విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య…

విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం,షెడ్యూల్డ్ కులముల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాల,వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, విద్యార్థుల గదులు, వంటశాల,భోజనశాల, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు చేపట్టిందని, విద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకోవాలని,ఆ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని,ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం,త్రాగునీరు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని,గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వేసవి అయినందున త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత పథకం క్రింద చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఈ క్రమంలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న బాల సదనం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య అంచనా నిధులతో బాలసదనం భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని,పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సందర్శించి వార్డులు,రిజిస్టర్లు, మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఎండాకాలం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వెంకట్రావుపేట, దౌడపల్లి,చందారం గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా పట్టాలని,ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్లపై,మురుగు కాలువలలో వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.లక్షట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రానున్న వేసవిలో ప్రజలకు నిరంతరంగా నీటిని అందించే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు,ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు,వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని,లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని,ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని,పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని,జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఉన్నారు.జిల్లాలో ప్రాణ నష్టం,పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version