ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.

కొనుగోలు కేంద్రలలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలి

రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం.సేకరణ లక్ష్యం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

కోదాడ, నేటి ధాత్రి:

జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు. గతంలో రోజుకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా వరి కోతలు ఎక్కువ కావడంతో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసె లా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌళిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రలు, టార్ఫలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్ లోడింగ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలను వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదే విదంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, కోదాడ సొసైటీ సీఈవో మండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

తూముల్లో తుమ్మ పొదలు..

తూముల్లో తుమ్మ పొదలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రతీ ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో సమృద్ధిగా నిండిపోతున్నాయి. కానీ, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వ్యాప్తంగా ఏడాకులపల్లి కొత్తూరు వాగు, రాళ్ల వాగు చెరువులు, మేదపల్లి శివారులో గుండం చెరువు, ఏనుగుల చెరువు, ఈదులపల్లిలో కప్పలగ వాగు చెరువు, రాచన్న వాగు చెరువు, గంగాపూర్లో చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల కింద దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు సూచిస్తున్నాయి. కానీ వాటి తూములు, సీసీ కాలువలు శిథిలావస్థకు చేరి 10 ఏళ్లు గడిచిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. 200 ఎకరాలకు కూడా నీరు చేరడం లేదు. దీంతో పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు పండించే వివిధ రకాల పంటలకు నీరు అందకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో తూములు, కాలువలు..

ఝరాసంగం మండల వ్యాప్తంగా 7 పెద్ద చెరువులు ఉండగా, పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్కపల్లి, చిలేపల్లి, ఎల్గోయి తదితర గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వాటి తూములు శిథిలావస్థకు చేరుకోగా, మట్టి కాలువలు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరడం లేదు. చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తున్నారు. మరి కొంతమంది రైతులు చెరువుకు సమీపంలో ఉన్న రైతులు మోటర్లు బిగించుకొని పంటలు పండిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న రైతులు వర్షాధార పంటల పైనే ఆధారపడి ఉన్నారు. ఆయా గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు,గ్రామస్తులు పలుమార్లు చెరువుల మరమ్మత్తులు చేయాలని అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువులకు సంబంధించిన కాలువలు, మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సీఎంఆర్ఎఫ్: నిరుపేదలకు కొత్తగూడ సర్పంచ్ ఆశా కిరణం

* సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

* కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ
*
కొత్తగూడ నేటిధాత్రి :

పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక వరం అని కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ అన్నారు.గురువారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మహ్మద్ యాకుబ్ కు 18500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బోడ ఈర్య, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,ఈర్య నాయక్, అఫ్జల్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు యాదగిరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాకు యూరియా సరఫరా హామీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

జిల్లాలో ప్రస్తుతం 809 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి కలెక్టర్ బాదావత్ సంతోష్
ఈ నెలలో జిల్లాకు మరో 2270 టన్నుల యూరియా రాక ఉండనుంది
మొత్తం 4500 టన్నుల యూరియా జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు
రైతుల అవసరాలకు సరిపడా యూరియా సర్పొర కొనసాగుతుందని హామీ
యూరియా నిలువలపై ఏవో/ఏఈఓ లు నిత్యం పర్యవేక్షణ చేపడుతున్నారు
రైతులకు ఇబ్బంది తలెత్తకుండా సకాలంలో యూరియా పంపిణీ
రిటర్న్ దుకాణాలకు నాలుగు బస్తాలు యూరియా ఇతర పంటలకు రెండు బస్తాల పరిమితి
అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్చలు
రైతులు అధికారిక దుకాణాల నుంచి యూరియా కొనుగోలు చేయాలని సూచన
సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి…

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హనుమకొండ:నేటిధాత్రి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు..

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు

ఉత్సాహంగా పంట చేళల్లో తిరిగిన విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు.డిసెంబర్ 23 న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట,నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.ఈసందర్భంగా కూరగాయల పంటలను,మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి వాటియొక్క సాగు చేసే విదానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటచేనులో కలియ తిరిగారు.గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి, పంటచేను వద్ద ట్రాక్టర్ పై విద్యార్థులు కూర్చోని ఆనందంగా గడిపారు.

ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబర్ 23 న రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులకు వ్యవసాయ పంటల పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మిధున్, గుడిపాటి సౌజన్య, ఫీల్డ్ విజిట్ ఇంచార్జిలు ఆస్య , నూకల నాగ లక్షీ , ఉపాధ్యాయిని లు కుండె అనిత, శ్రీలక్ష్మీ, కావ్య,యాంకి , దేవిక, రాధిక పాల్గొన్నారు.

