సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఇరువురు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగి, జిల్లాలో రైతు సమస్యలపై సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడిందని నాయకులు తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన నాయకులు…

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ గా ఉదయ్ కుమార్ ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన తెలంగాణ నేతకాని మహర్ కుల సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్ కుమార్ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బౌత్ విజయ్ కుమార్ జిల్లా యూత్ నాయకులు దుర్గం అనిల్ తదితరులు పాల్గొన్నారు

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T124508.621.wav?_=1

 

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బట్టు కర్ణాకర్ ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది

చిత్తూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం

*చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)..

చిత్తూరు నేటి ధాత్రి:

 

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్,
జిల్లా అధికారులు జెడ్ పి సీఈఓ రవికుమార్ నాయుడు,పి ఆర్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి,విజయ్ కుమార్,డ్వామా,హౌసింగ్ పిడి లు,డిఇఓ,
వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణ,డి ఆర్ డిఏ,పిడి,
శ్రీదేవి,జిల్లా వ్యవసాయ,
ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి,సీపీఓ శ్రీనివాసులు ఎల్డిఎం హరీష్,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు,డి ఎం హెచ్ ఓ, సుధారాణి,
డి ఎస్ ఓ శంకరన్,చిత్తూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత జిల్లా అధికారులు హాజరు అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి, శాఖల వారీగా అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం
ఆయన చేశారు,
అర్హులైన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని
ఎంపి,
దగ్గుమళ్ళ ప్రసాదరావు
సూచించారు..

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T163631.302.wav?_=2

 

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో బుదవారం మర్యాదపూర్వకంగా కలిశారు.నర్సంపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా తన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు దొంతి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి..

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

జిన్నారం సీఐగా ఇటీవల బదిలీపై వచ్చిన రమణారెడ్డి బుధవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిన్నారం సర్కిల్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని సూచించారు.

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-29T131947.636.wav?_=3

 

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రఖ్యాత మత పండితుడు మరియు జమియత్ ఉలేమా తెలంగాణ మరియు ఆంధ్ర అధ్యక్షుడు హాజీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (అల్లాహ్ ఆయనపై దయ చూపాలి) షాహీన్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా, హఫీజ్ పర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ (జమియత్ ఉలేమా తెలంగాణ ప్రధాన కార్యదర్శి) ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా స్వాగతించారు మరియు ఆయన సానుభూతి మరియు సంతాపానికి ధన్యవాదాలు తెలిపారు. సంతాప సమావేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రలోని వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు జమియత్ యొక్క అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి తరపున హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి జనరల్ సెక్రటరీ) మరియు హఫీజ్ అక్బర్ సాహిబ్ (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి ట్రెజరర్) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని రాజకీయ మరియు సామాజిక సమస్యలను కూడా బహిరంగంగా చర్చించారు మరియు పరస్పర సహకారం మరియు సమన్వయం ద్వారా ప్రజా సంక్షేమం మరియు స్థిరత్వం కోసం ఉమ్మడి ప్రయత్నాలపై ప్రాధాన్యత ఇవ్వబడింది. సమావేశం ఆహ్లాదకరమైన మరియు గౌరవప్రదమైన వాతావరణంలో జరిగింది, దీనిలో మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన మరియు జాతీయ సేవలకు నివాళులు అర్పించారు మరియు అతని లక్ష్యాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం కూడా వ్యక్తమైంది.

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీడీవో…

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీడీవో

నడికూడ,నేటిధాత్రి:

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మొక్క(ఆక్సిజన్), శాలువ కప్పి మర్యాద పూర్వకంగా కలిసిన నడికూడ ఎంపీడీవొ రామ రామకృష్ణ అదే విధంగా మండలం లోని ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కి కలిసి పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు. వారితో పాటు కార్యాలయ సహాయకులు గోవిందు నవీన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి..

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల

మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము…

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము

వనపర్తి నేటిదాత్రి .

 

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా డి సి సి అధ్యక్షుల
ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం కొత్తకోట ,, మదనపురం మండలాల సమన్వయ కమిటీ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు ఈసమావేశనికి ఏఐసీసీ అబ్జర్వర్లు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ టీపీసీసీ , వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారుఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అన్ని అంశాలను పరిగణలకు తీసుకుని ఏఐసీసీడీసీసీ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు
బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలని విమర్శించారు
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నదని అన్నారు

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

 

 

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవ్వండి.

 

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుని ఎన్నికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ విషయంగా పార్టీ వర్గాల అభిప్రాయసేకరణ కోసం పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో 17వ తేదీ శుక్రవారం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్ ఏ, బ్లాక్ బీ గా రెండు దశలుగా సాగే ఈ సమావేశం ఒకేరోజు పూర్తవుతుందన్నారు. బ్లాక్ ఏ లో ఉన్న జడ్చర్ల, మిడ్జిల్, ఊర్కొండ మండలాల పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం ఉదయం 10 గంటల మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం బ్లాక్ బీ లోని నవాబుపేట, రాజాపూర్, బాలానగర్ మండలాల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందని వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలదేనని స్పష్టం చేసారు. ఈ సమావేశానికి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరై డీసీసీకి మంచి నాయకత్వాన్ని సూచించాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

మెట్ పల్లి‌లో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కోసం బిజెపి డిమాండ్…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్నేని రఘు విలేకరుల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి

కోరుట్ల నియోజకవర్గం ప్రజలందరికీ దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేయాలని
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఎలక్షన్ ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది కనీసం ఒక్క హామీ కూడనెరవేర్చలేదుజర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో ఉన్నవి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్ మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు సుంకేటి విజయ్ కుడుకల రఘు బీజేవైఎం నాయకులు గోపనవేని రమేష్ యాదవ్ చెక్కల శ్రీకాంత్ కోసగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం…

