తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్, ఐపీఎస్ గురువారం ఐనవోలు మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లాకి అభిలాష్ బిస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న దర్శనానికి విచ్చేసిన వారిని దేవాలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి, శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి శేష వస్త్రములతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణ దారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు పాతర్లపాటి నరేష్ ,నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక సీఐ రాజగోపాల్ గౌడ్ ఎస్ఐ పస్థం శ్రీనివాస్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేసిన మరిపెడ పోలీసులు
మరిపెడ నేటిధాత్రి.
ఈ మద్య కాలంలో జరిగిన సైబర్ నేరాలలో మరిపెడ పరిది లో బాధితులు డబ్బులు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించినారు.వెంటనే పోలీసు లు స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా కంప్లైంట్ చేసి తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నారు, 1930 నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కొంత డబ్బు నిందితుని అకౌంట్ కి చేరకుండా హోల్డ్ లో ఉంచబడింది అన్నారు,మరిపెడ సి.ఐ రాజ్ కుమార్ గౌడ్ , ఇట్టి కంప్లైంట్ లను ఐ టి యాక్ట్ కింద కేసు కట్టి విచారణ చేపట్టి, హోల్డ్ లో ఉంచబడిన అమౌంట్ ను బాధితులకు రిటర్న్ వచ్చేలా గౌరవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, తొర్రూరు గారికి లెటర్ పెట్టి, తద్వారా మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకొని బాధితులు పోగొట్టుకున్న అమౌంట్ ను వారి ఖాతా లోకి తిరిగి జమ అయ్యేలా చేయడం జరిగింది అన్నారు,ఒక క్రైమ్ నందు 13,700/- రూపాయలు ఇంకొక క్రైమ్ నందు 6,821/- రూపాయలు రిటర్న్ వచ్చాయి, గతం లో మరిపెడ లో ఒక షాప్ యజమాని 40,000/- పోగొట్టుకొని వెంటనే 1930 కి కాల్ చేయడం ద్వారా, మొత్తం డబ్బులు వెనక్కి తెప్పించడం జరిగింది.ఇంకా మూడు కేసులలో అమౌంట్ రీఫండ్ కావలసి ఉంది.ఈ మధ్య కాలంలో చాలా సైబర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కావున ప్రజలు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగలరు,బాధితుల సమస్యలకు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్సై సతీష్ గౌడ్ ని అభినందించడం జరిగింది.
పోలీస్ జాగిలాలకు నుతంగా నిర్మించిన గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఐపీఎస్ పోలీస్ జగిలాలు (Police Dogs)నేర పరిశోధన,భద్రతా చర్యలు,మాదకద్రవ్యాల నియంత్రణ,విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు.పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు.ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ..విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం,సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ,ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.
మాదకద్రవ్యాలు (Drugs), బాంబులు (Explosives), మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ,వైద్య సంరక్షణ,మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు.ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, మొగిలి, నటేష్,ఆర్.ఐ లు రమేష్,యాదగిరి,ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ లు, డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తీక్,సురేష్, శ్రీనివాస్, కిరణ్,సిబ్బంది పాల్గొన్నారు.
సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలు శిక్షలు తప్పవు.
జిల్లాలో సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ (SOCIAL MEDIA TRACKING CELL) ఏర్పాటు:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేల,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెట్టె వారిపై,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై,ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టె వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మధ్యమల్లో (ట్విటర్,ఫేస్‌బుక్,వాట్సాప్,ఇతర సోషల్ మీడియా..)వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని,సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం(“SOCIAL MEDIA TRACKING CELL”)ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని,జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24*7 నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు. సామాజిక మధ్యమల్లో మతవిద్వేషాలు,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ 8712537826 నంబర్ కి మెసేజ్ రూపంలో పంపగలరు.
ఝరాసంగం పీఎస్ నుండి కోహీర్ పీఎస్ కి బధిలిపై వెళ్లిన”సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్ సర్” మరియూ పుల్కల్ పిఎస్ నుండి ఝరాసంగం పీఎస్‌లో “సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన క్రాంతి గార్లకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానం చేసి వీడ్కోలు పలికి ఝరాసంగం మండల నాయకులు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్ రెడ్డి, సిద్ధు పాటిల్, డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి నాయకులు లక్ష్మారెడ్డి,షకిల్ సర్, వై నాగేష్, ఎం విష్ణు, అమృత్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఝరాసంగం మండల రాఘవేంద్ర,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం మండల చింతలగట్టు శివరాజ్,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాంపూర్ ప్రకాష్,గంగారం నర్సింలు తదితరులు పాల్గోని ఎస్ఐ నరేష్ , పటేల్ క్రాంతి గార్లకు వీడ్కోలు మరియు స్వాగతం పలికారు..
