ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ పర్యటన మియాపూర్ డివిజన్ కాలనీల్లో డ్రైనేజీ సమస్యల క్షేత్రస్థాయి పరిశీలన శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చొరవ చూపారు. గురువారం న్యూ కాలనీ మరియు శ్రీరంగాపురం కాలనీల్లో అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.న్యూ కాలనీలో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ లైన్ల నిర్మాణ ప్రాంతాలను, అలాగే శ్రీరంగాపురం కాలనీలో ప్రస్తుతం తలెత్తిన డ్రైనేజీ సమస్యను జలమండలి డిజిఎం నారాయణ, సిఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, సమస్యల తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్‌లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. డివిజన్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, లింగయ్యలతో పాటు స్థానిక నాయకులు వెంకటేష్ గౌడ్, తిమ్మరాజు, నరేష్, శంకర్ నాయక్, జ్యోతి, లక్ష్మి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
పట్టణంలో శ్రీ పోచమ్మ నాగుల ఆలయం దర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు పట్టణం లోని *నూతన పోచమ్మ నాగుల ఆలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ లు స్వప్న ప్రవీణ్,ప్రేమలత శంకర్ రెడ్డి , నాయకులు భరత్ రెడ్డి, జగదీష్, ప్రభు పటేల్ తదితరులు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి,ఆలయ కమిటీ వారు ,పూజారులు, భక్తులు ఎమ్మెల్యే గారికీ,నాయకులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జహీరాబాద్ మే 14: హైదరాబాద్‌లో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గురువారం మే 14, 2026 ఉదయం జహీరాబాద్ పరిధిలోని జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది.కోహిర్ ఎస్సై టి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సయ్యద్ సర్దార్, అతని భార్య సబీహా (30), పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న తమ బంధువుల పెళ్లికి వచ్చారు. మే 13 సాయంత్రం వివాహ రిసెప్షన్ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. భార్యాపిల్లలను ఇతర వాహనంలో పంపిన సర్దార్ కెఎ 32 ఎచ్ఎల్ 0274 నెంబర్ గల తన బైక్ పై ఒంటరిగా బయలుదేరాడు.మే 14 (గురువారం) ఉదయం 5:40 గంటల సమయంలో జహీరాబాద్ వైపు వస్తుండగా, దిగువాల్ గ్రామ శివారులోని పిరమిల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై సర్దార్ బైక్‌ను ఒక గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన సర్దార్ రోడ్డుపైనే అక్కడికక్కడే మృతి చెందాడు.భర్త మృతిపై భార్య సబీహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోహిర్ ఎస్సై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్ళిపోయిన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు తమ ఉన్నతమైన భవిష్యత్తు కోసం రాసిన నీట్ పరీక్షలు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పరిషత్ పత్రాలు లీకేజీ అవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారిందని దీనికి వారిని కేంద్ర విద్యా శాఖ మంత్రిని విచారించి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు సి డబ్ల్యూ సి మెంబర్ ఎక్స్ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో కూడా సుమారు 75 వేల మంది విద్యార్థులు రాశారని ఆయన పేర్కొన్నారు పరీక్ష పత్రాల లీకేజీ కు పాల్పడిన వారిపై కఠించడం తీసుకోవాలి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవిలే పెద్ద సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పేర్లపల్లి గోపి చిట్టిబాబు వెంకట నరసింహులు ఐరాల లోకేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
*నీట్ పరిక్ష రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం..*
భాద్యులపై కఠిన చర్యలు తీసుకో వాలి…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ -యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే.పరిక్షా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న లోపాలు,పేపర్ లీకుల వల్ల విద్యార్థులలో నమ్మకాన్ని దెబ్బతిస్తున్నాయి.విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరిక్ష వ్రాస్తే ప్రభుత్వ అసమర్థతో లీకుల పేరుతో రద్దు చేయడం వారి తల్లిదండ్రులకు మోయలేని ఆర్థిక భారం విద్యార్థులకు తీరని నష్టం,ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారంతా నెలల తరబడి కష్టపడి సిద్ధమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు నీట్ పరిక్ష నిర్వాహణలో జరిగిన నిర్లక్ష్యానికి బాద్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ఇక ముందు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి,ఎన్ టిఏకు డిమాండ్
