విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు..

విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు

రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో “అరైవ్ & అలైవ్” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని సూచించారు.ఈ నియమాలను మనమే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి, నియమాలను గౌరవిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రలేఖనం చేశారు.సీపీ,డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.చివరగా విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ,తమ కుటుంబ సభ్యులతో కూడా పాటింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

షైన్ హై స్కూల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

షైన్ హై స్కూల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

ఎస్ఐ రవళి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

షైన్ హైస్కూల్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని షైన్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ భానుచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవళి రెడ్డి హాజరయ్యారు అనంతరం మాట్లాడుతూ మన జీవితంలో రోడ్డు భద్రత చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ మనం స్కూల్, బయటికి వెళ్లడానికి తిరిగి ఇంటికి రావడానికి రోడ్లను ఉపయోగిస్తాం. అందుకే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అన్నారు
డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఎప్పుడూ పాటించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, అలాగే సీట్ బెల్ట్ లేదా సాల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం తాగి వాహానం నడపరాదు అని తెలిపారు. అనంతరం
పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ విద్యార్థులకి డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. స్రవంతి. అకడమిక్ ఇన్చార్జ్ ఎమ్. రాజేష్ కుమార్ ఉపాద్యాయ బృందం పాల్గోన్నారు.

వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ..

వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .

పాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలలో సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వనపర్తి పోలీస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ, రత్నం విద్యార్థులతో కలిసి మానవహారం పోలీసులు, వాలంటీర్లు కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు ట్రాఫిక్ నియమాలపై చర్చించి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా డి ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక చట్టం మాత్రమే కాదుఅది మన జీవితానికి రక్షణ కవచం అని అన్నారు.సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సురక్షితంగా రోడ్డు దాటే విధానం హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై బస్సుల్లో జాగ్రత్తలు పాఠశాలల వద్ద వేగ నియంత్రణ గురించి, మైనర్ల వాహనాలు నడపటం డ్రైవింగ్‌పై నిషేధం
ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు ఉంటాయని డి ఎస్పీ అన్నారు
ఈ కార్యక్రమంలో సీఐ, సుగంధ రత్నం, వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, చిన్నమ్మ తామస్, వనపర్తి టౌన్ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి..

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు,జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని,రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబానికి జరిగే ప్రమాదమని తెలిపారు.జిల్లాలో రహదారులపై లైట్లు,బ్లైండ్ స్పాట్లను గుర్తించి తగు ఏర్పాట్ల చేయడం జరుగుతుందని,సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.అనుభవానికి, ప్రమాదానికి సంబంధం లేదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు,వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.ప్రతి వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి, మొబైల్ వినియోగిస్తూ వాహనాలు నడపకూడదని,రాంగ్ రూట్ లో వాహనం నడపకూడదని తెలిపారు.తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినట్లైతే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని,18 సంవత్సరాల వయసు నిండని వారు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపినట్లయితే వారి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.రహదారులపై పరిమిత వేగాన్ని పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడ్ రవాణా చేయాలని తెలిపారు.పోలీస్,రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు.అతివేగం చాలా ప్రమాదమని,వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్రీత్ ఎనలైజర్స్,స్పీడ్ గన్స్ అవసరం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గీతాంజలిలో రోడ్డు భద్రత అవగాహన

గీతాంజలిలో రోడ్డు భద్రతపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

 

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహనా సదస్సును ఘనంగా నిర్వహించారు. నిత్యం ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటన అత్యంత కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్తలు తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కొర్ర సారయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఓవర్‌లోడింగ్ వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం మాత్రమే సరైన మార్గమని ఆయన వివరించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఖాల రోడ్డు కూడలి వరకు రోడ్డు భద్రత నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో పాటు రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని హితవు పలికారు.

రోడ్డు నిబంధనలు పాటించండి: సీఐ సదాకర్

*రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి: జగిత్యాల రూరల్ సిఐ సాధాకర్

రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి:

 

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్-అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లిపూర్ లో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *జగిత్యాల రూరల్ సీఐ సదాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ‘అతి వేగం ప్రమాదకరం’ అని గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఉండాలని తెలిపారు.
**మండల విద్యాధికారి ఎం ఈ ఓ. రాఘవులు మాట్లాడుతూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగు వారికి వివరించి సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు.
*పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ * మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు సామాజిక స్పృహ కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు, గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి -వెంకటేష్, ఉప సర్పంచ్ వినయ్, గ్రామ వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మోడల్ స్కూల్‌లో రోడ్డు భద్రతా కార్యక్రమం

మోడల్ స్కూల్‌లో’అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం.

