సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం

సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు సిరిసిల్ల
జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని, 1931 లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కులగణన పై సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీసీ సంఘాల కులగణనను సొంత పార్టీ కార్యకర్తలే చించేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ బిల్లును బీజేపీ ఆమోదించిందని, ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోతోందని, కులగణన బిల్లు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు వారంలో చెల్లించకపోతే, రైతుల తరఫున సంఘర్షణ చేస్తామని హెచ్చరించారు.

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల.!

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version