పట్టుదల ఉన్న యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం

సాధించాలనే పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తాం

మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల,నేటి ధాత్రి:

ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల,క్రమశిక్షణ ఉన్న యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో టామ్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, తహసీల్దార్ సతీష్ కుమార్,టామ్ కామ్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్‌లతో కలిసి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరైన విద్యా అర్హతలు,నైపుణ్యాలు కలిగిన వారికి విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా జర్మనీ, జపాన్,ఇజ్రాయిల్‌తో పాటు గ్రీస్,యూరప్ దేశాల్లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉందన్నారు.ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా భాషా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టామ్ కామ్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.అర్హత,అనుభవం కలిగిన వారికి వారానికి 35 గంటల పని మాత్రమే ఉండటంతో పాటు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.యువతకు ఉపాధి కల్పించేందుకు మందమర్రిలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.జూన్ 10 నుంచి ఉదయం,సాయంత్రం నాలుగు గంటల చొప్పున శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.నర్సింగ్,ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ తదితర రంగాల్లో నైపుణ్యంతో కూడిన అభ్యర్థులకు విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు రూ.90 కోట్లు మంజూరు చేసిందన్నారు.యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, విదేశీ భాషలను నేర్చుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తాము కష్టపడి సంపాదిస్తే కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోవచ్చని,సమాజంలో మరింత మందికి ఆదర్శంగా నిలవచ్చని అన్నారు.

మందమర్రి లో శిక్షణ శిబిరం ఏర్పాటు – కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల్లో భద్రత,సాంఘిక రక్షణ,కార్మిక చట్టాల పరిరక్షణ ఉండటంతో ఉద్యోగులకు మంచి భవిష్యత్ లభిస్తుందని చెప్పారు.స్థానిక యువతకు శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మందమర్రి లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అర్హత,ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

కోల్ ఇండియాలో ఫోక్ డాన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కళాకారులు…

కోల్ ఇండియాలో ఫోక్ డాన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కళాకారులు

మందమర్రి నేటి ధాత్రి

డబ్ల్యూ పీ ఎస్ ఆన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చరర్ మీట్ లో భాగంగా సి ఆర్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో కోల్ ఇండియాలో ఫోక్ డాన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కళాకారులకు మందమర్రి జిఎం శ్రీ రాధాకృష్ణ నీలాల శ్రీనివాస్ గ్రూపుకు ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడంలో సింగరేణి ఎప్పుడు ముందుంటుందని వారు ఇలాగే ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్ సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ అండ్ పి సి ఏ ఎస్ ఓ రవి పర్సనల్ మేనేజర్ కార్తీక్ ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం..

జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం

నేటి ధాత్రి యాదగిరిగుట్ట:

జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, సెక్రటరీలను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ సన్మానించిన వారిలో కానుగు బాలరాజు గౌడ్ , డాక్టర్ గిరి , గుండు నరసింహ గౌడ్ , సయ్యద్ సలీం , చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బిక్షపతి గౌడ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం , వైస్ చైర్మన్ బరిగే రమ్య ,కౌన్సిలర్లు ఓబీసీ సెల్ అధ్యక్షులు అరవింద్ పెలిమిల్లి లావణ్య, బూడిద మధు , గుండు జ్యోతి గౌడ్, బాల్ రెడ్డి, గుడ్ల నరేష్ కుమార్, కల్వకుంట్ల శేఖర్ గాంధీ, ములుగు నరసింహ, సలాం జమాల్, గ్యదపాక బాల నరసింహ ,గోర్ల నరేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

ఎస్ అండ్ పిసి గార్డ్ కి నంది అవార్డు..

ఎస్ అండ్ పిసి గార్డ్ కి నంది అవార్డు..

మందమర్రి నేటి ధాత్రి

తెలంగాణ భాషా సాంస్కృతిక సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఎస్ అండ్ పి సి విభాగంలో సీనియర్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న కే,ఆర్,సంపత్ కి నంది అవార్డు రావడం ఎస్ అండ్ పిసి సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ డిపార్ట్మెంట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాజు గాన సభ లో కళా సుబ్బారావు గారి వేదికలో గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యోగా ఎడ్యుకేషనల్ అకాడమీ తెలంగాణ భాషా సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఎస్ అండ్ పి సి విభాగంలో సీనియర్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న కే,ఆర్,సంపత్ మిస్ తెలంగాణ చేతుల మీదుగా బంగారు నంది అవార్డు మరియు ఉగాది పురస్కారాన్ని అందుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ శ్రీ మల్లెపూల వెంకటరమణ గారు ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి కళాకారులని వెలికి తీయడమే నా ధ్యేయమని కల కోసం పాటుపడే వ్యక్తులకు ఇది ఒక ఉదాహరణ అని వివరించారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

