విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్…

విఘ్నేశ్వర వైన్స్ ను తొలగించాలి-భావండ్లపల్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న వైన్స్ ను తోలగించాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిడెంట్ కి వినతి పత్రం అందజేశిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్. ఈసందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల పరిధిలోని విఘ్నేశ్వర వైన్స్ జాతీయ రహదారి అనుకోని నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అందువల్ల మద్యం ప్రియులు ఫుటుగా తాగిపలుమార్లు రోడ్ క్రాస్ చెస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగి మృత్యువాతపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతారు చేస్తూ వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకొని వైన్ షాప్ నడిపిస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఎమ్ఆర్పి కంటే అదిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిని అనుకుని నిర్వహిస్తున్నందువల్ల రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు వాహనాలు ఆపుకొని మద్యం సేవించడం జరుగుతుందని, మద్యం ఎక్కువ సేవించిన మద్యం ప్రియులు రోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారని దీని వల్ల రోడ్డుపై వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విఘ్నేశ్వర వైన్స్ ను రోడ్డుపై నుండి తోలగించాలని యుగేందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బాబు, దగ్గుపాటి సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షానికి తడిసిన వడ్లు..

అకాల వర్షానికి తడిసిన వడ్లు

ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.

తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్…

వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

 

 

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version