*ఇంట్లో పని మనుషులని పెట్టుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త.*
మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్
*జహీరాబాద్ నేటి ధాత్రి :*
నేపాల్ నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కానీ మన జిల్లా మండలాలకు పని నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలాంటి వారిని పనిలో పెట్టుకోవడానికి ముందు,ఇండ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి గత వివరాలు నేర చరిత్ర తెలుసుకోవాలి. ఇలాంటి వారి వివరాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి వారి వివరాలు పోలీసు స్టేషన్ నందు నమోదు చేయాలి జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్ సూచించారు. పని పెట్టుకునే వారి సమాచారం, కొత్తవ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వివరాలు పోలీసులకు తెలిపి గత చరిత్ర తెలుసుకోవాలని. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను పనిలో పెట్టుకోవద్దు అని కోరారు. నేరాల నిర్మూలన,దొంగతనాల నిర్మూలనలో పోలీసు వారికి సహకరించాలి అని కోరారు. ఇంట్లో పని మనుషులుగా చేరిన పనివారు దోపిడీలకు,దొంగతనాలకు, దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంగా మండల ఎస్సై ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ఇంట్లో పని మనుషులని పెట్టుకునే ముందు వారి పూర్వాపరాలు పరిశీలించాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్తవ్యక్తులను,గుర్తింపు లేని వారిని చేరదీస్తే వారి నుండి అపాయం సంభవించే అవకాశం ఉందని గుర్తు చేశారు. పథకం ప్రకారం పనిలో చేరి నేరాలకు పాల్పడతారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని తెలిపారు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు డయల్ 100 కు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.
అవధూత దత్త పీఠం గణపతి సచ్చితానంద స్వామి చేతుల గోల్డ్ మెడల్ బహుమతి
బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కర్ణాటక మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చితానంద స్వామి చేతుల మీదగా శ్రీమత్ భగవద్గీత రెసిటేషన్ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెందిన ఐదవ తరగతి బాలిక , బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్ తండ్రి పేరు వినయ్ పవర్ , NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్ కూతురు భగవద్గీత చూడకుండా మొత్తం పుస్తకాన్ని చదివింది ఎ క్కడ ఏ శ్లోకం అడిగినా కంఠస్థగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సాన్విక పవర్ కు గోల్డ్ మెడల్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు హిందువులు విద్యార్థి విద్యార్థులు భగవద్గీత తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం మైనార్టీ సోదరులు ఏ విధంగా ఖురాన్ చదువుతారు , మన క్రైస్తవ సోదరులు సంబంధించిన బైబిల్ చదువుతారు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు మీ ఇంట్లో తప్పనిసరిగా భగవద్గీత చదవాలి ప్రతి ఇంట్లో భగవద్గీత ప్రతి పూజ మందిరంలో ఉండాలి ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
*దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలి..
*దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించాలి..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటిధాత్రి:
ప్రపంచ రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరల పెరుగుదల, దిగుమతి వ్యయాల భారము, మార్కెట్ అస్థిరత వంటి పరిణామాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించాలనే. భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించి.దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.పొదుపు అనేది కేవలం కుటుంబ అవసరం కాదు…అది దేశ భద్రతకు కూడా ఆధారం” అనే భావనను ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం.., పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవిదేశీ మారక నిల్వలను కాపాడేందుకు,ఇందన వినియోగాన్ని తగ్గించేందుకు కీలక పొదుపు సూత్రాలను ప్రకటించిన దరిమిలా.