సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటన విజయవంతం కావాలి

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భూపాలపల్లికి రానున్నారని, వారి పర్యటనను భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు (శనివారం) ఎమ్మెల్యే జీఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులోని కర్నాలకుంట చెరువు పక్కన ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ నాయకులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక ఏర్పాటు, హెలీ ప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గణపురం సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ తో చర్చించారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన రేగొండ కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగులు.
ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగు లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు తెలిపారు.

 

 

ఖో ఖో క్రీడా లో సి హెచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ టేకుమాట్ల, కబడ్డీ క్రీడకు గాన సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ తాడిచర్ల, వాలీబాల్ క్రీడకు గాని కే జ్యోతి ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, మహా ముత్తారం, కే మమత ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, పెద్దాపూర్, పాపికొండలు జి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్, జి పూర్ణిమ ,ఫిజికల్ డైరెక్టర్, జడ్.పి.హెచ్.ఎస్, మహాదేవపూర్ గర్ల్స్, కే మమత ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ పెద్దాపూర్, అథ్లెటిక్స్ క్రీడకి గాను సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్, హెచ్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజామ్ నగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెస్ క్రీడకి గాను బీ.కొమలత, ఎస్ జి టి, ఎం పి పి ఎస్ కేశవాపూర్, స్పందన ,ఎస్ జి టి, ఎంపీపీ ఎస్ ఎల్కేశ్వరం.
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు క్రీడా శాఖ తరుపున అభినందనలు, జాతీయ స్థాయి లో జిల్లా కి క్రీడా లలో మంచి పేరు తేవాలి అని ఆకాక్షించారు.
సి హెచ్ రఘు, తెలిపారు

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version