మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.

 

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం..

మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు…

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు

సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండల కేంద్రంలో గల శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో మాదక ద్రవ్యాలపై ఎస్సై రావుల రణధీర్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దుగ్గొండి బ్రాంచ్ శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్ లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం సమాజంలో ఆన్ లైన్ మోసాలు, డేటా హాకింగ్, ఫేక్ అకౌంట్ వంటి సైబర్ నేరాల గురించి వివరించామన్నారు.రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రతినెల ఒక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.మొబైల్ ఫోన్లో వస్తున్న ఫేక్ మెసేజ్లను ఇతరులకు షేర్ చేయకూడదుని తెలిపారు.అకౌంట్లో డబ్బులు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ జరిగినట్లయితే వెంటనే 1930 నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ మారక ద్రవ్యాలు, పాను,గుట్కా గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో అనుమానాస్పదంగా అనవసరమైన లింకులు,పాస్ వర్డ్ మొబైల్ ఫోన్ లో వస్తున్నాయని అటువంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కవిత బిక్షపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో బుధవారం
రోజున చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి సమక్షంలో ఏఎస్ఐ మధుసూదన్ సారధ్యంలో పాఠశాలలోని విద్యార్థులు అందరి చేత మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ మనుగడకు పెనుముప్పు అని మాట్లాడడం జరిగింది. మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందిన దేశంఅని, మాదకద్రవ్యాలను అందరం కలిసికట్టుగా నిర్మూలించుదామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బొమ్మ రాజమౌళి, రామ్ నారాయణ, శ్రీనివాస్, ఉస్మాన్ అలీ, శంకర్, బుర్ర సదయ్య, సరళ దేవి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, మౌనిక, స్వామి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పూర్వ విద్యార్థి గుర్రపుచందర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అధికారుల ఆదేశానుసారం.

జిల్లా అధికారుల ఆదేశానుసారం.

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిట్నెస్ టెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం . బద్దెనపల్లి గ్రామంలో. జిల్లా రవాణా ఆదేశానుసారం. టెక్స్టైల్ పార్కులో గల రవాణా శాఖ వారి ఫిట్నెస్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే స్థలంలో మారక. ద్రవ్యాల. నిర్మూలనకై .డ్రైవింగ్. ఫిట్నెస్ నిర్వహించి స్థలంలో. వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాహనదారుకు. మారక దవ్యాల . నిర్మూలనకై వాహనదారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ మోటర్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్. సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి. ప్రమీల. కానిస్టేబుల్ సౌమ్య. హోంగార్డు ఎల్లేష్. వాహనాల. దారులు.తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version