పాఠశాల ప్రాంగణంలో..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T131045.997.wav?_=1

 

పాఠశాల ప్రాంగణంలో..
ప్రమదకరంగా సంపు
పట్టించుకోని అధికారులు, ప్రతినిధులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ సంపు ప్రమదకరంగా తయారైంది. నిజాంపేట మండలం నస్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మన ఊరు మనబడి పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. ఆ పనుల్లో భాగంగా పాఠశాల ఆవరణలో తీసిన సంపు ప్రమాదకరంగా తయారైంది. సంపుపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కాంట్రాక్టర్కు పలుమార్లు చెప్పిన ఏమి ఫలితం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రక్షణ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత..

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత
– ప్రజల ప్రాణాలకు ముప్పు!

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల, కామారెడ్డి రహదారి ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై భారీ గుంత.
నడిరోడ్డుపైనే ఇంత పెద్ద గుంత ఉండటం స్థానికులలో ఆందోళనకు కారణమైంది. ప్రధాన రహదారిపై ఉండటంతో వాహనదారులు ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే వాహనదారులు ఈ గుంతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుంత చుట్టూ కొంతమంది చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు ఇక్కడ ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో దీని ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు తెలుపుతున్నారు.
ఈ గుంతను తక్షణమే పూడ్చివేయాలని, రోడ్డు రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, వాహనదారులు. ఇప్పటికైనా పబ్లిక్ సేఫ్టీ, గ్రామపంచాయతీ అధికారులు రోడ్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వహించకుండా తొందరగా మరమ్మత్తులు జరపాలని కోరుతున్నారు.

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం

సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని 30 వార్డులలో కోతులను కుక్కలను అరికట్టడంలో అధికారులకు విఫలం చెందారని సిపిఐ జిల్లా నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, గురీజపెళ్లి సుధాకర్ రెడ్డి, కోరిమి సుగుణ లు అన్నారు. కోతుల కుక్కల బెడదను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కోతులు,కుక్కల సమస్య విపరీతంగా ఉంద ని వాటిని నివారించడంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. పట్టణ కేంద్రంలో 30 వార్డులలో కోతులు చాలా మంది మహిళలను,పిల్లలను తీవ్రంగా ఎన్నోసార్లు గాయపర్చడం జరిగిందన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. పట్టణం లోని హనుమాన్ నగర్ లో 80లక్షల రూపాయలతో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వాటి నివారణకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిర్వహించకపోవడం వల్ల కోతులు,కుక్కల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. కోతులు కుక్కల పట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు నిధులను దుర్వినియోగం చేస్తూన్నారని వారు ఆరోపించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం కలిసి కోతుల పట్టే బోన్ లను తీసుకొచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటిని వాడకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే కోతుల కుక్కల బెడదను అరికట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కువినతిపత్రం ఇవ్వడం కోసమే అధికారులు నిరాకరించటంతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో సిపిఐ నాయకులు ఆఫీస్ గేట్ ను నెట్టుకొని లోపటికి పోయే ప్రయత్నం చేయగా పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నూకల చంద్రమౌళి,మాతంగి రామ్ చందర్,పల్లె కృష్ణ,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, సదానందం,గణగల జోగేష్ ,లోకిని రమేష్ ,గంప రాజు,పెదమాముల్ సంధ్య శ్రీలత స్వప్న సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో ఉన్నట్టా..ఉన్నా లేనట్టే నా…

విధుల్లో ఉన్నట్టా..ఉన్నా లేనట్టే నా

ఓ పంచాయతీ కార్యదర్శి వైఖరి

పరకాల నేటిధాత్రి

నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బదిలీపైన వచ్చి నెలలు గడుస్తున్నా కనీసం గ్రామంలో కనపడిన పాపన పోలేదని గ్రామంలో ప్రజల మధ్య చర్చ నడుస్తుంది.మరికొందరైతే అసలు కార్యదర్శి ఎవరో కూడా తెలియదు అని మాట్లాడుకోవడం గమనార్షం.వారు తమ విధులకు సమయపాలన లేకుండా వస్తుంటారని కొందరు,వచ్చిన కూడా గ్రామంలోని కాలనీలను ఎన్నడూ సందర్శించలేదని ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదని మరికొందరు,ఆ గ్రామ కార్యదర్శి పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకీ ఆ కార్యదర్శి ఎవరు ఆ గ్రామమేదో మరో సంచికలో మీ నేటిధాత్రి లో…..

