యూరియ కోసం… రైతుల తిప్పలు…

– యూరియ కోసం…
రైతుల తిప్పలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

యూరియా కోసం రైతులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో శనివారం రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 400 బ్యాగులో యూరియా గ్రామానికి సరఫరా చేసింది. విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగినంత యూరియా రైతులకు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహులు, ఏఈఓ శ్రీలత, గ్రామస్తులు ఉన్నారు.

తాసిల్దార్ తిరుమల రావు సమర్థ సేవలు అందిస్తున్నారు..

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న తాసిల్దార్ తిరుమల రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాసిల్దార్ పనిచేస్తున్న తిరుమల రావు ప్రజలకు సక్రమంగా సేవలు అందిస్తున్నారు. ప్రజల సమస్యలు విన్న వెంటనే పరిష్కారం చూపిస్తూ, పేదల అభ్యర్థనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తూ, కార్యాలయంలో పారదర్శకతను కాపాడుతున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నందుకు స్థానికులు తాసిల్దార్ తిరుమల రావుకి ఝరాసంగం మండల్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు,

మరిపెడలో గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-85.wav?_=1

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్

భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం

సి ఐ రాజ్ కుమార్ గౌడ్,ఎస్సై సతీష్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణం మరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్ సీఐ.రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై సతీష్ గౌడ్, తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దయనంద్, తాసిల్దార్ కృష్ణవేణి, మండలంలోని పలు గ్రామాల్లో నీ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో సమస్యల పరిష్కార హామీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-83-1.wav?_=2

ప్రజావాణిలో ఐదుగురి సమస్యలు, తహసిల్దార్ హామీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రతీ సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కార్యక్రమంలో ఐదుగురు తమ సమస్యలను విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తిరుమల రావు హామీ ఇచ్చారు.అధికారులు
ఎంపిడిఓ మంజుల డిప్యూటీ ఎమ్మార్వో కరుణాకర్ రావు వ్యవసాయ అధికారి వెంకటేశం, ఆర్ఐ రామారావు, స్పెషల్ ఆఫీసర్, పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి, హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహిళా సంఘం స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి వినతి పత్రం

మహిళా సంఘం స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి వినతి పత్రం

జైపూర్,నేటి ధాత్రి:

మహిళా సంఘం భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి మహిళా సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులకు గత ప్రభుత్వం 152 సర్వే నెంబర్ లో అప్పటి ఎమ్మెల్యే మహిళా భవనం నిర్మాణం కొరకు స్థలాన్ని తహసిల్దార్ ద్వారా కేటాయించారని తెలిపారు.కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ తో రామస్వామి అనే వ్యక్తి గోదావరిఖని కి చెందిన వ్యక్తులతో కొనుగోలు చేశామని ఆగస్టు 14న నిర్మించిన జెండా గద్దెను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సదరు వ్యక్తులపై కట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులు తహసిల్దార్ వనజ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

అర్ధరాత్రి కుండపోత వర్షం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-3.wav?_=3

అర్ధరాత్రి కుండపోత వర్షం.

#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.

#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.

#మత్తడి దూకుతున్న పలు చెరువులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

Flood water overflowing

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

నెక్కొండలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

నెక్కొండలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

అంబరాన్ని అంటిన 79స్వతంత్ర దినోత్సవ వేడుకలు

#నెక్కొండ ,నేటి ధాత్రి:

నెక్కొండ మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో పాటు పల్లె నుండి పట్నం దాకా ఘనంగా నిర్వహించారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వేముల రాజుకుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, రెవెన్యూ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నెక్కొండ మార్కెట్ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నెక్కొండ మార్కెట్ లో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒకరికొకరు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, రాచకొండ రఘు, ఈదునూరి సాయి కృష్ణ, బండి శివకుమార్, సింగం ప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Independence Day

నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణలో సొసైటీ చైర్మన్ మారం రాము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో సురేష్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

బేడ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్

బేడ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దని తసిల్దార్ కి వినతి పత్రం.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల తాసిల్దార్ కి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్న బాలసంత కాటిపాపల కులస్తులకు బేడ బుడగ జంగామాని తప్పుగా చెప్పి ఎస్సి కులం సర్టిఫికెట్ తీసుకుంటున్న వాటిని రద్దు చేయాలని సంబంధించిన జిల్లా మండల అధికారులకు తెలియజేయుచున్నాము .