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు..

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు

ఉత్సాహంగా పంట చేళల్లో తిరిగిన విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు.డిసెంబర్ 23 న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట,నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.ఈసందర్భంగా కూరగాయల పంటలను,మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి వాటియొక్క సాగు చేసే విదానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటచేనులో కలియ తిరిగారు.గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి, పంటచేను వద్ద ట్రాక్టర్ పై విద్యార్థులు కూర్చోని ఆనందంగా గడిపారు.ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబర్ 23 న రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులకు వ్యవసాయ పంటల పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మిధున్, గుడిపాటి సౌజన్య, ఫీల్డ్ విజిట్ ఇంచార్జిలు ఆస్య , నూకల నాగ లక్షీ , ఉపాధ్యాయిని లు కుండె అనిత, శ్రీలక్ష్మీ, కావ్య,యాంకి , దేవిక, రాధిక పాల్గొన్నారు.

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు..

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

మండలంలో వానాకాలం పంటల సాగు మొత్తం 26,956 ఎకరాలకు చేరినట్లు తహసిల్దార్ వేముల రాజ్ కుమార్ చైర్మన్ తెలిపారు. గురువారం లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి పంటల విస్తీర్ణంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగులోకి వచ్చాయని వివరించారు. సమావేశంలో యం పి యస్ ఓ హనుమంతు నాయక్, ఏ ఓ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ ఈ చందన, ఏ ఈ ఓలు రాజేష్, రఘు పాల్గొన్నారు.

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T151547.325.wav?_=1

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

 

కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్‌ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్‌లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.

అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు…

అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు

అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి

ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సౌలతండలో అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నా రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ సంవత్సరాల తరబడి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నా రైతులకు పాలకులు మాత్రం పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని అట్టి రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా ఉంటున్నాయని, బ్యాంకు రుణాలు కూడా వచ్చే స్థితి లేదని, యూరియా బస్తాలు కూడా భూమి పట్టా ఉంటేనే వస్తాయని ఆయన అన్నారు. రైతులందరూ సమిష్టిగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పట్టాలు సాధించేంత వరకు పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అనంతరం కన్వినింగ్ కమిటీని వేయడం జరిగింది. కన్వీనర్ గా దారావత్ వీరన్న ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బానోతు బాల్ సింగ్, గుగులోతు వెంకన్న, బానోతు బాలాజీ, బానోతు శ్రీను, బానోతు అమ్మి, బానోత్ సరోజ తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం…

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ , రామాయంపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకము క్వింటాలుకు 2389 గాను, గ్రేడ్ బి రకానికి క్వింటాలుకు 2369 gaa అలాగే సన్న రకానికి బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందని సెంటర్ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్ ,వడ్ల కనుగోలు కేంద్రం నిర్వాహకులు కేతావత్ సురేష్ , పాత్లోత్ శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగ్లోత్ దేవేందర్, గ్రామస్థులు ఉప్పలయ్య, మోహన్, నాజాం , అనిల్ కుమార్, మరియు రైతులు పాల్గొన్నారు.

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభం…

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. సీరియల్ పద్ధతిలో కొనుగోలు జరపడం జరుగుతుందని పేర్కొన్నారు. తేమశాతం 14 ఉండేలా చూడాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత, కావేరి, రైతులు చాకలి రవి, అందే స్వామి, మ్యాదరి ప్రభాకర్, పట్ల స్వామి, బోయినీ బాలరాజు, రమేష్ ఉన్నారు.

రాజ్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్ నవంబర్ 3 నేటి దాత్రి

 

కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో పాక్స్ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్పలత నర్సయ్య,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు లు కలిసి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం. నర్స రెడ్డి, నిగ రవి,ఏలేటి లింగా రెడ్డి,ఉత్కం.హన్మంతు,రోండ్ల.రాజ రెడ్డి, పతకాల.కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రాం తదితరులు పాల్గొన్నారు.

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్…

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్

◆:- శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.

