వర్షం పడితే వాహనదారులకు నరకమే.
⏩ ప్రమాదకరంగా మారిన గుంతలు.
⏩ ఒక్కసారి వర్షం పడితే చిత్తడే.
⏩ ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా?
⏩ గత కొన్ని సంవత్సరాల నుండి పేరుకుపోతున్న సమస్య.
⏩పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.
కాశీబుగ్గ నేటిధాత్రి.
వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామం నుండి రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు వెంకట సాయి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న గుంతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.వర్షం పడితే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రమాదకరమైన రోడ్డులో ఎన్నో స్కూళ్లకు సంబంధించిన బస్సులు, ఇండస్ట్రియల్ ఏరియా కు సంబంధించిన పెద్ద పెద్ద వాహనాలు, రవాణా చేయటం జరుగుతుంది. వర్షం పడినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆర్ అండ్ బి అధికారులు పట్టినట్టు ఉండటం విడ్డూరంగా ఉంది.ఎన్నోసార్లు పేపర్లలో కథనాలు వచ్చినా కూడా కనీసం అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడం ఎన్నో వివాదాలు దారితీస్తుంది.పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తారా,ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళలో వచ్చే వాహనాలకు మాత్రం నరకమే కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం స్కూలుకు వెళ్లే బస్సులు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంతో వెళ్తుంటారు. ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
