రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట
బిజెపి నేత ఉడుత కుమార్
వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జ్ మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారిన ముళ్ళ కంపలను చెట్లను అదే గ్రామానికి చెందిన బిజెపి నేత ఉడుత కుమార్ స్వచ్ఛందంగా లేబర్ సహాయంతో తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి నిత్యం జమ్మికుంటకు వెళ్లే వాహనాలకు మూలమలుపు వద్ద పెరిగిన చెట్ల వల్ల, ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని పలుమార్లు ప్రమాదాలు జరిగిన, గ్రామ అధికారులు పట్టించుకోవడంలేదని, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా జరగాలని స్వచ్ఛందంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించడం జరిగిందన్నారు.
