చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు సిఐ నరేష్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/nviWxUjGzCI
భూపాలపల్లి పట్టణంలో చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు సిఐ నరేష్ కుమార్ అన్నారు
భూపాలపల్లి పట్టణంలో నిషేధించబడిన చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి పట్టణ సీఐడి నరేష్ కుమార్ స్పష్టంగా హెచ్చరించారు. భూపాలపల్లి పట్టణంలో సీఐ.డి నరేష్ కుమార్ ఎఫ్‌ఆర్‌వో నరేశ్ సతీష్ ఎస్ఐ కలిసి పలు దుకాణాలు, వ్యాపార కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిషేధిత చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయా? నిల్వలు ఉంచుతున్నారా? అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా, చైనా మాంజా వాడకం వల్ల పక్షులు, జంతువులు మనుషులకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యుత్ తీగలు, మెడలు కోసుకునే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణ దృష్ట్యా ప్రభుత్వం చైనా మాంజాను పూర్తిగా నిషేధించిందని, ఎవరైనా వ్యక్తులు లేదా షాపులు నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ. డి నరేష్ కుమార్ హెచ్చరించారు. కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా చేయబడతాయని తెలిపారు.
భూపాలపల్లి పట్టణ ప్రజలు, వ్యాపారులు ఈ విషయంలో పూర్తిగా సహకరించాలని, నిషేధిత చైనా మాంజాను విక్రయించకుండా, వాడకుండా ఉండాలని సీఐ. డి నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా విక్రయాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
