గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి

భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎలక్షన్లు బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్న కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు ఇస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతానని ప్రజలకు తెలియజేయుతున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే ప్రభుత్వం లో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచి అభ్యర్థుల గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, గొడుగు వినోద్, మాడుగురి సమ్మిరెడ్డి, లింగారెడ్డి ,ముత్యాల రవీందర్, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, దాట్ల వీరస్వామి, పార్లపల్లి స్వామి, దసారపు అశోక్, మోటం శ్రీనివాస్, కంకల సంతోష్, మడికొండ వెంకటేష్,చేతి వెంకటేశ్వర్లు, పత్తి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, తోడేటి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T114404.157.wav?_=1

 

అన్నదాన కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

అన్న ప్రసాద వితరణ సత్యసాయి బాబా శతజయంతి సందర్బంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన మరియు సత్యసాయి సేవా సమితి కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్ ఆవరణలో రెండు వందల మందికి మరియు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఐదు వందల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈసందర్బంగా క్లబ్ అధ్యక్షులు ననువాల గిరిధర్ రావు మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయి బాబా విద్య, వైద్యం, ఆహరం, త్రాగునీరు వంటివి పేద ప్రజలకు అందించారని, ఎప్పుడు సమాజహితం కోసం పరితపించే వారని, ఆకార్యక్రమాలన్ని సత్యసాయి సేవా సంస్థ వారు కొనసాగించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో దాత ఏడె. పూర్ణిమ, క్లబ్ కార్యదర్శి లయన్ పాశం నర్సింహారెడ్డి, లయన్ అక్కినపల్లి అజయ్ కుమార్, లయన్ చిలుపూరి రాములు, లయన్ అలిశెట్టి శ్రీనివాస్, లయన్ ఉదారం వెంకటస్వామి, లయన్ వూట్ల దేవయ్య, లయన్ లేడీ ననువాల హరిప్రియ, రామకృష్ణ సత్యసాయి సేవా సమితి సభ్యులు బోనగిరి శ్రీధర్ రావు, డా.ఏడె గంగాధర్, సంజీవరెడ్డి, రామరాజు, రాజేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సాయి అశ్రీత్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట పరిధిలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణ ముప్పై రెండు వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన కోత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్.
ఈసందర్భంగా తిరుపతినాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఈపథకం ఉపయోగపడుతుందని, వీరికి రావడానికి కృషిచేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సిపిఐ ప్రచార జాతను జయప్రదం చేయండి – పంజాల శ్రీనివాస్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T125504.372.wav?_=2

 

 

సిపిఐ ప్రచార జాతను జయప్రదం చేయండి – పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నవంబర్15 నుండి జోడేగడ్ లో ప్రారంభమై భద్రాచలం వరకు వెళ్ళు ప్రచార జాత ఈనెల 17న కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని రెండు రోజులపాటు జిల్లాలో నిర్వహించే ప్రచార జాతాలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ నగర శాఖ కార్యదర్సుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశ రాజకీయ చరిత్రలో వంద సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన పార్టీ లేదని అది కేవలం సిపిఐ ఘనతని ఆయన గుర్తు చేశారు. ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసిన తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ఇప్పుడున్న భారతదేశాన్ని నిర్మించుకోవడానికి వంద సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహించింది సిపిఐ పార్టీ అని కొనియాడారు. వంద సంవత్సరాల పోరాట చరిత్రలో వేలాదిమంది ప్రాణార్పణాలు లక్షలాదిముంది జైలు జీవితం, వేలాదిమంది అజ్ఞాత జీవితం, గడిపారన్నారు. దేశంలోని ప్రజలందరూ అసమానతలు లేని ప్రజలంతా ఒకటేనని సుఖశాంతులతో జీవించే సోషలిజం సమసమాజమే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లక్ష్యం అన్నారు. కానీ నేడు దేశంలో రాష్ట్రంలో ఆర్థిక, కుల, మతoతరాలు ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తున్నాయని అవి రూపుమాపెంత వరకు సిపిఐ ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల కొరకు పుట్టి, ప్రజల కోసం పోరాడుతున్న సిపిఐ ఏనాడు ఓట్లు సీట్లు ముఖ్యం అని భావించలేదని వంద సంవత్సరాలను ఒక్కరోజు అధికారంలో లేకున్నా నిత్యం ప్రజల కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈభూమి మీద మనుషులు ఉన్నంతవరకు ఎర్రజెండా, సిపిఐ ఉంటుందని తెలియజేశారు. 17న మధ్యాహ్నం కరీంనగర్ కు జాత చేరుకుంటుందని కరీంనగర్, తిమ్మాపూర్, చిగురుమామిడి
18న సైదాపూర్, హుజురాబాద్ మండలంలో జాత సాగుతుందని జాతలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు కార్యదర్శులు బీర్ల పద్మ, కొట్టే అంజలి, ఎలిశెట్టి భారతక్క, గామినేని సత్యం, కసి బోసుల సంతోష చారి, చంచల మురళి, బాకం ఆంజనేయులు, మాడిశెట్టి అరవింద్, ఆకునూరి రమేష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T123717.896.wav?_=3