 

బాలసంత కాటిపాపల కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దాన్ని చల్లగరిగే ముసినిపర్తి,చిట్యాల గ్రామాల నుండి దళితులు వచ్చి తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఇతర కులాలకు చెందిన వారు మేమే బెడ బుడగ జంగం అని మాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమని ఎవరైన అప్లికేషన్ పెట్టిన కూడా వారు గతంలో ఏ పాఠశాలలో చదువుకున్నటువంటి అడ్మిషన్ రిజిస్టర్ను ఎంక్వయిరీ చేసి వారికి ఇవ్వగలనీ ఎందుకంటే వాళ్లు ఏదో సర్టిఫికెట్ పట్టుకొచ్చి మేము తీసుకొని దళితులకు అసలైన ఎస్సీ కులానికి చెందిన వాళ్లకు అన్యాయం జరుగుతున్నది ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్ది పొందడం కోసం మరియు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళు పోటీ చేయడం కోసము తయారవుతున్నందున వారికి జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి ఇవ్వగలరు .

 

బాలసంత కాటిపాపల కులాలకు చెందినవారు బేడ బుడగజంగా వాని తాప్కా చెప్పుకుంటూ ఉన్నందున వారు గతంలో చదువుకున్నటువంటి పాఠశాలలో అడ్విజన్ రిజిస్టర్ లను తీసుకువచ్చి చిట్యాల తాసిల్దార్ కి చూపెట్టడం జరిగింది మేము మీ అన్నయ్య సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నాం గతంలో ఎలాంటి విచారణ లేకుండా తప్పుగా సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చెయ్యాలి లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని దళిత సంఘాలైన మేము హెచ్చరిస్తున్నాము.

 

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య (ఎమ్మార్పీఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జేరిపోతుల ఓదెలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య డిఎస్పి నాయకులు పుల్ల అశోకు చల్లగరియా ముచి నీపర్తి గ్రామాల చెందిన దళిత సంఘాల నాయకులు సోమిడిరఘుపతి దూడపాక దివాకరు నోముల శివశంకరు సిరి పెళ్లి నరేష్ కొల్లూరి అశోకు దూడపక రాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం

◆ లంచం ఇస్తేనే కబ్జ ఇస్తాం వృద్ధ రైతులకు రెవిన్యూ సిబ్బంది బెదిరింపులు…తహసీల్దార్, ఆర్ఐ నిర్వాకం….!

◆- మా సొంత భూమికే,లక్షలు డిమాండ్ చేస్తున్న తహసీల్దార్, ఆర్ఐ

◆- అన్ని రికార్డులున్న మాకు అన్యాయం చేస్తున్న అధికారులు

◆- బోరున విలపిస్తున్న వృద్ధ మహిళ రైతులు

కోర్టు ఉత్తర్వులు ఉన్నపటికీ,జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికి ని పట్టించుకోని అధికారులు

-ఎంతటి అధికారులైన భయపడేది లేదు అంటు బెదిరింపులు

◆- ఏమి తోచక మంచాన పడ్డ వృద్ధ మహిళ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్/ఝరాసంగం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగించి ప్రజలకు సమస్యలు లేని పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తే అవేమి పట్టకుండా రెవిన్యూ సిబ్బంది వారి ఇష్టనుసారంగా వ్యవహారిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి భూభారతి వెబ్సైట్ ప్రవేశపెట్టిన రెవిన్యూ సిబ్బంది ఆగాడాలు కొనసాగుతూనే ఉన్నాయని పేద రైతు కుటుంబాలు తమ బాధను వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పూర్తి వివరల్లోకి వెలితే జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామనికి చెందిన కోస్గి మాణమ్మ భర్త రాములు కోస్గి సరోజ భర్త రాములు, గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 100/12లో రాములుకు 1978 లో 4 ఎకరాలు భూమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.అనంతరం మాన్యమ్మ,సరోజ, భర్త చనిపోగా వారి ఇద్దరికీ 100/12 2 ఎకరాలు 100/12/1 2 ఎకరాలు పంపకం చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మేము ఆ భూమిని సాగుచేస్తూ ఉన్నాము కాని మాకు డిజిటల్ భూమి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాని ఆ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మండల తహసీల్దార్, ఆర్ఐ ఇద్దరు లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారు. కాని మాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదని అధికారులకు చెప్పడంతో వారు మా పైన అగ్రహించి డబ్బులు ఇవ్వకుంటే మీకు పొజిషన్ లేదని రికార్డులు చేసి మీకు భూమి లేకుండ చేస్తామని మాకు బెదిరిస్తున్నారని వృద్ధ మహిళ లబ్ధిదారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో స్థానిక తహసీల్దార్, ఆర్ఐ మాకు అన్యాయం చేస్తున్నారని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1978సంవత్సరం నుండి అన్ని రికార్డులు ఉన్న మాకు కబ్జా కాస్తు ఉన్న లంచం గురించి తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, ఆర్ఐ లంచం డిమాండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి తమ గోడు చెప్పుకుంటామని ఇటీవలే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని నిరుపేదలైన మాకు జిల్లా కలెక్టర్ చోరువ చూపి మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

