ఎన్నికలలో వెండి పట్టగోలుసులు పట్టుబడ్డాయి

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
– పట్టుబడ్డ అనుమతి లేని వెండి గొలుసులు
సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

శనివారం ఉదయం సుమారు 10:57 గంటలకు, కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల రగుడు వద్ద ఉన్న ఎస్ ఎస్ టి చెక్‌పోస్ట్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా
టీఎస్ 08 ఎఫ్ ఎస్ 6726 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని తోగిటి సత్యానారాయణ, తండ్రి: వెంకట్రాములు, నివాసం: మెట్పల్లి గ్రామము మరియు మండలం, జగిత్యాల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని మరియు అనుమానాస్పదమైన 2.342 కే.జి ల వెండి పట్టగోలుసులు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
అట్టి వెండి పట్టగోలుసులు ఎన్నికల నిబంధనలు మరియు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్ ఎస్ టి బృంద ఇన్‌చార్జ్ జి. ఆనంద్, ఏపీవో సమక్షంలో, మధ్యవర్తుల (పంచనామా సాక్షుల) సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ అట్టి వెండి పట్టగోలుసుల యొక్క మూలం మరియు ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ / దర్యాప్తు కొనసాగుతోందనీ టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

రోడ్డు భద్రత కోసం సిరిసిల్ల ఎస్పీ ట్రాఫిక్ నిబంధనల పాటింపుని కోరారు

ప్రతి ప్రాణం విలువైనదే…అందరూ బాధ్యతగా వ్యవహరించాలి.

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

రోడ్డు భద్రతే లక్ష్యంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం.

 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన“అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు,విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా,ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.మనం నిబంధనలు పాటించినప్పటికీ, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశముందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణాల రక్షణ లక్ష్యంగా ప్రారంభించిన “అరైవ్–అలైవ్” కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం,పట్టణం, కాలనీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కొనసాగుతుందని తెలిపారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు.

అనంతరం వాహనాలకు రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్లు అట్టించి అధికారులు,వాహనదారులతో కలసి ఎస్పీ గారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కృష్ణ, ఆర్.ఐ సురేష్, ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ దిలీప్ సిబ్బంది,నేతాజీ డిగ్రీ కలశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T134551.948.wav?_=1

 

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి

నవంబర్ 29, 30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా 4వ,మహాసభల కరపత్రం ఆవిష్కరణ.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు పక్షాన హ మాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్,మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు, అటువంటి సిఐటియు 4వ, మహాసభలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు నవంబర్ 29,30 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ-ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పడి చేయడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, హ మాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్మికులు, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు, హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థలో చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు,, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు సిఐటియు మహాసభలకు హార్దిక సహాయ సహకారాలు అందించి పోరాటాల వారిది సిఐటియుకు వెన్నుదండగా నిలవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది..ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి,గురిజాల శ్రీధర్, మరియు బూరుగుపల్లి,గ్రామ హ మాలి సంఘం అధ్యక్షులు, సూర్గు నాంపల్లి, కము టం సురేష్, కోరేపు రాజు, కల్లే పల్లి రవి, బరిగే రమేష్, నేరెళ్ళ బాలైయ్య, పెరుమల్ల తిరుపతి, సుదుల గోపాల్, తది తరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత..

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత
– ప్రజల ప్రాణాలకు ముప్పు!

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల, కామారెడ్డి రహదారి ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై భారీ గుంత.
నడిరోడ్డుపైనే ఇంత పెద్ద గుంత ఉండటం స్థానికులలో ఆందోళనకు కారణమైంది. ప్రధాన రహదారిపై ఉండటంతో వాహనదారులు ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే వాహనదారులు ఈ గుంతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుంత చుట్టూ కొంతమంది చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు ఇక్కడ ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో దీని ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు తెలుపుతున్నారు.
ఈ గుంతను తక్షణమే పూడ్చివేయాలని, రోడ్డు రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, వాహనదారులు. ఇప్పటికైనా పబ్లిక్ సేఫ్టీ, గ్రామపంచాయతీ అధికారులు రోడ్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వహించకుండా తొందరగా మరమ్మత్తులు జరపాలని కోరుతున్నారు.

