గల్లీకో బెల్ట్ షాప్….

గల్లీకో బెల్ట్ షాప్….!

బంద్ వైన్ షాపుల కేనా…!బెల్ట్ షాపులకు కాదా…?

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాప్ లు

బెల్ట్ షాపులను నియంత్రించే అధికారులు ఎక్కడ

హోల్ సేల్ ముసుగులో బెల్ట్ షాప్ లకు విక్రయాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.

 

బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు

బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.

వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల

ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?

మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version