రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం, రైతు వారోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పలు రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. నెక్కొండ, రెడ్లవాడ, నాగారం, అలంకనిపేట, తోపనపల్లి, పెద్దకోర్పోల్, దీక్షకుంట క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
నెక్కొండ రైతు వేదికలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, రైతులు ప్రతీ ఏటా ప్రత్తి, మొక్కజొన్న పంటలకే పరిమితం కాకుండా పంటమార్పిడి వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారులు సేంద్రీయ వ్యవసాయం, వరిలో సన్న రకాల సాగు, యాసంగి ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు. మండల పశువైద్య అధికారి డాక్టర్ మమత ,పశుగ్రాస జొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ కృష్ణమీనన్ పంటలను మార్కెట్‌కు తేవడంలో శుభ్రత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

 

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం, రైతు వారోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పలు రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. నెక్కొండ, రెడ్లవాడ, నాగారం, అలంకనిపేట, తోపనపల్లి, పెద్దకోర్పోల్, దీక్షకుంట క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
నెక్కొండ రైతు వేదికలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, రైతులు ప్రతీ ఏటా ప్రత్తి, మొక్కజొన్న పంటలకే పరిమితం కాకుండా పంటమార్పిడి వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారులు సేంద్రీయ వ్యవసాయం, వరిలో సన్న రకాల సాగు, యాసంగి ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు. మండల పశువైద్య అధికారి డాక్టర్ మమత ,పశుగ్రాస జొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ కృష్ణమీనన్ పంటలను మార్కెట్‌కు తేవడంలో శుభ్రత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి ధాత్రి

తాళ్లపూసపల్లి గ్రామంలో బత్యేం సమ్మయ్య అనే రైతు యొక్కమూడు పశువులు నిన్న ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందటంతో సోమవారం మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్, పరామర్శించి 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గరకు వెళ్లి కాంటాలు కాకపోవడం గురించి బస్తాలు లేకపోవడం గురించి లారీలు రాకపోవడం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు రావుల రవిచంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ కందుకూరు ఉప్పలయ్య, ఉప సర్పంచ్ బండారు యాకన్న దేవేంద్ర, మాజీ సర్పంచ్ పోతకం సుధాకర్, బండి శ్రీనివాస్ , వాలేరు దశరథం, గొట్టిపర్తి వెంకన్న, వల్లాల కొమురయ్య ఆరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

నెక్కొండలో టీవీకే విజయోత్సవ సంబరాలు

నెక్కొండలో టీవీకే విజయోత్సవ సంబరాలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగరేసిన సందర్భంగా నెక్కొండ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య మాట్లాడుతూ, విజయ్ గెలుపు దళిత–బహుజనుల గెలుపుగా అభివర్ణించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కందిక చెన్నకేశవులు, ఈదునూరి మహేష్, వడ్డూరి కుమారస్వామి, ఈదునూరి శివాజీ, ఈదునూరి దిలీప్, కందిక వీరస్వామి, ఈదునూరి కృష్ణ, కందిక రాజు, శ్రీనివాస్, ఈదునూరి బిక్షపతి, రామచందర్, ఈదునూరి రాజు, వల్లందాస్ నగేష్, దంతాల వెంకన్న, ఈదునూరి హరీష్, కనకం కృష్ణ, బస్కే శ్రీను, ఈదునూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ ప్రతిష్టకు మంత్రికి ఆహ్వానం

శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఐ టీ శాఖ మంత్రికి అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9 వ తారీకు శనివారం రోజున జరుపబడును ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేసి ప్రతిష్టాపనకు రావలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో పాటు గౌడ సంఘం నాయకులు కూనూరి. సత్యనారాయణ గౌడ్, గట్టు సదయ్య గౌడ్, వీరగోని సంతోష్ గౌడ్, బండి క్రాంతి కుమార్ గౌడ్ మరియు వార్డు సభ్యులు వీరగోని అంజి గౌడ్. అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘం తరఫున ఆహ్వాన పత్రిక అందచేశారు ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో సెంట్రల్ లైట్స్ మంత్రి మంజూరు చేయడం జరిగింది. అడవి శ్రీరాంపూర్ గ్రామ గౌడ సంఘం తరఫున మంత్రి కి కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

