డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి…

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

 

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్‌పై (DeepFake) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు (Hyderabad CP Sajjanar) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజల్లో ఎంతో అవగాహన తీసుకువస్తున్నామని.. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు 5 వేలు, 10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని.. దీని వల్ల పెద్దలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ వెల్లడించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెండ్‌పై…

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version