ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం బాధాకరం…

ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం బాధాకరం”

 

“ప్రజా పాలనలో పేదలకు అన్యాయం”

 

ఈ ఘటనపై అధికారులను సస్పెండ్ చేయాలి.

 

బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ డిమాండ్.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం అత్యంత బాధాకరమని, ఇది ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని బాలానగర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ఆసుపత్రిలో భద్రతా చర్యలు, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు

అంజమ్మ గడ్డ, హేమ్లా తండాలలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం…

అంజమ్మ గడ్డ, హేమ్లా తండాలలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం.

తండాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం – ఎమ్మెల్యే.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

పేదల సొంతింటి కల సాకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ మండలంలో అంజమ్మ గడ్డ తండా మరియు హేమ్లా తండా (సింగమ్మ గూడ)లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి అర్హుడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తండాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం ఏర్పాటుకు రూ.2.11 లక్షల విరాళం

బాలానగర్ : ధ్వజస్తంభం ఏర్పాటుకు రూ.లక్ష విరాళం.

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసెల యాదయ్యభక్తితో ముందుకు వచ్చి రూ.2.11 లక్షలు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా శనివారం రూ.లక్ష అడ్వాన్స్ ను దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిసెల యాదయ్య మాట్లాడుతూ.. ధర్మం కోసం చేసే ఖర్చు ఎప్పుడూ వృధా పోదని.. స్వామి వారి సేవలో భాగస్వాములై తన వంతు విరాళాన్ని అందించానని అన్నారు. గుడిసెల యాదయ్య సామాజిక స్పృహను దైవభక్తిని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల పరిధిలోని జాలుగడ్డ తండాలో బుధవారం నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రాము నాయక్ లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పారదర్శకమైన పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ పత్రాలను అందించామన్నారు. మంజూరైన నిధులతో లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్, కిషన్, సుప్రియ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తండావాసులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన బాలానగర్ పోలీసులు

“హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి”

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

 

బాలానగర్ ఎస్సై లెనిన్.

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో, పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ ఆదేశాల అమలులో భాగంగా, బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండెడ్ గ్రామం నందు బాలానగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ లెనిన్ మరియు సిబ్బంది రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు క్రింది విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి
త్రిబుల్ రైడింగ్ చేయరాదు
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు
రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ ఓవర్టేక్ నివారించాలి
మైనర్లు వాహనాలు నడపరాదు
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు వివరించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల్లో రోడ్డు భద్రతపై మంచి అవగాహన ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

జడ్చర్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా లింగం యాదవ్ నియామకం.

జడ్చర్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా లింగం యాదవ్ నియామకం.

 

 

 

జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ సమక్షంలో బీసీ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్ చేతుల మీదుగా.. జడ్చర్ల నియోజకవర్గ బీసీ సేన ఉపాధ్యక్షులుగా సూరారం గ్రామానికి చెందిన లింగం యాదవ్ ను గురువారం నియమించారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల కోసం పనిచేస్తానన్నారు. బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్, బాలానగర్ మండల బీసీ సేన అధ్యక్షులు చాకలి మధు, శ్రీశైలం, పూజారి శ్రీశైలం, శేఖర్ గౌడ్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం, పూజరి రమేష్, కురువ మహేష్,చాకలి వీరేష్, సరస్వతి శారదమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి….

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.

బాలానగర్ ఎస్సై లెనిన్.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ.

హన్వాడ:- నేటి దాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కారుకొండ గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-2015 బ్యాచ్.ఏప్రిల్ 20-2025 న.తమ 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను పంచు కున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఉపాధ్యాయులని గుర్తుచేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version