జిల్లా కోర్టులో ఉద్యోగాల పేరుట కాంట్రాక్టర్ డబ్బులు వసూలు దందా

జిల్లా కోర్టులో ఉద్యోగాల పేరుట కాంట్రాక్టర్ డబ్బులు వసూలు దందా

న్యాయస్థానాలలో అక్రమ వసుల దండ

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకునే పోస్టులకు స్లీపర్ ఎలక్ట్రిషన్ ప్లంబర్ పెయింటర్ గార్డెన్ క్లీనింగ్ తదితర పోస్టులకు కాంట్రాక్టర్ నరేష్ వారి బినామీగా కార్తీక్ ని అడ్డం పెట్టుకుని అతని నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉద్యోగాల నమ్ముకుంటూ పోస్టుకు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటూ అమాయక ప్రజల్ని బుట్టలో పడేస్తూ పద్ధతి కొనసాగిస్తున్నాడు ఇంత జరుగుతున్నా ఇది ఎక్కడో కాదు జిల్లా కోర్టులో నిరంతరం న్యాయం కోసం వస్తున్న ప్రజలు ఎక్కడైతే న్యాయం జరుగుతుందనుకుంటున్నారో అదే కోర్టు దగ్గర ఎంతోమంది అమాయకులను మోసం చేసే విదంగా కాంట్రాక్టు మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూనారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న ఎవరి దృష్టిలో పడకుండా జాగ్రత్తగా కొనసాగిస్తున్నాడు ఒక కోర్టులోనే పైసల దందా చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్మకాలకు పెడుతూ ఈ రకంగా ఆయన దందా కొనసాగిస్తున్నారు ఇంతకుముందే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి అవినీతిని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా అయితే కాంట్రాక్టు పై చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ రద్దుచేసి కొత్త కాంట్రాక్టు అప్పచెప్పారో అదేవిధంగా కోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఈ డబ్బులు వసూలు దందా అని ఆపి సామాన్యమైన ఎలిజిబులిటీ అయిన నిరుపేదలకు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని ఏదైతే డబ్బులు తీసుకుంటున్నారో దాన్ని నియంత్రించాలని ఇక్కడున్నటువంటి జిల్లా కలెక్టర్ కి తెలియజేయడం జరుగుతుంది ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఎవరితో చెప్పకూడదని కాంట్రాక్టు వారితో చెప్పుకుంటూ డబ్బులు తీసుకుంటూ వారిని ఉద్యోగాలలో కొనసాగిస్తున్నాడు ఎవరైతే డబ్బులు కట్టి నష్టపోయారో వారికీ న్యాయం చెయ్యాలని జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బట్టు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు

మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం

మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం

గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శ

పరకాల,నేటిధాత్రి

రైతులు పండించిన మొక్కజొన్న,వరి కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.పరకాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులతో కలిసి సమస్యలను పరిశీలించిన ఆయన,సంబంధిత అధికారులతో చర్చించారు.కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,20 రోజులుగా పంటలు కొనకుండా రైతులను నిరీక్షింపజేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఈ నెల 11న జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి,రాగుల రమేష్, పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్,బొచ్చు ఈశ్వర్,మడికొండ ప్రశాంత్,రవి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ ప్రతిష్టకు మంత్రికి ఆహ్వానం

శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఐ టీ శాఖ మంత్రికి అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9 వ తారీకు శనివారం రోజున జరుపబడును ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేసి ప్రతిష్టాపనకు రావలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో పాటు గౌడ సంఘం నాయకులు కూనూరి. సత్యనారాయణ గౌడ్, గట్టు సదయ్య గౌడ్, వీరగోని సంతోష్ గౌడ్, బండి క్రాంతి కుమార్ గౌడ్ మరియు వార్డు సభ్యులు వీరగోని అంజి గౌడ్. అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘం తరఫున ఆహ్వాన పత్రిక అందచేశారు ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో సెంట్రల్ లైట్స్ మంత్రి మంజూరు చేయడం జరిగింది. అడవి శ్రీరాంపూర్ గ్రామ గౌడ సంఘం తరఫున మంత్రి కి కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలనిరాస్తారోకో

మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలనిరాస్తారోకో

తెలంగాణ రైతు సంఘం ఏ ఐ కె ఎస్

కేసముద్రం/ నేటి దాత్రి

కేసముద్రం మండలం తాళ్లపసపల్లి గ్రామం లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మార్తినేని పాపారావు. రైతు సంఘం మండల అధ్యక్షుడు నీరుటిజలంధర్ రైతుల సమస్యలు తెలుసుకుని రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించడం జరిగింది. తాళ్లపూసపెళ్ళిలో 15 రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు, మొక్కజొన్నలు నింపడానికి 10వేల బస్తాలు ప్రభుత్వం పంపిణీ చేసిందని, వాటిని మాత్రమే కాంటాలు పెట్టారని ఆరు లారీల్లో 6300 బస్తాలు తరలించారని ఈరోజు లారీల్లో వారు 2000 బస్తాలు తరలిస్తారని ఇక్కడ నిర్వాహకులు చెప్పారని, 20 రోజుల క్రితం మొక్కజొన్నలు తీసుకువచ్చి రాశులు పోసామని కాళీ బస్తాలుఇవ్వలేదు, మీరే కొనుక్కోచుకోమంటే తెచ్చుకుందామని అయినా బస్తాల్లో నింపట్లేదని అడుగుతే ఆన్లైన్ అయితే నింపుతం అంటున్నారని, 15 రోజుల్లో నుండి ఇక్కడ కావాలి పడుకో లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు తమ ఆవేదన తెలియజేశారని, నిన్న గాలి దుమారం అకాల వర్షానికి ఇబ్బంది పడ్డామని త్వరగా బస్తాలు అందించి కంటాలు పెట్టించి లారీలు తీసుకొచ్చి తరలించాలని రైతులు వారి ఆవేదన తెలియజేయడం జరిగింది. రైతులకు మద్దతుగా కొనుగోలు కేంద్రం ఎదురుగా ఉన్న కేసముద్రం మహబూబాద్ ప్రధాన రహదారిపై బైటాయించి ఆందోళన చేయడం జరిగింది, ఇంకా కొనుగోలు కేంద్రంలో 30 వేల బస్తాలు కాంటాలు పెట్టి తరలించాల్సి ఉందని, ఈ కొనుగోలు కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఇంకా రైతుల కళ్ళల్లో మొక్కజొన్నలు ఉన్నాయని త్వరగా తరలించాలని రాస్తారోకో చేయడం జరిగిందని . రేపు కలెక్టర్ ని కలిసి
మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొనే ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో మాదా శ్రీనివాస్, కాలేరు రామ్మూర్తి, మేకల మురళి బానోత్ కిషన్, కాలేరు వెంకటమ్మ భాదవత్ రమేష్ రాములు నాయక్, మోక్ష వెంకటేష్, సారయ్య, వెంకన్న,నర్సయ్య, పీరియా రైతులు తదితరులు పాల్గొన్నారు.

మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన నూక సురేష్ కుమార్

మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన నూక సురేష్ కుమార్

పరకాల,నేటిధాత్రి

పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ లో సాయి గీతా కిరాణం యజమాని నూక సురేష్ కుమార్ మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దాహుర్తి తీర్చాలనే కోరికతో ఏప్రిల్ నెల ప్రారంభం నుండి నేటి వరకు అంగడి బజార్ నుండి వెళ్లే ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.ప్రతిరోజు అంగడి బజార్ కు వెళ్లే ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతున్నది దంచి కొడుతున్న ఎండలను చూసి ప్రజల పై ప్రేమతో మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న సాయి గీత కిరాణం యజమాని సురేష్ కుమార్ ను పలువురు అభినందిస్తూ దీవిస్తున్నారు.ఒకవైపు పక్క వారికే సహాయం చేయని ఈ రోజులలో మండుతున్న ఎండలను చూసి సాయి గీతా కిరాణం యజమాని అంగడి బజార్ నుండి వెళ్లే ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప గర్వకారణమని కొనియాడుతున్నారు.

