విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న వైన్స్ ను తోలగించాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిడెంట్ కి వినతి పత్రం అందజేశిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్. ఈసందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల పరిధిలోని విఘ్నేశ్వర వైన్స్ జాతీయ రహదారి అనుకోని నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అందువల్ల మద్యం ప్రియులు ఫుటుగా తాగిపలుమార్లు రోడ్ క్రాస్ చెస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగి మృత్యువాతపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతారు చేస్తూ వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకొని వైన్ షాప్ నడిపిస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఎమ్ఆర్పి కంటే అదిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిని అనుకుని నిర్వహిస్తున్నందువల్ల రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు వాహనాలు ఆపుకొని మద్యం సేవించడం జరుగుతుందని, మద్యం ఎక్కువ సేవించిన మద్యం ప్రియులు రోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారని దీని వల్ల రోడ్డుపై వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విఘ్నేశ్వర వైన్స్ ను రోడ్డుపై నుండి తోలగించాలని యుగేందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బాబు, దగ్గుపాటి సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
