వరంగల్ జిల్లాకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీని 10 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా శ్రీరామ్ రామచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, ఎండి హుస్సేన్ పాషా, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల్ల సోమేశ్వరరావు, పెద్దపల్లి వరప్రసాద్, బొడిగ శ్రీనివాస్, బొల్లెపల్లి రాజు నియమితులయ్యారు.
ఈ కమిటీకి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి అయూబ్ అలీ మెంబర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
అదనంగా, దక్షిణ మధ్య రైల్వే, టీజీఎస్ఆర్టీసీ ప్రతినిధులు మరియు సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు.
కొత్తగా ఏర్పడిన ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. గీసుకొండ మండలం దసరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని దసరుతండా, మంగళతండా గ్రామాలలో ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమృత అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత మరియు వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను వివరించారు. జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి లక్షణాలు మరియు నివారణపై సంక్షిప్తంగా వివరించి, ముందస్తు టీకాలే ఉత్తమ రక్షణ అని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించనుంది.ఈ శిబిరంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు, లేగదూడలు మరియు పెద్ద పశువులకు పురుగుమందులు అందించారు. అదేవిధంగా రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు.గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, రైతులకు ఆర్థిక నష్టం కలిగించే ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించి, ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుందని. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలుతుంది.
వ్యాధి నివారణ కోసం పశువులకు ముందుగానే టీకాలు వేయించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని మార్చి 10 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహిస్తున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో మొత్తం 115 పశువులకు టీకాలు అందించామని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కొమ్మాల పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, సుమన్, చందు, జితేందర్, గోపాల మిత్రులు ఇస్మాయిల్, రమేష్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
29న భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లాల చెస్ పోటీలు
గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేముల పల్లి సుబ్బారావు
నర్సంపేట,నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్ నందు ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం మరియు వరంగల్ జిల్లాల స్థాయి చెస్ పోటీలు లో నిర్వహించినట్లు గీతాంజలి విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 30 ట్రోఫీలతో పాటు ప్రతి ఒక్క క్రీడాకార్డుకి మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయున్నట్లు తెలిపారు.ఈ చెస్ క్రీడలో పాల్గొనేందుకు 15 మంది బాలికలకు 15 మంది బాలురకు, అందులో అండర్ 15 అండర్ 12 అండర్ 9 విభాగంలో వారికి బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో జరుగుతాయని ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ సిహెచ్ గోపికృష్ణ తెలిపారు.క్రీడలో పాల్గొనే వారు 9440162749,9182225496 చేరవాణి నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ఓన్ చెస్ బోర్డ్స్ ను తమ వెంట తీసుకురాగలరన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల లోపు భద్రాద్రి కొత్తగూడెం పట్టణం గౌతమ్ నగర్ గీతాంజలి పబ్లిక్ స్కూల్ రావాల్సిందిగా కోరారు. ఈ పోటీలలో ఓడిపోయిన గెలిచిన ప్రతి ఒక్కరు 5 రౌండ్లు ఆడవలసిందిగా చెస్ కోచ్ సీహెచ్ బిశ్వజిత్ కృష్ణ తెలిపారు.
భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 96వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో యుక్తవయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి భగత్ సింగ్ అని తెలిపారు. చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన మహా వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్ జీవితం భారత యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, అలాగే భగత్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్న ప్రదానం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత పాలకులదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జేరిపోతుల జనార్థన్, కుమ్మరి సాగర్, డివిజన్ నాయకులు అరె పవన్, కిరణ్, నవీన్, ఉదయ్, సుకుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాలకు చెందిన గీత కార్మికులు కొంతమంది వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దమనుషుల ముసుగులో ఒక ముఠాగా ఏర్పడి గీత కార్మికుల భూములు, సంఘానికి చెందిన డబ్బులు కాజేసి, వాటి లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారని కార్మికులు ఆరోపించారు.
ఈ విషయంపై బాధితులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యను వివరించారు. కార్మికుల వినతిని ఆలకించిన మంత్రి, విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
దీంతో గీత కార్మికులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో సమూహంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. బత్తిని హరి మరియు అతని ముఠా సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కార్మికులు సంతకాలు చేసి ఫిర్యాదు సమర్పించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
వరంగల్, నేటిధాత్రి:
National Science Day celebrations at Sanghamitra HighSchool
వరంగల్ జిల్లా దేశాయ్‌పేట్ రోడ్డులోని సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డి. మహేందర్ తెలిపారు.ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త సి వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ, 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ద్వారా కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శాస్త్రవేత్త సి.వి. రామన్ అని పేర్కొన్నారు. భౌతిక శాస్త్రంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని తెలిపారు.దేశంలో సైంటిఫిక్ టెంపర్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు.ప్రిన్సిపాల్ మహేందర్ మాట్లాడుతూ, సైన్స్‌కు జీవితాంతం అంకితమైన మహనీయుడు సి.వి. రామన్ ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్పందించిన పోలీసులు – రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ నగర పరిధిలోని పోతన నగర్‌లో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ వివాదంపై పోలీస్ శాఖ స్పందించింది. భూ బాధితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
మునుపటి రోజున భూ బాధితులు కల్వర్టు విస్తరణ పేరుతో తమ ప్రైవేటు భూమిని అసమానంగా స్వాధీనం చేసుకుంటున్నారని, దళితుల వైపు ఎక్కువగా భూమి తీసుకుని, ఇతరుల వైపు తక్కువగా తీసుకున్నారని ఆరోపిస్తూ టెంటు వేసి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలు పరిశీలించినట్లు సమాచారం. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇక విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి నిర్మాణ పనులపై విచారణ ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణం అనుమతులు, ప్రణాళికలు, భూస్వాధీనం విధానం తదితర అంశాలపై పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. రెండు వైపులా భూమి తీసుకున్న పరిమాణంపై స్పష్టతకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
నిర్మాణం జరిగిన ప్రదేశంలోనే ప్రత్యక్షంగా కొలతలు తీసి, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అధికారులను కూడా వివరణ కోరినట్లు సమాచారం.
భూ బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరువైపులా సమానంగా భూమి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హిస్టోరియన్ నేహా వర్మానీ 130 ఏళ్ల క్రితం నాటి మహారాజుల డిన్నర్ మెనూను బయటపెట్టారు. మెనూకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1897 జనవరి 31వ తేదీన బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం. ఆ డిన్నర్‌లో ఇద్దరు మహారాజులు కేవలం ఫ్రెంచ్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.
పైపులు తొలగించండి మేడం.. మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల విన్నపం
నేటిధాత్రి, వరంగల్:
వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన వేళ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై మధ్యలో నిలిచిపోయిన పైపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుమధ్యలోనే ఉన్న ఈ పైపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగమంచు కారణంగా రోడ్డుపై స్పష్టత తగ్గిన పరిస్థితుల్లో పైపులు ఎక్కడున్నాయో తెలియక వాహనాలు అటువైపు దాటేందుకు ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళ స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఉద్యోగులకు తీసుకెళ్లే వాహనాలు, చిరు వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డుకు మధ్యలో ఎలాంటి డివైడర్ లేకపోవడం, పైగా ఈ పైపులు అలాగే ఉండిపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న పైపులను వెంటనే తొలగించి, భద్రత కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ .
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని క్యాన్సర్ చికిత్స వార్డులో వ్యాధిగ్రస్తులకు పండ్లను అందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేక క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించగలిగి, డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ ను ముందే గ్రహిస్తే చికిత్స సులభతరం అవుతుందని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండి, సరైన నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్ ను ఎదుర్కొనవచ్చును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.జి.యం. ఆర్.యం.ఓ.డాక్టర్ మహేందర్, డా.భాస్కర్ (అంకాలజిస్ట్), పారా లీగల్ వాలంటీర్ వై.సింధూజ, ఏ.యన్.యం.లు తదితరులు పాల్గొన్నారు.
కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి స్వార్థం కోసం విస్తరింపజేస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు అలవాట్ల కారణంగా 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వారి భవిష్యత్ దారితప్పి తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చితున్నారని ఈ పరిస్థితిపై గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పౌర హక్కులు–సామాజిక సమానత్వం–యువత భవిష్యత్తే లక్ష్యంగా..గీసుకొండ మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ సబ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గీసుకొండ డిప్యూటీ తహసిల్దార్ వీందర్ రావు,టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కోట ప్రమోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ బోధించు,సమీకరించు, పోరాడు అనే మహానినాదంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు అని కొనియాడారు. గ్రామంలో విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు ప్రభావం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సమస్యపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించే ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సమాన అవకాశాలు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ రుణపడి ఉండాలని తెలిపారు. చదువు ద్వారా ప్రశ్నించే తత్వం పెరుగుతుందని, నేటి సమాజంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు వంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ద్వారానే ఎదిగారని స్పష్టం చేశారు.
దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని దళితులపై జరుగుతున్న దాడుల వల్ల నష్టపోయేది సమాజమేనని పేర్కొన్నారు.కుల భేదాలను మర్చిపోయి మేము–మీరు అనే భావనను విడిచిపెట్టి అందరం ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించి గీసుకొండ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. రాజేంద్రప్రసాద్, హెచ్డబ్ల్యూఓ హరిత, గ్రామం వార్డు మెంబర్లు పసుల యుగేందర్, దౌడు చిన్న జ్యోతి, దౌడు ఎలీషా, దౌడు సారిక, మాజీ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ వార్డ్ మెంబర్ దౌడు రాజేష్ గ్రామ కరోబార్ అలీ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన.
సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు.అక్కడి పిల్లల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి తమ పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
గుండాల విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ కు ప్రశంషాపత్రం
గుండాల,నేటిధాత్రి:
గుండాల సెక్షన్ విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గత 3 సంవత్సరాల నుండి ప్రజలందరి మరియు అధికారుల ఆదరాభిమానాలు పొందుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వరంగల్ లో TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి గా ప్రశంస పత్రం అందుకున్నారు. సిఎండి చేతుల మీదుగా ప్రశంస పత్రం తీసుకున్నందుకు గాను అధికారులు కొత్తగూడెం సూపరిండెంట్ ఇంజినీర్ మహేందర్ ,కొత్తగూడెం డివిషనల్ ఇంజినీర్ రంగస్వామి,ఎల్లందు ఏడిఈ రామారావు మరియు రెండు మండలాల విద్యుత్ వినియోగదారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోగల బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, పాఠశాలల్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షరధా స్కూల్ అలాగే బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవం దేశభక్తి అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులు జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భరతమాత, భగత్ సింగ్ వంటి నాయకుల వేషధారణలో అలరించారు.ఈ సందర్భంగా పిల్లలు వివిధ దేశభక్తి పాటలతో నృత్యాలతో అలరించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ జ్యోతి గౌడ్,అక్షర ధా స్కూల్ ప్రిన్సిపాల్ జి భవాని,ఉపాధ్యాయ బృందం బాలాజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజ్, లెక్చరర్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బిట్స్ విద్యాసంస్థల్లో…
దేశ సమగ్రతకు తీవ్రవాదం అడ్డంకిగా మారి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దెబ్బతీస్తోందని వాటిని అధిగమించాలంటే మనం జీవితంలో ఎంతో క్రమశిక్షణను అలవర్చుకోవాల్సి ఉందని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. బిట్స్ లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించికొని చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థులే దేశానికి వెన్నెముక అని.. చదువుతో పాటు నిజాయితీ సత్ప్రవర్తనలతో రానున్న భావితరాలకు ఆదర్శం కావాలని కోరారు. ఎందరో దేశభక్తులు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే మన రాజ్యాంగానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేశారని, ఎంతో పేదరికాన్ని అనుభవించినా తాను కష్టపడి దేశ రాజ్యాంగాన్ని నిర్మించే శక్తిని సమకూర్చుకున్నారు. అటువంటి కష్టపడే లక్షణాన్ని విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని హితవు చెప్పారు.ఆ తర్వాత బాలాజీ టెక్నోస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. దీంతో పాటు విద్యార్థుల కరాటే విన్యాసాలు మరియు పిరమిడ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి.ఎస్. హరిహరన్,డాక్టర్ ఎ. శ్యామ్ సుందర్, డాక్టర్ ఎల్. సంపత్, డాక్టర్ పి. ప్రసాద్, జి. శ్రీనివాసులు, యం. భానురేఖ, కె. సంపత్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్, ఏ.ఓ.సురేష్ లు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు,హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు రక్షణ సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.రైతుల హక్కుల సాధన కోసం సమితి చేపడుతున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ సలహాదారులు సుధాకర్ ఉపాధ్యక్షులు చవుల్ల రామారావు హింగే రవీందర్ కార్యదర్శి సురావు బాబురావు జిల్లా నాయకులు అంబిరి శ్రీనివాస్,నడికూడ ఎల్కతుర్తి పరకాల మండల అధ్యక్షులు వాంకే రాజు, కొక్కు తిరుపతి,లక్కర్స్ మధుకర్ కమలాపూర్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్, ఎల్కతుర్తి ప్రధాన కార్యదర్శి కొదటీ మాధవరావు రైతు నాయకులు లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
వరంగల్, నేటిధాత్రి.
సమాజాన్ని చైతన్యపరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి ఎస్ జె యు) పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో టి ఎస్ జె యు ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె కొనియాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా టి ఎస్ జె యు ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. టి ఎస్ జె యు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కందికొండ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ డీటీఓ శోభన్, ట్రాఫిక్ సీఐ సుజాత, జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజికవేత్త మండల పరశురాములు, వరంగల్ ఎంఆర్వో శ్రీకాంత్, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ సతీష్, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ మాట్టేవాడ సీఐ కర్ణాకర్, ఎస్సైలు సందీప్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని, రోడ్డును దాటేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల స్వయంగా ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ప్రజల భద్రత కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ డీటీఓ శోభన్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందని అన్నారు.
ట్రాఫిక్ సీఐ సుజాత, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు. ఈ ర్యాలీలో కార్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టి ఎస్ జె యు రాష్ట్ర నాయకులు తోకల అనిల్, నాగపురి నాగరాజు, నరేష్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఆవునూరి కుమార్, కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ఈద శ్రీనాథ్, అడుప అశోక్, నాగపూరి అవినాష్, కౌడగాని మోహన్, నీరుటి శ్రీహరి, మంతెన సురేష్, రావుల నరేష్, 28వ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మోటివేటర్ బరుపాటి గోపి, సికేఏం కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు, ధ్రువ, పద్మావతి కళాశాలల ఎన్‌సీసీ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 5, 6, 7 తేదీలలో జరగనున్న మహాసభల సందర్భంగా శనివారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం వరకు విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆడిటోరియం ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ బహిరంగ సభకు పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, పి.డి.ఎస్.యు ఉమ్మడి ఏపీ పూర్వ అధ్యక్షులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి.సంధ్య, పి.డి.ఎస్.యు జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం అరుణోదయ బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జనవరి 6, 7 తేదీలలో వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో ప్రతినిధుల సభలు జరుగుతాయని తెలిపారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జీవన్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొంటారని, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే తొలి పలుకులు వినిపిస్తారని పేర్కొన్నారు. ప్రారంభ ఉపన్యాసాన్ని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వికాస్ బాజ్‌పాయ్ ఇస్తారని తెలిపారు. అలాగే వివిధ అంశాలపై ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, బి.ప్రదీప్, చంద్రశేఖర్, కే.గోవర్ధన్, మైసా శ్రీనివాసులు ప్రసంగిస్తారని వెల్లడించారు.
7వ తేదీన జరిగే మహాసభలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిపి పలు తీర్మానాలను ఆమోదించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ మహాసభలకు ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావు, బన్న నర్సింగం, అలాగే పి.డి.ఎస్.యు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, కార్యదర్శి మర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో ఓసీ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో కూడా అమలు చేయాలనీ ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి డిమాండ్ చేసారు మొదటి నుండి అన్ని రంగాలలో ఓసీ లకు వివక్షతో జరుగుతున్న అన్యాయాలపై జనవరి 11 న వరంగల్ లో తలపెట్టిన సింహ గర్జన ను విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు….
