మానసిక ఆరోగ్య అవగాహన రామడుగులో

మానసిక ఆరోగ్యమే సంపూర్ణ జీవితానికి పునాది

యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్‌లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్‌ఫోన్‌ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు.
“మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

ఫిలాటెలి డే: షైన్ స్కూల్ విద్యార్థుల తపాలా కార్యాలయ సందర్శన

ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు

నేటిధాత్రి, వరంగల్:

Vaibhavalaxmi Shopping Mall

ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్‌లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

ప్రతి ఐదుగురిలో ఒక విద్యార్థికి మెడికల్ సీటు

◆:- పేదింటి బిడ్డలకు భరోసా..

సత్ఫలితాలనిస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్-2025లో సత్తాచాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్గోల్, బూచినెల్లి క్యాంపస్ల నుంచి 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు పదేండ్లలో డాక్టర్లుగా 1200 మందికి పైగా గురుకుల విద్యార్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్, మాజీ ముఖ్యముతై కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.. దీంటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు విరునామాగా నిలుస్తు న్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక లోని అల్గోర్ బూచి బూచిపెట్టె గ్రామ గ్రామ శివారులో (టెర్రెస్) మైనార్డ్ గురుకుల క్యాంపస్ విదర్శనం. ఈ రెండు బ్యాండ ల నుండి ఈ ఏడాద్ 18 మందికి పైగా విద్యార్థులు ఎంటి బీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్య వన్దకే గర్వకారణం. ఇఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యా భ్యాసమనేది మీద, మధ్యతరగతి విద్యార్థులకు అందన్ డ్రాక్ష ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే

 

 

పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, విరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కల లను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతో పాటు నాణ్యమైన విద్యను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వ ర్యంలో 66. మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (ప్రతిభా కళాశాలలు) గా తీర్చిదిద్దింది.

 

 

ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యా ర్థులను ఎంపిక చేసి ఐఐటీ, తేవారు, వీటి పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవి ధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్స్ను ఉచి తంగా అందించింది. ఫలితంగా గత పదేం లో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థా యిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశం వారు.

 

 

 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థ ల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సీవోఈలు గిలిచాయంటే అతి శయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోధుల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యా ర్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది..

 

 

మైనార్టి గురుకులాల నుంచే 10 మందికి ఎంబీబీఎస్ సీట్లు

కేసీఆర్ దార్శనికతడు సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నియోజకవర్గంలోని అల్గో అల్గోల్, బూరె వెళ్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయాకళా శాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు జేఈఈ, నీటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.

 

 

దీంతో ఇక్కడి విద్యా ర్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కు లతోపాటు జిల్లా, రాష్ట్రాస్థాయిలో ర్యాంకులు సాదిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని
అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందు తున్నారు. 2020 సంవత్సరానికిగాను నిర్వ హించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచి వెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు హాజర య్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలి తాల్లో ఆయా కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలే జిల్లా సీట్లు సాదించి సత్తా చాటారు.

 

 

అంటే ఇక్కడ చదివిన ప్రతి బదుగురిలో ఒక్కరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుధ గురు కుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిరోస్, ధర్మ తేజ, సిద్ధి రమేశ్, ఎస్వీ ఆయాన్, ఎండీ ఓబెడ్, గౌతమిఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచి వెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా పాతిమా షేక్ సమీనా మర్దార్ గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీర్, తస్లీం, సరేఖ మర్డాన్, ఫిరోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.

 

 

 

గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగా లను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదుని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యా పకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కేసీఆర్ దూరదృష్టికి

◆:- తార్కాణం గురుకులాలు గురుకుల

◆:- విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషం

◆:- ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా
ఎదగడం గర్వకారణం

మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతో ద్యోగులుగా సేవలందించడం గర్వకార ణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచిపల్లి మైచార్జీ గురుకులం ప్రారంభం సంద ర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యూచర్లో ఏం అవు తావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్ష ర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిస్టోన్ అనే విద్యార్థిని మాట నిలబెట్టు కున్నది.

 

 

కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిరోసోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎని మిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంచి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. లీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకు చాల ప్రిన్సిపాళ్లు, ఉపాద్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైం దని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నీరు పేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.

