రాజన్న సిరిసిల్ల సాహితీ సమితి సంక్రాంతి కవి సమ్మేళనం

*రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం*

*సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు గాంధీనగర్ హనుమాన్ మందిర్లో డాక్టర్ జనపాల శంకరయ్య, అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య స్వాగత ఉపన్యాసంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత వినే ఉంటారు. కాబట్టి పెండతో చాన్పు వేయడం, పసుపుతో కడప పూజించడం ఆరోగ్యానికి సంరక్షణకు మూలం ఎందుకంటే పసుపు పెండ రోగ నిరోధక శక్తికి సంబంధించింది. ఆ నాటి హరిదాసులు గంగిరెద్దులు కనుమరుగవుతున్నాయి. వాటిని మీ కవితల్లో ఒకసారి గుర్తు చేయాలని, కవిత్వంలో సంప్రదాయం కనిపించాలని సెలవిచ్చారు, సమాజ హితమే మా కవిత్వ పట్టమని ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సంక్రాంత్రి ఆనాటి సంబంధము కనుమరుగవుతున్న వేళ వైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కవులందరికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక కవిత్వంలో మన ప్రాంతపు మేటి సినారే లాగా అత్యధిక శక్తివంతమైన పదజాలాన్ని వాడుతూ కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నించాలని మన ప్రాంత ప్రతిభను చాటాలన్నారు. వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరిషరాములు కవితా గానం చేశారు. ఈ మధ్యనే వీరికి వివేకానంద స్ఫూర్తి అవార్డు అందుకున్న నేపథ్యంలో వాసర వేణి పరిషరాములను ఘనంగా సత్కరించారు. పల్లెటూరి అమ్మాయి గురించి పాట పాడారు. కోడం నారాయణ సహాధ్యక్షులు కవితా గానం చేశారు. పండగ విశేషాలు నాటి అనుభూతుల్ని నేటి అజాగ్రత్త ను ఎత్తి చూపించారు. ఏనుగుల ఎల్లయ్య ఆత్మీయ అతిథులుగా పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అంటూనే సమాజ హితం కోసం మీ కవితలు ముందుకు రావాలన్నారు. మరొక ఆత్మీయ అతిథి గడ్డం పరశురామ శాస్త్రి చక్కని తన గలంతో కవిత ను ఆలాపించారు. గుండెల్ని వంశీకృష్ణ తన కవిత ఆలాపించారు. ఇలాగే కవులందరూ తమ కవిత్వాన్ని వినిపించారు.

జిల్లాకలెక్టర్‌కు సీనియర్ సిటిజన్ డైరీ సమర్పణ

*జిల్లాకలెక్టర్ గరీమా అగర్వాల్ కి సీనియర్ సిటిజన్ డైరీ సమర్పణ*

*సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

 

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్య నిర్వహణలో దొంత దేవదాసు ఆధ్వర్యంలో డాక్టర్ జనపాల శంకరయ్య సూచనలతో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ని కలిసి సీనియర్ సిటిజన్ 2026 డైరీ ,ని సీనియర్ సిటిజన్ పిలుపుపత్రికను సమర్పించడం జరిగినది. వారు మీ అనుభవాన్ని భవిష్యత్తు తరానికి అందించే విధంగా ప్రయత్నాలు సాగించాలని సలహా ఇచ్చారు. అలాగే వారే గుర్తుచేసి మీ డే కేర్ సెంటర్ త్వరలో అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అందుకు కలెక్టర్ జిల్లా కార్యవర్గం అభినందనలు తెలపడంతెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీ గాద మైసయ్య, గౌరిశెట్టి ఆనందం, గుడ్ల శ్రీధర్ గజవాడ కైలాసం, శ్రీహరి రెడ్డి ,కే రాజిరెడ్డి దేవనపల్లి శ్రీహరి మొదలైన వారు పాల్గొన్నారు.
.

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో. అదనపు గదులు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం.సమర్పించిన గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం.లో. పలు కార్యక్రమంలో మరియు ప్రారంభోత్సవాల్లో.పాల్గొన్న పరిపాలన రాళ్ల పేట గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట. గ్రామంలో. ఎంపీపీ ఎస్. పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని. బోధన ధ్యాసనకై. కేవలం ఒకే గది ఉందని. ఒకటి నుండి ఐదు తరగతి వరకు. విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి. చదువుకోడానికి. ఇబ్బందికరంగా ఉందని. దయచేసి వెంటనే. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా. గ్రామస్తులు తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారు విద్యార్థుల పిల్లల ను సౌకర్యాల నిమిత్తం.మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్…

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్

* ఇంచార్జి కలెక్టర్ గా సైతం..

– సెలవులో వెళ్లిన కలెక్టర్ ఎం హరిత

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్లగా, ఇంచార్జి కలెక్టర్ గా సైతం గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ…

ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ
– తెలంగాణ కోసం చేసిన ఉద్యమం స్ఫూర్తిదాయకం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల
సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే
మహేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని అన్నారు.
ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.

 

ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని అన్నారు. తన రాజకీయ జీవితమంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడు బాపూజీ అని అన్నారు.
ముఖ్యంగా రైతాంగం కోసం నిస్వార్థంగా కృషి చేశారనీ అన్నారు.
ఆయన చూపిన మార్గం పల్లెబాటలో నడిపే వెలుగుదీపమని అన్నారు.
వారి ఆలోచనలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలనీ, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

ఆయన ఆశయాల సాధనకోసం కృషి చేయాలని అన్నారు.
హైదరాబాద్ సంస్థాన ప్రజలకోసం నిజాం ను ఎదిరించిన యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, వస్త్ర వ్యాపార, అనుబంధ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి…

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి

24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version