కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

“మా పొట్ట కొట్టొద్దు… సారు…

“మా పొట్ట కొట్టొద్దు… సారు “

“ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మిస్తే.. చచ్చిపోతాం”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు, వనమోని గూడ, గౌతాపూర్, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి గ్రామాల మీదుగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ఈనెల 15 రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరించేందుకు గడువు పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భూ నిర్వాసితులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న తమకు.. పిడుగు లాంటి వార్త మా జీవితాల్లో నాశనం చేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న పొలం రోడ్డుకు పోతే తాము జీవనోపాధి కోల్పోతామన్నారు. ఒకవేళ రోడ్డును నిర్మిస్తే క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

గంగాధర నేటిధాత్రి :

 

 

గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల సమీక్ష…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T140136.019.wav?_=1

 

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్..

గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూలైన్లు, విమాన గోపురం, అర్థమండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ..

ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానన్న ఎమ్మెల్యే..

కొడవటంచ ఆలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం..

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రేగొండ మండలంలోని
కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు, గుత్తేదార్లకు సూచించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయశాఖ, పీఆర్, ఆర్ అండ్ బీ, టూరిజం, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈలు, డీఈలు, ఏఈలు మరియు రేగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంనకు ముందు ఎమ్మెల్యే బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూలైన్లు, విమాన గోపురం, అర్థమండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ జరిపారు. అదేవిధంగా, మరో మూడు నాలుగు నెలల్లోపు అన్ని పనులు పూర్తయితే ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు వంద ఏళ్ల కిందట స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని, ఆలయాన్ని పట్టించుకునే నాథులు లేక ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.12.15 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ప్రధానంగా విమాన గోపురం అర్ధ మండపం, మహా మండపం పునర్నిర్మాణానికి రూ.3.77 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అద్దాల మండపం కోసం రూ.5 లక్షలు, అల్వార్ నిలయానికి రూ.1.10 లక్షలు, పాకశాల భవనానికి రూ.7.5 లక్షలు, క్యూలైన్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, అన్నదాన సంత్రానికి రూ.40 లక్షలు, ఆలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.15 లక్షలు, భక్తుల బస కోసం రూ.5.5 లక్షలు, రూ.50 లక్షలతో చుట్టూ కాంపౌండ్, తాగునీటి ట్యాంక్ కోసం రూ.30 లక్షలు, ఈవో, ఇతర అధికారుల ఆఫీస్ కోసం రూ.50 లక్షలు, అర్చకుల వసతి గృహాలకు రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గణపురం మండలం బుద్దారం గ్రామం నుండి కొడవటంచ గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. రేగొండ పోలీస్ స్టేషన్ వద్ద అసంపూర్తిగా ఉన్న ఆర్చి పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఆర్చిని ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంపత్ రావు నరసయ్య బిక్షపతి రాజు తదితరులు పాల్గొన్నారు

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T133713.630-1.wav?_=2

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T152634.590.wav?_=3

 

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

హైదరాబాద్ – నాందేడ్ నేషనల్ హైవేపై అండర్‌పాస్‌ల, ఫ్లై‌ఓవర్ల నిర్మాణం కోసం,నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ మరియు జహీరాబాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు,

“కోతపల్లి సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు బీజేపీ వినతి పత్రం”..

సులబ్ కాంప్లెక్ నిర్మాణం కొరకు MPDO గారికి వినతి పత్రం అంద చేసిన బీజేపీ నాయకులు *

తాండూరు ( మంచిర్యాల ) నేటి ధాత్రి:

 

 

కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శనివారం సంత సమీపంలో సులబ్ కాంప్లెక్ కి అనుమతి చ్చింది.నిధులు కూడా మంజూరు అయినవి.నిర్మాణం కోసం ముగ్గు పోసి అక్కడికే వదిలేశారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దుడపాక భరత్ కుమార్ మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా శనివారం సంతకు వచ్చె చుట్టూ పక్కల మండలాల ప్రజలు, పలు గ్రామాల ప్రజలు కూరగాయలు అమ్మే వారికి చాలా ఇబ్బంది కరంగా ఉందని వాటిని వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. సులబ్ కాంప్లెక్ నిర్మాణం ఆలస్య విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ప్రజలు బావిస్తున్నారు. ప్రజల అవసరాలు గుర్తించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరుపున అధికారులను కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విఘ్నేష్, పుట్ట కుమార్, ఉప అధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రామగౌని మహీధర్ గౌడ్, ఎక్స్ వార్డ్ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పుట్ల దుర్గాచరణ్, బిజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్, 126 బూత్ అధ్యక్షులు సలాది శ్రీకాంత్ , యువమోర్చా కార్యకర్త రెవెల్లి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు….