 

జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం

భవన నిర్మాణ కార్మికుల నిధులు రక్షణ కోసం నిరంతరం ఆందోళనలు చెయ్యాలి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఈనెల17న వినతి పత్రాలు, 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తీర్మానం చేయనైనదని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. ఈసమావేశంలో ఎఐటియూసి, సిఐటియూ, బిఆర్టియూ, ఇతర స్వతంత్య సంఘాలు పాల్గొన్నాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఎసి నాయకులు మాట్లాడుతూ కార్మిక సంఘాలతో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైసర్ కమిటీ ద్వారా నిధులను మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించాలన్నారు.
సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, రెన్యువల్ కానీ పదమూడు లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు విడుదల చేయాలనీ, జిల్లాల్లో లేబర్ అధికారుల అవినీతి అరికట్టాలని, ఆఫీసులో బ్రోకర్లు, ఏజెంట్లను పెట్టుకొని పనిచేస్తున ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని, లేబరు కార్డ్స్ నమోదు, రెన్యువల్, క్లెయిమ్స్ నమోదులో అధిక ఫీజు వసూళ్లు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని జిల్లా జేఏసి సంఘాలు తీర్మానం చేశాయి. ఈడిమాండ్స్ సాధనకోసం 17వ తేదిన కార్మిక మంత్రి, లేబర్ కమిషనర్ కి వినతి పత్రాలు అందజేయాలని, ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేయాలని, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తున్నామని తెలియచేశారు.
ఈకార్యక్రమాల విజయవంతంలో అన్ని రకాల భవన నిర్మాణ కార్మికులు భాగస్వాములు కావాలనివారు కోరారు. ఈరౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ యూనియన్ గౌరవ అధ్యక్షులు బుచ్చన్న యాదవ్, ఏఐటీయూసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు గందె కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య సిఐటియూ యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, బిఆర్టియూ యూనియన్ అధ్యక్షులు ఆకుల మల్లేశం, ప్రధాన కార్యదర్శి బొంకురు రాములు, ఏఐటియూసి నాయకులు రేగుల కుమార్, స్వతంత్ర సంఘాల నాయకులు గామినేని సత్యం, రమేష్, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన హరిని…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T162131.997.wav?_=4

 

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన హరిని

మెట్ పల్లి నేటి ధాత్రి:

మెట్పల్లి విస్ డమ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వెలగందుల హరిణి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పిటి హరీష్ తెలిపారు. బుధవారం కరీంనగర్లో జోనల్ స్థాయిలో నిర్వహించిన పోటీలో రెండవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు ఈనెల 14న సికింద్రాబాద్లోని జింఖానా స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విజయం పట్ల పాఠశాల యాజమాన్యం బంధువులు స్నేహితులు పలువురు ప్రముఖులు అభినందించారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్యాయంగా రిజిస్ట్రేషన్ నిరాకరణ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్యాయంగా రిజిస్ట్రేషన్ నిరాకరణ