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ శ్రీకాంత్

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం కొంపల్లి గ్రామంలో ఉపాధి హామీ 100 రోజుల పనిని కొంపల్లి గ్రామ సర్పంచ్ సడాల శ్రీకాంత్.. ఉప సర్పంచ్ మర్రి శ్రీనివాస్ ఉపాథి హామీ పని ప్రారంభించి అనంతరం కూలీలకి మజ్జిగా..పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి లింగయ్య ఫీల్డ్ అసిస్టెంట్ బొల్లవేణి శ్రీనివాస్ యాదవ్ కొంపల్లి తండా సర్పంచ్ అజ్మీరా నిర్మలా సతీష్ ఉపసర్పంచ్ వాలు నాయక్… తదితరులు పాల్గొన్నారు

సమయపాలన పాటించని ఎంపిడిఓ తాసిల్దార్ ఉపాధి హామీ అధికారులు

సమయపాలన పాటించని ఎంపిడిఓ తాసిల్దార్ ఉపాధి హామీ అధికారులు

సిపిఐ ఎంఎల్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి తాసిల్దార్ ఎంపీడీవో ఉపాధి హామీ పథకం అధికారులు సమయపాలన పాటించడం లేదని వారు అన్నారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రామ్ రామచంద్ర మాదిగ పార్టీ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ ఆధ్వర్యంలో కార్యాలయాలను సందర్శించడం జరిగింది ఉదయం 9 గంటలకే కార్యాలయం తీయాలి కానీ 10:30 అయిన ఆఫీసులు తీసిన దాకాలు కానరావడం లేదు . మండల ఉన్నంత అధికారులు సమయపాలన పాటించకుండా మండలానికి మేమే బాసులం మమ్ములు అడిగేది ఎవరు మా ఇష్టం వచ్చినప్పుడు వస్తామని రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు ఎవరు కూడా సమయానికి ఆఫీసు రాకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వీరిని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మండలంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మార్వో ఆఫీస్ ఎంపీడీవో ఆఫీసు ఈజీఎస్ ఉపాధి హామీ ఆఫీసు లో ఉన్నటువంటి అధికారులు సమయానికి వచ్చి సమస్యలను పరిష్కరించాలి కానీ ఏ ఒక్క మండల ఉన్నత అధికారి సమయానికి రావడం లేదు కనీసం వారిని అడిగే వారు లేరు ఇలా నిర్లక్ష్యం చేసిన అధికారులను చోద్యం చూస్తున్నట్లు చూడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కి కోరుతున్నాం లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని తెలియజేస్తున్నాను

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా ముక్కెర సురేష్

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా ముక్కెర సురేష్

నడికూడ,నేటిధాత్రి:

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు,కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన ముక్కేర సురేష్ ను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా నియమించారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవురికి,వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇనుగాల కి అలాగే పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఈ బాధ్యత నాపై ఉంచిన నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినపిషరిస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్…..

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినపిషరిస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. 