పాత పెన్షన్ ను పురుద్దరించాలి,

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T132105.230.wav?_=4

 

పాత పెన్షన్ ను పురుద్దరించాలి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు 2004 నుంచి అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ ను మళ్ళీ అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ.తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో బోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు…ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల పొట్టిపల్లీ తో పటు అనేక పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు,, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెల్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు Y. అమృత్,శంకర్ ,ప్రసన్న లక్ష్మి. నారాయణ,,కృష్ణ తదితరులు పాల్గొన్నారు,

మొగుడంపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T131050.512-1.wav?_=5

 

మొగుడంపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మొగుడంపల్లి మండలం జాంగార్ బోలీతండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్, పంచాయతీ కార్య దర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-57-1.wav?_=6

మరోసారి ఐటీ దూకుడు
మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ సంస్థల్లో కూడా..సోదాలు

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్‌ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎంపీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సురారంతోపాటు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఐదేండ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి డీఎస్‌ఆర్‌ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారు.

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి…

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి
..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్, జూలై 31,నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద లావణ్య ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.వెంకటి,హౌసింగ్ ఎ.ఇ పి. తిరుమల,మున్సిపల్ సిబ్బంది రజాక్,గంగారెడ్డి, శేఖర్ వార్డు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ మొహమ్మద్ షాకీర్ సామాల్ల లత చింతకుంట సాయికుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యకల రమేష్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్ బొమ్మ కంటి నవీన్ కడకుంట్ల నరేష్ బాపురపు నరసయ్య మహమ్మద్ సాబీర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ బొద్దుల శివ కుమార్ కాటిపెల్లిరామ్ రెడ్డి గుమ్మడి సంతోష్ గోపాల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి ,

పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన , శాంతమ్మ రాములు కు చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం లబ్దిదారుల తో కలిసి భూమిపూజ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి..

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతి పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T154633.723-1.wav?_=7

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 16 పి.హెచ్.సి సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలలో 3 పి.హెచ్.సి లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని,మరో పి.హెచ్.సి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, గంభీర్ రావు పేట రూఫ్ దశలో ఉందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ సెంటర్ల మంజూరు కాగా 5 సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండల తహసిల్దార్ లతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించారు. పి.సెచ్.సి సబ్ సెంటర్ నిర్మాణ పనులు అదేవిధంగా గంభీరావుపేట్ పిహెచ్సి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పి.హెచ్.సి, సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు అందుబాటులో పెట్టిందని, పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చోరువతో పని చేయాలని అన్నారు. అగ్రహారం, తిప్పపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఈ ఈ పి ఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు..

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు

పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని పులిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో గల కొండేవాయి గ్రామంలో ఎంపీపీ స్కూల్ కి ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం వద్దు గ్రామంలోనే వేరే దగ్గర స్థలం ఇస్తాము అని గ్రామస్తులు చెప్పిన వినకుండా సెల్ ఫోన్ టవర్ నిర్మాణానికి స్థలం కేటాయించడం అన్యాయమని పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి అన్నారు ఫారెస్ట్ అధికారులు మరొకసారి పునరాలోచించాలని అన్నారు సెల్ ఫోన్ టవర్ ఇంత దగ్గరగా నిర్మాణం చేపట్టడం విద్యార్థులపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇకనైనా చర్ల మండల అధికారులు ఇటువంటి ఇటువంటి నిర్మాణాలను గ్రామంలోని వేరొక ప్రాంతానికి తరలించాలని అన్నారు వలన ఐదవ షెడ్యూల్ ప్రాతంలో పెసా గ్రామ సభ తీర్మానం చేయకుండా ఫారెస్ట్ అధికారులు బిఎస్ఎన్ఎల్ టవర్ కోసం విద్యార్థులు ఆటలు ఆడుకునే స్కూల్ స్థలంలో మార్కింగ్ ఇచ్చివున్నారు మరియు ఎంపీపీ స్కూల్ స్థలం లో కాకుండా గ్రామంలోనే వేరే దగ్గర టవర్ ఏర్పాటు చేయాలనీ చర్ల మండల తాసిల్దార్ కు చర్ల మండల విద్యాశాఖ అధికారికి విన్నతి పత్రం ఇచ్చినారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పొడియంరాజేష్ పొడియం అంద్దయ్య మడకంరవి వినోద్ యాత్ కాంగ్రెస్ నాయుకులు సోడినాగరాజు తదితరులు పాల్గొన్నారు

వంతెనల నిర్మాణానికి రూ.44.10 కోట్లు మంజూరు…

వంతెనల నిర్మాణానికి రూ.44.10 కోట్లు మంజూరు

తీరనున్న ప్రజల కష్టాలు.