గంగాధర,నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక పౌరుడి చట్టబద్ధమైన అమ్మకపు లావాదేవీని అన్యాయంగా నిరాకరించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కార్యాలయంలో ఇంతకుముందు ఇలాంటి లావాదేవీలను అనుమతించినప్పటికీ, ఇప్పుడు అదే ఆస్తి విషయంలో సబ్ రిజిస్ట్రార్ తారుమారుగా వ్యవహరించారని పౌరుడు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మరుతీనగర్ నివాసి తోట శ్రీకాంత్ 18అక్టోబర్2025న రేకుర్తి గ్రామం సర్వేనం.80 లేపాక్షి పరివార్ అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ నం.304కి సంబంధించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం సమర్పించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ 04నవంబర్2025న జారీ చేసిన నిరాకరణ ఉత్తర్వు నం.09/2025 ద్వారా డీటీసీపి నిబంధనలు, జిల్లా కలెక్టర్ 02అగఘ్ట2025 చింతకుంట గ్రామానికి సంబందించిన ఉత్తర్వులను కారణంగా చూపించి రిజిస్ట్రేషన్ను నిరాకరించారు. కానీ అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అట్టి ఉత్తర్వుల్లో పేర్కొన్న చింతకుంట గ్రామ శివారు సర్వే నెంబర్ 114/బి కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ లో లేదు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులుతో రిజిస్ట్రేషన్ తిరస్కరించడం అసంబద్ధం. కానీ అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇంతకుముందు అదే అపార్ట్మెంట్ మరియు సర్వే నంబరుకు సంబంధించిన మోర్ట్గేజ్ (బ్యాంకులకు టైటిల్ డీడ్ల డిపాజిట్) 5212/2025 లావాదేవీలను రిజిస్టర్ చేయడం వాస్తవం. ఇది ఆఆస్తిపై ఎటువంటి నిషేధ ఉత్తర్వులు లేవని, చట్టబద్ధమైన బదిలీ సాధ్యమని స్పష్టం చేస్తోంది. కలెక్టర్ ఉత్తర్వులు నిజంగా నిషేధిస్తున్నాయంటే, అదే ఆస్తికి బ్యాంక్ మోర్ట్గేజ్ ఎలా అంగీకరించబడింది? అమ్మకపు డీడ్లను నిరాకరించి మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్ను అనుమతించడం ఎలా సాద్యం” అని తోట శ్రీకాంత్ తెలిపారు. ఈభవనం 02పిబ్రవరి2012న గ్రామపంచాయతీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే బిల్డింగ్ అనుమతితో నిర్మించబడిందని, ఆసమయంలో డీటీసీపి నియమాలు వర్తించలేదని, తర్వాతి కాలంలో వచ్చిన నియమాలను వెనుకకు వర్తింపజేయడం చట్టబద్ధం కాదని అన్నారు. రేకుర్తి గ్రామంలోని లేపాక్షి పరివార్ ఎటువంటి నిషేధ జాబితా లేధని అటువంటి పరిస్థితిలో తన ఫ్లాట్ను నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తూ, చట్టపరమైన నిషేధ ఉత్తర్వు లేకుండా రిజిస్ట్రేషన్ను నిరాకరించడం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 71, 72లకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలో ఆయన జిల్లా రిజిస్ట్రార్ వద్ద అప్పీల్ దాఖలు చేశామని తెలిపారు.

విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్…

విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న వైన్స్ ను తోలగించాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిడెంట్ కి వినతి పత్రం అందజేశిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్. ఈసందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల పరిధిలోని విఘ్నేశ్వర వైన్స్ జాతీయ రహదారి అనుకోని నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అందువల్ల మద్యం ప్రియులు ఫుటుగా తాగిపలుమార్లు రోడ్ క్రాస్ చెస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగి మృత్యువాతపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతారు చేస్తూ వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకొని వైన్ షాప్ నడిపిస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఎమ్ఆర్పి కంటే అదిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిని అనుకుని నిర్వహిస్తున్నందువల్ల రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు వాహనాలు ఆపుకొని మద్యం సేవించడం జరుగుతుందని, మద్యం ఎక్కువ సేవించిన మద్యం ప్రియులు రోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారని దీని వల్ల రోడ్డుపై వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విఘ్నేశ్వర వైన్స్ ను రోడ్డుపై నుండి తోలగించాలని యుగేందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బాబు, దగ్గుపాటి సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత..

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత
– ప్రజల ప్రాణాలకు ముప్పు!

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల, కామారెడ్డి రహదారి ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై భారీ గుంత.
నడిరోడ్డుపైనే ఇంత పెద్ద గుంత ఉండటం స్థానికులలో ఆందోళనకు కారణమైంది. ప్రధాన రహదారిపై ఉండటంతో వాహనదారులు ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే వాహనదారులు ఈ గుంతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుంత చుట్టూ కొంతమంది చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు ఇక్కడ ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో దీని ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు తెలుపుతున్నారు.
ఈ గుంతను తక్షణమే పూడ్చివేయాలని, రోడ్డు రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, వాహనదారులు. ఇప్పటికైనా పబ్లిక్ సేఫ్టీ, గ్రామపంచాయతీ అధికారులు రోడ్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వహించకుండా తొందరగా మరమ్మత్తులు జరపాలని కోరుతున్నారు.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖను రాసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు ఇంటి వద్ద, కళాశాలలకు తాళాలు ఉండడమా అని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై ఇచ్చిన మాట తప్పారని, రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవని? సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ లోని పోస్టు ఆఫీస్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యార్థులు ఉండాల్సిన కళాశాలలు మూసిఉన్నాయి, తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్
రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, గతంలో కళాశాలల వారు బంద్ చేస్తే దసరా దీపావళి లోపు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు విడుదల చేశారని, నేటి నుండి కళాశాలలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించి పది రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారితో చర్చించకుండా వారికి బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ యాజమాన్యాలకు  ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా పెండింగ్ బకాయిలు ఇవ్వమన్నందుకు విజిలెన్స్ తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులు చేయడం సిగ్గుచేటని, ఫీజు బకాయిలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వెంటనే  కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల బంద్ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేనిపక్షంలో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నగర అధ్యక్షులు కేషబోయిన రాము యాదవ్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, శివ, రాజు, మల్లికార్జున్, మని, వరుణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు…

