మహా లక్ష్మి అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల జె.కె కన్స్ట్రక్షన్ లో శ్రీ లక్ష్మీ అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న శాసనసభ్యులు సభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి ఆత్మ చైర్మన్ విజయకుమార్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ లు వెంకటేశం నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్ తదితరులు.
జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయా మండల ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ గ్రామాలలో పత్తి ఏరేందుకు కూలీలు ఇతర నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా రు. వారు సైతం అనుకున్న స్థాయిలో దొరకకపోవ డంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వలస కూలీలతో పనులు చేయించడం వల్ల వారికి స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసి ఇతరత్రా సౌకర్యాలు ముందుగానే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో పత్తి రైతులకు ఖర్చులు తడిసిమోపడవుతున్నా యి. ఏటా జిల్లాలో పత్తి పంట సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కూలీల కొరత వల్ల కొందరు రైతులు పత్తి జోలికి వెళ్లడం లేదు. ఓ వైపు కూలీల సమస్యలు మరోవైపు వర్షాలు, రోజు కురుస్తున్న వర్షాలతో మునిగిన పంటలు ఇవన్నీ పత్తి రైతుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పత్తి పంటను నమ్ముకు న్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వలస కూలీల ఆర్థిక భారాన్ని భరించడం తప్ప చేసేదేమీలేదు..
అడ్వాన్స్ ఇస్తేనే..
పత్తి ఏరేందుకు వలస కూలీలకు అడ్వాన్స్ ఇస్తేనే పనులకు వస్తున్నారు. ఏపీ నుంచి అనంతపురం, శ్రీకాకుళం, కర్నాటక ప్రాంతం నుంచి వలస కూలీలను తీసుకొస్తున్నారు. వారికి గుడారాలు, నిత్యావసర సరుకులకు అవసరమైన డబ్బు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఒప్పందం ప్రకారం కూలీలు పనులకు వస్తున్నారు. ఈ భారం అంతా రైతులపై పడడంతో పాటు దిగుబడి తగ్గి గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
◆:- మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్,మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగి పాడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఝరాసంగం మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. వర్షం ఆగకపోవడంతో పంటల తేమ తగ్గక, కోతకు వచ్చిన పంట కూడా చెడిపోతోందని, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యం కూడా తడిసి నాణ్యత కోల్పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ అధికారులు పంటల నష్టం వివరాలు సేకరిస్తున్నప్పటికీ, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాసంగి పంటల పెట్టుబడికి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, పంటల నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని, విత్తనాలు మరియు ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ న్యాల్కల్ మోగుడంపల్లి కోహిర్ ఝరాసంగం ఉమ్మడి మండలంలో పెద్ద ఎత్తున పత్తి పంటలు దెబ్బతిన్నాయి వ్యయ ప్రయాసలకు ఓర్చి వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతు లకు పంటలు చేతికి వచ్చే దశలో ప్రకృతి వికృత రూపం దాల్చి కాయ కష్టం మొత్తాన్ని ఉడ్చేసింది. దీంతో ఉమ్మడి మండలంలో సుమారు 50 కోట్ల కు పైగా నష్టం వాటిల్లింది ఉమ్మడి మండలంలో ప్రధాన పంటలైన వారి పత్తి
ఈ రెండు పంటలే ప్రధాన పంటలు కావడంతో రైతన్నలు పంట సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి భూములను కౌలుకు తీసుకొని అందులో పంటలను సాగు చేసినప్పటికీ పంటలు చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వరుణుడు తమ ప్రతాపం చూపడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అటు పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులకు కంటినిండా నిద్రలేక రైతులు తీవ్ర అస్తవ్యస్తాల కు గురవుతున్నారు. పత్తి చేలల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పత్తి పంట రంగు మారిపోయింది అంతేకాకుండా పత్తి చెట్టుకు కాసిన కాయల్లో నుంచి సగం కాయలు పూర్తిగా కుళ్ళి పోయాయి ఉన్న అరకొర కాయలు కూడా తెలుపు రంగులో ఉండే పత్తి నలుపు రంగులోకి మారిపోయింది.
