వయోవృద్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలి

వయోవృద్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలి:-

వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నిర్మలా గీతాంబ :-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి :-

తెలంగాణా లోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలయైన మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలతో పాటు అన్నీ ప్రభుత్వ వైద్యశాలలలో వయోవృద్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలని శ్రీమతి నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం రోజున మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో ‘సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ హనుమకొండ వారి అధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007 పై ఏర్పాటుచేసిన శిక్షణ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులను ఇతర సౌకర్యాలను ఏర్పాటుచేసి వారికి మర్యాదపూర్వకమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు.. ఇంటిలోని పెద్దవారిపట్ల ప్రేమ గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లోని పిల్లలుకూడా పెద్దవారితో సన్నిహితంగా ప్రేమగా మెలుగుతారని, అప్పుడు కుటుంబంలో చక్కని వాతావరణం నెలకొంటుందని అన్నారు. వారు ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తూ వారిని వృద్ధాశ్రమాలలో వేయడం తగదని అన్నారు. ప్రజలకు వైద్యశాలలపై విశ్వాసం పెరిగేవిధంగా వైద్యులు, ఇతర సిబ్బంది సేవలందించాలని అన్నారు.

ఈ సందర్భంగా వారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎం.జి.ఎం. సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఎం.జి.ఎం. లో సీనియర్ సిటిజన్స్ కి మంచి వైద్య సేవలు అందిస్తున్నామని, వారికి ప్రత్యేక ఓ.పి. విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తామనీ అన్నారు. కార్యక్రమంలో ‘హెల్పేజ్ ఇండియా’ సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ సమస్యలపై హెల్పేజ్ ఇండియా సర్వే లోని ప్రధానాంశాలను తెలుపుతూ ‘2007 తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం’ సీనియర్ సిటిజన్స్ కోసం చేసిన ముఖ్యమైన చట్టాలను, మరియు వైద్య సేవలకు సంబంధించిన చట్టాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు..

 

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి-సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ఎం. సాయికుమార్, సమన్వయకర్త డా. మమత, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రిటైర్డ్ డి.ఎస్.పి దామెర నర్సయ్యగారు, ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి అధ్యక్షులు, హనుమకొండ సి.డభ్ల్యు.సి సభ్యులు కజాంపురం దామోదర్, కార్యవర్గ సభ్యులు నాగులగాం నర్సయ్య, మార్క రవీందర్ గౌడ్, సత్యనారాయణ, గంటి సాంబయ్య, గంగారపు యాదగిరి, వైద్య సిబ్బంది, నర్సులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా

లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి :-

తేదీ:- 26-07-2025 వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ లోని డి – అడిక్షన్ సెంటర్ ఓ.పి. విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “సమాజంలోని పేదలు మరియు వెనుకబడిన వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండే చట్టపరమైన సహాయాన్ని అందించడానికి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఉద్దేశించబడ్డాయి అని తెలిపారు. ఈ సెంటర్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను నిర్వహించే పారా లీగల్ వాలంటీర్ వై.సిందూజ ప్రజలకు న్యాయ సేవలను అందించడంతో పాటు, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారితో, వారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కౌన్సెలింగ్ తదితర ప్రత్యామ్నాయ కార్యకలాపాలను చేపట్టడం జరుగుతుంది, తద్వారా మత్తు పదార్థాల బారిన పడిన ప్రజలు కొంతమేరకైనా మారతారేమోనని ఆశిస్తున్నాం.

న్యాయ సలహా మరియు ప్రత్యుత్తరాలు, దరఖాస్తులు, పిటిషన్‌లను రూపొందించడంలో సహాయం చేయడం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ యొక్క బాధ్యత అని తెలిపారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ కేవలం ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్యలనైనా ఈ క్లినిక్ లో తెలియపరిచి, న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయి కుమార్, ఎం.జీ.ఎం. సూపరింటెండెంట్ కిషోర్, సైకియాట్రి హెచ్.ఓ.డి. శ్రీనివాస్, ఆర్.ఎం.ఓ అశ్విన్, సైకియాట్రి ఫ్యాకల్టీ మురళీకృష్ణ, చిన్నికృష్ణ, పారాలి ఈగల్ వాలంటీర్ వై.సింధుజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తులసి అర్చన

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తులసి అర్చన

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తాండూరి రామాచార్యులు, ఫణిందర్ విష్ణులు బ్రహ్మాండ వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక తులసి అర్చన నిర్వహించారు.

 

 

ఈ తులసి అర్చన కార్యక్రమంలో స్థానికులు జిల్లా కాంగ్రెస్ నాయకుడు, కొమ్మాల మాజీ ఉపసర్పంచ్ సాయిలి ప్రభాకర్,లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అమర్ సింగ్ నాయక్,దశ్రుతండా మాజీ సర్పంచ్ కేలత్ స్వామి,భక్తులు మాడిశెట్టి శ్రీనివాస్,గాదం మల్లయ్య భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version