◆:- డీసీఎంహెచ్ చైర్మన్. మల్కాపురం శివకుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నాఫెడ్ వారిచే మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోయబీన్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు. మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్. ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు 5328/ రూపాయలు. కావున రైతులు దళారుల వద్దకు తీసుకోనిపోయి మోసపోకుండా రైతులు సోయబీన్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇట్టి అవకశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ది పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ , ఏడాకులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ రైతు బంధు ఆధ్యక్షులు ప్రభు పటేల్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభుపటేల్. సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్. అగ్రికల్చరల్ ఏవో వెంకటేశం ఏఈఓ వేద రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు,

పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు…

పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని, కట్రీ యాల గ్రామములో ఉన్న రైతు వేదిక నందు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్ర ప్రసన్న గారు హాజరై రైతులకు పంట నష్టం,భూమి పట్టా దారు , ఇనామ్ భూములు, కౌలు రైతు చట్టాల పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమములో డిపెన్స్ కౌన్సిల్ మెంబర్ సురేష్,ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ శృతి,వర్ధన్నపేట తహిసిల్ధర్ విజయ సాగర్, ఎ.ఓ విజయ్ కుమార్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఎస్సై సాయిబాబు,రైతులు పాల్గొనడం జరిగింది.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.

యాసంగి వరిధాన్యం బోనస్ రైతులకు చెల్లించాలి…

యాసంగి వరిధాన్యం బోనస్ రైతులకు చెల్లించాలి

మొక్కజొన్నలకు మద్దతు ధర లభించక నష్టపోతున్న రైతులు

రైతుల యాసంగి బోనస్ డబ్బులకై ఈనెల 25న చలో కలెక్టరేట్

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.తక్షణమే యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని రైతు రాజ్యాన్ని తెస్తామని గొప్పలు చెప్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అమ్మిన వెంటనే చెల్లిస్తామని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల 36 వేల టన్నుల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన 1168 కోట్ల రూపాయల బోనసు ను నాలుగునెలలైనా జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అధిక వర్షాలతో యూరియా కొరతతో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు మొక్కజొన్న వరి పత్తి పంటలు వేసిన దిగుబడి తగ్గి పంటలు చేతికి వస్తున్న దశలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలోనే మొక్కజొన్నలు ముందుగా చేతికి అందే వరంగల్ జిల్లాలో రైతులు ఇప్పటికే నూటికి 70 శాతం మంది దళారులకు వ్యాపారులకు మద్దతు ధర కన్నా క్వింటాకు ఐదు వందల నుంచి 600 రూపాయల వరకు తక్కువకు అమ్ముకొని తీవ్రంగా దోపిడికి గురయ్యారని మొక్కజొన్నలన్నీ దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవడం ఎవరి కోసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యవసాయ పంటల కొనుగోలు ప్రణాళిక లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే యాసంగి వరి ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే బోనస్ డబ్బులను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అందుకోసం ఈనెల 25న వరంగల్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రైతులను ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

– సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు
సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం విలీన గ్రామాలైన చంద్రంపేట, ముష్టిపెళ్లి గ్రామాల్లో బుధవారము నూతనంగా
వడ్ల కొనుగోలు కేంద్రం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి 4 ఎకరాలు ముష్టి పెళ్లికి, 5 ఎకరాలు చంద్రంపేటకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధరతోపాటు సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కి,సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, ప్రభుత్వ అధికారులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, మెప్మా మేనేజర్ పసాద్, ఆలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, రాజిరెడ్డి కమలాకర్ రావు, వంతడుపుల రాము, కొలనూరి రమాదేవి, గుడిసెట్టి బాలరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. నిన్ననే ప్రారంభోత్సవం చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలను.మహిళా సంఘాల ఆధ్వర్యంలో. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. అలాగే ప్రభుత్వం గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు చేయాలని మహిళల అభివృద్ధి ధ్యేయంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఐకెపి సెంటర్లద్వారా వడ్ల కొనుగోలు చేయడంతో పాటు మహిళలకు ఐకెపి సెంటర్ల ద్వారా. ఉపాధి కల్పిస్తున్నట్టు తెలియజేస్తూ మహిళా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అలాంటిది రైతులు పండించిన ధాన్యాన్ని. రైస్ మిల్లులో గాని. దళారుల గాని అమ్మి మోసపోవద్దని. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు రైతులు ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని. ప్రజలను. ఆర్థికంగా. నిండా ముంచి వెళ్ళాయని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా. రాష్ట్రాన్ని. అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్. వెలుపుల. స్వరూప తిరుపతి రెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ఏపీఎం.. డైరెక్టర్లు తిరుపతి రెడ్డి. నక్క నరసయ్య. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మునిగిల రాజు. శ్రీనివాస్ రైతులు మహిళా సంఘ సభ్యులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version