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో… మోడీ పిలుపునందుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాకు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు, విద్యుత్ పొదుపు… దేశానికి ప్రత్యక్ష సహాయం అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయడం చిన్న విషయం అనిపించినా, కోట్లాది కుటుంబాలు అదే చేస్తే దేశ విద్యుత్ వినియోగ భారం గణనీయంగా తగ్గుతుంది. విద్యుత్ ఉత్పత్తికి కూడా భారీగా ఇంధనం అవసరం అవుతుంది. కాబట్టి విద్యుత్ పొదుపు అంటే పరోక్షంగా దేశ సంపదను కాపాడినట్టేనన్నారు. ఇంధన వినియోగంలో నియంత్రణ అవసరం.., అవసరం లేని వాహన ప్రయాణాలు తగ్గించడం, ఒకే పనికి అనేకసార్లు బయటకు వెళ్లకుండా ప్లాన్ చేసుకోవడం,సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించడం వంటి చర్యలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. భారత్ ఎక్కువగా విదేశీ చమురుపైనే ఆధారపడుతున్నందున ప్రతి చుక్క ఇంధనం విలువైనదేనని తెలిపారు. బంగారం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా వ్యయమవుతున్నందున, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ముగిసేవరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలి. విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించి, విదేశీ కరెన్సీ ఖర్చయ్యే వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉండాలన్నారు. నీటి సంరక్షణ కూడా ఆర్థిక రక్షణే నీటి వృథా తగ్గితే వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పట్టణాల నిర్వహణపై ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్‌లో నీటి కొరత పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటి వినియోగంలో జాగ్రత్తలు ఇప్పటి నుంచే అలవాటు కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం లోకల్‌కు వోకల్” అనే మోదీ పిలుపు ఇప్పుడు మరింత అవసరమైంది. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తే చిన్న వ్యాపారులు, రైతులు, సూక్ష్మ పరిశ్రమలు బలపడతాయి. దేశంలోనే డబ్బు తిరుగుతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందన్నారు. ఆడంబరాల కంటే అవసరాలకు ప్రాధాన్యం సంక్షోభ కాలాల్లో అధిక ఖర్చులు, అనవసర కొనుగోళ్లు కుటుంబాలను అప్పుల్లోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుటుంబ బడ్జెట్‌ను నియంత్రించడం, పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవింగ్స్‌గా ఉంచే అలవాటు పెంచుకోవాలన్నారు. డిజిటల్ లావాదేవీలతో పారదర్శక ఆర్థిక వ్యవస్థకు బలమని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,డిజిటల్ చెల్లింపులు పెరిగితే నగదు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అలాగే అవినీతి, నల్లధనం నియంత్రణకు కూడా దోహదం అవుతుంది. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ కుటుంబాల వరకు డిజిటల్ విధానాలను అలవాటు చేసుకోవడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆహార ధాన్యాల వృథా తగ్గించాలి..ఒక్క గింజ అన్నం వెనుక రైతు చెమట, నీరు, విద్యుత్, రవాణా వ్యయం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వండటం, వినియోగించడం కూడా ఒక గొప్ప పొదుపు సూత్రమేనన్నారాయనపొదుపు అనేది పాతతరం అలవాటు మాత్రమే కాదు. భవిష్యత్ భారత్‌ను నిర్మించే యువత కూడా పొదుపు నేర్చుకోవాలి. ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, స్థానిక ఉత్పత్తుల వినియోగం వంటి అంశాల్లో యువత ముందుండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం మాటలకే పరిమితం కాకుండా నిబంధనలను స్వయంగా అమలు చేస్తూ తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను మరియు SPG కమాండోల సంఖ్యను 50 శాతం మేర తగ్గించుకుని, ఆచరణలో చేసి చూపారని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ బాటలో పయనిస్తూ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైకోడ్ మండల యూసు పూర్ సర్పంచ్ సంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరో పించారు. యూసుపూర్ సర్పంచ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పగలు రాత్రి కష్టపడి చదివిన సుమారు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటo మాడు తోందని మండిపడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ అర్హత పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించలేని స్థితిలో కేంద్రం ఉంది ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. పరీక్షకు ముందు రోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయంటే, విద్యా వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2024లో జరిగిన నీట్ లీకేజీ ఉదంతం నుండి కేంద్రం ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదని, ఆ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృత మైందని గుర్తు చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందని, కేంద్ర సర్కారు తీరువల్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గుర వుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడం లో విఫల మైన ఎన్డీయే ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
*నీట్-యూజీ 2026 స్కాం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం*
