పోలీసుల సేవలకు సలామ్..!!
◆:- ప్రజల క్షేమమే ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ లక్ష్యం
◆:- వరుణుడి బీభత్సం.. సహాయ కార్యక్రమాలలో పోలీసుల కృషి
◆:- మండలంలో సుడిగాలి పర్యటన, ప్రజలకు సలహాలు తగు సూచనలు
◆:- ముందస్తు చర్యల్లో ఎస్ఐ సేవలు అభినందనీయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఒక్కసారిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు, రైతులు అతలాకు తలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, అటు వర్షానికి కూలిన ఇండ్లు దీంతో భారీ నష్టానికి గురైన ప్రజలు, రైతులు.
అదేవిధంగా చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తన సిబ్బందితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడటమే కాకుండా భారీ వర్షానికి ఇండ్లలోకి ప్రవహిస్తున్న నీటిని చూసి భయాందోళన చెందుతున్న ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ..
వారిని కూడా కాపాడి ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చెరువు, కుంటలు నిండి రోడ్లపై భారీగా నీరు వరదల ప్రవహించడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు, రైతులకు తగు సూచనలు,సలహాలు ఇస్తూ రాకపోకలను నిలిపివేశారు. ప్రజల క్షేమమే తన బాధ్యతగా తీసుకొని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం మండల జిర్లాపల్లి ప్యాలారం దేవరంపల్లి ఎల్గోయి కృష్ణాపూర్ పోటీపల్లి గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్య టించారు. ప్రజలు భారీ వర్షాలు ఉండడంవల్ల అప్ర మత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు రైతులను అటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసుల కృషి, అండ ఉంటుందని ధైర్యాన్ని ఇస్తూ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చేస్తున్న సేవలకు హాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా అని లెక్కచేయకుండా తన విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సలాం కొడుతున్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు : ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటి ప్రమాదం ఉన్నందున రాకపోకలు నిలిపివేశామని అదేవిధంగా అత్యవసర సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండేల చర్యలు చేపడుతున్నా మని అన్నారు.