జడ్చర్ల/ నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో వంతెనలు కట్టడానికి గత ఏడాదిలో తాను చేసిన ప్రతిపాదనల కోసం అవసరమైన రూ.44.10 కోట్లను వెంటనే మంజూరు చేసి, వంతెనల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీతక్క వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారని వెల్లడించారు.
అనిరుధ్ రెడ్డి గురువారం మంత్రి సీతక్కను కలిసి గతంలో తాను ప్రతిపాదించిన వంతెన నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరామని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జూన్ నెలలో తాను జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరమున్న ప్రాంతాలను గుర్తించి వీటి నిర్మాణానికి నిధులను కేటాయించాల్సిందిగా కోరామని గుర్తు చేసారు. ఈ విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సీతక్క పంచాయితీరాజ్ ఈఎన్సీకి ఆదేశించడంతో దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ మొదలైయిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. తాను నియోజకవర్గంలో ప్రతిపాదించిన తొమ్మిది వంతెనల వివరాలను ఆయన వివరించారు. జడ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తాండాకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తాండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, శేరిగూడ నుంచి బోడజానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని చెప్పారు. నవాబుపేట మండలంలో వీరశెట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెల్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.40 కోట్లు ప్రతిపాదించామన్నారు. రాజాపూర్ మండలంలో రాయపల్లి నుంచి కుచ్చర్కల్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, మిడ్జిల్ మండలంలో వల్లభరావుపల్లి నుంచి చౌటకుంట తాండ మీదుగా వేముల వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.10.20 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది వంతెనల కోసం రూ.44.10 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ గత ఏడాదిలోనే మొదలైయిందన్నారు.

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

పాకాల యేటి పై హైలెవల్ బ్రిడ్జినిర్మాణం ఇంకెప్పుడు..?

ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?

ఎన్నికల హామీగానే మిగిలిపోయిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం…

కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-74.wav?_=8

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో గల పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పాలకులకు ఎన్నికల అప్పుడు హామీలకే పరిమితమైపోయిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టే బోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం గార్ల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడా అని అన్నారు.ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద, ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడిన మండల కేంద్రానికి సకాలంలో వైద్యం కొరకు కానీ, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ విద్యను అభ్యసించాలన్న, రైతాంగం తమ పంటలకు అవసరమయ్యే పరికరాలు మందులు తీసుకొని రావాలన్న చుట్టూ 30 నుండి 40 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దూరపు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పాకల యేటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మండల కేంద్రంకు రావాలని అన్నారు.వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,ఇంకా ఎన్నాల్లు ఈ ప్రాంత కష్టాలు? ప్రజల ఓట్లు దండుకోవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ప్రజా సమస్య అయినటువంటి పాకాల ఏటిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యే,ఎంపీలు ప్రత్యేక శ్రద్ధచూపి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Collector

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

Collector

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన.!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

నిజాంపేట, నేటి ధాత్రి

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రాంపూర్, నగరం గ్రామాలలో కలెక్టర్ పర్యటించి ఫ్రైడే ఫ్రైడే పరిసరాల పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు దోమలను పారద్రోలేందుకు పాగింగ్ చేపట్టాలన్నారు. సిజనల్ వ్యాధులు చికెన్ గున్య ,మలేరియా , డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా సిబ్బందులు అందుబాటులో ఉండాలని అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

లోటత్తు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటూ అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు పంచాయతీ సెక్రెటరీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ,అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజల ఆరోగ్యం పరిరక్షణపై తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నగరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం లబ్ధిదారులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్, హౌసింగ్ ఏఈ సంధ్య, ఆర్ ఐ ప్రీతి ,హిమద్ ,పంచాయతీ సెక్రటరీ లు హరిప్ హుస్సేన్, చంద్ర హాసన్, ఆశ వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు

బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను పరిశీలించిన

బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను పరిశీలించిన
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

సుభాష్ కాలనీలో నిర్మాణంలో ఉన్న బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతి రాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణంలో ఆలస్యానికి కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8 గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ గదులను ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా, వేగంగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version