మహాలక్ష్మి (మెప్మా) ద్వారా ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటు..

మహాలక్ష్మి (మెప్మా) ద్వారా ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్దూర్ లో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య (మెప్మా) ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తనాల దుకాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కొరకు ఎరువులు మరియు విత్తనాల దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సంఘాల అభివృద్ధి కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే.మహేందర్ రెడ్డి ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి మహిళలకు అండగా ఉంటూ నిరుపేద కుటుంబాలను ధనవంతులను చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రత్యేకంగా పేదలకు రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత రవాణా సదుపాయం మహిళలకు అలాగే ఎరువులు విత్తనాలు దుకాణం పెద్దూరు ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆఫజల్ బేగం, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వరూప రెడ్డి మహిళా సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు రైతులు తదితరులు రావడం జరిగింది.

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన..

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని వినతి…

జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో అంతోనీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కళాశాలలో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అదనపు గదులతో పాటు ప్రహరి గోడ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అర్జున్, నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్ జులై 30(నేటి ధాత్రి )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మ మహాదేవపూర్ కాళేశ్వరం గ్రామంలో మంగళవారం రోజున కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నాగుల తులసి, కోల శాన్వి, గంట హరిచందన, రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ శాలువాతో సన్మానించారు జూలై 1న హైదరాబాదు లో హంకి పేట క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మన జిల్లా నుండి విద్యార్థులు ఎంపిక కావడంపట్ల ఆయనవిద్యార్థులను అభినందించారు

అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన..

అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన పి.కలెక్టర్ ప్రావిణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి కొహీర్ మండల పోతిరెడ్డిపల్లి గ్ గ్రామంలో డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు.ఈపాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు.అనంతరం ఒక  రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓ కు కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు.

అడిషనల్ కలెక్టర్కు గ్రామస్తుల వినతి….

అడిషనల్ కలెక్టర్కు గ్రామస్తుల వినతి

నిజాంపేట: నేటి ధాత్రి

ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు బుధవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా నలుగురు టీచర్లు బోధన నిర్వహిస్తున్నారని డిప్యూటేషన్ పై ఇద్దరు టీచర్లను పంపిస్తే తమ పిల్లల చదువులు అర్థవంతం అవుతాయని డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వడ్ల ప్రవీణ్, కోమ్మిడి జీవన్ రెడ్డి, రాజు రెడ్డి, సౌడ స్వామి లు ఉన్నారు.

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి..

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతి పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T154633.723-1.wav?_=1

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 16 పి.హెచ్.సి సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలలో 3 పి.హెచ్.సి లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని,మరో పి.హెచ్.సి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, గంభీర్ రావు పేట రూఫ్ దశలో ఉందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ సెంటర్ల మంజూరు కాగా 5 సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండల తహసిల్దార్ లతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించారు. పి.సెచ్.సి సబ్ సెంటర్ నిర్మాణ పనులు అదేవిధంగా గంభీరావుపేట్ పిహెచ్సి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పి.హెచ్.సి, సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు అందుబాటులో పెట్టిందని, పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చోరువతో పని చేయాలని అన్నారు. అగ్రహారం, తిప్పపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఈ ఈ పి ఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్..

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని కార్మికుల త్యాగాలకు ప్రతిబింబమని, భావితరాలకు తెలిసే విధంగా జరుపుకుంటున్నామని తెలిపారు.1999 లో నావీ, ఎయిర్ ఫోర్స్,ఆర్మీ సమిష్టిగా పోరాడి మన దేశ సరిహద్దులను కాపాడారని,ఆ సమయంలో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని తెలిపారు.భారత దేశాన్ని సరిహద్దులలో సైనికులు 365 రోజులు 24 గంటలు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారని,దేశ ప్రజల రక్షణ కోసం అందరినీ వదిలి దేశ సేవలో ఉన్నారని తెలిపారు.నిరంతరం విధులు నిర్వహిస్తున్న సైనికులకు గౌరవంగా కార్గిల్ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని తెలిపారు.మాజీ సైనికులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,పోలీస్ అధికారులు,ఎన్.సి.సి. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల..

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Collector Dr. Satya Sarada

విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన..

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల విషయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. కాంపౌండ్ వాల్, మౌలిక సదుపాయాలపై అధికారులను ఆదేశించారు.

ప్రజలకు వైద్య సేవలపై నమ్మకం కలిగించాలి.

ప్రజలకు వైద్య సేవలపై నమ్మకం కలిగించాలి.

24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ, ఇన్‌పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్‌లో రక్త పరీక్షల పరికరాలు, శస్త్రచికిత్స గదులను ఆయన పరిశీలించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు వైద్యసేవలపై నమ్మకం కలిగించాలని వివరించారు.
ఆసుపత్రి చాలా బావుందని, రోజుకు ఎంత మంది ప్రజలు వైద్య సేవలకు వస్తున్నారని, రోజుకు ఎంతమంది వైద్యసేవలకు వస్తున్నారని అడుగగా 150 నుండి 200 మంది వరకు వస్తున్నారని ఓపి.సేవలు పెంచాలని వైద్యులను ఆదేశించారు. వైద్య సేవలకు ఎలాంటి వ్యాధితో బాధపడే వారు వస్తున్నారని వైద్యాదికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్ని సమయాలలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పరి శుభ్రత, సదుపాయాలు, వైద్య సేవలు మెరుగుగా ఉన్నాయని, ఎందుకు వైద్య సేవలకు ప్రజలు రావడం లేదని అన్నారు. అయితే ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని సూచించారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉండాలని, తప్పనిసరి వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించాలని తెలిపారు. అలాగే పాము, కుక్క కాటు వంటి ప్రమాదాల నివారణకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ అన్నివేళల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రసూతి, చిన్న పిల్లల వైద్యులు నియామకం కొరకు చర్యలు తీసుకుంటామని, మీ మిత్రులు కానీ మీకు తెలిసిన వైద్యులు ఉంటే నియామకానికి చర్యలు తీసుకుంటామని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వాలియా నాయక్, డా శ్రీకాంత్, తహసీల్దార్ ఇమామ్ బాషా తదితరులు. పాల్గొన్నారు.

దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ.

దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం
భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ 2025 ను సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో మహిళా శిశు దివ్యాన్గుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ నిధులు, పథకాల ద్వారా వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. దివ్యాన్ గులల్లోని సృజనాత్మకత ను వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దివ్యాన్గుల పధకాలు ప్రతి మారుమూల గ్రామ స్థాయికి చేర్చాలని, దివ్యాన్గులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కపిస్తే వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తారని తెలిపారు.
అధికారులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. దివ్యాన్గుల సంక్షేమం సంక్షేమ శాఖ బాధ్యతని, సంక్షేమం, సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాన్గులకు పాఠశాలల్లో విద్యాబ్యాసం, వృత్తి నైపుణ్యం, భవిత కేంద్రాలు నిర్వహణ, వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నేను మీకు అభయం ఇస్తున్నాను దివ్యాన్గులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి లో దివ్యాన్గులను భాగస్వాములను చేస్తూ చేయూతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధిమాంద్యంతో బాధపడే దివ్యాంగుల సాధికారత కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చవల్ డిసేబులిటీఎస్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఎన్‌జీవోల స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ఉద్యోగ మేళా కోసం స్టాల్ ఏర్పాటు చేసింది. అలీం కో, ఐజినిష్డ్
సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అనంతరం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు పరిశీలించి దివ్యాంగులతో ప్రత్యేకంగా ముఖాముఖీ మాట్లాడారు. అన్ని స్టాళ్లను సందర్శించి, దివ్యాన్గులు వేసిన పెయింటింగ్ కొనుగోలు చేసి నగదు చెల్లించి అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులుప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
ఈ కార్యక్రమంలో 600 కంటే ఎక్కువ దివ్యాంగులు, 300 IERPs, ఎన్‌జీవోలు తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ డా. బి.వి. రామ్ కుమార్ దివ్యాంగులకు సౌకర్యాల కల్పన, అవసరమైన సేవల సమన్వయం కోసం ఆయన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య.

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం మండలం చిలేపల్లి, బర్దిపూర్, చిలేపల్లి తాండ, ఎల్గోయి నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించారు. నిమ్జ్ భూసేకరణ పరిధిలోకి వచ్చే వివరాల మ్యాపును ద్వారా పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన భూమి, మిగిలిన భూమి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఉగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు వేసిన రోడ్డును పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి, తహసిల్దార్ తిరుమలరావు, సర్వేర్లు, నర్సింలు, లాల్ సింగ్, నిమ్ అధికారులు ఉన్నారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు కమిటీ

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో ఏడాదిపాటు కోడి గుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.కోడిగుడ్ల సరఫరా టెండర్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ లో ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ వసతి గృహాల నుండి కోడిగుడ్డుల ఇండెంట్ వివరాలు జిల్లా కలెక్టరేట్ కు సమర్పించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి నేరుగా సప్లయర్ కు అవసరమైన కోడిగుడ్ల ఇండెంట్ ను సమర్పించడం జరుగుతుందని, గత సంవత్సరం అడ్మిషన్లకు అదనముగా 10% విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోడిగుడ్డు బరువు 45 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉండాలని, ప్రతి మాసము రెండుసార్లు సప్లై చేయాలని, అర్హత, అనుభవం వారికి నిబంధనల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులు అందజేస్తామని, కోడిగుడ్ల సరఫరాలో ఆలస్యం చేస్తే పెనాల్టీలు విధిస్తామని కలెక్టర్ తెలిపారు. టెండర్ల విధానం, టెండర్లు ఆహ్వానం, తెరవడం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఆయా విద్యాలయాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

భూ భారతి  రెవిన్యూ సదస్సులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా  కలెక్టర్ డాక్టర్ సత్య శారద తహసీల్దార్ లను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో మండల తహసీల్దార్ లతో భూ భారతి, రెవిన్యూ సదస్సు లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు.భూభారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ సత్వరమే  వాటిని ఆన్లైన్లో  అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి  అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.

అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు.దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్ ఓ విజయలక్ష్మి,ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి , కలెక్టరేట్ ఏఓ విశ్వ ప్రసాద్, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం.నేటిధాత్రి

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార
ఎరువుల సరఫరా పై పరిశీలించిన కలెక్టర్ పాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసినారు తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంట కు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవలెనని అధికారులకు ఆదేశించిన
ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించాడు మరియు కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.

District Collector Dr. Satya Sarada.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి..

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై  సమీక్షించిన కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. లక్ష్యం వైపు పయనించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్
సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డీ.పీ.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్  సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా సంస్థల వద్ద డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.


అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.
ఈ సందర్భంగా అడిషనల్  ఎస్పీ చంద్రయ్య అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా  విద్యార్థులకు , యువతకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.సమావేశంలో డీ.ఎం.హెచ్.ఓ రజిత, డీఏఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Collector Sandeep Kumar Jha

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Collector Sandeep Kumar Jha

కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version