తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు….

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన శుభాకాంక్షలు , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ సంగారెడ్డి జిల్లా కార్య కార్యదర్శి వరప్రసాద్ కార్యక్రమంలో మండల మొగుడంపల్లి అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, అధ్యక్షుడు , మొగుడంపల్లి యూత్ అధ్యక్షులు మహేష్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు 60 మంది చేరడం జరిగింది తెలంగాణ రాజాధికారి పార్టీలో అందరూ కలిసి తీన్మార్ మల్లన్న జన్మదినాలు జరుపుకోవడం జరిగింది,

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత…..

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందివ్వాలని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎస్ ఆర్ ఎస్ పి భూముల ఆక్రమణ జరగడంతో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై న్యాయంగా చట్టబద్ధంగా పోరాటం చేయటంతో సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూముల ఆక్రమణ అంశంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి సొంత గ్రామ అభివృద్ధికి సహకరించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు తోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానని కొందరు నాపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని. నా సొంత స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వేసుకొని చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పోరాడతానని. దానికోసం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామ ప్రజల వెంట ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కొరకై పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి…

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.

#గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూపర్డెంట్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అందుకనే నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రతి గ్రామ పంచాయతీ లో మీమే ఫోటోను పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకుడు బచ్చు వెంకటేశ్వరరావు, నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, శివ, కొండ్లె రమేష్ నవీన్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.

#కెనాల్ సరిహద్దు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి.

#అక్రమ నిర్మాణాలు చేసేవారికి నోటీసులు జారీ.

#డిబిఎం 38 కెనాల్ భూమిపై భారీ వాహనాలు వెళ్ళకూడదు.

#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.

#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.

మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-11T120952.778.wav?_=1

 

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

#కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

నల్లబెల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా కష్టపడి పనిచేస్తానని. అదేవిధంగా గ్రామంలో గత పాలకుల సమయంలో చేయని పనులు ఎన్నో తిష్ట వేశారని వాటిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సిసి రోడ్, డ్రైనేజీ, సెంటర్ లైటింగ్ పనులు, అర్హులైన వారికి పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్ మహాశయులను ఆమె అభ్యర్థించారు.

“ఎన్నికల నియమాలు తప్పనిసరి: తహసిల్దార్”

అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నియమావళి పాటించాలని తహసిల్దారు ముప్పు కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చులను ఎప్పటికప్పుడు వివరించాలని. అభ్యర్థులు ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా సామరసంగా ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చంద్రకళ, ఎంపీడీవో శుభానివాస్, ఏఎస్ఐ కీరు నాయక్, ఎన్నికల అబ్జర్వర్, సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.

“పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ 11వ వార్డు అభ్యర్థి”

ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా.

#పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి).

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నల్లబెల్లి మండల కేంద్రంలో బిజెపి బలపరిచిన 11వ వార్డు అభ్యర్థిగా పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి) బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వ వార్డు సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచానని. వార్డులో ఉన్న ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని. సమస్యలపై గళం వినిపించేందుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలపై పోరాడి పరిష్కారం చేస్తానని. అలాగే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో ఉమారాణి..

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో ఉమారాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీవో ఉషారాణి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుండి నామినేషన్ తీసుకునే(9) క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, పంచాయతీ కార్యదర్శులు ధర్మేందర్, రజిత, ప్రశాంత్, కారోబార్ పులి చక్రపాణి సిబ్బంది తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం.

#పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న హారిక, మహాలక్ష్మి, అక్షితలు ఇటీవల రాష్ట్రస్థాయి రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం హర్షినియమని పి ఆర్ టి యు టీఎస్ మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ అన్నారు. శనివారం మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించి ఎంపిక కావడానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, ఉపాధ్యాయ బృందాన్ని ఈ మేరకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు లడే రవీందర్, శ్రీధర్ బాబు, పురం బద్రీనాథ్, జిల్లా బాధ్యులు నాగరాజు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మజ, ప్రమీల, భారతి, రజిత, మనహళ్ రావు, ప్రశాంత్, రాము, బలరాం నాయక్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘా నాయకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T160649.588-1.wav?_=2

 

 

అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘా నాయకులు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను గురువారం తనిఖీలో భాగంగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి రాగా విషయం తెలుసుకున్న ఏ బి ఎస్ ఎఫ్, టిడివివి సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ ఆధ్వర్యంలో గురుకుల వసతి గృహాల్లో నిలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, సంక్షేమ గురుకుల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చలి తీవ్రతో ఇబ్బంది పడుతున్నారని. చలి తీవ్రత నుండి విద్యార్థులకు విముక్తి కల్పించే విధంగా మండలంలోని గురుకుల పాఠశాల వసతి గృహాల్లో గ్రీజల్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని. అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల కాంపౌండ్ చుట్టూ సోలార్ వైర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.

లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T165746.941.wav?_=3

 

లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

#రాజీ పడటమే రాజమార్గం

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో పలు కేసులలో సతమతమవుతున్న బాధితులు రాజీ పడడం వలన వారి భవిష్యత్తుకు లోక్ అదాలత్ దోహద పడుతుందని ఎస్సై వి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈనెల15న నర్సంపేట కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ ను మండల పరిధిలో ఉన్న పలువురు పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సద్వినియోగం చేసుకోవాలని. అలాగే క్రిమినల్, సివిల్ ఆస్తి తగాదాలు, కుటుంబ పరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సత్వర పరిష్కారం లభించే అవకాశం లోక్ అదాలత్ లో దొరుకుతుందని అలాగే ఇరువర్గాల వారు రాజీ పడడంతో సమస్య పరిష్కారం కావడమే కాకుండా కక్షిదారుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T160140.528.wav?_=4

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాన బోయిన రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్టీవ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నాయకులు బత్తిని మహేష్ యాదవ్, అజ్మీర తిరుపతి, మామిండ్ల రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బై కానీ కోటి, మాసం పెళ్లి అఖిల్, గంధం చోటు తదితరులు ఉన్నారు.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమైక్యంగా ఆలాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద పలువురు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తినిచ్చిందని అదేవిధంగా భారత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వందేమాతరం గీతం నిలవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన పిట్టల మల్లయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మండల నాయకులు తో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీకి ఎలా లేని సేవలు చేశారు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు పెంతల కొమరారెడ్డి, హౌసింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన బానోతు సారంగపాణి….

నూతన వధూవరులను ఆశీర్వదించిన బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రుద్రగూడెం గ్రామ బిఆర్ఎస్ నాయకుడు అంబరగొండ సుమలత-రాజు దంపతుల కుమార్తె మనిషా-అజిత్ వివాహ వేడుక గిర్ని బావి ఫంక్షన్ హాల్ లో జరగగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ ,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T144802.717.wav?_=5

 

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.

#ఇందిరా గాంధీకి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.

#రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి,నేటిధాత్రి :

 

భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ మత భావజాలాలను వ్యతిరేకించిన దీరవనిత అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు.ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సెక్యులర్ భావజాలానికి అంకితమై దేశ రాజకీయాల్లో మత భావజాలాలను తీవ్రంగా వ్యతిరేకించిందని. రాజభరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయకరణ చేయడం 20 సూత్రాల పథకాన్ని తీసుకువచ్చి పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన గొప్ప మహనీయురాలు గరీబ్ హటావో అని నినాదంతో ప్రజలందరికీ అండగా నేనుంటా అని ఉత్తేజపరిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఇందిరమ్మ ఆమె లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఇందిరమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త తీసుకొని రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని.భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం,దేశ అభివృద్ధి కోసం, అనేక సరళీకృత సంస్కరణలు చేసి దేశంలో గ్రీన్ రెవల్యూషన్ విజయం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయురాలుగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పెంతల కొమరారెడ్డి, కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, నాయకులు చిట్యాల ఉపేందర్ రెడ్డి, జంగిలి మోహన్, మాందాటి శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేష్, ఒల్లె పైడి, కోడెం బిక్షపతి, దూలపల్లి రవీందర్రావు, మూడు స్వామి, మచ్చిక మహేష్, కొనుకటి రమేష్, బత్తిని మల్లయ్య, గద్దల సురేష్, బోట్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి….

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version