భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్,సీఐ నవీన్ తో కలిసి భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్బంగా డీసీపీ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిచడంతో పాటు,స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు,స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు,గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,పోలీస్ స్టేషన్ రికార్డ్ లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై డిసీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను ఎస్సై రాజేందర్ ని అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని,మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

జైపూర్,నేటి ధాత్రి:

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంచిర్యాల పోలీస్ వారు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన యాదన వేన తిరుపతి (42) తన భార్య శ్రీలత ఇద్దరు కుమారులతో మంచిర్యాలలో నివాసం ఉంటూ నస్పూర్ లో హమాల్ పని పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం నస్పూర్ లో పని ముగించుకుని మంచిర్యాలకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.మంచిర్యాల పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version