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణికి 149 దరఖాస్తులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీపృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇప్పటివరకు ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమయ్యాయి? తదితర వివరాలపై ఆరా తీశారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు.

రెవెన్యూ కు 58, డీఆర్డీఓ కు 20, హౌసింగ్ కు 14, ఎస్డీసీకి 11, డీపీఓ కు 7, డీఈఓ 6, డీఎంహెచ్ఓ, సెస్ కు ఐదు చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, ఉపాధి కల్పన అధికారికి మూడు చొప్పున, డీసీఎస్ఓ, ఎక్సైజ్ ఆఫీసు కు రెండు చొప్పున, డీసీఓ, ఫారెస్ట్ అధికారి, రిజిస్ట్రార్, డీఎస్సీడీఓ, డీవీహెచ్ఓ, డీ ఎం ఆర్టీసీ సిరిసిల్ల, జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎల్ డీ ఎం కు ఒకటి చొప్పున వచ్చాయి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

కరపత్ర ఆవిష్కరణ నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T150306.262.wav?_=2

 

కరపత్ర ఆవిష్కరణ నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి

41 వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 41వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగినది.కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో పుట్టి మద్రాసులో ఉన్నత విద్యను అభ్యసించి 1952 భూస్వామ్య పెత్తందారి వర్గాల దౌర్జన్యాలను ఎదిరించి నందికొట్కూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు 1948 – 50 ల మధ్య 1968 – 84 మధ్య ప్రభుత్వ నిర్బంధాల కారణంగా రహస్య జీవితం గడిపి ప్రజల మధ్య కార్యక్రమాలు కొనసాగించాడు 1946 లోను 50 లోను 62 లోను ప్రభుత్వ రాజకీయ నిర్బంధాల కారణంగా సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపాడు 1953 నుండి కమ్యూనిస్టు పార్టీలో పాదుకుంటున్న తప్పుడు వైఖరి పాలకవర్గాల పట్ల రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడినాడు కమ్యూనిస్టు పార్టీకి పునర్మించే ప్రయత్నాలలో కృషిలో ముందు నిలిచాడు గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించి గోదావరి లోయ ప్రాంతంలో అనేకమంది ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినాడు ముఖ్యంగా మన సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించినాడు అట్టి విప్లవ మేధావికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామీకా వాదులు విప్లవ కమ్యూనిస్టు పార్టీల శ్రేణులు అన్ని వర్గాల కార్మికులు కర్షకులు హాజరుకావాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి దశరథం,AIFTU (న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వొల్లల కిషోర్,AIFTU (న్యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు,బామండ్ల రవీందర్,రాష్ట్ర కోశాధికారి తెలంగాణ రైతు కూలీ సంఘం మచ్చ అనసూర్య,పెద్దొల్ల సంగీత, గుజ్జే దేవదాస్, తడక రాములు,బొద్దుల శ్రీహరి,అకేని సత్తయ్య,బొల్లా వత్తిని ఎల్లయ్య వేముల రాజేశం,తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు

– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్

– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు

– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం

– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు

– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్

సిరిసిల్ల, నేటిధాత్రి:

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు.
పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.

Karimnagar Collectorate

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ డివిజన్ పోలీస్ అధికారులు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు.వి.పి. ఓ లు ప్రతి గ్రామని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T131708.158.wav?_=3

 

బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
– ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఇవ్వాలని 18న ఇచ్చిన తెలంగాణ బంధుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇస్తున్నామని
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేసినమని అన్నారు. అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసుకుని కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హై కోర్ట్ స్టే రావడం జరిగిందని అన్నారు.
ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సంఘీభావం తెలిపారని అన్నారు.
బంద్ కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా సహకరించాలని అన్నారు.
కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతాం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నాం మాకు పూర్తి ఆశాభావం ఉందని అన్నారు.
బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లులు వెళితే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పించడం లేదని
ప్రశ్నించారు.
బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను లాక్కోవద్దని బిజెపి నాయకులను కోరుతున్నామని అన్నారు.
రాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడా లేదు అని అన్నారు.
కోర్టులో సవాలు చేసిన వారు జీఓ 9 జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని కాదనీ అన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం చిత్త శుద్ధితో మేం ముందుకు పోతున్నామని, బిజెపి నాయకులు కూడా ఆలోచన చేయాలని అన్నారు.
18న జరిగే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,బిసి అధికార ప్రతినిధి పర్ష హన్మండ్లు, చేనేత సెల్ అధ్యక్షులు గోనే ఎల్లప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్నారు