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం
* ఎంపీడీవో రవీంద్రనాథ్

మహాదేవపూర్ సెప్టెంబర్ 8 (నేటి ధాత్రి)

 

 

రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ సోమవారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ జాబితా, ముసాయిదా ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామారావు, వివిధ పార్టీల ప్రతినిధులు, సూపర్ ఇండెంట్ శ్రీధర్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ మంత్రి చంద్రశేఖర్ ను గౌడ సంఘం నేతల భేటీ…

మాజీ మంత్రివర్యులు ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా గౌడ సంఘం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా
గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, గౌడ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,మురళి కృష్ణ గౌడ్,విట్ఠల్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రంగయ్య గౌడ్, లక్ష్మయ్య ,వాసు గౌడ్,మధు శేఖర్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్ , శేఖర్ గౌడ్, నందు గౌడ్, కంది శ్రీనివాస్ గౌడ్, బక్కయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు..

బీజేపీ జిల్లా పర్యటన సన్నాహాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T155725.947.wav?_=4

 

రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం, కొక్కెరకుంట గ్రామాల శక్తి కేంద్రం ఇంఛార్జి వేముండ్ల కుమార్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం పరిధిలోని బూత్ కమిటీలతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ ఇంఛార్జి పోచంపెల్లి నరేష్ లు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సెప్టెంబర్ 3న జరిగే జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ నుండి కూడా అధిష్టానం చెప్పిన విధంగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, శేవాళ్ళ అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు కట్టెకొల మహేష్, కోడూరి గంగరాజు, నాగం రమేష్, గుంట సంజీవ్, బత్తిని సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T162411.931-1.wav?_=5

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 25:

 

సోమవారం చిత్తూరులోని హోటల్ భాస్కర(ఎన్
పి యస్)లో నిర్వహించిన చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బాబు ని, లీడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు ని తుడా చైర్మన్ ఘనంగా సత్కరించారు. తిరుపతి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు బూత్ స్థాయి నాయకులను కలుపుకొని కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తుడా చైర్మన్ తెలియజేశారు.

మేయర్ ను కలిసిన అదనపు కమిషనర్…

మేయర్ ను కలిసిన అదనపు కమిషనర్…

అదనపు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

నేటిధాత్రి, వరంగల్.

 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బి.చంద్రశేఖర్ శుక్రవారం నగర మేయర్ గుండు సుధారాణిని, మున్సిపల్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ అదనపు కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ

జైపూర్,నేటి ధాత్రి:

 

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల,జనరల్ సెక్రెటరీ భూక్యా నాగేశ్వరరావు గురువారం దనుసరి సీతక్క పంచాయతీరాజ్ రూరల్ గవర్నమెంట్,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ని, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ని ప్రజా భవన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు.ఆగస్ట్ 10న జరిగిన కేంద్ర కమిటీ ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యుల వివరాల ప్రక్రియను వివరించారు.అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కి మినిస్టర్ సీతక్కని గౌరవ అధ్యక్షులుగా ఉండాలని సెంట్రల్ కమిటీ సభ్యులు కోరారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సింగరేణిలో గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, అధికారుల ప్రమోషన్లలో క్లస్టర్,ఇంటర్ క్లస్టర్ ప్రమోషన్లలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని,రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ లో కూడా ప్రమోషన్ పాలసీకి సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు.అలాగే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని
సెంట్రల్ కమిటీ సభ్యులు వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి సానుకూలంగా స్పందిస్తూ గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ రూపంలో తమ దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయిస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో చీఫ్ లైజాన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.తిరుమల్ రావు,జిఎం సివిల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గణపురం సీఐని కలిసిన బీజేపీ నేతలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-62-2.wav?_=6

 

గణపురం సీఐని కలిసిన బీజేపీ నేతలు

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రావును బుధవారం మండల బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్నం చందర్, మహిళా నాయకురాలు బొల్లం అరుణ, మండల ప్రధాన కార్యదర్శి చెలమల ప్రవీణ్, కోశాధికారి వడ్డెం రాజశేఖర్, బిల్లా దేవేందర్, రేపాక సంతోష్, భూక్యా హరిలాల్, దూడపాక సతీష్, సందీప్, దూడపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

“సింగరేణి గిరిజన ఉద్యోగుల సమస్యలపై కొత్త కమిటీ సమావేశం”…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T154558.767-1.wav?_=7

 

సింగరేణి సిఎండి బలరాం నాయక్ ని కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నుకున్న సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నట్లు తెలిపారు.అధ్యక్షుడు దారావత్ పంతుల,జనరల్ సెక్రటరీ భూక్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియను వివరించి, రోస్టర్ వెరిఫికేషన్,ప్రమోషన్ పాలసీ వంటి గిరిజన ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చర్చించారు.వాటి పరిష్కారానికి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.సిఎం డి బలరాం,డైరెక్టర్ గౌతమ్ పోట్రు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ,గిరిజన ఉద్యోగుల న్యాయపూరితమైన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.జనరల్ మేనేజర్లు, లైజాన్ సెల్ అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఆంగోత్ భాస్కరరావు,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోకాళ్ల తిరుమలరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్, వైస్ ప్రెసిడెంట్ భూక్య వెంకట్రామ్,డిప్యూటీ జి.ఎస్. బి.కృష్ణ,జాయింట్ సెక్రటరీ ఏ.ఉపేందర్,ఇల్లందు ఏరియా ప్రెసిడెంట్ బి.కిషన్,కొత్తగూడెం ఏరియా సెక్రటరీ హీరోలాల్, మణుగూరు ఏరియా లైజాన్ ఆఫీసర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.గిరిజన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version