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం
కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్
*జహీరాబాద్ నేటిధాత్రి:*
నీట్-యూజీ 2026 పరీక్షలో వెలుగులోకి వస్తున్న పేపర్ లీక్, అవినీతి ఆరోపణలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశం–ఒక పరీక్ష” అంటూ గొప్పలు చెప్పుకున్న బీజేపీ ప్రభుత్వం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు.నీట్ పరీక్షల సమయంలో విద్యార్థులపై అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తూ, చెవిపోగులు నుంచి జుట్టు క్లిప్పుల వరకు తనిఖీలు చేసే అధికారులు, అసలు ప్రశ్నపత్రాలనే కాపాడలేకపోవడం సిగ్గుచేటని సుగుణక్క మండిపడ్డారు. విద్యార్థులపై మాత్రమే అనుమానం చూపించే ఈ ప్రభుత్వం, వ్యవస్థలో ఉన్న అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు.ప్రతి సంవత్సరం నీట్ చుట్టూ పేపర్ లీకులు, మార్కుల గందరగోళం, గ్రేస్ మార్కుల వివాదాలు వస్తూనే ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, తప్పు చేసిన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.గతంలో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండేవని, కానీ బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన నీట్ విధానం వల్ల కోచింగ్ మాఫియాలు మాత్రమే లాభపడుతున్నాయని విమర్శించారు. గ్రామీణ, పేద, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. పరీక్షలు రద్దు చేయడం, మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చిన బీజేపీ విధానాల ఫలితమే ఈ పరిస్థితి అని అన్నారు.నీట్-యూజీ 2026 స్కాంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలని వారు అన్నారు,
ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(సిడిసిఏ) ఆధ్వర్యంలో మే 14వ తేదీ ఆదివారం అండర్ 16 బాయ్స్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సిడిసిఏ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రికెట్ సెలక్షన్స్ తిరుపతి స్థానిక మంగళం రోడ్డులోని కజారియా టైల్స్ ఎదురుగా ఉన్న సీవీ క్రికెట్ అకాడమీ నందు ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సెలక్షన్స్ లో హాజరగు అండర్ 16 బాయ్స్ 1.9.2010 తరువాత, 31.08.2012 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. ఆదివారం జరిగే ఈ సెలక్షన్స్ లో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు తెల్లని దుస్తులు, తమ సొంత క్రీడా సామాగ్రితో పాటు ఆధార్ కార్డు, జన్మ ధ్రువీకరణ పత్రము తప్పక తీసుకురావాలని సూచించారు. ఈ సెలక్షన్స్ కు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ క్రికెట్ సెలక్షన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్ 8886185559, కోచ్ సునీల్ కుమార్ 9000214966, కోచ్ చిన్నబాబు 798188 0381 లను చరవాణి ద్వారా సంప్రదించవలసిందిగా వారు కోరారు…
జిల్లాలోని పలు రైస్ మిల్లులను మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మల్లాపూర్ మే 14 నేటి ధాత్రి
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉదేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం మల్లాపూర్ మండలం రాఘవపేట, ముత్యం పేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలాగే మొగిలి పేట గ్రామంలోని ఏ ఆర్ ఎస్ రైస్ మిల్, ముత్యం పేట, రాఘవ పేట గ్రామం లోని పూజ ఇండస్ట్రీయల్ రైస్ మిల్లు, విష్ణు ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గన్ని సంచులు, టార్ఫలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని పాడీని ప్రొటెక్ట్ చేయాలన్నారు . కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వస్తున్న వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్‌లోడ్ చేసిన వెంటనే లారీలను త్వరితగతిన పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు మరియు రవాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం దిగుమతి, నిల్వ, మిల్లింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు . మిల్లుల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, మిల్లింగ్ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లర్లు హమాలీలను అందుబాటులో ఉంచుకొని వచ్చిన ధాన్యాన్ని దింపుకోవాలని అలాగే మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో నరసింహ రావు, సివిల్ సప్లైస్ డిఎం జితేంద్ర ప్రసాద్ , తహసీల్దార్, సంబంధిత అధికారులు పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
నిపుణులుగా ఎదిగి, వృత్తిలో రాణించండి గీతం విద్యార్థులకు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ సూచన
నేటి ధాత్రి, పాటన్ చేరు :
