ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు…

ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన ఝరాసంగం మండల బోరేగావ్ గ్రామ పరిధిలోని బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చాకలి శంకర్ అనే పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషమని రైతు తెలిపారు. ఒకే కాన్పులో ఆవు రెండు లేగ దూడలను ప్రసవించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు లేగ దూడలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ విషయం బోరేగావ్ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ పై మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డిని సంప్రదించగా, ఒకే కాన్పులో జన్మించాయని, అవి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందిని పంపించి వైద్యం అందిస్తామన్నారు.

మొగిలిపేటలో గొర్రెల, మేకల ఉచిత నట్టల మందుల పంపిణీ

మొగిలిపేట గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ
మల్లాపూర్ డిసెంబర్ 30 నేటి ధాత్రి

పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 31 వరకు జరుగుతున్నటువంటి ఉచిత గొర్రెల మేకల నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో 3100 గొర్రెలకు 450 మేకలకు నట్టల మందుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్ గోల్కొండ కళా. ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్ వార్డ్ సభ్యులు ప్రణయ్ కాంగ్రెస్ నాయకులు ఎలేటి జలపతి రెడ్డి గోల్కొండ రమేష్ లైవ్ స్టాక్ ఆఫీసర్ సుజాత వెటర్నరీ అసిస్టెంట్ రవీందర్ ఆఫీస్ సబార్డినేట్ రాజేందర్ గొల్ల కుర్మా యాదవ రైతులు ముక్కెర రాజేందర్. ముక్కెర లక్ష్మీనరసయ్య . మల్లయ్య. బాస రమేష్ తదితరులు పాల్గొన్నారు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి….

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి

#పత్తిపల్లి గ్రామంలో వీధి కుక్కలకు వింతరోగాలు.
#పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ లక్షణాలు
#ఎస్సీ (మాల) కాలనీలో రేబిస్ వ్యాధి లక్షణాలు గల కుక్కలు.
#పట్టింపు లేని అధికారులు.

గ్రామ యువకుడు మధుకర్ బండారి

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో వింత రోగలతో కుక్కలు సంచరిస్తున్నాయి.కుక్కల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని వైనం.. పగలు,రాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై కోళ్లపై ,పశువుల పైన దాడులు చేస్తుండడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీ నివాసులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తిపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) కాలనీలో పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ వ్యాధి లక్షణాలు ఉండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు, పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో సంచరించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో వింత రోగానికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు, పిల్లలు వృద్దులు, పాదాచారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు. మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచాయితీ అధికారులు, కార్యదర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు. కావున వీధి కుక్కలకు వింత రోగాలు నియంత్రించేందుకు తక్షణమే తగుచర్యలు చేపట్టాలనీ గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

పెంపుడు కుక్కలకు వింత రోగాలు చర్యలు తీసుకోండి.. గ్రామ యువకుడు మధుకర్ బండారి

గ్రామంలో విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుతు ఈగలు వాలుతు వాటినీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచాయితీ అధికారులకు పలుమార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని గ్రామ యువకుడు మధుకర్ బండారి డిమాండ్ చేశారు.

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి…

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్‌ పౌడర్‌ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం…

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు బుధవారం ఉచిత పోషక టీ కల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వ్యాధి వల్లరైతులకుఆర్థికభారమవు
తుందన్నారు. పోషక టీలతో పశువుల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.జెంట్ డైరెక్టర్ వసంతకుమారిమాట్లాడుతూ.. మూడు నెలల పైబడిన పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటేల్,ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ సంగ్రామ్ పాటేల్, మాజీ ఎంపిటిసి మారుతీ రావు పాటేల్, ఏడి అధికారులు ఆదిత్య వర్మ, ప్రభాకర్,

ఈ డి డి ఎల్ పవన్, వైద్యాధికారులు సునీల్ దత్తు, హర్షవర్ధన్ రెడ్డి అంజికే, గోపాలమిత్ర సూపర్వైజర్ అర్జున్ అయ్యా, తుక్కారెడ్డి, గోపాల మిత్రులు శ్రీకాంత్ అలియాస్ జాన్, అశోక్ రమేష్, శివకుమార్, అశోక్ రావు పాటిల్, విజయ్ కుమార్ పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరప్ప పటేల్, గ్రామస్తులు మల్లేష్,సంజీవులు, మోహన్,మహేందర్,నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version