గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేటటువంటి నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ. మండలంలోని వివిధ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు మావద్ద ముందస్తుగా సమాచారం తీసుకుంటే మానిటరింగ్ చేయడం చాలా సులభం అవుతుందని ఇందుకోసం ప్రత్యేకంగా http://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు కచ్చితంగా ఆన్లైన్లో ఉండాలని అన్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో డీజే లకు ఇలాంటి అనుమతి లేదని అందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని మండపాల వద్ద విద్యుత్ వినియోగం కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద మైక్ సౌండ్ సిస్టమ్ ఉపయోగించ కూడదని మండపాల వద్ద మద్యం సేవించిన అసభ్యకరమైన నృత్యాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. మండపాల వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి సందేహం వచ్చిన పోలీస్ శాఖను సంప్రదించాలని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు.

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి ఎస్సై జాడి శ్రీధర్

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి

ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

 

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా,జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,ఏ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు,విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే తేదీ సమయం,ప్రదేశం,ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు.అన్ని వివరాలు మండప నిర్వహకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,వాలంటీర్ల వివరాలు,ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని,శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 డయల్ 112 ను సంప్రదించాలని తెలియజేశారు.మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు సామరస్యపూర్వక వాతావరణం లో , శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ కి సహకరించాలని కోరారు.
ఇంతకు మునుపు వినాయక మండపం ఏర్పాటు చేసినటువంటి,ఎలాంటి వివాదాస్పదం కాని ప్రదేశంలో మాత్రమే మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, విద్యుతు ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,స్త్రీలకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన క్యూలైన్లు నిర్వహించి వారిని గౌరవించాలని,వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల నిర్వహకులకు ఎస్సై శ్రీధర్ సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version