ఇది చెట్ల పొద కాదు.. అది బావి..

ఇది చెట్ల పొద కాదు.. అది బావి..

*కనీసం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చెయ్యని అధికారులు..

*ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా..?

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల పరిధిలోని ఓ రహదారిపై బావి వాహనదారులు ప్రమాదకరంగా మారింది.చూడడానికి చెట్ల పొదల కనిపించే బావి రహదారి పక్కనే సాధారణ కంచె ఏర్పాటు చేసి దర్శనమిస్తుంది.పరకాల పట్టణం నుండి మొగుళ్లపల్లి,చిట్యాల మండలాలకు,అలాగే సమీప గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ బావి హనుమాన్ కమాన్ సమీపంలో ఉంది.బావి నిర్మాణం సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై బలహీనపడిందని చెప్పవచ్చు రోడ్డుకు చాలా సమీపంలో ఉండడం వల్ల వాహనాలు,ముఖ్యంగా రాత్రిసమయాల్లో లేదా వర్షకాలంలో తారసపడే ప్రమాదం అధికంగా ఉందని, బావి చుట్టూ రక్షణ గోడ మరియు కనీసం హెచ్చరిక బోర్డు లేకపోవడం ప్రమాద సంకేతాలను మరింత పెంచుతోందని చెప్పవచ్చు ప్రతిరోజూ ఈ రహదారిపై వాహనాలు,ఆటోలు,ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు వెళ్తుంటాయి.ఆ సాధారణ కంచెను తొలగించి బావి చుట్టూ సిమెంట్ గోడ ఏర్పాటు,రహదారిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులు పెట్టడం,రాత్రి సమయంలో లైట్లు అమర్చడం వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్నారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను మరియు స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జాయింట్ కలెక్టర్…

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జాయింట్ కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా నల్లవాగు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఆరోగ్యం క్షీణించి మృతిచెందిన ఘటనపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు దారా మంజుల, సుధాకర్ దంపతులు తమ కుమారుడిని కోల్పోయి తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి. అప్పట్లో ఆర్డిఓ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు అమలు కాలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినప్పటికీ, ఇల్లు ఇప్పటికీ ఇవ్వలేదు” అని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్
“తప్పకుండా దారా మంజుల, సుధాకర్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల తుకారం సంఘ నాయకులు పాల్గొన్నారు

వర్షం పడితే వాహనదారులకు నరకమే….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T123048.173.wav?_=2

 

వర్షం పడితే వాహనదారులకు నరకమే.

⏩ ప్రమాదకరంగా మారిన గుంతలు.

⏩ ఒక్కసారి వర్షం పడితే చిత్తడే.

⏩ ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా?

⏩ గత కొన్ని సంవత్సరాల నుండి పేరుకుపోతున్న సమస్య.

⏩పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.

కాశీబుగ్గ నేటిధాత్రి.

 

వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామం నుండి రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు వెంకట సాయి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న గుంతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.వర్షం పడితే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రమాదకరమైన రోడ్డులో ఎన్నో స్కూళ్లకు సంబంధించిన బస్సులు, ఇండస్ట్రియల్ ఏరియా కు సంబంధించిన పెద్ద పెద్ద వాహనాలు, రవాణా చేయటం జరుగుతుంది. వర్షం పడినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆర్ అండ్ బి అధికారులు పట్టినట్టు ఉండటం విడ్డూరంగా ఉంది.ఎన్నోసార్లు పేపర్లలో కథనాలు వచ్చినా కూడా కనీసం అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడం ఎన్నో వివాదాలు దారితీస్తుంది.పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తారా,ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళలో వచ్చే వాహనాలకు మాత్రం నరకమే కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం స్కూలుకు వెళ్లే బస్సులు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంతో వెళ్తుంటారు. ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

#పట్టించుకోని వైద్యాధికారులు.