సింగరేణి కళాకారులు జాతీయ సాంస్కృతిక పోటీలో బంగారు పతకం

సత్తా చాటిన సింగరేణి కళా ఆణిముత్యాలు

మందమర్రి నేటి ధాత్రి

 

మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈనెల 15న నిర్వహించిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో సింగరేణి కళాకారులు జానపద పోటీల్లో గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించారు ఈ పోటీల్లో పది జట్లు పాల్గొనగా సింగరేణి కి చెందిన నీలాల శ్రీనివాస్ జట్టు లోని కళాకారులు ఎన్ శ్రీనివాస్ కేఆర్ సంపత్ యు సాగర్ ఎం విజయ్ ఎల్ వినయ్ ఈ శ్రీనివాస్ కె వెంకటస్వామి పి స్వామి ఎస్ అనిల్ అత్యధిక ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ కళాకారులను అభినందించారు

సమ్మక్క సారలమ్మ జాతర: భక్తి, సౌకర్యాలపై ప్రధాన శ్రద్ద

సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి..

మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించారు.అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జాతర జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. మందమర్రి ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఉద్యోగులు జాతరకు విచ్చేసి అమ్మవార్ల ను దర్శించుకోవాలని కోరారు. సుమారు 40 సంవత్సరాలుగా జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందని అన్నారు .సాంస్కృతిక కార్యక్రమాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీ ఝా, పర్సనల్ డిజిఎం అశోక్, కిరణ్ కుమార్ ప్రసాద్ ,సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ,రవి యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

మానవ హక్కుల అవగాహన కై విద్యార్థుల ర్యాలీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-11T114655.902.wav?_=1

 

మానవ హక్కుల అవగాహన కై విద్యార్థుల ర్యాలీ

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి పట్టణంలో మానవ హక్కుల అవగాహనకై పాఠశాల విద్యార్థులచే ర్యాలీమందమర్రి పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులచే మానవ హక్కుల పై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మహిళా మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీస్ సెక్యూరిటీ మందమరి కే భువనేశ్వరి ప్రిన్సిపల్ ఎన్జీవో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి హక్కులను విధులను ఏర్పాటు చేయడం జరిగిందని మానవ హక్కులను మనమంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కుల మత భేదాలు లేకుండా సమానత్వంగా జీవించడానికి మానవ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఏర్పాటు చేసిందని వాటిని అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా విధానం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

మందమర్రిలో విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

విద్యార్థులకు నాసా కిట్టు అందజేత

మందమర్రి నేటి ధాత్రి

 

శ్రీ చైతన్య మందమర్రి బ్రాంచ్ ఈ రోజు నాసా ప్రోగ్రాములో పాల్గొన్న విద్యార్థులకు నాసా కిట్టు అందజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మందమర్రి ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ గారు పాల్గొన్నారు నాసాలో పాల్గొన్న విద్యార్థుల “అందరికీ “నాసా కిట్టును అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు శ్రీ చైతన్య పాఠశాలలో విద్యతో పాటు విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినంధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏ.జి.యం అరవింద్ రెడ్డి గారు, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎం. రమేష్ గారు, అకాడమిక్ డీన్ కె.రవికుమార్ గారు, ప్రైమరి ఇంచార్జ్ ఎన్. సునితగారు, ప్రైమరీ ఇంచార్జ్ ఎ. తిరుమలగారు, నాసా ఇంచార్జ్ అదితి గార్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T155913.136.wav?_=2

 

పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం

 

మందమర్రి మండలంలోని రైతులు ఐక్యంగా రైతు వేదికను సందర్శించి, కౌలు రైతుల సంక్షేమం కోసం అధికారులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాపస్ కిసాన్ యాప్ కారణంగా రైతులు అనేక సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఆలస్యాలు అవరోధాలు ఏర్పడుతున్నాయని రైతులు వివరించారు.

ప్రస్తుతం యాప్ ఆధారంగా కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తోందని, రైతుల వాస్తవ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్ల వరకు పెంచాలని రైతులు అధికారులు ముందు వినతిపత్రం ద్వారా అధికారికంగా కోరారు. చిన్న, మధ్య తరహా కౌలు రైతులు యాప్ లోపాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులలో పడుతున్నారనీ, ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వారు అభ్యర్థించారు.

