భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..

భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

గీసుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలో రానున్న 48 గంటలలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
గీసుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ కోరారు.వ్యవసాయ అధికారుల సూచనల నేపథ్యంలో ప్రజలు తమ ప్రాణాలు, ఆస్తులను రక్షించుకునేందుకు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు.వర్షాల సమయంలో కరెంట్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ పరికరాల పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించారు.చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున చేపల వేట లేదా ఈతకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.పిల్లలను వర్షంలో బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించే సమయంలో వాహన లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేసి జాగ్రత్తగా ప్రయాణించాలి.రోడ్డుపై నీరు నిలిచిన ప్రాంతాల్లో దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగంగా వీచే గాలుల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ ఇతర శాఖలతో కలిసి సిద్ధంగా ఉందని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ పేర్కొన్నారు.

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు,ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు,వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని,లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని,ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని,పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని,జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఉన్నారు.జిల్లాలో ప్రాణ నష్టం,పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version