దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ….

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.

పోత్కపల్లి గంజాయి నిందితుడు అరెస్ట్.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్..

4.098 గ్రాముల ఎండు గంజాయి,కారు,మొబైల్ ఫోన్ స్వాదీనం..

ఓదెల(పెద్దపల్లిజిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను , స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ అనే 20 ఏళ్ల యువకుడు డ్రైవర్, టైల్స్ వర్క్ పై చేస్తూ డబ్బులు సరిపోక గంజాయి వ్యాపారం వైపు మళ్లాడని ఐ విచారణలో తేలింది. అతడి వద్ద నుంచి 4.098 కిలోల ఎండు గంజాయి, విలువ రూ. 2,04,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మొబైల్ క ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి స్నేహితులు బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని , త్వరలోనే అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోత్కపల్లి శివారులోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ -్య హాల్ ముందు వాహన తనిఖీలు జరుగుతుండగా ఎస్ఐ దీకొండ న్న రమేష్ ఒక కారు అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి ఆపగా
నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన మహేందర్, ఆకాష్ తో పరిచయం పెంచుకున్న అరుణ్, వీరితో కలిసి ఓడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాలలో విద్యార్థులు, ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఒక కిలో గంజాయిని ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి, స్థానికంగా యాభై వేల రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో తెలిసింది. గంజాయి పండించినా, తరలించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సీఐ సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఏసీపీ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ పి. కరుణాకర్ పర్యవేక్షణలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు వివరించారు.

గంజాయి మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు.!

గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన

ఎస్ ఐ జి నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో నిషేదిత గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ముత్తారం ఎస్ ఐ జి నరేష్ మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి అదేవిదంగా కొత్తగా పెళ్లి కార్డ్స్ ఏ పి కే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్ , సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల గాని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని
కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం చేడు అలవాటులకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుందని
సైబర్ నేరాల పట్ల, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ జి నరేష్ తెలిపారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version