న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం
నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్లను ధ్వంసం చేయడం..ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నేడు (డిసెంబర్ 27) ప్రకటించిన ఈ ఆపరేషన్లో దక్షిణ ఈశాన్య జిల్లాలోని హాట్స్పాట్లపై రాత్రివేళ దాడులు చేశారు.