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్షా పత్రాల- వితరణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి పాల్గొని రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను, ఫలితాలను వివరించి, భూసార పరీక్షా పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ ఎన్. ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారిని త్రివేదిక, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు అనంతరాజ్, సంపత్, రమేష్, గోవర్ధన్, గుండి గోపాలరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈసందర్భంగా మండల అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధుర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఒక బాధ్యత గల పదవిలో ఉండి కేంద్ర బలగాలను అవమానించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో తెలపాలన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటే, ఐక్య రాజ్య సమితిలో పాకిస్థాన్ బతిలాడుకుంటే ఆపరేషన్ సింధుర్ కేంద్రంలోని నరేంద్రమోదీ అపారని, అటువంటి విధానాలను, కేంద్ర బలగాలను అవమానించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. అర్మీ బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ళ శ్రీకాంత్ గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడిపెళ్లి చైతన్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మాదం శివ, బొజ్జ తిరుపతి, శేవెళ్ల అక్షయ్, సూదగోని మహేష్ గౌడ్, మామిడిపెళ్లి రమేష్, మండల ఐటి సెల్ కోకన్వీనర్ మూల వంశీ, చేనేత సెల్ కన్వీనర్ వేముల రమేష్, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్, బుర్ర శ్రీధర్, మడికంటి శేఖర్, భూస మధు, ఉత్తేం సాయి తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతుల కోసం తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన భాజపా నాయకులు

నష్టపోయిన రైతులను రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు

కరీంనగర్: నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామడుగు మండల కేంద్రంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈసందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ మోంథ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాల కారణంగా మండలంలోని రైతుల పంటలు నష్టపోయి, కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదలుపెట్టక అనేక రైతుల ధాన్యం తడిసిపోయి, వరదల్లో కొట్టుకోపోవడం, వరి, మొక్కజొన్న, పత్తి రైతులు కూడా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కారుపాకల అంజిబాబు,మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల అధ్యక్షులు దుర్శేట్టి రమేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, షేవెళ్ల అక్షయ్, మాదం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేమ్ కనుకరాజు, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు

– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్

– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు

– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం

– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు

– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్

సిరిసిల్ల, నేటిధాత్రి:

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు.
పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.

Karimnagar Collectorate

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ముట్టడి.

జమ్మికుంట,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

జమ్మికుంట నుండి వంద మంది విద్యార్థులు హలో విద్యార్థి చలో కలెక్టరేట్ విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది ముట్టడిలో భాగంగా పోలీసులకు విద్యార్థి నాయకులకు విద్యార్థులతో తోపులాట జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం జరిగినది సిటీ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగినది మీరు ఎన్ని అక్రమ అరెస్టులు కేసులు చేసిన విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరియు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేనియెడల మరో ధర్నాలు రాస్తారోకోలు చేయడనికైనా సిద్ధం హెచ్చరించడం జరిగినది ఈ కార్యక్రమంలో జమ్మికుంట బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ ,ఆవుల తిరుపతి, జవాజీ అనిల్, వొల్లాల శ్రీకాంత్ , నల్లగాశ హరీష్ యాదవ్,చింతల కౌశిక్, వెనిశెట్టి నాగరాజు, నరిండ్ల శివ భాస్కర్

విశ్వాసనీయతకు చిరునామా మా ప్యానల్…

విశ్వాసనీయతకు చిరునామా
మా ప్యానల్

భారీ మెజార్టీతో గెలిపించండి

ఖాతాదారులకు రక్షణగా ఉంటాం – వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