ఎంపిక చేసుకున్న రంగంలో నిపుణులుగా ఎదిగి, ఆయా వృత్తులలో మేటివారిగా రాణించాలని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని టెలివిజన్ ప్రసార కోర్సులు, ప్రయోగాత్మక యానిమేషన్, మీడియా నిర్వహణ పద్ధతులు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. పూణేలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూ విశ్వవిద్యాలయ సహకారంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో నిర్వహించిన రెండు వారాల ‘జాతీయ విద్యా ఇమ్మర్షన్ కార్యక్రమం’ గురువారంతో ముగిసింది. భవిష్యత్ తరానికి చెందిన మీడియా నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యక్రమ ముగింపు వేడుకలో డాక్టర్ సంజీవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క నిజమైన విలువ కేవలం విద్యాపరమైన వినిమయంలోనే కాకుండా, పాల్గొనేవారి మధ్య ఉన్న జిజ్జాస, సహకారం, పరస్పర సంభాషణ స్ఫూర్తిలో కూడా ఉందని అన్నారు. నూతన ఆవిష్కరణలను, అర్థవంతమైన విద్యాపరమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే వేదికను కల్పించినందుకు ఆయన ఎంఐటీ వర్సిటీకి కృతజ్జతలు తెలిపారు. ఈ చొరవ రెండు సంస్థల మధ్య మరింత బలమైన సహకారానికి నాంది పలికిందన్నారు.ఎంఐటీ-డబ్ల్యూపీయూ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ అను నాయర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో 71 మంది విద్యార్థులఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. గీతంతో మరిన్ని సహకార కార్యక్రమాల కోసం తమ సంస్థ ఎదురు చూస్తోందని ఆమె తెలిపారు. విద్యార్థులు ఆయా సెషన్లలో చురుకుగా పాల్గొన్నారని, ముఖ్యంగా ఆచరణాత్మక అభ్యాస అనుభవాలను ఆస్వాదించారని చెప్పారు.
మే 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఇమ్మర్సన్ కార్యక్రమం, విద్యార్థులకు సమకాలీన మీడియా పద్ధతులు, కమ్యూనికేషన్ వ్యూహాలు, డిజిటల్ స్టోరీటెల్లింగ్, పరిశ్రమ ఆధారిత శిక్షణపై విస్తృతమైన అవగాహనను అందించింది. నిపుణుల ఉపన్యాసాలు, కార్యశాలలు, ముఖాముఖి కార్యక్రమాలు, ఆచరణాత్మక అభ్యాస అనుభవాల ద్వారా, విద్యాపరమైన జ్జానానికి, వృత్తిపరమైన మీడియా పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే ఈ లక్ష్యంగా ఇది కొనసాగింది.రెండు విద్యా సంస్థల అధ్యాపకులు, ప్రముఖులు ఈ ఉమ్మడి కృషిని ప్రశంసించారు. సామాజిక బాధ్యత కలిగిన, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న మీడియా నిపుణులను తీర్చిదిద్దడంలో అనుభవపూర్వక అభ్యాసం, వివిధ రంగాల పరిజ్జానం, విద్యా భాగస్వామ్యాల ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.తమ ప్రతిస్పందనలో విద్యార్థులు ఈ కార్యక్రమం గురించి సానుకూల స్పందనను పంచుకున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక యానిమేషన్ తరగతులు, మోషన్ గ్రాఫిక్స్ సెషన్లు, ఆడియో ప్రొడక్షన్-సౌండ్ డిజైన్ కార్యశాలలు, అలాగే పీసీఆర్ గదిలో మూడు ప్రాజెక్టులను రూపొందించిన ప్రత్యక్ష అనుభవాన్ని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన రెండు లఘు వీడియోలను కూడా ప్రదర్శించారు.ఇందులో పాల్గొన్నవారు తమ అభ్యాస అనుభవాలను సమీక్షించుకోవడంతో వీడ్కోలు కార్యక్రమం ముగిసింది. అనంతరం సామూహిక ఛాయాచిత్రాల కార్యక్రమం జరిగిందని తెలిపారు
ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకం
భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు.గురువారం ఎంపిక చేసిన రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు,జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని తెలిపారు.ప్రతి ఎన్నికకు ముందు ఎన్నికల జాబితాలను నవీకరించవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు, 18 సంవత్సరాలు నిండిన వారు, ఆయా నియోజకవర్గంలో సాధారణ నివాసితులు, చట్టపరంగా అనర్హులు కాని వారు ఓటరుగా నమోదు కావచ్చని తెలిపారు.యువ ఓటర్ల నమోదు, మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ఇంటింటి సర్వేలు, పోలింగ్ స్థాయి అధికారుల పని తీరు,ఓటరు జాబితాలో పేర్ల నమోదు,తొలగింపు,సవరణ ప్రక్రియలను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాలపట్టికలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని,దేశ వ్యాప్తంగా గతంలో కూడా పలు మార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా,అనర్హులు జాబితాలోకి చేరకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని,అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ ఫారమ్‌ల సేకరణ కోసం బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించేలా చూడాలని, ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేసిన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేర్చడం జరుగుతుందని,విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని తెలిపారు.
