శాంతి భద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత..
ఆర్కేపీ నూతన ఎస్సై జె శ్రీధర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని రామకృష్ణాపూర్ పట్టణానికి నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జె శ్రీధర్ అన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి సాధారణ బదిలీపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జె శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్కేపీలో విధులు నిర్వహించిన భూమేష్ భూపాలపల్లి కి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం పోలీస్ స్టేషన్ కు ఎప్పుడైనా రావచ్చని హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజలు, ప్రజా ప్రతినిదులు పోలీసులకు సహకరించాలని కోరారు.
