సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు..

సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేసిన మరిపెడ పోలీసులు

మరిపెడ నేటిధాత్రి.

ఈ మద్య కాలంలో జరిగిన సైబర్ నేరాలలో మరిపెడ పరిది లో బాధితులు డబ్బులు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించినారు.వెంటనే పోలీసు లు స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా కంప్లైంట్ చేసి తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నారు, 1930 నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కొంత డబ్బు నిందితుని అకౌంట్ కి చేరకుండా హోల్డ్ లో ఉంచబడింది అన్నారు,మరిపెడ సి.ఐ రాజ్ కుమార్ గౌడ్ , ఇట్టి కంప్లైంట్ లను ఐ టి యాక్ట్ కింద కేసు కట్టి విచారణ చేపట్టి, హోల్డ్ లో ఉంచబడిన అమౌంట్ ను బాధితులకు రిటర్న్ వచ్చేలా గౌరవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, తొర్రూరు గారికి లెటర్ పెట్టి, తద్వారా మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకొని బాధితులు పోగొట్టుకున్న అమౌంట్ ను వారి ఖాతా లోకి తిరిగి జమ అయ్యేలా చేయడం జరిగింది అన్నారు,ఒక క్రైమ్ నందు 13,700/- రూపాయలు ఇంకొక క్రైమ్ నందు 6,821/- రూపాయలు రిటర్న్ వచ్చాయి, గతం లో మరిపెడ లో ఒక షాప్ యజమాని 40,000/- పోగొట్టుకొని వెంటనే 1930 కి కాల్ చేయడం ద్వారా, మొత్తం డబ్బులు వెనక్కి తెప్పించడం జరిగింది.ఇంకా మూడు కేసులలో అమౌంట్ రీఫండ్ కావలసి ఉంది.ఈ మధ్య కాలంలో చాలా సైబర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కావున ప్రజలు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగలరు,బాధితుల సమస్యలకు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్సై సతీష్ గౌడ్ ని అభినందించడం జరిగింది.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
• మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు
• లోన్ అప్ లను నమ్మొద్దు

• ఇంచార్జ్ ఎస్ఐ సృజన

నిజాంపేట నేటి ధాత్రి:

ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ ఓటీపీ వచ్చింది. చెప్పండి అంటూ ఫోన్ చేస్తే నమ్మవద్దన్నారు. అలాగే లోన్ అప్ ల వేధింపులకు చాలా మంది బలివుతున్నారని ఎవరు కూడా లోన్ అప్ లను నమ్మవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే 1930కు కాల్ చేయాలన్నారు.

క్రిమినల్స్ పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .
మిక్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3.5 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చెలుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మియాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. వారసిగూడా కు చెందిన గాయని శ్రీకాంత్ (36) కంది జైల్లో జైల్ వార్డెన్ గా పని చేటున్నాడు. కడప జిల్లాకు చెందిన చిదిరి అమర్నాథ్ (41) ఎపి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పలు కెసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడు. ఇద్దరు సస్పెన్షన్ లో ఉండగాఆరో ఇద్దరు మల్కాజిగిరి దాయనంద్ నగర్ కి చెందిన ఎండి ఇమ్రాన్ (32), మలక్ పెట్, మూసరం బాగ్ కి చెందిన వాసం శ్రీకాంత్ (32) లతో పరిచయం ఏర్పడింది. ఇమ్రాన్ డెలివరీ బాయ్ గా శ్రీకాంత్ పెయింటర్ గా పనిస్తున్నారు. నలుగురు ముఠా గా ఏర్పడి ఇటిసి నుండి సిగరెట్లు షాప్ లలో సప్లై చేసే వారే టార్గెట్ గా పెట్టుకొని రెక్కీ నిర్వహించేవారు. వారు బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం మీరు తిఅంకెళ్తున్న సిగరేట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అని భయబ్రాంతులకు గురి చేసేవారు. సిగరేట్లతో పాటు గంజాయి, డ్రగ్స్ సప్లై చేటున్నందుకు కేసులు పెడతామని బెదిరిస్తారు. వాటిని పరిశీలించి లోకల్ పోలీసులకు అప్పగించాలి అంటూ బెదిరించి డబ్బ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ లో ఏప్రిల్ 28 వ తేదీన సిగరెట్ సప్లైర్ బెదిరించి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సప్లర్ శ్రీహరి వెంటనే మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయాయడంతో నిందితులను అదుపులోకి తిఆకున్నారు. వారి నుండి 3.5 లక్షల విలువ చేసే పలు రకాల కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసుల స్వాధీనం చెలుకున్నారు. ఈ విధంగా వారిపై అల్వాల్, మియాపూర్, సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ మేరకు నిందితులను రిమాండ్ కు తరలించి కేసును చేధించిన పోలీసులని ఏసీపీ, శ్రీనివాస్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో, క్రాంతి కుమార్, రవీందర్, రమేష్ నాయుడు,విజయ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పుల్య నాయక్, సుభాష్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version