మా పార్టీ అధికారంలోకి వస్తే ఈత వాగు బ్రిడ్జి కట్టిస్తా బిఆర్ఎస్ మాజీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి ధాత్రి చర్ల
మా పార్టీ అధికారంలోకి వస్తే ఈత వాగు పై బ్రిడ్జి కట్టిఇస్తా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
గొంపల్లి గ్రామాన్ని సందర్శించినపుడు ఈత వాగును పరిశీలించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు గొంపల్లి లింగాపురం కొత్తపల్లి గ్రామల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ వాగు వలన 5 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వర్షా కాలం వస్తే వాగు వలన రాకపోకలు నిలిచిపోతున్నాయి గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పడవలు వేసి తరలించవలసి వస్తుంది గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు రోడ్డు లేక బ్రిడ్జి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేయడం జరిగింది రేగా కాంతారావు వెంటనే స్పందించి ఈ సమస్య ఇంత వరకు నా దృష్టికి రాలేదు ఈసారి మన ప్రభుత్వం రాగానే మీ తరుపున నేను ఈ బ్రిడ్జి కట్టిఇస్తాను చర్లలో మొదటి అభివృద్ధి కార్యక్రమం దీనితోనే ప్రారంభిస్తా అని హమీ ఇచ్చారు ఈ సారి మండలం కమిటీ కూడా భాధ్యత తీసుకోవాలని తెలియజేసారు దీనితో కార్యకర్తలలు ఆనందాన్ని వ్యక్తం చేశారు చాలా మంది 9 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు చేయలేదని కూడ అడుగుతారు అయినా సరే మండల ప్రజలకు హమీ ఇస్తున్నా తెలియజేసారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానెం రామకృష్ణ కో కన్వీనర్ ఐనవోలు పవన్ సోయం రాజారావు సీనియర్ నాయకులు పోలిన రాములు సయ్యద్ అజీజ్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కార్యదర్శి తుర్రం రవి కారం కన్నారావ్ బిసి సెల్ అధ్యక్షుడు గోరంట్ల వెంకటేశ్వరావు కార్యదర్శి కేప గణేష్ ఎస్సి సెల్ అధ్యక్షుడు కొంబత్తి రాము బట్టా విజయ్ సంతపూరి సతీష్ చందు రాట్నాల శ్రీరామ్మూర్తి తడికల బుల్లేబ్బాయి ఎన్నమూరి సృజన్ గాదంశెట్టి కిషోర్ మైపవెంకటేశ్వర్లు కుక్కడపు సాయి తోటపల్లి మాధవరావు కట్టం కన్నారావు బ్రహ్మనాయుడు మెంతుల నాగరాజు బంటు వెంకటేశ్వరావు నవీన్ యూదవ్ శ్రీను మేడబత్తిని గోవర్ధన్ అనేక ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు