ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల,నేటిధాత్రి
ఈ రోజు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని,విద్యుత్,త్రాగునీర,అంతరాయం కలగకుండా చూడాలని,రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని,అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి చూసించారు.అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