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి…

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 23 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) సన్నద్దత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ..ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ఎస్.ఐ.ఆర్ సన్నద్దత రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితా, 2002 ఎస్.ఐ.ఆర్ లో ఉన్న ఓటర్ల కామన్ డెటాతో కెటగిరి ఏ, 2002 ఎస్.ఐ.ఆర్ లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరి బి, పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించి బూత్ స్థాయి అధికారులు రిపోర్టును సెప్టెంబర్ 23 లోపు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ రెవిన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు రాధాబాయి అన్ని మండలాల తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవమానం పై బీసీ, దళిత సంఘాల నిరసన

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానపరిచిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

బీసీ, దళిత సంఘాల డిమాండ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అవమానపరిచి అగౌరపరచినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలుమరియు దళిత సంఘాలు గురువారం రోజున డిమాండ్ చేశాయి, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం నరసయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్పా దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పద్మశాల సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాసు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం ,

 

 

 

బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ లు గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఫోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని మరియు ప్రజా పాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు, ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీనివాసును ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు , చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన అనంతరం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు, ఆది శ్రీనివాస్ పై జరిగిన అవమానం యావత్తు బీసీ ,దళితులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామన్నారు, చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు,గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు , బొప్ప దేవయ్య , చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాములు ,రాగుల జగన్ ,బట్టు ప్రవీణ్ ,తడక కమలాకర్, కంచర్ల రాజు , రవీందర్, మల్లేశం ,ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం
వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్.బిగి.తే

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఐపిఎస్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి తర్వాత తెలంగాణకు స్వతంత్రం రావడం సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం మరియు ప్రజాపాలన దినోత్సవం గా జరుపుకోవడం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలు అధికారులు కలుపుకుంటూ ముందుకు సాగించడం ఎంతో గర్వకారణమని తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం
తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.డా. కిరణ్ కుమార్ సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.
ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.
ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండా రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, యువజన కార్యదర్శి అంకారపు రవి, కవులు,కళాకారులు, రచయితలు అభినందించారు

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T120634.581.wav?_=4

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సాహితీ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో భాగంగా సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ..
తెలంగాణ యాస భాష మన కాళోజీ అని, నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన యోధుడని, కలం పట్టి ఖడ్గంగా మార్చిన మన కాళోజీ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని రచించినటువంటి వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాళోజి పై కవితను గానం చేశారు నిజాం తూటాలకు, కలం పట్టిన వీరుడని పొగిడారు. అలాగే బుర దేవానందం మాట్లాడుతూ కాళోజీ పై కవితను గానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోడం నారాయణ, దొంత దేవదాస్, అంకారపు రవి,ఎం.డి ఆఫీజ్, తదితర కవులు రచయితలు పాల్గొన్నారు.

బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించాలి…

బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించాలి

అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పట్ల సర్వత్ర హర్షం

స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల అమలు కై కాంగ్రెస్ చేస్తున్న కృషికి ధన్యవాదాలు