ఈ సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టడం జరుగుతుందని, ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1 వేయి 200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.హై-రైజ్ బిల్డింగ్‌లు, మురికివాడలలో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా,ఒక కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ,బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరడం జరిగిందని,ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత అట్టి జాబితాను వెబ్‌సైట్‌లో,స్థానిక కార్యాలయాలలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.జాబితాలో పేర్ల చేర్పులు,తొలగింపుల కోసం ఫారమ్ 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులకు తగిన విచారణ ద్వారా వారి అర్హతను ధృవీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సమకూర్చడం జరుగుతుందని,ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని సుముఖ గోదాము, మండల కేంద్రంలోని జయలక్ష్మి రైస్ మిల్ లను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని,కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని, సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు.వరి ధాన్యం కొనుగోలు,దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని,రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు.రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రావి నారాయణరెడ్డి భవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సాధారణ ప్రజల విషయంలో వేగంగా స్పందించే పోలీస్ వ్యవస్థ, అధికార పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ సమానమని, అధికారంలో ఉన్నవారికోసం ప్రత్యేక నిబంధనలు ఉండవని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు పోలీస్ శాఖపై ఉందన్నారు. పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో ఆలస్యం చేయడం వల్ల ప్రజల్లో చట్టంపై నమ్మకం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలు, బాలికల రక్షణ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి విడనాడాలని, వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు.సిపిఐ పార్టీ ఎప్పటికీ బాధితుల పక్షాన నిలబడుతుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రవీణ్ తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ నాయకులు నేరెళ్ల జోసెఫ్, పోచంపల్లి మహేష్,గోలి లావణ్య, ఎండి సాబిర్, గోనెల తిరుపతి, ఐలీ శరత్, పల్లెల రజిత, పెద్దమంలో సంధ్య, వాసం రజిత, పోతుగంటి స్వప్న, మట్టి నాగమణి, మెండ్రపు సుభద్ర తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు నాణ్యమైన తక్షణ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యూబ్ డయాగ్నస్టిక్ డివైసెస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు త్వరితగతిన వైద్య పరీక్షలు మిర్వహణకు 50 హెల్త్ క్యూబ్ డయాగ్నస్టిక్ డివైసెస్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కిట్ల ద్వారా 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తక్షణ రోగ నిర్ధారణ పరీక్షలు చేసి సమయానికి చికిత్స అందించడానికి ఈ పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీడీఎల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సిఎస్ఆర్ నిధులతో ప్రధాన ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, సాంకేతిక నిపుణులు ఏర్పాటు వంటి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం 203 పోస్టులను మంజూరు చేయించగా, రూ.14 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పల్లె దవాఖానాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని, అసంపూర్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సిఎస్ఆర్, డిఎంఎఫ్‌టిఎస్‌డిఎఫ్ నిధులను వైద్య రంగ అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా వైద్యాధికారులు సిబ్బంది కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి సబ్ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కిట్ల ద్వారా 16 రకాల వైద్య పరీక్షలను అక్కడికక్కడే నిర్వహించవచ్చని అన్నారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పరీక్షల కోసం నమూనాలను జిల్లా కేంద్రంలోని టి హబ్ కు పంపించాల్సి వచ్చేదని, ఇప్పుడు అక్కడే పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ప్రోగ్రాం అధికారి శ్రీదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏ ఎన్ ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు తదితరులు పాల్గొన్నారు.
*ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అందరి సహకారం అవసరం*
*విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులు,పూర్వ విద్యార్థుల సమావేశం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ప్రజాప్రతినిధులు,పేరెంట్స్,టీచర్స్,పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి పట్టణ వార్డు కౌన్సిలర్లు,సమీప గ్రామాల సర్పంచులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పూర్వ విద్యార్థులు హాజరై కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,అనుభవజ్ఞులైన అధ్యాపకులు,ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఒక వ్యక్తి వద్ద ఉన్న ఆస్తిని దొంగలించవచ్చేమో గానీ విద్యను ఎవరూ దొంగలించలేరని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.కళాశాల అభివృద్ధికి అధ్యాపక బృందం చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు హాజరైన ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులను ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య,స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ఎలిషాల అశోక్,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ జి.పావని,కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి.రాజేశ్వర్ కుమార్,అధ్యాపకులు డాక్టర్ భీమ్రావు,బి.మహేంద్రరావు,డాక్టర్.ఆడెపు రమేష్,డాక్టర్ కల్పన,డాక్టర్ కే.జగదీష్ బాబు,ఎం.సమ్మయ్య,ఆర్.ఈశ్వరయ్య,ఎస్.రాజశ్రీ,డాక్టర్ డి.సంజయ్ కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహితులు అంటే సుఖాల్లో పాలుపంచుకునే వాళ్ళు కాదని, కష్టాల్లో సైతం తోడుండే వాళ్ళని 1992- 93 వ సంవత్సరంలో రామకృష్ణాపూర్ పట్టణం లో గల జడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాల లో 10 వ తరగతి విద్యనభ్యసించిన 36 మంది స్నేహితులు నిరూపించారు. అమ్మతోపాటు దిగినభ్యసించిన బాల్యమిత్రుడు వడ్డేపల్లి రాజనర్సయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడనే విషయాన్ని తెలుసుకొని మిత్రులంతా కలిసి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి స్నేహం ఎంత గొప్పదో తెలియజేశారు. తమతో పాటు చదువుకున్న రాజ నరసయ్య ఒంటరివాడు కాదని మేమంతా తన వెంట ఉంటామని తను కోలుకునే వరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. త్వరగా మిత్రుడు కోలుకొని ఇంటికి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు .
-మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో కాలేయం (లివర్ )ఒకటని, ఇది శరీరంలో అనేక ముఖ్యమైన జీవక్రీయలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుందని, మనం తీసుకునే ఆహారం, నీరు, ఔషధాలు వంటి అన్ని పదార్థాలను శుద్ధి చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఇది 500లకు పైగా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుందని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత అన్నారు. గురువారం మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేయానికి ప్రత్యేకంగా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వలన తీవ్రమైన నష్టం కలగవచ్చని, ముఖ్యంగా కాలేయం దెబ్బతిన్న ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని నిశ్శబ్దహంతకుడు అని పిలుస్తారని తెలిపారు. ప్రస్తుతం కాలేయ వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని, మద్య సేవనం మాత్రమే కాకుండా అధిక కొవ్వు వున్న ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి కారణంగా “నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ “ కేసులు కూడా ఘననీయంగా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ప్రతిరోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలని, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలు, చక్కెర పానీయాలు తగ్గించాలన్నారు. మద్యపానం పూర్తిగా నివారించాలని, తగినంత నీరు తాగాలని, ఏడాదికి ఒకసారి కాలేయ పనితీరు పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెపటైటిస్ బి వంటి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని, “మంచి అలవాట్లు -పటిష్టమైన కాలేయం”అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలన్నారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో పౌరుల ఆరోగ్యమే కీలకమని, కాలేయము మన శరీరంలోని నిశ్శబ్ద ఇంజన్ వంటిదని, అది ఎంత స్మూత్ గా రన్ అయితే, మన జీవితమంతా కాలం సాఫీగా సాగుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మన కాలేయాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేద్దాం. కాలేయ రక్షణ జీవన రక్ష అని గుర్తిద్దామన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.