అవినీతికి అడ్డాగా మారిన ఝరాసంగం మండల తహసీల్దార్ కార్యాలయం

అవినీతికి అడ్డాగా మారిందని సమస్యలతో వచ్చి అ సమస్యల్ని పరిష్కారం చేయాలని స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వస్తే అధికారులు మాత్రం రైతులను నాన ఇబ్బందులకు గురిచేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తమ జేబులు తాసిల్దార్ గా ఉన్న తిరుమల రావు అన్ని తానై డబ్బులు ఇస్తే అవినీతి పనైనా చేసి పెడతారని బాధితులు అంటున్నారు. మండలంలో భూ తగాదాలతో వ్యవసాయ భూములను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించాలంటే అధికారులకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పి బాధితుల దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నారు పసుపు తాసిల్దార్ కు తోడుగా ఆర్ఐ రామారావు మండల పరిధిలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ పనులను డబ్బులు వసూలు చేసి జిల్లా నుంచి పర్యవేక్షణకు అధికారులు వచ్చినప్పుడు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చి తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ ఏం జరగనట్టుగా చేపిస్తున్నాడు డబ్బులు తీసుకుని ఒక కుటుంబానికి ప్రభుత్వము పంపిణీ చేస్తున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని నిబంధనను ఉల్లంగించి వ్యవసాయ పోలానికి సర్వే చేసే క్రమంలో చల్లన్ కట్టకుండాప్పటికిని అనుమతి పోయినప్పటికీని సర్వే చేయించి అమాయకులైనటువంటి వ్యవసాయ రైతులతో పంచానామాలో సంతకాలు చేసుకొని అడ్డగోలుగా భూమికి అద్దులు చూయించి లక్షల్లో అవినీతి డబ్బు తీసుకొని రైతులకు మాత్రం ఝరాసంగం తాసిల్దార్ మాత్రం ముందు ముందు వరుసలో ఉంటారు. కుప్పానగర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కేటాయించడం జరిగింది.

ఇదే కాకుండా ఇంకా చాలా అవినీతి పనులు బాధితులు అంటున్నారు. తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరచి ఇలా అవినీతి పనులు చేయడానికి తహసీల్దార్ అండగా ఉండటం గమర్హం. వ్యవసాయ భూమి ఒకరి పేరు ఉండంగా డబ్బులు తీసుకుని వేరే వారి పేరు మీద సర్వసాధారణమని బాధితులు అంటున్నారు లేనిపోని భూతాలల్లో కలుగజేసుకొని సమస్యలను సృష్టించి బాధితులు పరిష్కారం చేయాలని కోరగా అ ఫైల్ ను పై అధికారులకు సమస్యను పరిష్కరించినట్లుగా కనిపించడానికి ఫైల్ డిస్పోజని ఆన్లైన్లో పరుస్తున్నారు పై అధికారులు చూస్తే బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యాయని పై అధికారులు అనుకోవడానికి ఇలా చేస్తున్నారు ఆర్డీవో చెప్పిన వినిపించుకొని ఝరాసంగం రెవెన్యూ అధికారులు పై అధికారులను సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారి ఆర్ఐ ఉప తాసిల్దార్ అవినీతిగా అడ్డంగా మారిన రెవెన్యూ వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ రికార్డ్ అసిస్టెంట్ తన ఇష్ట ప్రకారం గా ఎవరికి నచ్చిన వారితో డబ్బులు వసూలు చేసి పట్టాలు మారుస్తున్నారు కళ్యాణ లక్ష్మి రెండో పెళ్లి అయినవారికి పంచనామా చెయ్యక డబ్బులు వసూలు చేసి వర్తించేటట్టు చేస్తున్నారు మరికొందరు డిప్యూటీ తాసిల్దార్ ముందు అక్కడే కూర్చుని కొన్ని ఆధారాలు తమ దగ్గర పెట్టుకుని భయం పెడుతూ కానీ పనులు చేయించుకుంటున్నారు దళారుల అడ్డగా మారిన ఝరాసంగం మండల రెవెన్యూ సంస్థ.
ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు

తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని భూ రికార్డుల మార్పిడి,ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలని సూచనలు చేస్తూ లోపల మాత్రం ఇలాంటి అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

 

నడికూడ నేటిధాత్రి:

నడికూడ మండల కేంద్రం లో స్థానిక మండల రెవెన్యూ ఆఫీస్ లో తాహసిల్దార్ రవీందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దొగ్గేల వినయ్,వరికోలు గ్రామ కమిటీ అధ్యక్షులు దేవు రమేష్, తదితరులు పాల్గొన్నారు

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు.

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు

నడికూడ నేటిధాత్రి:

మండలం తహసీల్దార్ కార్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి ని మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరుపున మర్యాద పూర్వకంగా డూప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గడ్డం సర్వేశం,ప్రధానకార్యదర్శి మాదాసు శ్రీనివాస్,రేషన్ డీలర్లు దుప్పటి కిష్టయ్య, సుమన్,చిదిరిక సుమలత, రమేష్,అరుణ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నూతన తాసిల్దారుగా కృష్ణవేణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన సైదులు ఖమ్మం జిల్లా కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రైతుల భూముల కు సంబంధించిన విషయాలు మరియు రెవిన్యూ కు సంబంధించిన విషయాలు ఇతర సమస్యల గురించి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.!

జమ్మికుంట నూతన తహసిల్దార్ ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మండల తహసిల్దారు గా పదవి బాధ్యతలు స్వీకరించిన చలమల్ల రాజు గారిని ఈరోజు వారి కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కమిటీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ మరియు మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ముందుండాలని యువజన కాంగ్రెస్ కమిటీలు కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో; యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చైతన్య రమేష్, సంధ్యా నవీన్, సెక్రటరీ సజ్జు అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, యువజన నాయకులు ప్రవీణ్, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం.!

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం పలికిన సామాజిక కార్యకర్తలు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

 

 

నేటి ధాత్రి :తెలంగాణ రాష్ట్రం లో పరిపాలన మార్పులలో భాగంగా, వీణవంక మండలం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన దూలం మంజుల గారికి పూలమొక్కతో సాధర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపిన సామజిక కార్యకర్తలు దేవునూరి శ్రీనివాస్, సిలివేరు శ్రీకాంత్, ఈ శుభ సందర్బంగా,తహసీల్దార్ మండల ప్రజలకు నూతన రెవెన్యూ చట్టాలు “భూభారతి, సాదా బైనామా”ల విషయంలో ప్రజలకు విరివిగా సేవలను అందించాలని, వీణవంక మండల ప్రజలు, అన్నదాతలైన రైతాంగ వర్గం తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది, అందుకు సానుకూలంగా స్పందించిన నూతన తహసీల్దార్ గారికి వీణవంక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

బాధ్యతలు స్వీకరించిన తాహశీల్దార్ రాజేశ్వరి.

బాధ్యతలు స్వీకరించిన తాహశీల్దార్ రాజేశ్వరి

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల తాహశీల్దారుగా బి.రాజేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా రామడుగులో పనిచేసిన వెంకటలక్ష్మి కొత్తపెల్లి మండల తహశీల్దార్ గా బదిలిపై వెళ్ళగా మానకోండూరు మండల తాహశీల్దారుగా పనిచేసిన బి.రాజేశ్వరి రామడుగు తాహశీల్దారుగా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version