“హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి”
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.
బాలానగర్ ఎస్సై లెనిన్.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో, పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ ఆదేశాల అమలులో భాగంగా, బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండెడ్ గ్రామం నందు బాలానగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ లెనిన్ మరియు సిబ్బంది రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు క్రింది విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి
త్రిబుల్ రైడింగ్ చేయరాదు
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు
రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ ఓవర్టేక్ నివారించాలి
మైనర్లు వాహనాలు నడపరాదు
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు వివరించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల్లో రోడ్డు భద్రతపై మంచి అవగాహన ఏర్పడిందని పోలీసులు తెలిపారు.