బాలాజీలో ఘనంగా- హిందీ భాషా దినోత్సవం…

బాలాజీలో ఘనంగా- హిందీ భాషా దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.అలాగే పట్టణంలోని అక్షర ద స్కూల్, ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర ద స్కూల్ లో బాలాజీ వివిధ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణ ఎనిమిదవ షెడ్యూల్లో హిందిభాషను కేంద్రప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందని తెలియజేశారు.బాలాజీ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హిందీ భాషా దినోత్సవ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.భారత జాతీయ ఉద్యమంలో అప్పటినుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.అనంతరం హిందీ భాషో పాధ్యాయుడు ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీ, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఆయా పాఠశాలల్లో విద్యార్థులందరూ హిందీ భాషలో కవితలు ,గేయాలను చార్ట్ పై రాసి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో విష్ణులత, నరసింహస్వామి, లలిత, ఎస్ .రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Hindi Language Day

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర ద స్కూల్ లో…

బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవం ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ,
అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని, ఏ.ఓ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

చిట్యాల పాఠశాలలో ఉపాధ్యాయులకి అవార్డు…

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం లోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో జూకల్ లక్ష్మీ విద్యానికేఆతన్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కవి రచయిత మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అంద జేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పాల్గొని ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందించడం అభినందనీయం అని అన్నారు , అనంతరం
మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి ,మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ , నూనె స్వామి , కసిరెడ్డి మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో ఉపాధ్యాయులకు వారు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని చేయూత పౌండర్ మ్యాదరి సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వేమునూరి ధనలక్ష్మీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా కంప్యూటర్ ప్రొజెక్టరులతో విద్యాను అందించే పాఠశాల మీ ఊరిలో ఉండడం గర్వకారణం అని కొనియాడారు
ఈ సందర్భంగా చేయూత పౌండేషన్ వారు ఇలాంటి విద్యాసంస్థలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం అభినందనియం అని అన్నారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1-2.wav?_=1

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=2

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమలో ఎమ్మెల్యే తనిఖీ….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T145502.392.wav?_=3

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

విద్యార్థుల సమస్యలను ఐటీడీఏ పీవో కు ఫోన్ లైన్లో వివరించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

MLA Inspects Tribal Girls Hostel in Bhoopalapalli

గత పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదని కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్, మూడు నెలల నుండి కాస్మోటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి, దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే ఏటూరునాగారం ఐటిడిఏ పీఓకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా ఎస్టిమేట్స్ వేసి పనులను ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాన్ని పక్కనున్న భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బంగారు పతకాలతో మెరిసిన మొగుళ్లపల్లి విద్యార్థులు.

బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు  విజయ పాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ  ఎయిర్ ఫోర్స్   వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది  ఎన్.సి .సి క్యాడేట్స్  పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో  వాలీబాల్,  టాగ్ ఆఫ్ వార్, ఆటలలో  గోల్డ్  మెడల్ సాధించగా,  మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి  జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు  మీ ఊరికి  రాష్ట్రానికి , దేశానికి  మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు  ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున  మంచి చదువుతోపాటు  ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను  అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శ్రీమతి భాగ్యశ్రీ,   ,  శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి,  జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు,  శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి  వై. శ్రీకళ  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన…

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి

వనపర్తి నేటిదాత్రి .

రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక ,శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నాడు వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల పర్యటి oచారు చిన్నదగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వర్షం పడిన ప్రతిసారీ పాఠశాల భవనం కురుస్తుందని, భవనం శిథిలావస్థకు చేరిందని కొత్తగా మంజూరు అయి నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి పాఠశాల నిర్మాణానికి 96 లక్షలు మంజూరు చేస్తే గత నాలుగు సంవత్సరాల నుండి పూర్తి చేయకుండా మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి కొత్తగా టెండర్ పిలవాలని పంచాయతీ రాజ్ ఎస్ ఈ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. రేపే కొత్తగా టెండరు పిలిచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు ఇప్పటికే మంజూరు అయిన 96 లక్షల నిధులను అదనంగా మరో 50 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలకు అన్నిమౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు
గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్థులు మంత్రి వెంట ఉన్నారు

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసి పరిషత్..

