డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు
తహరాపూర్ సర్పంచ్ కుక్కల సరోజన
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన
మాట్లాడుతూవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట పోలీస్ ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్ (సురక్షితంగా గమ్యా నికి చేరండి) రోడ్ సేఫ్టీ అవగా హన కార్యక్రమాన్ని సర్పంచ్ కుక్కల సరోజన పిలుపు మేరకు గ్రామంలో నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని, హెల్మెట్ ధరించి గ్రామ పంచాయతీ ఆవరణం నుంచి మెయిన్ రోడ్డువరకు ర్యాలీ నిర్వహించారు. ఇది ఎంతో ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ.జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదాలను గణ నీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ డం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధానకారణమని హెచ్చరిం చారు. మన భద్రతే మన కు టుంబ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, గ్రామయువకులు బడుగు సునీల్, నిమ్మల రాజకుమార్, కొమ్ముల మల్లికార్జున్, గాజర్ల అజయ్, గోనెల రాజు, దాసరి నరేష్, బండారి రమేష్, సముద్రాల అనిల్, తాళ్ల రాజకుమార్, వాలుస పృథ్విరాజ్, కందగట్ల ప్రకాష్, గోనెల నాగరాజ్, కుక్కల రాజ్‌కుమార్, వాలుస తరుణ్, కుక్కల కుమార్, లోకాల బోయిన శివ నాగేంద్ర, కుక్కల దేవేందర్, పంచాయ తీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