రంగు మారిన పత్తిని కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు దీంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాక పోవడం ఒక ఎత్తు అయితే పంట సాగు కోసం తెచ్చిన అప్పులు రెట్టింపు కావడంతో ఆ అప్పులను ఎలా తీర్చాలో రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది లేనియెడల తమకు మరణమే శరణ్యమని పలు గ్రామాల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మరోవైపు కాస్తో కూస్తో కొద్దిపాటి వరి పొలం ఉండడంతో ఆ వరి పంట కూడా రేపో మాపో చేతికి వస్తుందనుకున్న సమయంలో అధిక వర్షాల వల్ల అట్టి వరి పంట గింజలు నేలరాలిపోయాయి, మరికొంతమంది వరి పొలాలు పూర్తిగా నీడ మునిగిపోయి, అట్టి నీటిలోనే వరి పంట కుళ్ళిపోయింది దీంతో ఆయా గ్రామాల రైతులు తమ కళ్ళముందే తమ పంటలు ఇలా చెడిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు పడ్డారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు లేనియెడల పురుగుల మందులే పాయాసం అనుకోని ఆత్మహత్యలకు పాల్పడడం ఖాయమని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి నష్టపోయిన పంటలను గుర్తించి అట్టి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గము (సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండలంలో మండల బీసీ కుల సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయం పై చేస్తున కుట్రల పై చర్చించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంధుకు , పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు తెలిపారు. బిసి లంగా ఐక్యం అయ్యి రాబోవు ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో బిసి అభ్యర్థులనే గెలిపించుకోవాలి. ఈ కార్యక్రమంలో .పెద్దగొల్ల నారాయణ,కొండాపురం నర్సిములు, శంకర్ సాగర, నారాయణ బీసీ సంఘం ప్రతినిధి, వాడే శేఖర్, ఆర్.ఈశ్వర్, గొల్ల దశరత్ శ్రీకాంత్ ముదిరాజ్, మాదిరే వీరేశం, గోవింద్ గుండు, వాడే చెన్నూ, బాయిని సుభాష్, నర్సింలు గుడిసె, శ్రీనివాస్ గొల్ల, సుభాష్ సతోలి, మంగలి రాములు, సిద్దు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొనారు
వివాహ వేడుక లో వేడుక లో పాల్గొన్న రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మొగుడంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ తాజుద్దీన్ గారి కుమార్తె వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు వెంకట్ రెడ్డి మొహమ్మద్ కుతుబుద్దీన్ మహమ్మద్ తాజోద్దీన్ సుభాష్ సందీప్ తదితరులు ఉన్నారు,
మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్ నుండి చించోలి వయా మొగుడంపల్లి మండల మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అంతర్ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు గత రెండు నెలల క్రితం హోతి బి గ్రామం గోవింద్ పూర్ గ్రామం మద్యన కల్వర్టు పూర్తిగా ద్వంసం అయిపోయింది, దింతో వాహనదారులకు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీళ్లు ఎక్కడిక్కడనే ఆగిపోవడం జరిగింది కల్వర్టు పాడైపోయినందున నీరంత రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఆర్.అండ్.బి డీఈఈ కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి.అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.
దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మిస్తే బాగుటుంది,
ఆర్.అండ్.బి అధికారుల నిర్లక్ష్యం…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
ఆర్.అండ్.బి డీఈఈ కి అక్కడి నుండే సమస్యను వివరించగా కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు అని నరోత్తం అన్నారు.పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి
వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మించాలని డిమాండ్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం అన్నారు.,
మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు, గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..
సీఎం సహాయ నిధి: దేవి బాయ్కు రూ. 60,000 చెక్కు పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం మోతిమాత మందిరం దగ్గర నివాసముంటున్న దేవి బాయ్ ధన్సింగ్ రాథోడ్ కు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.60,000 విలువైన చెక్కును AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ పవర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కాపాడటం, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి వరప్రసాదమని పేర్కొన్నారు.
ఖాన్ జమాల్‌పూర్‌లో శివాజీ మహారాజ్ నిర్మించిన తుల్జా భవానీ ఆలయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తుల్జా భవానీ మాత గురించి మాట్లాడేటప్పుడు, మొదట గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలోని ప్రఖ్యాత తుల్-జాపూర్ భవానీ మాత ఆలయం. అయినప్పటికీ, సంగారెడ్డి జిల్లా, మొగుడంపల్లి మండలం, భవానీ అమ్మపల్లి, ఖాన్ జమాల్‌పూర్‌లో ఉన్న మరొక పురాతన ఆలయం నిశ్శబ్దంగా చరిత్ర మరియు భక్తితో ప్రతిధ్వనిస్తుంది. ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వయంగా స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి. దాదాపు 500 సంవత్సరాల క్రితం, శివాజీ మహారాజ్ ఒక ముఖ్యమైన సైనిక ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఖాన్ జమాల్‌పూర్‌లో ఆశ్రయం పొందారని నమ్ముతారు.
