రైతులంటే అధికారులకు చిన్న చూపా
* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్
మహదేవపూర్ జూలై 23 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసులో చేయాల్సిన ఆన్లైన్ పనులు మీ సేవ లకు అప్పజెప్పి కమిషన్లు దొబ్బుతూ రైతులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఒక ప్రకటనలో అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం తమకేం సంబంధం లేనట్టుగా అంత ఆన్లైన్ సెంటర్లో ఆన్లైన్ చేసుకోవాలని ఏ ఈ ఓ లు వ్యవహరిస్తున్నారని, రైతులకు సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ మరియు ప్రభుత్వ పథకాల సేవలను గాలికి వదిలేస్తూ దర్జాగా ఉంటున్నారనీ, మండలంలో ఉన్నటువంటి ఏవో కనీస పర్యవేక్షణ చేయకుండా చూస్తూ ఉండడం గమనార్థమని, రైతులని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుండి మీసేవ, ఆన్లైన్ సెంటర్ లు డబ్బులు వసూలు చేస్తూ కమిషన్ రూపం లో ఏఈవోలకు పైసలు ముట్ట చెపుతున్నారని అన్నారు. రైతులకు సమస్య వస్తె పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరుగాల్సిందే కానీ పరిష్కారం కాదని, రైతుల దగ్గర డబ్బులు ఉంటే గాని వ్యవసాయ శాఖ కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తో గత్యంతరం లేక రైతులు పైసలు పెట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను మీసేవ, ఆన్లైన్ సెంటర్ లలో చేసుకుంటున్నారని అన్నారు.