#రోగులకు సరైన మందులు లేని ఆసుపత్రులు.

#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.

#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

#వైద్యాధికారాలు ఎక్కడ..?

పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.

#స్పందించని వైద్యాధికారులు.

సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.

#రోగుల బాధలు పట్టించుకోరా.?

వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

చిత్తూరులో అంబేద్కర్ విగ్రహ దహనంపై వైసిపి నిరసన…

*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన..

*ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి..

తిరుపతి(నేటిధాత్రి) అక్టోబర్04:

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు.
అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారుఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తహసిల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత లోపం.

తహసిల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత లోపం.

#పట్టించుకోని కార్యాలయ సిబ్బంది

#ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసిన దళిత నాయకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తహసిల్దార్ కార్యాలయానికి అనునిత్యం అనేక పనుల కోసం మండల ప్రజలు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడంతో గమనించిన దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రత పాటించాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టగా. దానిని తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది విస్మరించి మండల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థమవుతుంది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై చెప్పవలసిన అధికారులే కార్యాలయం వద్ద శుభ్రత పాటించకపోతే గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదిఏమైనాప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే కలెక్టర్ స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి…

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి”

అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తాహాసిల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు జిల్లాలోనే అధికంగా బాలానగర్ లో ఎక్కువగా పెండింగ్ లో ఉండటంతో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించరాదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లిఖిత రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె…

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె???
మర్రి చెట్టుకున్న విలువ మనుషుల ప్రాణాలకు లేకపాయే???
పక్కనుండే వెళ్లిపోయినా ప్రజలు ఇక్కట్లను గుర్తు చేయని కోటరీ..
బురద నీటితో ఉన్న ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఆంతర్యం ఏమిటీ
సమయం లేకనా.. సమాచార లోపమా????

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

అయినవోలు మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఐలోని మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శివాలమర్రి గా పేరుపొందిన 200ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మరియు దేవాదాయ శాఖ అధికారుల సమాచారం మేరకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హుటాహుటిన టెక్సబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి అట్టి శివాల మర్రి స్థలాన్ని సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో నేలకొరిగిన ప్రతిష్టాత్మకమైన శివాలమర్రి ని మళ్లీ పున ప్రతిష్టాపన చేస్తామని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే అయినవోలు మండలంలో కురుస్తున్న గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షం నీరు రెండు గేట్ల వద్దనే నిలిచిపోయి లోపలికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. మర్రిచెట్టు నేలకొరిగింది అనగానే హుటాహుటిన బయలుదేరి వచ్చిన ఎమ్మెల్యే అదే మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారా. అంటే రోగులకు ఇక్కట్లు తలెత్తుతున్నాయన్నా కూడా ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఒక చెట్టుకు ఇచ్చిన విలువ మనుషుల ప్రాణాలను కాపాడే ఒక ఆసుపత్రికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక బ్యాంకుకు తాళం వేసిన అధికారులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T151739.068.wav?_=3

 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక బ్యాంకుకు తాళం వేసిన అధికారులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ మండలంలోని అలంకానిపేట లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవలు కరెంటు సరఫరా లేకపోవడంతో మంగళవారం నిలిచిపోయాయి. బ్యాంకుకు వచ్చిన వినియోగదారులను లోనికి రానివ్వకుండా బ్యాంక్ అధికారులు బ్యాంకుకు తాళం వేసి బయటనే ఉంచడం హేయమైన చర్యగా వినియోగదారులు బ్యాంకు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బ్యాంకులో కరెంటు సరఫరా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇన్వర్టర్ లేదా ఏదో ఒకటి ప్రతి బ్యాంకులో ఉంటుంది కానీ ఇక్కడ లేకపోవడం అధికారులు నిర్లక్ష్యం కాదా అని పలువురు ఖాతాదారులు ప్రశ్నించారు. కొందరు ఈ ఎం ఐ, మహిళా సంఘాల పొదుపు, రుణాలు, చివరి రోజు బ్యాంకులో చెల్లించాల్సి వస్తే వారందరూ నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్యాంకు వినియోగదారులు ఖాతాదారులు పత్రిక విలేకరులతో అన్నారు.

