భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే, రాంచంద్రునాయక్.
మరిపెడ నేటిధాత్రి.
మొంథ తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ సంబంధిత జిల్లా కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోతున్న ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు,ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు,” అని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ప్రజలను హెచ్చరించారు,అలాగే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, వర్షాల ప్రభావంతో చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. నేను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నాను.ఎక్కడైనా అత్యవసర సహాయం అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులను తక్షణమే సంప్రదించండి, అని ఎమ్మెల్యే తెలిపారు,మొత్తం మీద, వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ స్పష్టంగా సూచించారు.