విశ్వాసంగా సేవలందించడమే ధ్యేయంగా మీముందుకు వచ్చిన మాపానల్ అభ్యర్థులను అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
విశ్వాసనీయతకు చిరునామా మాప్యానల్ అభ్యర్థులు అనీ ఏలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ లోని లేక్ పోలీస్ స్టేషన్, మానేరు డ్యాం కట్టపై అర్బన్ బ్యాంకు అభ్యర్థుల గెలుపు కోసం వెలిచాల రాజేందర్ రావు ప్రచారం చేశారు. ఈసందర్భంగా వాకర్సు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, పలువురు ప్రతినిధులను కలిసి తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వాకర్సు, స్విమ్మర్స్, క్రీడాకారులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రాజేందర్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. విశ్వాసంగా, అవినీతి రహితంగా సభ్యులు మెచ్చేలా, డిపాజిట్లకు రక్షణ కల్పించేలా వారిలో నమ్మకం కలిగేలా అర్బన్ బ్యాంకును తెలంగాణ రాష్ట్రంలోనే స్మార్ట్ బ్యాంకుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జాతీయ బ్యాంకులకు దీటుగా అర్బన్ బ్యాంకును తీర్చిదిద్దుతామని మెరుగైన సేవలు అందించేలా డిజిటలైజేషన్ హామీ ఇచ్చారు. ఖాతాదారులకు వెంట వెంటనే సేవలు అందేలా బ్యాంకును సంస్కరిస్తామని చెప్పారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధిలో మాతండ్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ జగపతిరావు కీలక పాత్ర ఉందని తెలిపారు. గతంలో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నాలుగుసార్లు సొంతంగా ప్యానల్ ఏర్పాటు చేసి గెలిపించుకున్నారనీ, రెండుసార్లు ముద్దసాని కనుకయ్య, ఒకసారి బొమ్మరాతి రాజేశం మరోసారి డి శంకర్ కు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా అవకాశం కల్పించారని తెలిపారు. తన తండ్రి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఏవిధంగా కృషి చేశారో అదే విధంగా తాను ముందుండి బ్యాంకును అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తాను ముందుండి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తాననీ, ఎక్కడికెళ్లినా అర్బన్ బ్యాంక్ మెంబర్లు తమ ప్యానెల్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారనీ, వారినీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేందర్ రావు కోరారు. గతంలో అవినీతి ఆరోపణలు చేసుకున్న వారు ఎన్నికలను ఆపిన వారు మళ్లీ అధికారం కోసం ప్రాకులాడుతున్నారనీ, వారి పట్ల అర్బన్ బ్యాంక్ మెంబర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వారు మళ్లీ ముందుకు వచ్చి ఓట్లు అడగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. అర్బన్ బ్యాంక్ మెంబర్లు అప్రమత్తంగా ఉండి తమ ప్యానెల్ ను ఆదరించాలని రాజేందర్ రావు కోరారు. ఈకార్యక్రమంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి కాంగ్రెస్ నాయకులు, ఆకుల ఉదయ్ అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల ఘటనపై బిజెపి ఆందోళన…

ప్రభుత్వ పాఠశాల ఘటనపై బిజెపి ఆందోళన

ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు,అటెండర్ ను సస్పెండ్ చేయాలి

ధర్నాలో మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్

గంగాధర నేటిధాత్రి :

 

గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న బాలికల బాత్రూమ్‌లో కెమెరా వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు గంగాధరలోని మధురానగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆఘటనకు బాధ్యుడైన అటెండర్‌ను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గళమెత్తారు. ధర్నాకు మద్దతుగా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఖ్య రావి శంకర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన మీడియాతో తెలిపారు. ఈధర్నా కారణంగా గంగాధర ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకులతో చర్చించారు. చివరికి పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఈఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్…

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి.యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో సంఘటనను ఉన్నతాధికారులకు నివేదించడం, వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యం కారణంగా జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని ఆదేశించారు. ఈఘటనలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషాను కూడా సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు.

బాధిత కుటుంబాలకు వెలిచాల రాజేందర్ రావు పరామర్శ….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-28T134319.662.wav?_=5

 

బాధిత కుటుంబాలకు వెలిచాల రాజేందర్ రావు పరామర్శ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్, వల్లంపహాడ్ లలో ఇరువురు బాధిత కుటుంబాలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పరామర్శించారు. వల్లంపహాడు మాజీ సర్పంచ్ సాదినేని మునిరాజ్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అనంతరం పాత బజార్లో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్ సోదరులు కోడూరి శైలేష్ గౌడ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్, గుర్రం అశోక్ గౌడ్, వేల్పుల వెంకటేష్, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ ప్రచారం…

తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ ప్రచారం

◆:- సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిర్ధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా, తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిర్ధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్మికులు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుకు ఓటు వేయాలని మరియు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో విజయవంతం చేయాలని ఆయన సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version