విజయం సాధిస్తే భవానీ మాతకు ఆలయాన్ని నిర్మిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాట నిలబెట్టుకున్నట్లు, ఖాన్ జమాల్‌పూర్‌లోని భవానీ మాత ఆలయం ఆయన విజయం తర్వాత నిర్మించబడిందని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూనే ఉంది, ముఖ్యంగా పౌర్ణమి రోజులలో. దూర ప్రాంతాల నుండి యాత్రికులు ఒక రోజు ముందుగానే వస్తారు మరియు స్థానిక దాతలు వారికి ఆహారాన్ని అందిస్తారు. మరుసటి రోజు ఉదయం, భక్తులు తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు దేవతను భక్తితో పూజిస్తారు.
వాస్తుపరంగా, ఆలయం పురాతన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది మరియు దాని పునాదులపై దృఢంగా నిలుస్తుంది. నిర్మాణం చుట్టూ ఒక కందకం ఉంది మరియు ఆలయానికి ఆనుకుని ఉన్న మెట్ల క్రింద ఒక ఆసక్తికరమైన సొరంగం ఉంది. గ్రామస్తుల ప్రకారం, సొరంగం యొక్క లోతు ఆలయ ఎత్తుకు అనుగుణంగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పునరుద్ధరణ పనుల సమయంలో, మెట్లు తొలగించబడినప్పుడు, గదులు మరియు గదులతో పాటు ఈ భూగర్భ మార్గం కనుగొనబడింది. విజయోత్సాహంతో ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహాలు గుర్రంపై లేదా సింహాసనంపై కూర్చున్న భంగిమలు అంతటా కనిపిస్తాయి. ఆసక్తికరంగా, శివాజీ మహారాజ్‌కు అంకితం చేయబడిన ప్రత్యేక ఆలయం కూడా ప్రాంగణంలో ఉంది. గ్రామంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న తవ్వకాల్లో మరిన్ని పురాతన నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతం యొక్క గొప్ప వారసత్వాన్ని వెల్లడించడానికి సమగ్ర అన్వేషణలు చేపట్టాలని గ్రామస్తులు పురావస్తు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు దీనిని చాలావరకు విస్మరించారు. విజయదశమి నాడు, ఆలయం ఉత్సాహభరితమైన జాతరతో సజీవంగా ఉంటుంది. గ్రామస్తులు ఉత్సవాలను నిర్వహించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, వేడుకలు దేవత మరియు చారిత్రక రెండింటినీ గౌరవించేలా చూసుకుంటారు.భక్తులు తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు ఉత్సాహంగా ఆలయాన్ని అలంకరించారు. వాస్తుపరంగా, ఈ ఆలయం పురాతన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది మరియు దాని పునాదులపై దృఢంగా నిలుస్తుంది. ఈ నిర్మాణం చుట్టూ ఒక కందకం ఉంది మరియు ఆలయానికి ఆనుకుని ఉన్న మెట్ల క్రింద ఒక ఆసక్తికరమైన సొరంగం ఉంది. గ్రామస్తుల ప్రకారం, సొరంగం యొక్క లోతు ఆలయ ఎత్తుకు అనుగుణంగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పునరుద్ధరణ పనుల సమయంలో, మెట్లు తొలగించబడినప్పుడు, గదులు మరియు గదులతో పాటు ఈ భూగర్భ మార్గం కనుగొనబడింది. విజయవంతమైన శివాజీ మహారాజ్ విగ్రహాలు గుర్రంపై లేదా సింహాసనంపై కూర్చున్న భంగిమలు అంతటా కనిపిస్తాయి. ఆసక్తికరంగా, శివాజీ మహారాజ్‌కు అంకితం చేయబడిన ప్రత్యేక ఆలయం కూడా ప్రాంగణంలో ఉంది.గ్రామంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న తవ్వకాలలో మరిన్ని పురాతన నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతం యొక్క గొప్ప వారసత్వాన్ని వెల్లడించడానికి సమగ్ర అన్వేషణలు చేపట్టాలని గ్రామస్తులు పురావస్తు శాఖను కోరుతున్నారు. ఈ స్థలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు దీనిని ఎక్కువగా విస్మరించారు.విజయదశమి నాడు, ఆలయం ఉత్సాహభరితమైన ఉత్సవంతో సజీవంగా ఉంటుంది. గ్రామస్తులు ఉత్సవాలను నిర్వహించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, వేడుకలు దేవత మరియు శివాజీ మహారాజ్ యొక్క చారిత్రక వారసత్వాన్ని గౌరవించేలా చూసుకుంటారు.
ఆన్లైన్ ఆఫర్లు, ఏపీకే ఫైల్స్ లాంటి నకిలీ లింక్స్ ఓపెన్ చేయవద్దు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు,
◆:- సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధం
◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలైన ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్ పంపి ఖాతాలను ఖాళీ చేయడం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా నకిలీ కేవైసీ ఫైల్స్ పంపించడం వంటి పద్ధతులు మోసగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తం
1. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్/డిస్కౌంట్ లింక్స్ ఎప్పటికీ ఓపెన్ చేయవద్దు.