​చిట్యాల,నేటిదాత్రి :

​రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *అరైవ్అలైవ్’కార్యక్రమంలో భాగంగా,బుధవారం రోజున చిట్యాల మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.చిట్యాల ఎస్.ఐ పోచంపల్లి సతీష్ ఆదేశానుసారం, ఎస్.ఐ-3 ఈశ్వరయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:
వ్యాసరచన పోటీలు:* ‘హెల్మెట్ ధరించడం – ప్రాణ రక్షణ’* అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
​మానవహారం:* పాఠశాల ఆవరణలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారంగా ఏర్పడి, రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.​ఈ సందర్భంగా ఎస్.ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఏ ఎస్సై మధుసూదన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్స్ ఏ సందీప్, పి సందీప్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు

తహరాపూర్ సర్పంచ్ కుక్కల సరోజన

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన
మాట్లాడుతూవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట పోలీస్ ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్ (సురక్షితంగా గమ్యా నికి చేరండి) రోడ్ సేఫ్టీ అవగా హన కార్యక్రమాన్ని సర్పంచ్ కుక్కల సరోజన పిలుపు మేరకు గ్రామంలో నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని, హెల్మెట్ ధరించి గ్రామ పంచాయతీ ఆవరణం నుంచి మెయిన్ రోడ్డువరకు ర్యాలీ నిర్వహించారు. ఇది ఎంతో ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ.జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదాలను గణ నీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ డం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధానకారణమని హెచ్చరిం చారు. మన భద్రతే మన కు టుంబ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, గ్రామయువకులు బడుగు సునీల్, నిమ్మల రాజకుమార్, కొమ్ముల మల్లికార్జున్, గాజర్ల అజయ్, గోనెల రాజు, దాసరి నరేష్, బండారి రమేష్, సముద్రాల అనిల్, తాళ్ల రాజకుమార్, వాలుస పృథ్విరాజ్, కందగట్ల ప్రకాష్, గోనెల నాగరాజ్, కుక్కల రాజ్‌కుమార్, వాలుస తరుణ్, కుక్కల కుమార్, లోకాల బోయిన శివ నాగేంద్ర, కుక్కల దేవేందర్, పంచాయ తీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి…

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో గల రైతు వేదిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీ స్ శాఖ మహోత్తరమైన కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహన దారు లకు తెలియజేశారు వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రమా దాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు హెల్మెట్ ఒకటే ప్రధానమని అన్నారు. ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాల సహాయంతో ఇంటికి చేరుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి.

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు

ఎస్సై పరమేష్

రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్మెట్ పెట్టుకోవడం ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ పరమేష్ కోరారు రోడ్డు భద్రత ప్రగతి ప్రణాళిక,నియంత్రణ ప్రణాళిక గురించి ప్రజలకు వివరిం చాడు. ఒకవేళ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామనీ హెచ్చరించారు

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై గోపాల్ రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ. ఆరైవ్-ఆలైవ్ నినాదంతో రోడ్డు ప్రమాదాలు నివారణ హెల్మెట్, సీట్ బెల్ట్, ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రజలు వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడంలేదని రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలు రక్షించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాల వీధిన పడుతున్నాయని ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చేవరకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ. స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత నియమ అంశాల తెలియజేస్తూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. మితిమీరిన వేగంతో వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలకు యువతకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వర్క్ ఇన్స్పెక్టర్ ఈసి, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు, మహిళలు గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం…

రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్

ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవడమే… అరైవ్… అలైన్ ప్రధాన ఉద్దేశం… సిఐ సత్యనారాయణ

కేసముద్రం/ నేటి ధాత్రి

రైతు వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు.జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి
అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఉదేశీస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ,

ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ ప్రధాన ఉద్దేశం”. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం అని అన్నారు.

అతివేగం, మొబైల్ వాడకం, తాగి వాహనం నడపడం ( డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మునిసిపాలిటీ ప్రజలందరూ మన ప్రాణాలకు సంబంధించిన బాధ్యత హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అని అన్నారు.

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి అని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒకరిది బాధ్యత అని అన్నారు.

