నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ లో డిప్యూటీ మేయర్ కు చాంబర్ కేటాయించడం సిగ్గుచేటు.

నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ లో డిప్యూటీ మేయర్ కు చాంబర్ కేటాయించడం సిగ్గుచేటు.

బిఆర్ఎస్ విధానాలు బిజెపి అవలంబిస్తుంది-సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

https://youtu.be/ooGYBXQUVCQ?si=-goZNUdgZUHhhhjG

కరీంనగర్ నగర పాలక సంస్థలో మార్పు తెస్తామని చెప్పినటువంటి బిజెపి రెండు నెలలు కాకముందే బిఆర్ఎస్ అవలంబించినట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ డిప్యూటీ మేయర్ ఛాంబర్ ప్రారంభించుకోవడం చూస్తుంటే అవినీతికి బిజెపి కూడా ఏంతక్కువ కాదని నిరూపించుకుంటుందని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్సులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు విమర్శించారు. నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. గతంలో మున్సిపల్ లో డిప్యూటీ మేయర్ ఛాంబర్ ను ఏర్పాటు చేస్తే బిజెపి పార్టీతీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలు చేసిందని కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గత పాలనలో అవలంబించిన విధానాలే బిజెపి కూడా అవలంబించడం దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర మంత్రిని అడ్డుపెట్టుకొని డిప్యూటీ మేయర్ చాంబర్ ఏర్పాటు చేశారని ఇప్పుడు కేంద్రమంత్రినీ అడ్డుపెట్టుకొని ఏర్పాటు చేశారని వారికి వీరికి ఏమీ తేడా లేదని అధికార దాహం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రథమ పౌరుడైన మేయర్ మాత్రమే చాంబర్ ఉండాలని డిప్యూటీ మేయర్ కు ఛాంబర్ ఉండాలని ఏనిబంధనలో లేదని కానీ ప్రజాధనం కోల్లగొట్టడానికి బిజెపి నిబంధనలను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడాలని చూస్తుందని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై, డిప్యూటీ మేయర్ చాంబర్ ఏర్పాటుపై సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

కరీంనగర్ టెండర్ నిలిపివేతపై సిపిఐ విమర్శ

కమిషన్ల కోసమే టెండర్ల నిలిపివేత

ఎన్నికల ముందు టెండర్లకు పిలిచిన యాభై కోట్ల నిధుల పనులను వెంటనే ప్రారంభించాలి-సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గం విలీన గ్రామాలలో అభివృద్ధి పనుల నిమిత్తం యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని వాటి టెండర్లను కూడా పిలవగా ఆన్లైన్లో టెండర్లు వేశారని అప్పుడు వేసిన టెండర్లను ఇప్పటివరకు ఓపెన్ చేయకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని దురుద్దేశంతో కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం ప్రయత్నించడం సిగ్గుచేటని ఇది పూర్తిగా కమిషన్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్సులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజులు విమర్శించారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి,న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు మాట్లాడుతూ గత నగరపాలక సంస్థకు అర్బన్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులనుంచి యాభై కోట్ల రూపాయలు మంజూరయని ఈనిధులతో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఉపయోగించాలని నగరపాలక సంస్థ పరిధిలో ఎనభై ఏడు అభివృద్ధి పనులను చేపట్టేందుకు గత సంవత్సరం సిడిఎంఏ పరిపాలన అనుమతి ఇచ్చిందని ఎనభై ఏడు పనుల్లో ఇరవై ఐదు పనులకు కాంట్రాక్టర్ బిడ్ దాఖలు చేయలేదని మిగిలిన అరవై రెండు పనుల్లో కొన్ని పనులకు సింగిల్ టెండర్లు దాఖలు ఎలా అయ్యాయని నిబంధనల మేరకు వచ్చిన టెండర్లకు ఖరారు చేసి ఎల్ఓఏ ఇచ్చి పనులు ప్రారంభించాలని మిగిలిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని కానీ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం మళ్లీ టెండర్లను నూతనంగా పిలవాలని చూస్తుందని ఇది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు నీతివంతమైన పాలన అందజేస్తామని గొప్పలు చెప్పినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదర్శ పాలన అందిస్తామని చెప్తుంటే మున్సిపల్ పాలకవర్గం మాత్రం కమిషన్ల కోసం కకృతిపడి పిలిచిన టెండర్లను రద్దుచేసి తిరిగి టెండర్ ప్రక్రియను పిలవాలని ఆలోచించడం సిగ్గుచేటన్నారు. కమిషన్ల కోసం నగర అభివృద్ధిని కుంటి పడేయడం బాధాకరం. నగరపాలక సంస్థలొ రాజకీయ జోక్యంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని విలీన డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నందున అధికారులు ఈవిషయంలో త్వరగా నిర్ణయం తీసుకుని పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం కోరం లేక వాయిదా పడింది. నిర్దేశించిన సమయానికి మునిసిపాలిటీ కార్యాలయానికి 22 మంది కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం వాయిదా వేస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు. నేడు మళ్లీ 11 గంటల ప్రాంతంలో కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలు ఉంటాయని, కౌన్సిలర్ లు అందరూ సకాలంలో విచ్చేసి ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మార్వో కోరారు. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణుల పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిఆర్ఎస్,సిపిఐ కలిపి 14 కౌన్సిలర్ సీట్లు గెలుపొందగా కౌన్సిలర్లను ప్రమాణస్వీకారానికి తీసుకొస్తున్న సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రావడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య లను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని గమనించిన పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతంలో అల్లరి సద్దుమణిగింది. నేడు ఎన్నిక జరిగే సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కు సమాచారం అందిస్తామని ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు.

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం

సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని 30 వార్డులలో కోతులను కుక్కలను అరికట్టడంలో అధికారులకు విఫలం చెందారని సిపిఐ జిల్లా నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, గురీజపెళ్లి సుధాకర్ రెడ్డి, కోరిమి సుగుణ లు అన్నారు. కోతుల కుక్కల బెడదను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కోతులు,కుక్కల సమస్య విపరీతంగా ఉంద ని వాటిని నివారించడంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. పట్టణ కేంద్రంలో 30 వార్డులలో కోతులు చాలా మంది మహిళలను,పిల్లలను తీవ్రంగా ఎన్నోసార్లు గాయపర్చడం జరిగిందన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. పట్టణం లోని హనుమాన్ నగర్ లో 80లక్షల రూపాయలతో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వాటి నివారణకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిర్వహించకపోవడం వల్ల కోతులు,కుక్కల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. కోతులు కుక్కల పట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు నిధులను దుర్వినియోగం చేస్తూన్నారని వారు ఆరోపించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం కలిసి కోతుల పట్టే బోన్ లను తీసుకొచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటిని వాడకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే కోతుల కుక్కల బెడదను అరికట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కువినతిపత్రం ఇవ్వడం కోసమే అధికారులు నిరాకరించటంతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో సిపిఐ నాయకులు ఆఫీస్ గేట్ ను నెట్టుకొని లోపటికి పోయే ప్రయత్నం చేయగా పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నూకల చంద్రమౌళి,మాతంగి రామ్ చందర్,పల్లె కృష్ణ,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, సదానందం,గణగల జోగేష్ ,లోకిని రమేష్ ,గంప రాజు,పెదమాముల్ సంధ్య శ్రీలత స్వప్న సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version