2. ఇలాంటి లింక్స్ లేదా ఫైల్స్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
3. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే ఏవైనా APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి.
⚠️ మోసపూరిత కేవైసీ ఫైల్స్ ఉదాహరణలు
ఎస్ బి ఐ ఏపీకే, కేవైసీ. ఏపీకే లేదా ఏ ఇతర ఏపీకే ఫైల్, ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ పూర్తిగా మోసగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. ఫోన్‌లో ఉన్న డేటా, ఫోటోలు, కాంటాక్ట్స్ దొంగిలించబడతాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దోచుకుంటారు.
ఎవరైనా మోసపూరిత లింక్స్ లేదా కేవైసీ ఫైల్స్ గమనించినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) కు కాల్ చేయండి,లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఇలాంటి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త.
ఆన్లైన్ ఆఫర్లు, ఏపీకే ఫైల్స్ లాంటి నకిలీ లింక్స్ ఓపెన్ చేయవద్దు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు,
◆:- సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధం
◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలైన ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్ పంపి ఖాతాలను ఖాళీ చేయడం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా నకిలీ APK ఫైల్స్ పంపించడం వంటి పద్ధతులు మోసగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తం
1. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్/డిస్కౌంట్ లింక్స్ ఎప్పటికీ ఓపెన్ చేయవద్దు.
2. ఇలాంటి లింక్స్ లేదా ఫైల్స్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
3. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే ఏవైనా APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి.
⚠️ మోసపూరిత APK ఫైల్స్ ఉదాహరణలు
Traffic challan.APK, Aadhar.APK, SBI.APK, SBI Rewards. APK, PM Kisan.APK, Union Bank.APK, CSE.APK, Statebank.APK, eKYC.APK లేదా ఏ ఇతర APK ఫైల్, ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ పూర్తిగా మోసగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. ఫోన్‌లో ఉన్న డేటా, ఫోటోలు, కాంటాక్ట్స్ దొంగిలించబడతాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దోచుకుంటారు.
ఎవరైనా మోసపూరిత లింక్స్ లేదా APK ఫైల్స్ గమనించినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) కు కాల్ చేయండి,లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఇలాంటి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త.
ఎంపీ కార్యాలయంలో సురేష్ షట్కర్ ఎన్ హెచ్ ఆర్ సి, సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొగుడంపల్లి మండలంలో వివిధ గ్రామంలో మూలిక సమస్యలు పైన చర్చించి రోడ్లు , డ్రైనేజీ కలవట్లు, విద్యుత్ స్తంభాలు ,షీట్ లైట్స్ , మంజూరు చేయాలని కోరడం జరిగింది ఎంపీ వెంటనే స్పందించి అతి త్వరలో సాంక్షన్ చేయించి సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ జిల్లా యువ ప్రతినిధి గోపాల్ పాల్గొన్నారు,
అడవులు రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే, అక్రమార్కులు మాత్రం ధనార్జిని ధ్యేయంగా అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ ఝరాసంగం మొగుడం పల్లి మాడలాల శివారులో అక్రమంగా రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రాముల ప్రజలు అర్పిస్తున్నారు.
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు హరితహారం లో భాగంగా చెట్లు నాటుతుంటే కాసులకు అలవాటుపడ్డ అక్రమార్కులు చెట్లను నరికి అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేక కలప వ్యాపారులకు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కల్ప వ్యాపారాన్ని అరికట్టి చెట్లు నరకకుండా చర్యలు తీసుకోవాలని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గణనాథులను దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
గణేష్ నవరాత్రి ఉత్సవాల మొగుడంపల్లి మండల కేంద్రంలో* గణనాథుని దర్శనం, పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో స్త్రీ శక్తి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుడుని దర్శనం,పట్టణంలో ఆర్యనగర్ వీధిలో శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడుని,సుభాష్ గంజ్ లో శ్రీ సేనా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,వెంకట్, మంజుళ,బి.జి.సందీప్,వంశి క్రిష్ణ,సురేష్, శికారి శ్రీనివాస్, సాయి కిరణ్,మహేష్,రమేష్, సుశీల్,నవీన్,బి.దిలీప్,ఆకాశ్,మల్లికార్జున్,ప్రశాంత్,విశాల్,తదితరులు పాల్గొన్నారు,
మొగుడంపల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ జుబేర్ జన్మదినాన్ని సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో జరుపుకున్నారు.
Deputy Tahsildar Juber Birthday Celebration
ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి డిప్యూటీ తాసిల్దార్ జుబేర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సిద్ధారెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు. ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.