వేగం కన్నా ప్రాణం ముఖ్యం…అనే సందేశాన్ని అందరికీ తెలియజేశారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టీ.శ్రీనివాస్ స్థానిక ఎస్సై.నరేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీరష్ యాదవ్, కిషోర్, వేముల భారతి, ఉమా, కనుకుల సుభద్ర, విజయ, శరత్ యాదవ్, రాము, కృష్ణ, అరుణ, శారద,అధికారులు, వార్డ్ ఆఫీసర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

భద్రంగా.. సామాజిక బాధ్యతగా రోడ్డుపై వెళ్లాలి…

భద్రంగా.. సామాజిక బాధ్యతగా రోడ్డుపై వెళ్లాలి

వాహనదారులు, ప్రజల భద్రతకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాలు అమలు

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

పోలీస్ శాఖ ఆద్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ లో అరైవ్.. అలైవ్ కార్యక్రమం

గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు

భద్రత ప్రతిజ్ఞ, బ్లాక్ స్పాట్స్, ప్రమాదకర రోడ్ల గుర్తింపు

సిరిసిల్ల(నేటి ధాత్రి):
 

రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు భద్రంగా.. సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పోలీసుల ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.

ముందుగా అరైవ్.. అలైవ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి వీడియో సందేశం వినిపించారు. రోడ్డు ప్రమాదాలతో ఓ కుటుంబం పడుతున్న ఇబ్బందుల ఆధారంగా రూపొందించిన సందేశం వీడియో ఆలోచింపజేసింది. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి.. గ్రామస్తులతో అరైవ్.. అలైవ్ పై ప్రతిజ్ఞ చేయించారు.
 
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక*లో భాగంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో *అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సందేశం ప్రకారం యుద్ధాలు, వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెపుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య పనులు, రెసిడెన్షియల్ విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించామని, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్లింది మొదలు ఇంటికి వచ్చే వరకూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపు నిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు  దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వివరించారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటివల డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని తెలిపారు.  యువత, విద్యార్థులు ఆటలు ఆడాలని.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సీఎం కప్ పేరిట 40 విభాగాల్లో పోటీలు నిర్వహించామని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 300 కోట్ల జీరో టికెట్లపై ప్రయాణం చేసి.. రూ. 10వేల కోట్లు ఆదా చేశారని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రూ. 2 లక్షల లోపు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు. ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, వేములవాడ నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ నీటి పారుదల ప్రాజెక్ట్ ల పనులు కొనసాగుతున్నాయని, మల్కపేట ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేశామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని, నూతన కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. రేషన్ కార్డ్ లు ఉన్న అందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని, రాష్ట్రంలో 86 శాతం మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొదటి స్థానం..
రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదని.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ప్రణాళిక.. ఆచరణ కార్యక్రమాలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన జాబితాలో  జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ గ్రామంలో 44 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, లబ్ధిదారులకు రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఇందిరా ఆత్మీయ భరోసా.. బీమా పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి చట్టం తీసుకువచ్చామని, త్వరలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు.

టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, నిర్దేశిత గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని సూచించారు. తమ కుటుంబ, పిల్లల బాద్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు.  అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకూ సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ. 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులను ఆసుపత్రిలో వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని వెల్లడించారు. నో హెల్మెట్.. నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు  అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తండ్రికి హెల్మెట్ ఉపయోగం చెప్పాలని పేర్కొన్నారు.

రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ..
రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు.  ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వాకథన్, డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ వారంలో పోలీస్ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తామని వివరించారు. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఎక్కడైనా రోడ్లపై ఇబ్బందులు, గుంతలు, వీధి దీపాల సమస్య, రోడ్డు వెంట బావులపై నివేదిక పంపాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచులు ఫోరం మండలాద్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు…

ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాశీనాథ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుల ఘనంగా నిర్వహించారు.జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల ముగ్గులు వేసి పోలీస్ స్టేషన్లో ప్రాంగణం అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ ఆయన మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటు పాలు కార్యక్రమాలు

నిర్వహించారు సంక్రాంతి పండుగ మహిళా పోలీసులకు మరియు ప్రజలకు పోలీసు అధికారులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముగ్గులలో సైబర్ క్రైమ్ అవగాహన చైనా మాంజా మద్యం సేకరించి వహానము నడపరాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సేఫ్టీ హెల్మెట్ అవగాహన హోదా చిన్నదైనా బాధ్యతలు వహించాలి ఈ ముగ్గులలో మరిన్ని అవగాహనలు ఉన్నాయి ప్రజలు ఈ అవగాహన దృష్టిలో పెట్టుకొని పాటించగలరన్నారు,

జహీరాబాద్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని జహీరాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సైదా నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, ‘అరైవ్, అలైవ్’ నినాదంతో జహీరాబాద్ పోలీసులు స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో కార్మికులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సాధనమని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version