ఈ సమావేశంలో రైతులు తమ సమస్యలను స్పష్టంగా వివరించడమే కాకుండా, పత్తి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, తూకం చర్యల్లో పారదర్శకత, చెల్లింపుల్లో వేగం వంటి అంశాలను కూడా ఉటంకించారు. రైతుల ఏకగ్రీవ అభిప్రాయం ఏమిటంటే కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతు నాయకులు, సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఐక్యంగా తమ మద్దతు తెలిపారు. రైతుల ఆశాభావం ఏమిటంటే, ఈ వినతి పత్రం ద్వారా వచ్చిన అంశాలను అధికారులు ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని రైతుల ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T160234.230.wav?_=3

 

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు

 

వందేమాతర గీతం ప్రచురించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మందమర్రి మండలంలోని ఆదిల్పెట్ చౌరస్తాలో సామూహిక వందేమాతరం జీతాల పని చేయడం ఏర్పాటు జరిగింది

ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ

స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతర నినాదం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిందని, బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వందేమాతర గీతాన్ని గుండెల్లో నింపుకుని దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు

ఈ సామూహిక వందేమాతరం గీతాలపన కార్యక్రమంలో గ్రామ ప్రజలు,విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు

భారతీయ జనతా పార్టీ నాయకులు డి.వి దీక్షితులు, దేవర్నేని సంజీవరావు, గిరినేటి జనార్ధన్, వంజరీ వెంకటేష్, పెంచాల రంజిత్, దుర్గం మల్లేష్, బోర్లకుంట లక్ష్మణ్, ఎనుగందుల రాజయ్య, ధారవేణి రవి, కాపురపు వినయ్, రాచర్ల మహేందర్,కొమురోజు రాము, సుంకరి ప్రవీణ్ ,ఏనుగందుల సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T155737.165.wav?_=4

 

ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

 

పీసీసీ సభ్యులు నూకల రమేష్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు గారి జన్మదిన వేడుకలను మందమర్రి పట్టణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సురేఖమ్మ గారు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె అధ్యక్షతలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను అత్యధిక మెజారిటీలతో గెలిపించడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర, ఆజాద్ కి గౌరవ్ యాత్ర, రాజీవ్ సద్భావన యాత్రల సందర్భంగా ఆమె వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అహర్నిశలు కార్యకర్తలకు అండగా నిలబడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్న నాయకురాలు సురేఖమ్మ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎండి ముజాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, సీనియర్ జిల్లా నాయకులు నర్సోజీ, యువజన కాంగ్రెస్ నాయకులు నరేందర్, రంజిత్, నవీన్, కిరణ్, సతీష్, సురేష్, అనిరుద్, సంతోష్ తదితర నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ…

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ

మందమర్రి నేటి ధాత్రి

 

యాపల్, అంగడి బజార్‌ పాత బస్టాండ్ లో వెయ్యికి పైగా సంతకాలు సేకరణ!

మంచిర్యాల జిల్లా,మందమర్రి: పట్టణంలోని యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయిన స్మశాన వాటిక లేమిపై ‘స్మశాన వాటిక సాధన కమిటీ’ బుధవారం రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో స్మశానం లేకపోవడం వల్ల దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు
ఏడు దశాబ్దాల సమస్య
యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల ప్రజలు గత సుమారు 70 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేకేటు ప్రాంతం వద్ద ఉన్న స్థలాన్ని స్మశాన వాటిక కోసం ఉపయోగించారు. అయితే, ఇటీవల ఆ స్థలం కూడా కబ్జాకు గురి కావడంతో సమస్య మరింత జటిలమైంది.
వెయ్యికి పైగా సంతకాలు సేకరణ
ప్రజలు ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్మశాన వాటిక సాధన. కమిటీ సభ్యులు వాడవాడలా తిరిగి, పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000కి పైగా సంతకాలను స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మార్వో కార్యాలయంలో వినతి
సేకరించిన ఈ సంతకాలను ఎం.ఆర్.వో కార్యాలయంలో అందజేసి, సమస్య తీవ్రతను తెలియజేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, ప్రజల నుంచి విస్తృత మద్దతు పొందారు. స్మశాన వాటిక కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే…

రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే

మందమర్రి నేటి ధాత్రి

 

42శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలునిర్వహిస్తే ప్రభుత్వం పై యుద్దమే…

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ *బిల్లు సత్వరమే ప్రవేశపెట్టాలి….

ఈరోజు మందమర్రి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నరెడ్ల శ్రీనివాస్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు. వివిధ బీసీ కుల సంఘాలతో మాట్లాడి బీసీలకు న్యాయం గా రావాల్సిన హక్కుల గూర్చి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ల కు రాజ్యాంగం బద్దంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. నరెడ్ల ‌శ్రీనివాస మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం బాధాకరం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను గుర్తించి 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నా మన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు సేలంద్ర సత్యనారాయణ
మైనార్టీ నాయకులు ఎండి ఎండి అబ్బాస్
సగర సంగం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం‌‌ పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు చిలగాని సుదర్శన్ ‌మరియు నాయకులు
ఒజ్జా సాగర్ బాబు దూడపాక రాజేందర్
శనిగారపు జనార్ధన్ బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్ అంకం సాగర్
శీలం మహేందర్
డాక్టర్ పోషం
కంది తిరుపతి
నస్పూరి తిరుపతి
పిల్లి మల్లేష్
బర్ల శేఖర్
శేఖర్ సార్ బీసీ కుల సంఘాల నాయకులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

అసైన్డ్ భూముల్లోనీ వెంచర్లల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయకండి..