ప్రెస్ మీట్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ను పెంచుతూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం తడక కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన, సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే కసి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండడం పట్ల ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి హాట్సాఫ్ చెబుతున్నట్లు పర్ష హన్మాండ్లు అన్నారు , బీసీ రిజర్వేషన్ల విషయమై కొన్ని పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని ఈ వ్యవహారం అంతా బీసీ సమాజం గమనిస్తుందని పర్ష హన్మాండ్లు అన్నారు,నిన్న అసెంబ్లీలో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు, 42 శాతం రిజర్వేషన్లు అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీతక్క కొండా సురేఖ లకు మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పర్ష హన్మాండ్లు తెలిపారు, బీసీ బిల్లు గవర్నర్ ఆమోదిస్తారని బిసి సమాజం ఆశిస్తున్నదని అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు,ఈ రిజర్వేషన్ల అంశం బీసీలకు నోటికి బుక్కలాగా దగ్గరగా వచ్చిందని దీన్ని ఎత్తగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదన్నారు, ఆరు నూరైనా ఏది ఏమైనా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో సాధించి తీరుతామని పర్ష హన్మాండ్లు అన్నారు ,గతంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేయకపోవడం వలన బీసీలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాలకు రాజ్యాధికారము దక్కిందని ప్రస్తుతం రాజ్యాధికారం వాటా దక్కాల్సింది బీసీలకేనని బీసీల జనాభా 56% ఉన్నదని ఆ జనాభా ప్రకారము బీసీల వాట బీసీలకే దక్కాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు, 42 శాతం రిజర్వేషన్లు అంశాన్ని మేము రాజకీయం చేయదలచుకోలేదని వేచి చూసే ధోరణిలో ఉన్నామని ఇంకా నాన్చివేస్తే ఇంకా ఏదైనా రాజకీయ పార్టీలు అడ్డగిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ విద్యార్థులు, బీసీ ఉద్యోగులు, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు, అందరితోని జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా బీసీ ఉద్యమ ఉద్యమం మార్చుతామని దేనికైనా తెగిస్తామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కంచర్ల రాజు సీనియర్ నాయకులు చొక్కి కైలాసం, కొడం రవీందర్, సామల తిరుపతి ,దండు శ్రీనివాస్ ,ఇల్లంతకుంట తిరుపతి, బూర ఆంజనేయులు తర్వాత పాల్గొన్నారు.

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T135104.883.wav?_=5

 

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

– ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

– విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, సెప్టెంబర్ – 01(నేటి ధాత్రి):

 

 

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.

సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-77-2.wav?_=6

 

సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

ఉత్పత్తిలో వెనుకబడిన వారు వేగం పెంచాలి

రెండు షిఫ్ట్ లలో ఉత్పత్తి చేయాలి

త్వరలో ఆర్డర్ల బిల్లులు చెల్లిస్తాం

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా
రామయ్యార్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో సమీక్ష

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. ఎస్ హెచ్ జీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరై, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుక బడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు ఏకరూప చీర చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్ లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50 శాతం పూర్తి అయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయని పరిస్థితుల్లో మిగతావారికి దానిని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్ తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు.వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, జీఎస్టీ తదితర సమస్యలను పరిశ్రమ బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆట సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ, టెస్కొ సీజీఎం ఎన్ వీ రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు – ఎస్పీ ఆదేశాలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49-3.wav?_=7

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి

జిల్లా ఎస్పీ మహేష్.బీ.గీతే ఐ.పీ.యస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్.ఐ లు,ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని,

SP Mahesh.B.Geethe IPS

ఈవిషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్టపన నుండి నిమార్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు.మండలాల వారిగా నిమార్జనం జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు..గణేష్ మండపాల వద్ద,శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని,నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.అవసరం మేరకు చిన్న స్పీకర్లు పోలీస్ వారి అనుమతితో ఏర్పాటు చేసుకోలన్నారు.. ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు,ఎస్.ఐ కు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

నేరరహిత సిరిసిల్ల లక్ష్యం – ఎస్పీ మహేష్ గితే..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-1.wav?_=8

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పరంగా మరియు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు.

SP Mahesh Githe Independence Day

అంతేకాకుండా సిరిసిల్ల జిల్లాను శాంతి భద్రతలలో, మన వంతు కృషి ముందుండాలని, అంతేకాకుండా జిల్లాను నేరాలు లేని జిల్లాగా రూపుదిద్దడానికి మనమంతా కృషి చేయాలని పోలీసుల అధికారులకు మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగినది.

SP Mahesh Githe Independence Day

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version