సడన్‌గా.. ఓటీటీకి వచ్చేసిన పోలీస్ థ్రిల్లర్! క్లైమాక్స్ మైండ్ బ్లాకే
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సడన్‌గా ఓ లేటెస్ట్ మలయాళ చిత్రం రోంత్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సడన్‌గా ఓ లేటెస్ట్ మలయాళ చిత్రం రోంత్ (Ronth) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పోలీస్ ప్రోసిడ్యూరల్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా గత నెల జూన్ 13న కేరళలో థియేటర్లలో విడుదలై సైలెంట్‌గా సంచలన విజయం సాధించింది. దిలీష్ పోతన్ (Dileesh Pothan), రోషన్ మాథ్యూ (Roshan Mathew) కీలక పాత్రల్లో నటించగా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, నాయట్టు వంటి సినిమాలకు కథా రచన చేసిన షాహి కబీర్ (Shahi Kabir) రచించి దర్శకత్వం వహించాడు. రోంత్ అంటే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. తెలుగులో గస్తీ, పహారా ఖాయడం అని అంటారు.
కథ విషయానికి వస్తే.. ఒక రాత్రిలో విధుల్లో ఉన్న ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న పోలీసులు చాలా సీనియర్ అయున సబ్‌ఇన్స్పెక్టర్ యోహన్నాన్ (దిలీష్ పోథన్) మరియు కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ డినానత్ (రోషన్ మాథ్యూ) ల మధ్య సాగుతుంది. ఓ రోజు రాత్రి పాట్రోల్ డ్యూటీకి వెళ్లిన ఈ ఇద్దరికి అనుకోకుండా వరుసగా ఎదురైన ఘటనలు వారిని ఎలా మార్చాయి, వారు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి వాటికి వారు రియాక్ట్ అయిన తీరు వళ్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చిది, వారి జీవితాలు ఎలా మలుపులు తిరిగాయో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఓ పిచ్చోడు బిడ్డను డ్రమ్ములో ఉంచి హింసించడం, ఓ తల్లి తన పక్కనే పిల్లలను పెట్టుకుని ఊరేసుకోవడం, ఓ ప్రేమ జంట లేచి పోవడం, వారి స్థానంలో వేరే వారిని పట్టుకోని కొట్టడం వంటి సిట్యువేషన్స్ ఎదురవుతాయి. వాటికి తోడు ఇంటి సమస్యలు, ఆ రోజే స్టేషన్‌కు వచ్చిన కేసులు ఇలా వాళ్లకు అనేక ససమస్యలు అ ఒక్క రోజులో వచ్చి మీద పడతాయి.
ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ స్టోరీలా మాదిరి కాకుండా, నిజ జీవిత పోలీస్ పట్రోల్ తీరు తెన్నులను, పోలీసులు అనుభవించే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇద్దరు ప్రధాన పాత్రధారులు పోటీ పడి మరీ నటించారు. సినిమాటోగ్రఫీ, లైట్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా సందర్బాల్లో స్లోగా సాగినప్పటికీ ఎక్కడా బోర్ అనే ఫీల్ రాదు. ఎలాంటి యాక్షన్, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ చిత్ర నిరాశే మిగులుస్తుంది. సస్పెన్స్, సీరియస్ కంటెంట్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ పరమాన్నం లాంటిది. అంతేకాదు స్టన్నింగ్ క్లైమాక్స్, ఊహకందని ట్విస్టులతో ఈ మూవీ షాకి ఇస్తుంది. గతంలో మలయాళం నుంచే వచ్చిన నయాట్టు, జన గణమన వంటి రియలిస్టిక్ పోలీస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు ఇంటిల్లిపాది కలిసి చూసేయవచ్చు.
17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.
Assistant Commandant Jagadeeshwar Rao, officers
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వాపురంపాడు వలస ఆదివాసి గ్రామము మరియు అనంతారం గ్రామము లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రాం అనంతరం యువతకు వాలీబాల్సు మరియు వారి కుటుంబాలకు దోమతెరలను (ఎన్జీవో సహకారంతో) అందించిన తర్వాత ఏడుల్లబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు
డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు . విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వారిని చదివించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారి నమ్మకాలను దుర్వినియోగం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్థులకు సూచించారు మరక ద్రవ్యాలు వాడరాదని ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ రావుల గరీధర్ పోలీస్ డి సి ఆర్ సి ఉమా మహేశ్వరరావు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సీఐ కృష్ణయ్య కొత్తకోట సీఐ రాంబాబు జిల్లా అధికారులు సుధీర్ రెడ్డి సుధారాణి క్రీడల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు
కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
shine junior college
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్. ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.
సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి, ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి- కేటీఆర్
సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు
కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేయడం,పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడంతోనే బీఆర్ఎస్ నేత కుంటయ్య ఆత్మహత్య
కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం-న్యాయపోరాటం చేస్తాం
కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు,పెళ్లిల్లు చేయడంతో పాటు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
కుంటయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
shine junior college
కాంగ్రెస్ హయాంలో సెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేశాడని ఫిర్యాదుచేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్బా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.
మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ఈరోజు కుంటయ్య కి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపుచేయాలన్నారు.ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు
జైపూర్ నేటి ధాత్రి:
shine junior college
జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.
సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు…
Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.
సార్ నా పేరు అజయ్ శంక్‌వర్ నేను బతికే ఉన్నాను.
దయచేసి నా పోస్టుమార్టం ఆపండి అని అన్నాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా ఘాతమ్‌పూర్ టౌన్‌లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు.
దీంతో పోలీసులు శవం ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు.ఆ శవం ఎవరిదో తెలిస్తేచెప్పమని కోరారు.
సుమన్ అనే మహిళ ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని గుర్తుపట్టింది.
అతడు తరచుగా రెడ్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుంటాడని కూడా పోలీసులకు చెప్పింది.శవం ఎవరిదో తెలిసింది కాబట్టి.. పోలీసులు మిగిలిన ప్రొసిజర్స్ పూర్తి చేశారు.
శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.
‘సార్ నా పేరు అజయ్ శంక్‌వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావటంతో నోరెళ్ల బెట్టారు. అతడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.
అతడే నిజమైన అజయ్ అని నిర్ధారించుకున్నాక తర్వాత పోస్టుమార్టం నిలిపేశారు. దీనిపై ఏసీపీ కృష్ణకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఘాతమ్‌పూర్ మెయిన్ క్రాస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి శవం దొరికింది.
అజయ్ కుటుంబం ఆ శవం అజయ్‌దే అని గుర్తుపట్టింది. దీంతో పోస్టుమార్టం కోసం పంపాము. తర్వాత నిజమైన అజయ్ స్టేషన్‌కు వచ్చాడు. దీంతో పోస్టుమార్టం ఆపేశాము. శవం ఎవరిదో కనుక్కునే పనిలో పడ్డాము’ అని అన్నారు
రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం
రామడుగు నేటిధాత్రి:
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ఎస్పై రాజు కమిషనర్ కు పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్, లాఠీ పరేడ్ ను పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, కేసుల్లో స్వాధీనమైన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్ కాప్, హెస్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు కోసం వినియోగించే టెక్ డాటం వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు కేటాయించిన ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది చేత పరిశీలించారు. అలాగే ఎఫ్ఎఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్ష చేసి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామడుగు మండలంలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను నియమించాలని సూచించారు. కోత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు రికార్డు నిర్వహణ, కోర్టు డ్యూటీ, బీట్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సమన్లు తదితర విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్పై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది.
అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.
గుడుంబా స్థావరం పై రైడ్ చేసిన పోత్కపల్లి పోలీసులు..
గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు…పోత్కాపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో పోత్కపల్లి ఎస్సై దీీకొండ రమేష్ సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం మరియు 5 లీటర్ల గుడుంబా ను పట్టుకొని దానిని తయారుచేసిన బోదాసు పద్మ భర్త పేరు సదయ్య వయసు 40 సంవత్సరాలు కులం వడ్డెర కొలనూరు గ్రామం అనే ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ సెల్ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ కిషన్, కానిస్టేబుల్స్ రాజేందర్ రాములు పాల్గొన్నారు.
`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.
`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.
`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.
`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.
`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.
`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.
`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.
`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.
`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.
`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.
`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.
`కాంగ్రెస్ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.
`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.
`కాంగ్రెస్‌లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.
`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.
`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.
`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.
`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.
`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.
`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.
`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.
`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.
`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.
`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.
`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.
`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.
`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.
`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్ లేకుండా చేస్తున్నారు.
`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.
హైదరాబాద్,నేటిధాత్రి: జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్‌ఫర్ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్‌ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్, పింక్ బుక్, బ్లాక్ బుక్ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్ లేకుండా చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుక
వేడుకలో పాల్గొన్న, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జిల్లా పోలీస్ పరేడ్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పాల్గొని భారత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగినది. తదనంతరం పోలీస్ పరేడ్ వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది. అంతేకాకుండా ఎందరో అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ, నేడు ప్రజా పాలన వ్యవస్థగా పురుడుపోసుకున్నదని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిఫలాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని.అంతేకాకుండా జిల్లాను విద్యా,వైద్య, ఉపాధి కల్పనలో ముందుండడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.