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పిషరిస్. ప్రధాన కార్యదర్శి చే న్నమనేని. ప్రశాంత్. సందర్భంగా వేసవి కాలమును దృష్టిలో పెట్టుకొని మండపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు అమాలీలకు తన వంతు సహాయంగా. 200. మంది ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎండాకాలంలో ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా గ్రామాలలో ప్రజలు ఉపాధి హామీ కూలీలు హమాలీలు ప్రజలు ఎండలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి తప్ప అనవసరంగా బయటకు వెళ్లి ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. ఎండవేడి. తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ. పి షరీస్. ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. వార్డు మెంబర్ కడారిప్రతాపరెడ్డి. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గుంటిశ్రీనివాస్. బండి రాజు. దుబ్బాక శ్రీనివాస్. గంగాధర బాలకృష్ణ. పన్యాలదుర్గారెడ్డి. దాసరి నరేందర్. గణప లావణ్య. సబిత. తంగళ్ళపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ లోని జాటో అమ్మి గారి ఇంటి నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం సోమవారం నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమంలో 16 వార్డు కౌన్సిలర్ వల్లందా ఉమా రవి మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కీర్తి శ్రీలత సో సు కాండ్ల సుభాష్ రెడ్డి అజ్మీరా రమేష్ పాల్గొని భూమి పూజ నిర్వహించి నూతన ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్ మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రతి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్న మహబూబాబాద్ శాసనసభ్యులు బొక్కి అమూరి నాయక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మోసం చేసిందని అర్హులైన పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ తిండియకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి పేదవాళ్లకు మంజూరు చేస్తుందని పేదింటి కల నిజం చేస్తుందని రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెర శాల శ్రీనివాస్ నాయకులు ఒల్లందాస్ రవి పోలేపాక నాగరాజు తండావాసులు తదితర కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

సిరిసిల్ల (నేటి ధాత్రి):

మంగళవారం రోజున గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్ ను ఎస్పీ గారు స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి,ఎల్లారెడ్డిపేట సి.ఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఎస్.ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కజొన్న చేను కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

మొక్కజొన్న చేను కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం తిరుమలపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట చేను కాలిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సోమవారం సంఘటన స్థలానికి చేరుకుని పంటచేను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట కోత దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం అన్నారు.ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలన ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే ఈ ఘటనను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారితో మాట్లాడి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీలైనంత సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎమ్మార్వో,ఎంపీడీవో,వ్యవసాయ శాఖ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గుమ్మడి శ్రీదేవి ,కాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు గూట్ల తిరుపతి, గుంటూరు పల్లె ఉప సర్పంచ్ ముద్దన నాగరాజు, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

తాడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…..

తాడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తాడూరు రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ హాజరై నారు కార్యక్రమంలో. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు. రైతులు పండించే వ్యవసాయంపై సంక్షేమం. సేంద్రియ పంటల గురించి వివరిస్తూ. తాడూరు రైతు వేదికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాలకు గ్రామాల సర్పంచులు మార్కెట్ కమిటీ నాయకులు రైతులు. ప్రజా ప్రతినిధులు తదితరులు ఇట్టి అవగాహన కార్యక్రమానికి. హాజరైనారు

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాల అమ్మకాలు

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాల అమ్మకాలు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండి పాటు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్లాంట్ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఆరోపించారు.పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులు నేడు తీవ్ర ఆవేదన చెందుతున్నారని,వారికి ఇచ్చిన హామీలను యాజమాన్యం గాలికి వదిలేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి,ఇప్పుడు వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు.కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి,వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు.​స్థానిక యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కాంగ్రెస్ నాయకులు దూర ప్రాంతాల వారికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన సంచలన విమర్శలు చేశారు.భూములిచ్చిన నిర్వాసితులకు,స్థానిక నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని డిమాండ్ చేశారు.ప్రభావిత గ్రామాల యువతకు న్యాయం జరగని పక్షంలో,బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని,నిర్వాసితుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బాల్క సుమన్ హెచ్చరించారు.

తాసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు…

తాసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

నూతనంగా టేకుమట్ల మండలం తాసిల్దార్ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా టేకుమట్ల మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు తోట పద్మ ఆధ్వర్యం లో మర్యాదపూర్వకంగా కలిసి తాసిల్దార్ ను శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆర్ఐ సంతోష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ ఆనందపు లావణ్య రాజు
బచ్చల రవి ఆకునూరి ఓదెలు
మలహల రావు (కుందనపల్లి & గుమ్మడవెల్లి )
నన్నపు శంకరమ్మ
సుంకర ప్రసన్న శ్రీనివాస రావు
నాగుల స్వరూప ⁠జంగంపెల్లి శారదా రాజమల్లు
పైడిపల్లి స్వామి
వంగ సరిత డీలర్లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version