
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు ఉదృత ప్రవాహానికి బతుకమ్మ ఘాట్ వరద ప్రవాహానికి మునిగిపోయింది. గత మూడు నాలుగు రోజుల నుండి భారీ వర్షానికి వస్తున్న వరదల వల్ల, పట్టణంలోని ఎగువ మానేరు జలాశయం నుండి నీరు ఉదృతంగా కిందికి ప్రవహిస్తున్న సందర్భంగా సిరిసిల్లలోని మానేరు జల కళ ఉట్టి పడినట్లు సిరిసిల్ల పట్టణవాసులు, మరియు పరిసర గ్రామాల నివాసులు మానేరు వాగు నీటిని సందర్శించడానికి, తండోపతండాలు గా వస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి
24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495
వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తమ విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖతోపాటు మున్సిపల్ కార్మికులకు టిఫిన్ వాటర్, బాటిల్ పంపిణీ చేశారు. గురువారం పట్టణంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందించారు.
జమ్ము & కాశ్మీర్‌లో రెండు వేర్వేరు క్లౌడ్‌బర్స్ శనివారం మరియు ఆదివారం రాత్రిలో చోటుచేసుకున్నాయి. జోధ్ ఘాటీ గ్రామంలో ఐదు మంది, జాంగ్లోటే ప్రాంతంలో వర్షాల కారణంగా భూకంపంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మినహాయింపులు భారీ నష్టం ఏర్పడింది. క్లౌడ్‌బర్స్ అనేది చిన్న ప్రాంతంలో హఠాత్, తీవ్రమైన వర్షం, ఫ్లాష్ ఫ్లడ్‌లు, ల్యాండ్స్లైడ్స్ మరియు మౌంటైన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలకు దారి తీస్తుంది. సాధారణంగా 1 కిమీ³ వాల్యూమ్ ఉన్న క్యూములోనింబస్ మేఘం 500 మిలియన్ లీటర్ల నీరు నిల్వ చేయగలదు. వర్షం అత్యంత స్థానికంగా పడుతుంది, కొన్ని గంటల్లోనే భారీ నష్టం కలిగిస్తుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అక్కేపళ్లి గ్రామానికి వెళ్లే పాల వాగు బ్రిడ్జి అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురై ప్రమాదాలకు దారితీస్తుందని గ్రామస్తులు వాపోయారు.చెన్నూర్ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు నిరంతరం రాకపోకలు జరిపే బ్రిడ్జి కోతకు గురైన ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు.ఈ రహదారి వెంట ఎలాంటి ప్రమాదాల జరగకముందే అధికారులు అప్రమతమై చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరారు.
వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీప అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 24 నుండి 36 గంటల భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్,ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని,ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని,ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా,వాగు,నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే బిచ్చగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు,నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను,వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు,రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.
#మత్తడి దూకుతున్న పలు చెరువులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.
Flood water overflowing
అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మొగుడంపల్లి 0.73 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఝరాసంగం వాలాద్రి వాగు పొంగి ఏడాకులపల్లి, ప్యారవరం, ఎల్లోయి, జీర్లపల్లి చెరువు పొంగడంతో మంజీరాకు వరద నీరు వెళుతుంది. ప్యారవరం వాగు ఎప్పటి మాదిరిగానే పొంగిపొర్లుతోంది. కుప్పానగర్, మచ్నుర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెర వాడ, చిలేపల్లి, చిలపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు..
పుల్ కల్ (లక్ష్మీసాగర్) – 13.7 సెంటీమీటర్లు
గుమ్మడిదల (నల్లవల్లి) – 9.70 సెంటీమీటర్లు
చౌటకూర్ (చౌటకూర్) – 8.89 సెంటీమీటర్లు
అమీన్ పూర్ (సుల్తాన్ పూర్) – 8.10 సెంటీమీటర్లు
ఝరాసంగం (ఝరాసంగం) – 7.48 సెంటీమీటర్లు
నిజాంపేట్ (నిజాంపేట్) – 6.60 సెంటీమీటర్లు
పుల్ కల్ (పుల్ కల్) – 5.93 సెంటీమీటర్లు
రాయికోడ్ (రాయికోడ్) – 5.73 సెంటీమీటర్లు
హత్నూర్, వట్ పల్లి, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా పటాన్ చెరువు, రామచంద్రపురం, సదాశివపేట్, జహీరాబాద్, కంది ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. మిగతా ప్రాంతాల్లో మోస్తారుగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఝరాసంఘం మండలం బిడే కన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీశారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. ఏడాకులపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను గ్రామస్తులు సురక్షితంగా దాటించారు. ఈ ప్రాంతంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ప్యాలవారం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి, రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. నెలరోజుల తర్వాత కురిసిన వర్షానికి పంట చేనులో నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షం పంటలను దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్: కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో మధ్యాహ్నం బారీ వడగండ్ల వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు జోరువానకు కాలనీలు జలమయం అయ్యాయి. ఈ వర్షాకాలం ఎ న్నడూ లేని విధంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈభారీ వర్షం కారణం గా గ్రామంలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు, వరద నీటితో నిండిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. వర్షం దాటికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలుస్థంభించాయి. గ్రామంలోని ప్రదాన రోడ్లు జల మయమై వాహనాలు నీటిలో కూరుకుపోయాయి. స్థానికంగా ఉన్న చిన్న చిన్న కాలువలు, వర్షపు నీటిని తట్టుకోలేకపోవడంతో పరిస్థితి మరింత దిగ జారింది. స్థానిక రైతులు మాత్రం ఈ వర్షం వల్ల పంట పొలాలలో వర్షం నీరు చేరి నీరు నిలిచిపోయాయి. ఇతర పంటలకు మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.