ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై

ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై
నిరంతరం నిఘా పెట్టండి: కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌
`ట్రాఫిక్‌, విపత్తు స్పందన బృందాలు సమన్వయం చేసుకుంటూ నగర జీవనంకు ఆటంకం కలగకుండా చూడాలిలి
-వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
-రాజేంద్ర నగర్‌ సర్కిల్‌ లో పర్యటనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌
-ఫీల్డ్‌ బృందాల సన్నద్ధత పరిశీలన

 

 

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్‌, సర్కిల్‌,వార్డు అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఉదయం రాజేంద్ర నగర్‌ సర్కిల్‌ లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ , జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి , డిప్యూటీ కమిషనర్‌ , అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.


జల్‌ పల్లి చెరువుతో పాటు వరదముప్పు ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కమిషనర్‌ పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజల భద్రతా కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ట్రాఫిక్‌ , విపత్తు బృందాలు కలసికట్టుగా పని చేయాలన్నారు. వరద నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించాలన్నారు. వాటర్‌ లాగింగ్‌ పాయింట్‌ లపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ ఫ్లో సజావుగా జరిగేలా చూడాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రమాదకర స్థలాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
వర్షకాలంలో ట్రాఫిక్‌, విపత్తు స్పందన బృందాలు సమన్వయం చేసుకుంటూ నగర జనజీవనానికి ఆటంకం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు చేపట్టాలనీ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌ ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version