సింహ గర్జన కోసం ప్రతి ఓసీ బిడ్డా ఒక సైనికుడిలా పని చేయాలనీ పిలుపునిచ్చారు బుధవారం హన్మకొండ బాలసముద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ జేఏసీ కార్యాలయాన్ని సీనియర్ జర్నలిస్ట్ తుమ్మ శ్రీధర్ రెడ్డి ఓసి జేఏసీ రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్ రాయపాటి వెంకటేశ్వరావు లు ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశం లో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి…
ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్ లు మాట్లాడుతూ రెడ్డి వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి లతో పాటు రిజర్వేషన్ పొందని ఇతర సామాజిక వర్గాలు అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించదని అన్నారు అయితే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రెండు సంవత్సరాలు కాలాయాపన చేసిందని… అలాగే కావాలనే రిజర్వేషన్లపై కొందరు దుష్ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు ఓసిలంతా ఐక్యంగా ఉండి న్యాయమైన హక్కుల కోసం పోరాడవలసిన సమయం వచ్చిందని పోరాటాల గడ్డ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జనవరి 11 న లక్ష మందితో జరిగే భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలనీ పిలుపునీచ్చారు… అనంతరం జేఏసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేసారు ఈ కార్యక్రమలో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులు రాము నడివిల్లి వెంకటేశ్వరావు అర్జుల కిషన్ రెడ్డి చందుపట్ల నర్సింహ రెడ్డి.. దొడ్డ మోహన్ రావు వీరారెడ్డి సంజీవ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ లు కృష్ణ మోహన్ పెద్దిష్ బుచ్చిరెడ్డి జేఏసీ నాయకులు తోట సురేష్…జగన్ మోహన్ శర్మ బ్రాహ్మణ సంఘ నాయకురాలు వాణి తదితరులు పాల్గొన్నారు
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి నిర్మలా గీతాంబ:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
శనివారం రోజు వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్, డి.ఆర్.వో. కార్యాలయంలో వృద్ధుల సంక్షేమం కొరకు న్యాయ సేవల శిబిరం ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ – మన సామాజిక మరియు చట్టపరమైన బాధ్యత అని తెలిపారు.ఈ ఉచిత న్యాయ సేవా శిబిరం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన ఇంట్లో ఉన్న వృద్ధులకు మనం ఇచ్చే భరోసా. వృద్ధు లలో ఆత్మగౌరవం తగ్గ కూడదు. నేటి సమాజంలో మారుతున్న జీవనశైలి వల్ల చాలామంది వృద్ధులు ఒంటరితనాన్ని, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2007లో “తల్లిదండ్రులు మరియు వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం” తీసుకువచ్చింది అని తెలిపారు. వృద్ధులు పోషణ పొందే హక్కు, ఆస్తి రక్షణ, తక్షణ పరిష్కారం మొదలగు హక్కులు కలిగి ఉన్నారని వివరించారు. అదేవిధంగా ఏ వృద్ధుడూ ఆకలితోనో, ఆత్మాభిమానం దెబ్బతిని రోడ్డు మీద నిలబడ కూడదన్నదే మా న్యాయ సేవాధికారాల సంకల్పం అని తెలిపారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా ఈ న్యాయ సేవా శిబిరంను సంప్రదించి, ఉచిత న్యాయ సలహాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్.డి.ఓ. టి.సుమ, డి.ఏ.ఓ.ఫణి కుమార్, న్యాయవాది యస్.కుమార్, పారా లీగల్ వాలంటీర్ ఆలేటి.డార్కస్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్
నేటిధాత్రి వరంగల్
ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఇటీవల గుర్రం దాడిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆయన, స్థానిక మంత్రి కొండా సురేఖ ద్వారా మరింత సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావును బాధిత కుటుంబ సభ్యులతో శ్రీరాం రాజేష్ కలిపించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కొండా దంపతులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, అలాగే బాధిత కుటుంబానికి నివాసంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీరాం రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐని పిలిపించి, గుర్రం యజమానులను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, బత్తుల నవీన్ కుమార్, అక్షిత్ పటేల్, ప్రియదర్శిని, శ్రీలత, లతతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దూపకుంట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన ఎంసిపిఐ(యు) బృందం
నేటిధాత్రి ఖిలా వరంగల్ :-
https://youtu.be/wR0ljd3z7mE?si=XsG-p6jOssIJ31iK
వరంగల్ నగరం, దూపకుంట పరిధిలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేసి కూడా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోతే అర్హులైన పేదలను సమీకరించి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు.
శుక్రవారం ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా–నగర నాయకత్వ ప్రతినిధి బృందం దూపకుంటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించింది.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ… వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరాశ్రయ పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్లు ఇస్తామని ప్రచార ఆర్భాటం చేసిన గత ప్రభుత్వం, కాలయాపన చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండానే అధికారాన్ని కోల్పోయింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి కొండ సురేఖ ప్రస్తుత మంత్రిగా ఉన్నా కూడా దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం విడ్డూరం” అని విమర్శించారు.వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకోగా, సగం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్లు అసంపూర్తిగా ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు మార్లు అధికార యంత్రాంగానికి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.
అలాగే లక్ష్మీ టౌన్షిప్‌లో 210, తిమ్మాపూర్‌లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ నేటికీ పంపిణీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే పంపిణీ చేయకపోతే ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇండ్ల నిర్మాణంలో జరిగిన నాసిరకం పనులు, అసంపూర్తిగా నిలిపివేసిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలోజిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్ రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.