అసైన్డ్ భూముల్లోనీ వెంచర్లల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయకండి..

మందమర్రి ఎమ్మార్వో సతీష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలో అసైన్డ్ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తున్నారనీ ,ఫిర్యాదులు వస్తున్నాయని మందమర్రి ఎమ్మార్వో సతీష్ తెలిపారు. అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్లు చేసి ఫ్లాట్లు ఏర్పాటు చేస్తే అట్టి ఫ్లాట్లు ప్రజలెవరూ కొనుగోలు చేయరాదని ఎమ్మార్వో సతీష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని ఫ్లాట్లను కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా వెంచర్లు చేసి ఫ్లాట్లుగా మార్చి క్రయ విక్రయాలు జరిపినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గల మూతపడిన పాఠశాలల స్థలాలు సైతం ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అట్టి భూములను మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబడతాయని అన్నారు.

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు…

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

రోడ్డు భద్రతపై మందమర్రి పోలీసుల క్రియాశీలక అడుగులు: యువతతో ‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా యాపల్, అంగడి బజార్, మేదరి బస్తి ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి (ఎన్.హెచ్)రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు నాలుగు నెలల్లోనే నాలుగు-ఐదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సదస్సును యాపల్ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

అవగాహన అంశాలు:

ఈ సదస్సులో పోలీసులు రహదారి భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వాడకం గురించి వీడియోలు, ఛాయాచిత్రాల (ఫోటోల) ద్వారా ప్రజలకు వివరించారు.

యువతకు ప్రత్యేక సూచనలు:

పిల్లలకు వయస్సు పూర్తి కాకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని అధికారులు తెలిపారు.

‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు:

ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించడానికి, ప్రమాదాల నివారణకు కృషి చేయడానికి యాపల్ ప్రాంతంలో కొంతమంది యువతతో పోలీసులు ఒక ‘రోడ్డు భద్రతా కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అందులో ముఖ్యులుగా అబ్బాస్, వనం నరుసయ్య, వెంకటరెడ్డి, సాంబమూర్తి, రాచర్ల రవి, రాజేశ్ చోట్టన్, రామ, సుజాత, సంగత్రి సంతోష్, అంజయ్య లైన్‌మెన్, భూపెల్లి కానుకయ్య, శ్రీనివాసు ఈ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

డి.సి.పి. ప్రసంగం:

కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏ.సి.పి., మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సి.ఐ., ఎస్.ఐ.లను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు “రోడ్డు సరిగా లేక యాక్సిడెంట్ అయింది” అనడం లేదా మద్యం సేవించి నడిపిన వ్యక్తిని పట్టుకుంటే, “ప్రభుత్వమే వైన్ షాపులు బంద్ చేయించొచ్చు కదా” అంటూ చేసే వితండవాదం సరికాదని డి.సి.పి. స్పష్టం చేశారు. ఇటువంటి వితండవాద ధోరణిని మార్చడానికి, ప్రజల్లో బాధ్యత పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఉద్దేశించబడ్డాయని ఆయన వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏ.సి.పి. రవికుమార్, మందమర్రి సి.ఐ. శశిధర్, ట్రాఫిక్ ఎస్.ఐ. రంజిత్, ఎస్.ఐ. రాజశేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) ప్రతినిధులు, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు..

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు

మందమర్రి నీటి ధాత్రి

 

ఈరోజు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది
*
పరామర్శించిన వారిలో వి హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ఎం ఆర్ పి ఎస్ అసిఫాబాద్ జిల్లా కో ఇన్చార్జి మంత్రి మల్లేష్ మాదిగ
బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు గాలి పెళ్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ..

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

ఈరోజు మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మనోవికాస పిల్లలకు

బెల్లంపల్లి నివాసి గుండేటి అంబదాస్ లత గార్ల కుమారుడు శివరాంప్రసాద్ ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా
మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క వైష్ణవి మేనమామ మేనత్త ఆడేపు అశోక్ కుమార్ సరోజన సహకరించిన స్కూల్ టీచర్ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

బిజెపి నేత ఉడుత కుమార్

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జ్ మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారిన ముళ్ళ కంపలను చెట్లను అదే గ్రామానికి చెందిన బిజెపి నేత ఉడుత కుమార్ స్వచ్ఛందంగా లేబర్ సహాయంతో తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి నిత్యం జమ్మికుంటకు వెళ్లే వాహనాలకు మూలమలుపు వద్ద పెరిగిన చెట్ల వల్ల, ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని పలుమార్లు ప్రమాదాలు జరిగిన, గ్రామ అధికారులు పట్టించుకోవడంలేదని, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా జరగాలని స్వచ్ఛందంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించడం జరిగిందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version