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసీ పరిషత్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని లింగగూడెం మండల పరిషత్ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మాట్లాడుతూ పాఠశాల దుస్థితి శిథిలావస్థకు చేరి ఉన్నదని ఈ యొక్క పాఠశాల ను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అలాగే మండలంలోని వివిధ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి గుత్తేదారులు అసంపూర్తిగా పనులు చేశారని వాటినన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండెకట్ల మహేందర్ ఉపాధ్యక్షులు ఇసం లెనిన్ కోశాధికారి అరేం సందీప్ దొర మండల కార్యదర్శి ఇసం శివాజీ సలహాదారులు పెండేకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=4

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=5

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయకుల ర్యాలీ – పర్యావరణ పరిరక్షణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-75.wav?_=6

మట్టి వినాయకులే ముద్దు.., పర్యావరణ ప్రేమికులవుదాం..

డాక్టర్ రతన్ సింగ్ ఠాకుర్.

నేటిధాత్రి, మట్టేవాడ.

వరంగల్ ఏవివి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం “మట్టి ప్రతిమలను పూజిద్దాం – పర్యావరణహిత ప్రేమికులమవుదాం” అనే ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సందేశమిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పిఒపి విగ్రహాల వల్ల కలిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులే ఉత్తమమైనవి అని ఆయన పేర్కొన్నారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” కాబట్టి మట్టి విగ్రహాలు, సహజ రంగులు వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రజలను ఆయన ఆహ్వానించారు.

Dr. Ratan Singh Thakur.

ఈ సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా తమ విభాగం పర్యావరణ పరిరక్షణపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మట్టి వినాయకుల వాడకం 25 శాతమే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇది 40 శాతానికి పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకులను రూపొందించి ర్యాలీ నిర్వహించడం ఇదే లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. “పిఒపి వద్దు – మట్టి వినాయకులే ముద్దు” అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. మట్టి వినాయకుల వల్ల పర్యావరణం కాపాడబడటమే కాకుండా గణేశ పూజలో వాడే 21 రకాల పత్రి ఔషధ గుణాలను కూడా ప్రజలకు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరావు రచించిన ఔషధ మొక్కల విలువలపై గోడపత్రిక ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకుడు సర్వేశ్, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రబ్బాని, దేవిశ్రీప్రసాద్, సాకేత్, చిరంజీవి, దస్తగిరి, క్రాంతి, భరత్, శివశంకర్, నమ్రత, చందన, ప్రవళిక, మన్విత, సుహన, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలును పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిసరాలును పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇస్సిపేట,పోతుగల్లు ,పర్ల పల్లి గ్రామాలలో అదేవిధంగా కొరికి శాల కస్తూర్బా పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇస్సి పేట లో డాక్టర్ నాగరాణి , పోతుగల్లో డాక్టర్ సరళ, పర్లపల్లిలో డాక్టర్ స్వప్న , వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది .అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో 8 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి నలుగురు జ్వర పీడితులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేసిన వారందరూ కూడా క్షేమం. నలుగురికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్టు డాక్టర్ తెలియజేసినారు . మండలంలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ మేడంకు తెలియజేసినారు. వంటశాలను తనిఖీ చేసి, వారికి కూడా తగు సూచనలు ఇచ్చినారు .అదేవిధంగా వివిధ క్యాంపులో కస్తూర్బా పాఠశాలలో 8 మందికి వైద్య పరీక్షలు చేసి నలుగురికి రక్త నమూనాలు తీసుకున్నారు.
పోతుగల్లులో 45 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుని గుర్తించి రక్తనమును తీసినారు, పర్లపళ్లి లోమందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితులను గుర్తించి రక్త నమోనాలు తీశారు .ఇసి పేట లో 55 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుల్ని గుర్తించి రక్త నమోనాలు తీసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడడం వల్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని ,కాచి చల్లార్చిన తాగాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ,డాక్టర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు . ఈయొక్క వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి గారు కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించినారు
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. కె రాజేంద్రప్రసాద్ ,హెల్త్ సూపర్వైజర్ సునీత ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత , భారతి, రజిత, షబిద ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్

ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని

యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ లేదా తస్తమాన విద్యను పూర్తిచేసి పాసైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి బీఏ,బీకం,బీఎస్సీ కోర్సులలో చేరేందుకుగాను 30న చివరితేది అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రిన్సిపాల్ అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్ మాట్లాడుతూ ఇంటి దగ్గర లేదా ఉపాధి చేసుకుంటూ విద్యను అభ్యసించాలనుకుంటే విద్యార్థులకు బిఆర్ఏఓయూ దూరవిద్య మంచి అవకాశాన్ని కల్పిస్తుందని టిప్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ పొందిన వారు కూడా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎలిశాల అశోక్, డాక్టర్.దుప్పటి సంజయ్,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో యోగాలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును యోగ అభ్యాసకులు ఎస్ కమలాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. నవీన్ మాట్లాడుతూ యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా యోగ పై మక్కువ పెంచుకుంటున్నాయన్నారు.ప్రాచ్య, పాశ్చాత్య అనే తేడా లేకుండా ప్రతి దేశం యోగా ఉపయోగాలు తెలుసుకొని తమ జీవనగమనంలో భాగం చేసుకున్నారని తెలిపారు.యోగ ప్రయోజనాల పట్ల తెలుసుకొని ప్రతిరోజు యోగాసనాలు ద్యానం కోసం సమయం కేటాయించాలని విద్యార్థులు సూచించారు.యోగ అభ్యాసకులు ఎస్. కమలాకర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా విద్యార్థులకు మానసిక ఏకాగ్రతకు శారీరక దృఢత్వానికి అందివ్వడానికే ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేశారు.ఈకార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ ఎంఎంకె రహీముద్దీన్,డాక్టర్ ఎం సోమయ్య, డాక్టర్ రాజీరు, డాక్టర్ సంధ్య, రజిత,విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి ఆకాష్ లో ఆంథే 2025 పోస్టర్ ఆవిష్కరణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-66-2.wav?_=7

*తిరుపతి ఆకాష్ లో ఆంథే 2025 పోస్టర్ ఆవిష్కరణ..

*250 కోట్ల స్కాలర్షిప్పులు ప్రకటించిన ఆకాష్..

తిరుపతి(నేటి ధాత్రి)

 

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంథే 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్లను ప్రకటించినట్టు ఇక్కడ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఎయిర్ బైపాస్ రోడ్ లో గల సంస్థ కార్యాలయంలో స్టేట్ అకాడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి, రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్
అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, రీజినల్ మార్కెటింగ్ హెడ్ మోడేo నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రమణ్యం పోస్టర్ విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతుంది. అంతే 2025 ను విజయవంతంగా 16వ ఏట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి నూరు శాతం ఉచితంగా శిక్షణ పొందడంతో పాటు పలు క్యాష్ ప్రైస్ ప్రకటించినట్టు తెలిపారు. ఆంథే 2025 పరీక్ష ఆఫ్‌లైన్ విధానo లో అక్టబర్ 5, 12 తేదీల్లో వివిద కేంద్రాల్లో
నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు క్లాస్‌రూమ్, ఆకాష్ డిజిటల్ మరియు ఇన్‌విక్టస్ కోర్సుల కోసం స్కాలర్‌షిప్‌లు ఇవ్వబడతాయి. గత ఏడాది, ఈ పరీక్షలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డ్ స్థాపించబడింది. నీట్ యుజి, జేఈఈ మెయిన్ మరియు అడ్వాన్స్డ్ లో
టాప్
ర్యాంకులలో ఉన్న విద్యార్థుల్లో చాలామంది ఆంథే ద్వారా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు
ఈ అవకాశాన్ని 9 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ సంస్థ ద్వారా శిక్షణ పొందే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తర్ఫీదు నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో వెబ్సైట్ https://anthe.aakash.ac.in/home
ఆఫ్ లైన్ పరీక్ష రాయాలనుకునే వారు సమీప ఆకాష్ కేంద్ర లో సంప్రదించవచ్చునని వెల్లడించారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు సాయి రాజ్, చిరంజీవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేసిన పి.ఎ.సి.ఎస్ చైర్మన్…

పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసిన – పి.ఎ.సి.ఎస్ చైర్మన్

* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన – ప్రిన్సిపాల్

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనీ విద్యార్థులకు మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి పోటీ పరీక్షల పుస్తకాలని పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రధమ మరియు ద్వితీయ పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని ఉన్నత స్థానాలకు ఎదగాలని నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలలో పాల్గొనాలన్న సదుద్దేశంతో ఈ పుస్తకాలను పంపిణీ చేశామని, పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందించినందుకు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు అబ్దుల్ అలీ, రమేష్, సదానందం, సంధ్యారాణి తోపాటు అధ్యాపకెతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version