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం పలు రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణం, గదులు, మరుగుదొడ్లు, వంట గది ఉన్నాయి. ఆకస్మిక తనిఖీ కి వచ్చిన అధికారులే అక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, ఎంపీడీవో మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామారావు, సాయికిరణ్ సిబ్బందితో కలిసి పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిర్వహణ లోపం ఉండడం తో పాఠశాల ప్రత్యేక అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు జ్వరాలు వచ్చినా ఎందుకు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. అధికారులు పాఠశాల వంటగదిని పరిశీలించగా ఎలుకలు కొరికిన టమాటాలు, కుళ్లిపోయ

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152052.705-1.wav?_=4

 

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T113732.763-1.wav?_=5

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు….

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు

*వాహనదారులు ప్రజల భయాందోళన

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండల
అధ్యక్షులు రావుల జానకి రావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.

ములుగు జిల్లాలో, ముఖ్యంగా మంగపేట మండలకేంద్రంలో వందలాది ఇసుక లారీలు రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీల పైన పట్టాలు కట్టకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల వాహనదారుల కళ్లలో ఇసుక రేణువులు పడుతూ నిత్యం ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పాదాచారులు సురక్షితంగా రోడ్లను ఉపయోగించలేక, భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్నాయని బిజెపి నేతలు కార్యకర్తలు అన్నారు.

ఇలాంటి ఇసుక లారీల వల్ల ప్రజలకు, వాహనదారులకు కలిగే భీభత్సాన్ని గుర్తుచేసి, వెంటనే లారీలను నియంత్రించి, సరైన పార్కింగ్‌లో ఉంచేటట్టు, రోడ్ల భద్రతను, ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=6

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్…

ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్

-కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేరుకే సంక్షేమం..గురుకులాలన్నీ సంక్షోభం

-కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

-ఫుడ్ పాయిజన్ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి

-సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మండలం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కార్పోరేట్ స్థాయి విద్యను కొనలేని దీనస్థితిలో ఉండడాన్ని కళ్ళారా చూసిన మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 5వ తరగతి నుంచే గురుకులాల విద్యను పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అందుబాటులోకి తెచ్చి..ఆ గురుకులాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను పట్టించుకోకపోవడం వలన రాష్ట్రంలో ఏదో ఒకచోట రోజురోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుండడంతో..విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కొర్కిశాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో..చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో..గుట్టుచప్పుడు కాకుండా..విద్యార్థులను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుండగా..మీడియా మిత్రులకు సమాచారం తెలియగానే..మీడియా మిత్రులను పాఠశాలల్లోకి రానివ్వకుండా..గేటుకు తాళం వేసి..ఇంత పెద్ద సమస్యను దాచిపెట్టడానికి కుట్రలు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందని అన్నారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకే గురుకులాలు సంక్షేమమని, ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాలు సంక్షోభంలో కొట్టుమిట్టు లాడుతున్నాయని..గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే ఫుడ్ పాయిజన్ కు కారణమవుతున్నాయా..? లేకుంటే ప్రభుత్వమే విద్యార్థులను నిర్లక్ష్యంగా చూస్తుందా..? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్లక్ష్యంగా వదిలేసి..పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గురుకులాల్లో ఉడికి ఉడకని పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెట్టడం వలన ఇలా ఫుడ్ పాయిజన్ లు అవుతున్నాయని, కాంట్రాక్టర్లు, గురుకులాల ప్రిన్సిపాల్ లు కుమ్మక్కై విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అండగా ఉండి గురుకులాల్లో పేద విద్యార్థులకు పెట్టె భోజనంలో ఈ దందాను కొనసాగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొర్కిశాల కస్తూర్బా గురుకుల పాఠశాలలోని విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, మెనూ ప్రకారం భోజనం పెట్టని కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని అన్నారెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version